ఆటోగ్రాఫ్ కోసం నీళ్లల్లోకి దూకేశాడు! | Big B Amitabh Bachchan shock on fan Autograph | Sakshi
Sakshi News home page

ఆటోగ్రాఫ్ కోసం నీళ్లల్లోకి దూకేశాడు!

Published Sun, Mar 1 2015 11:04 PM | Last Updated on Sat, Mar 9 2019 4:29 PM

ఆటోగ్రాఫ్ కోసం నీళ్లల్లోకి దూకేశాడు! - Sakshi

ఆటోగ్రాఫ్ కోసం నీళ్లల్లోకి దూకేశాడు!

బిగ్ బి అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టం ఉండని, ఆయన ఆటోగ్రాఫ్ కోసం తపించని సినీ అభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఓ అభిమాని గురించి అమితాబ్ తన ట్విట్టర్‌లో ఈ విధంగా ట్వీట్ చేశారు. ‘‘  ‘దో అంజానే’ చిత్రం షూటింగ్ అప్పుడు ఇది జరిగింది. ఆ చిత్రంలో ఓ పాటను బొటానికల్ గార్డెన్స్‌లో చిత్రీకరిస్తున్నాం. షాట్ గ్యాప్‌లో నా కెమెరాతో పరిసరాలను బంధిస్తున్నా. మేము ఓ సరస్సు ఒడ్డున ఉన్నాం. అవతలి వైపు నుంచి ఓ అభిమాని ఆటోగ్రాఫ్ కావాలని సైగ చేశాడు. ‘ఓకే’ అని సైగ చేశా. అతను ఓ పెన్ను, పేపరు నోట్లో పెట్టుకుని నీళ్లల్లోకి దూకేశాడు. నా దగ్గరకు వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకుని, అది తడవకూడదనే ఉద్దేశంతో వెనక్కి  ఈత కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ, ఆ కాగితం తడిసిపోయింది. ఏదేమైనా ఆ క్షణానికి అనుకున్నది చేశాడు’’.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement