
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించింది.

6 వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసి ఎట్టకులకు పాయింట్ల ఖాతా తెరిచింది.

గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఆదివారం జరిగిన ఈ పోరులో భారత పేస్ బౌలర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అరుంధతి రెడ్డి (3/19), స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ (2/12) సహా రేణుక సింగ్ (1/23), దీప్తి శర్మ (1/24), ఆశ శోభన (1/24) ఇలా బౌలింగ్‌కు దిగిన ప్రతి ఒక్కరు సమష్టిగా వికెట్లను పడగొట్టారు.

దీంతో పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది.

అయితే, సులువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు హర్మన్‌ప్రీత్ బృందం ఆఖరిదాకా పోరాడాల్సి వచ్చింది.

18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసి పాకిస్తాన్‌పై గెలిచింది.










