టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా ఈనెల 10న ఇంగ్లండ్‌తో జరుగబోయే సెమీస్ సమరంలో టీమిండియా ఎలా ఉండబోతుందో అన్న అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. విశ్లేషకులు, అభిమానులు ఎవరికి తోచిన విధంగా వారు భారత తుది జట్టును అంచనా వేస్తున్నారు. ఈ విషయంపై టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ చేసిన వ్యాఖ్యల ఆధారంగా భారత తుది జట్టు ఇలా ఉండబుతుందంటూ కొందరు విశ్లేషకులు బాహాటంగా ప్రకటించారు.
వారి అంచనాల మేరకు.. ఇంగ్లండ్‌తో తలపడబోయే భారత జట్టులో రెండు మార్పులకు అవకాశం ఉంది. జింబాబ్వేతో మ్యాచ్‌లో ఆడిన రిషబ్ పంత్ స్థానంలో దినేశ్ కార్తీక్ తిరిగి జట్టులోకి రావచ్చు. అలాగే ఆశించినంతగా ప్రభావం చూపలేకపోతున్న అక్షర్ పటేల్ స్థానంలో స్పెషలిస్ట్ స్పిన్నర్ చహల్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. మ్యాచ్‌కు వేదిక అయిన అడిలైడ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించనుందని, ఎక్సట్రా స్పిన్నర్‌తో బరిలోకి దిగే అవకాశాన్ని పరిశీలిస్తామని ద్రవిడ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చహల్ ఎంట్రీకి లైన్ క్లియర్ అయినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ రెండు మార్పులు మినహా టీమిండియా మరే ఇతర మార్పు చేసే సాహసం చేయకపోవచ్చని వారు అంచనా వేస్తున్నారు. దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్‌ల విషయంలో యాజమాన్యం తర్జనభర్జన పడవచ్చని.. తొలుత బ్యాటింగ్ చేయాల్సి వస్తే పంత్‌ను.. ఛేజింగ్ చేయాల్సి వస్తే డీకేకు ఛాన్స్ఇచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment