
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా సంచలన విజయం సాధించింది. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును విజయా తీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో 53 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
కాగా ఈ మ్యాచ్‌లో అఖరి మూడు ఓవర్లలో భారత్ ఏకంగా 48 పరుగులు చేసింది. తద్వారా ఓ అరుదైన ఘనతను టీమిండియా తమ పేరిట లిఖించుకుంది. టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో అఖరి మూడు ఓవర్లలో అత్యధిక పరుగులు లక్ష్యాన్ని చేధించిన జట్టుగా ఆస్ట్రేలియాతో కలిసి సమంగా నిలిచింది.
గతంలో 2019 టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా కూడా చివరి మూడు ఓవర్లలో 48 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. అదే విధంగా ఆఖరి బంతిలో భారత్ విజయం సాధించడం ఇదే నాలుగో సారి కావడం గమనార్హం. అంతకుముందు 2016లో ఆస్ట్రేలియాపై, 2018లో బంగ్లాదేశ్, వెస్టిండీస్‌పై కూడా భారత్ ఆఖరి బంతికే విజయం సాధించింది.
చదవండి: T20 WC PAK Vs IND: కోహ్లి అద్భుత ఇన్నింగ్స్‌కు రోహిత్ ఫిదా.. భుజంపై ఎత్తుకుని మరి!