మెల్‌బోర్న్: బాక్సింగ్ డే టెస్టులో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న టీమిండియా మ్యాచ్‌పై పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 195 పరుగులకు ఆలౌట్ చేసిన రహానే సేన.. 326 పరుగులు చేసి 131 పరుగుల విలువైన ఆదిక్యాన్ని సాధించింది. అనంతరం మూడో రోజు ఆటలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్ తలా ఒక వికెట్ తీయగా, రవీంద్ర జడేజా రెండు వికెట్లు సాధించి ఆతిథ్య జట్టు నడ్డి విరిచారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 66 ఓవర్లు ఆడిన ఆసీస్ 133 పరుగులు చేసి కీలకమైన ఆరు వికెట్లు కోల్పోయింది.
ప్రస్తుతం టెయిలెండర్లు కామెరూన్ గ్రీన్ (17), పాట్ కమిన్స్ (15) క్రీజులో ఉన్నారు. ఆసీస్ 2 పరుగుల ఆదిక్యంలో ఉంది. ఇక పోస్టు మ్యాచ్ ప్రెజంటేషన్‌లో మాట్లాడిన కెప్టెన్ రహానే భారత బౌలర్ల కృషిని కొనియాడాడు. కీలకమైన వికెట్లు తీయడం ద్వారా టీమిండియాను మంచి స్థితిలో నిలిపారని అన్నాడు. మ్యాచ్ అప్పుడే అయిపోలేదని మిగతా వికెట్లును త్వరత్వరగా తీయగలిగితే ఆశించిన ఫలితం వస్తుందని పేర్కొన్నాడు. తన రనౌట్ అనంతరం జడేజా అసంతృప్తికి లోనయ్యాడని, ధైర్యంగా ముందుకు వెళ్లాలని అతనికి సూచించినట్టు రహానే చెప్పుకొచ్చాడు.
(చదవండి: బాక్సింగ్ డే టెస్టు: అంపైర్స్ కాల్‌పై సచిన్ అసహనం)
Comments
Please login to add a commentAdd a comment