T20 World Cup 2022: Kohli And Babar Azam Practicing In Parallel Nets In Brisbane, Video Viral - Sakshi
Sakshi News home page

T20 WC 2022: ఒకే చోట కోహ్లి, బాబర్‌ నెట్‌ ప్రాక్టీస్‌.. వీడియో వైరల్‌

Published Tue, Oct 18 2022 11:46 AM | Last Updated on Tue, Oct 18 2022 12:58 PM

Babar Azam, Virat Kohli practicing in parallel nets in Brisbane  - Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022 వార్మప్‌ మ్యాచ్‌ల్లో భాగంగా ఆస్ట్రేలియాపై విజయం సాధించిన భారత్‌.. ఇప్పుడు మరో ప్రాక్టీస్‌ మ్యాచ్‌కు సిద్దమైంది. బుధవారం(ఆక్టోబర్‌ 19) బ్రేస్బేన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో భారత్‌ తలపడనుంది. మరోవైపు దాయాది జట్టు పాకిస్తాన్‌ మాత్రం ఇంగ్లండ్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో ఓటమి పాలైంది.

అయితే పాకిస్తాన్‌ కూడా తమ తదుపరి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో బుధవారం బ్రేస్బేన్‌ వేదికగానే ఆఫ్గానిస్తాన్‌తో ఆడనుంది. ఈ క్రమంలో టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి, పాకిస్తాన్‌ కెప్టెన్‌ నెట్స్‌లో తీవ్రంగా చమటోడ్చుతున్నారు. ఇద్దరూ ఒకే చోట వేర్వేరు నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్నారు.

కోహ్లి నెట్స్‌లో షార్ట్ బాల్స్‌ను ప్రాక్టీస్‌ చేస్తుండగా.. బాబర్‌ త్రోడౌన్‌ స్పెషలిస్టులతో సాధన చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా సూపర్‌-12లో భాగంగా టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో దాయాది జట్టు పాకిస్తాన్‌తో ఆక్టోబర్‌ 23న తలపడనుంది.


చదవండి: T20 WC 2022: టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆ రెండు జట్ల మధ్యే : సునీల్ గవాస్కర్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement