టీ20 ప్రపంచకప్-2022 సన్నాహాకాల్లో భాగంగా టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో బిజీబిజీగా గడుపుతోంది. ఇప్పటికే వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడిన భారత్.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో మరో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో ఆడనుంది . ఇక ఈ మెగా ఈవెంట్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది.
అయితే ఈ మ్యాచ్‌కు భారత తుది జట్టులో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు చోటు దక్కే అవకాశం కన్పించడంలేదు. కాగా వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా వచ్చిన రిషబ్ పంత్ తీవ్ర నిరాశపరిచాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో కలిపి పంత్ కేవలం 18 పరుగులు మాత్రమే సాధించాడు.
అదే విధంగా అంతకుముందు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లోనూ పంత్ విఫలమయ్యాడు. ఈ క్రమంలో పంత్‌ను పక్కన బెట్టి వికెట్ కీపర్ బాధ్యతలు దినేష్ కార్తీక్‌కు అప్పజెప్పాలని టీమిండియా మేనేజేమెంట్ భావిస్తున్నట్లు సమాచారం.
కాగా ఫినిషర్‌గా జట్టులో చోటు దక్కించుకున్న కార్తీక్.. తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తున్నాడు. ఈ ఏడాది టీ20ల్లో 181 బంతులు ఎదర్కొన్న కార్తీక్ 150.82 స్ట్రైక్ రేట్‌తో 273 పరుగులు సాధించాడు. ఇక పంత్ గత 17 ఇన్నింగ్స్‌లో 136.84 స్ట్రైక్ రేట్‌తో 338 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పంత్ స్థానంలో కార్తీక్‌ను ఆడించాలని భారత మాజీ క్రికెటర్‌లు కూడా సూచిస్తున్నారు. ఇక వీరిద్దరిలో ఎవరికీ ప్లేయింగ్ ఎలవెన్‌లో చోటు దక్కుతుందో పాక్-భారత్ మ్యాచ్ వరకు వేచి చూడాలి.
టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, ఆర్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్.
స్టాండ్‌బై ప్లేయర్స్: మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్
చదవండి: T20 World Cup 2022: 'టీ20 ప్రపంచకప్‌లో అతడే టీమిండియా టాప్ రన్ స్కోరర్'
Comments
Please login to add a commentAdd a comment