ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టును సెప్టెంబర్ 15న బీసీసీఐ ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్‌కు భారత జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ముంబైలో సమావేశం కానున్నట్లు ఇన్‌సైడ్ స్పోర్ట్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఆసియాకప్-2022 ముగిసిన నాలుగు రోజుల తర్వాత సెలక్టర్లు జట్టును ప్రకటించనున్నారు. ఆసియాకప్‌లో ప్రదర్శన ఆధారంగా జట్టును ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా టీ20 ప్రపంచకప్ పాల్గొనే జట్లు తమ పూర్తి వివరాలను సెప్టెంబర్ 16లోపు ప్రకటించాలని ఐసీసీ ఆయా జట్లకు డెడ్‌లైన్ విధించింది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 15న బీసీసీఐ జట్టును ఎంపిక చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ మెగా టోర్నీ కోసం ప్రతీ జట్టుకు 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేసేందుకు అనుమతి ఉంది. క్రికెటర్లు, నెట్ బౌలర్లు, సహాయ సిబ్బందితో కలిసి మొత్తం 30 మంది వరకు ప్రయాణించొచ్చు. అధికారికంగా 15 మంది ఆటగాళ్లు, 8 మంది సహాయ సిబ్బంది ఉండాలి. ఇక ఈ మెగా టోర్నీలో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 23న మెల్‌బోర్న్ వేదికగా దాయాది దేశం పాకిస్తాన్‌తో తలపడనుంది.
చదవండి: IND vs ZIM: దీపక్ హుడా అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా!
Comments
Please login to add a commentAdd a comment