
టీ20 ప్రపంచకప్-2022 కోసం ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకున్న టీమిండియా.. ప్రాక్టీస్ సెషన్స్‌లో బీజీబీజీగా గడుపుతోంది. పెర్త్‌లోని వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ క్రికెట్ అసోసియేషన్(డబ్ల్యూఏసీఏ) గ్రౌండ్ వేదికగా టీమిండియా తమ ప్రాక్టీస్‌ను కొనసాగిస్తుంది. ఈ క్రమంలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ ట్విటర్ యూజర్ పోస్ట్ చేశాడు.
ఈ వీడియోలో విరాట్ పుల్ షాట్, లెగ్ గ్లాన్స్, స్ట్రెయిట్ డ్రైవ్ షాట్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు కన్పించింది. ప్రస్తుతం విరాట్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా కింగ్ కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆసియాకప్‌లో అదరగొట్టిన విరాట్.. అనంతరం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో సిరీస్‌లలోనూ తన జోరు కొనసాగించాడు.
ఇక ఈ మెగా ఈవెంట్‌కు ముందు అక్టోబరు 10, 13 తేదీల్లో పెర్త్ వేదికగా టీమిండియా వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో రెండు ప్రాక్టీసు మ్యాచ్‌లు ఆడనుంది. అదే విధంగా ఆసీస్, న్యూజిలాండ్‌తో గబ్బా వేదికగా వార్మప్ మ్యాచ్‌లు టీమిండియా ఆడనుంది. కాగా ఈ మార్క్యూ ఈవెంట్‌లో భారత్ తమ తొలి మ్యా్చ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో ఆక్టోబర్ 23న మెల్‌బోర్న్ వేదికగా తలపడనుంది.
Virat Kohli practicing batting in the nets session at Perth - Absolute treat to watch. pic.twitter.com/NVYHHeqkQX
— CricketMAN2 (@ImTanujSingh) October 8, 2022
చదవండి: Ishan Kishan: పాపం ఇషాన్ కిషన్! ఇది నా హోం గ్రౌండ్.. వాళ్లు సెంచరీ చేయమన్నారు! కానీ..
Comments
Please login to add a commentAdd a comment