T20 WC Ind Vs Pak: Virat Kohli Warns Fans For Roaring Out Of Stadium During Net Session - Sakshi
Sakshi News home page

T20 WC 2022: ప్రాక్టీస్‌ చేస్తుండగా ఫ్యాన్స్‌ కేరింతలు! సీరియస్‌ అయిన కోహ్లి!

Published Fri, Oct 21 2022 3:30 PM | Last Updated on Fri, Oct 21 2022 5:55 PM

Virat Kohli warns fans for roaring out of stadium during net session - Sakshi

PC: Twitter

టీ20 ప్రపంచకప్‌-2022లో భాగంగా పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌కు టీమిండియా అన్ని విధాల సన్నద్దం అవుతోంది. అక్టోబర్‌ 23న మెల్‌బోర్న్‌ వేదికగా భారత్‌-పాకిస్తాన్‌ జట్లు తలపడనున్నాయి. ఇక ఇప్పటికే మెల్‌బోర్న్‌ చేరుకున్న భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ముఖ్యంగా భారత స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి నెట్స్‌లో గంటలకొద్దీ చెమటోడ్చుతున్నాడు.

కాగా  విరాట్‌ నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో అతడి అభిమానులు స్టేడియం వెలుపల నుంచి కోహ్లి కోహ్లి అంటూ గట్టిగా అరిచారు. అయితే నెట్స్‌కు దగ్గరనుంచి అభిమానులు గట్టిగా అరుస్తుండటంతో విరాట్ కోహ్లి ఏకాగ్రత దెబ్బతిన్నది. దీంతో వెంటనే నెట్స్‌ నుంచి బయటకు వచ్చిన ​కోహ్లి.. "యార్‌.. ప్రాక్టీస్‌ చేస్తున్నపుడు మాట్లాడకండి.. నేను డిస్ట్రబ్‌ అవుతాను కదా" అంటూ ‍స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చాడు.

ఇక కోహ్లి సమధానం విన్న ఓ అభిమాని "మీరు ఎప్పుడు రిలాక్స్‌డ్‌గా ఉంటారో అప్పుడే మాట్లాడతాం భాయ్‌.. కింగ్‌ కోసం ఏమైనా చేస్తాం. కింగ్‌ ఒక్కడే కదా" అని అన్నాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


చదవండి: Nicholas Pooran: మా ఓటమికి ప్రధాన కారణం అదే.. ఇదో గుణపాఠం.. అయితే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement