బాలీవుడ్ దిగ్గజం, బిగ్ బి అమితాబ్ బచ్చన్ పరిచయం అక్కర్లేని పేరు. ఆయనకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. టాలీవుడ్‌లోనూ బిగ్ బీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారత సినీ చిత్ర పరిశ్రమ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాందించారు. బాలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియాలోనూ ఆయనకు పెద్దసంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో పుట్టిన అమితాబ్ 90వ దశకంలో ఓ రేంజ్‌లో స్టార్‌గా మారిపోయారు. ఇవాళ (అక్టోబర్ 11) ఆయన పుట్టినరోజు సందర్భంగా ఓ ఆయన కెరీర్‌పై ఓ లుక్కేద్దాం.
కెరీర్‌లో ఒడుదొడుకులు: బాలీవుడ్ సినిమా పాటలకు స్టెప్పులెయ్యాలన్నా.. ప్రతి ఒక్కరికి అమితాబ్‌నే ఆదర్శంగా తీసుకోవాల్సిందే. చిన్న పిల్లాడిలా ఒదిగిపోవాలన్నా పెద్దమనిషిలా తీర్పులు చెప్పాలన్నా ఈ తరం కుర్రాడిలా స్టెప్పులెయ్యాలన్నా ఒక్క బిగ్ బీకే సాధ్యమైంది. ఈ విలక్షణమైన నటుడు సినిమాల్లోకి అంతా ఈజీగా రాలేదు. ఆయన కెరీర్‌లో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నారు. ఈ వయసులో కూడా ఆయన కోసం సినిమా ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి.
80 పదుల వయసులోనూ 20 ఏళ్ల కుర్రాడిలా...: ఆయనకు 80 వసంతాలు పూర్తి చేసుకున్నా కూడా.. ఇప్పటికీ నవ యువకుడిలా కనిపిస్తూ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ వయసులోనూ యువ నటులతో పోటీపడుతూ ఎంతో ఫిట్‌గా ఉంటున్నారు. ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు తాను హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో బిజీగా గడుపుతున్నారు.
(చదవండి: బిగ్‌బీ అమితాబ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన మోదీ)
ఆయన సినీ ప్రస్థానం..: అద్భుతమైన గాత్రంతో, డ్యాన్స్‌తో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్న అమితాబ్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా సినీ ప్రపంచంలో తన ప్రయాణం ప్రారంభించారు. అమితాబ్ బచ్చన్ సాత్ హిందుస్థాన్‌లో అన్వర్ అలీగా మొదలైన సినీ ప్రస్థానంతో ఆ తర్వాత వరుస హిట్‌లను అందుకున్నారు. ఆయన సినీ ప్రస్థానం తర్వాత మొదట్లో చాలామంది హేళన చేశారు. ఓ సారి నీ మొహం అద్దంలో చూసుకో అని అన్నా వాటన్నింటినీ పట్టించుకోలేదు బిగ్ బీ. వాటినే సవాల్‌గా స్వీకరించి తనదైన నటనతో అందరిని అవాక్కయ్యేలా చేశారు.
ఊహించని ప్రమాదం...: బాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఆయనకు ఓ సినిమా షూటింగ్లో జరిగిన ప్రమాదంతో చావు అంచుల దాకా వెళ్లివచ్చారు. ఆరోగ్యం విషయంలో ఎన్నో సమస్యలు ఆయనను చుట్టుముట్టాయి. ఆర్థికంగా ఇబ్బందులు పడ్డా.. తిరిగి పుంజుకున్నారు. టీబీ, లివర్ సంబంధిత వ్యాధులు, కరోనా బారిన పడినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఇక అప్పటి నుంచి ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆయన డైట్‌లో సాధారణ భోజనానికే ప్రాధాన్యమిస్తున్నారు. ఉదయం యోగా, వాకింగ్ చేయడం తప్పనిసరి చేసుకున్నారు. అందుకే బిగ్ బీ ఈ వయసులోనూ ఉత్సాహంగా కనిపిస్తున్నారు.
(చదవండి: ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన అమితాబ్.. ధరెంతంటే?)
బిగ్ బీని వరించిన అవార్డులు...: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మొదటి సినిమా పెద్దగా సక్సెక్ కాకపోయినా.. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. 1973లో ఆయన జంజీర్ మూవీ సాంప్రదాయ పాత్రలను అధిగమించిన భారతీయ సినిమా యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా మారడానికి దోహదపడింది. 1984లో భారత్ ఆయనను పద్మశ్రీతో సత్కరించింది. 2001లో పద్మభూషణ్, 2015లో పద్మవిభూషణ్ అందుకున్నారు. 2007లో ఫ్రెంచ్ ప్రభుత్వం అతనికి నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్ అవార్డును అందజేసింది.
ఆనంద్, దీవార్, షోలే, అమర్ అక్బర్ ఆంటోనీ, త్రిశూల్, నిశ్శబ్ద్, అగ్నిపథ్, పికు, పింక్ అతని నట జీవితంలో కొన్ని మైలురాళ్లు. తాజాగా గుడ్‌బై సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించారు. ఆయనకు విషెస్ చెప్పేందుకు ముంబైలోని ఆయన నివాసం వద్దకు వచ్చిన అభిమానుల కోసం ఇంటి బయటకు వచ్చి అందరినీ కలిశారు. అభిమానులతో కలిసి సందడి చేశారు. కెరీర్‌లో ఎంత ఎత్తు ఎదిగినా.. చాలా సింప్లీసిటీగా కనిపించడం ఆయన సొంతం.
#WATCH | Actor #AmitabhBachchan greets his fans who have gathered outside his residence 'Jalsa', in Mumbai, on his 80th birthday today. pic.twitter.com/eMahx6uOWi
— ANI (@ANI) October 11, 2022
Comments
Please login to add a commentAdd a comment