దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన ఆసీస్(PC: CA)
Australia vs South Africa, 2nd Test - World Test Championship: రెండో టెస్టులో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ మీద 182 పరుగుల తేడాతో పర్యాటక ప్రొటిస్ జట్టును చిత్తుగా ఓడించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మరో టెస్టు మిగిలి ఉండగానే.. సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది.
గ్రీన్ మ్యాజిక్
మెల్‌బోర్న్ వేదికగా జరిగి బాక్సింగ్ డే టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ 5 వికెట్లతో చెలరేగడంతో 189 పరుగులకే సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. వికెట్ కీపర్ బ్యాటర్ వెయిర్నే(52), మార్కో జాన్సన్(59) అర్ధ శతకాలతో రాణించడంతో ఈ మేరకు స్కోరు చేయగలిగింది.
డబుల్ సెంచరీ హీరో
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య కంగారూ జట్టుకు ఓపెనర్ డేవిడ్ వార్నర్ డబుల్ సెంచరీ(200)తో అదిరిపోయే ఆరంభం అందించాడు. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(1), వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ (14) నిరాశపరిచినా.. స్టీవ్ స్మిత్ 85 పరుగులతో రాణించాడు.
అతడికి తోడుగా ట్రవిస్ హెడ్(51), కామెరాన్ గ్రీన్ (51- నాటౌట్), వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ 111తో అదరగొట్టారు. ఈ నేపథ్యంలో 8 వికెట్ల నష్టానికి 575 పరుగుల భారీ స్కోరు వద్ద ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
తప్పని పరాభవం
ఇక తమ రెండో ఇన్నింగ్స్‌లో టాపార్డర్ విఫలం కావడంతో సౌతాఫ్రికాకు కష్టాలు తప్పలేదు. నాలుగో స్థానంలో వచ్చిన తెంబా బవుమా 65 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసిన వెయిర్నే 33 పరుగులు సాధించాడు.
మిగతా వాళ్లలో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ముఖ్యంగా ప్రొటిస్ కెప్టెన్, ఓపెనర్ డీన్ ఎల్గర్ డకౌట్‌గా వెనుదిరగడం ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో 204 పరుగులకే ఆలౌట్ అయిన సౌతాఫ్రికాకు భారీ ఓటమి తప్పలేదు. డబుల్ సెంచరీ హీరో డేవిడ్ వార్నర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఇక..
ఇక ఈ ఘన విజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో ముందు వరుసలో ఉన్న ఆస్ట్రేలియా తమ అగ్రస్థానం పదిలం చేసుకోగా.. రెండో స్థానం కోసం పోరులో పోటీ పడుతున్న సౌతాఫ్రికాకు చేదు అనుభవం మిగిలింది. తాజా ఓటమితో 72 పాయింట్లున్న ప్రొటిస్ పాయింట్ల పట్టికలో 54.55 నుంచి 50 శాతానికి పడిపోగా.. బంగ్లాదేశ్‌పై విజయంతో టీమిండియా 99 పాయింట్లతో 58.93 శాతంతో రెండో స్థానంలో కొనసాగుతోంది.
చదవండి: Suryakumar Yadav: మొన్న 90.. నిన్న 95.. చెలరేగుతున్న సూర్య! టెస్టుల్లో ఎంట్రీ ఖాయం!
Kane Williamson: పాక్‌తో మ్యాచ్‌లో సెంచరీ.. విలియమ్సన్ అరుదైన రికార్డు
Comments
Please login to add a commentAdd a comment