మెల్‌బోర్న్: ఆసీస్ విధించిన 70 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించేక్రమంలో టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగలింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (15 బంతుల్లో 5) ఔటైన కాసేపటికే కీలక బ్యాట్స్‌మన్ పుజారా (4 బంతుల్లో 3) వికెట్ కోల్పోయింది. మయాంక్‌ను స్టార్క్ పెవిలియన్ పంపగా.. పుజారాను కమిన్స్ ఔట్ చేశాడు. బంతి ఎడ్జ్ తీసుకుని గల్లీలో ఉన్న గ్రీన్ చేతిలో పడటంతో పుజారా నిరాశగా వెనుదిరిగాడు. 8 ఓవర్లు ముగిసేసరికి భారత్ రెండు వికెట్లకు 36 పరుగులు చేసింది. తొలి ఇన్సింగ్స్‌లో సెంచరీ హీరో కెప్టెన్ అజింక్యా రహానే (8), ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (20) క్రీజులో ఉన్నారు. ఇక అడిలైడ్‌లో జరిగిన పింక్‌బాల్ టెస్టులో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న భారత్, ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఫలితంగా నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1 తో సమం చేయాలని కృత నిశ్చయంతో ఉంది. మరో 34 పరుగులు చేస్తే టీమిండియా బాక్సింగ్ డే టెస్టును సొంతం చేసుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment