Security Arrest Pitch Invader Try To Hug Rohit Sharma IND Vs ZIM Match - Sakshi
Sakshi News home page

IND Vs ZIM: అభిమానంతో రోహిత్‌ వద్దకు.. ఒక్క హగ్‌ అంటూ కన్నీటిపర్యంతం

Published Sun, Nov 6 2022 9:05 PM | Last Updated on Mon, Nov 7 2022 8:32 AM

Security Arrest Pitch Invader Try To Hug Rohit Sharma IND Vs ZIM Match - Sakshi

జార్వో.. గుర్తున్నాడా. అరె ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది. 2021లో టీమిండియా ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లినప్పుడు పదే పదే మైదానంలోకి దూసుకొచ్చి హల్‌చల్‌ చేశాడు. జార్వో 69 టీషర్ట్‌ ధరించి సిరీస్‌లో పలుమార్లు అంతరాయం కలిగించాడు. దీంతో అతన్ని మైదానం నుంచి నిషేధం విధించినప్పటికి.. జైలుకి వెళ్లినప్పటికి అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. అయితే మొత్తంగా మాత్రం తన చర్యలతో అప్పట్లో హాట్‌టాపిక్‌గా నిలిచాడు. తాజాగా టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా-జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక అభిమాని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వద్దకు దూసుకొచ్చాడు.

జింబాబ్వే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక టీనేజ్‌  అభిమాని సెక్యూరిటీ కళ్లు కప్పి క్రీజులోకి దూసుకొచ్చాడు. ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ దగ్గరికి వచ్చి అతన్ని హత్తుకునే ప్రయత్నం చేశాడు. ఈలోగా సెక్యూరిటీ సిబ్బంది అతన్ని బయటికి లాక్కెళ్లారు. ఈ సమయంలో ఒక్క షేక్ హ్యాండ్ లేదా కనీసం హగ్‌ ఇవ్వాల్సిందిగా రోహిత్ వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం కాస్త బాధను కలిగించింది. అయితే అనుమతి లేకుండా మైదానంలోకి దూసుకురావడం తప్పుగా పరిగణిస్తారు.

ఎంత అభిమానం ఉన్న ఆటగాళ్లు కూడా తమ భద్రత దృశ్యా ఎవరిని దగ్గరికి రానియ్యరు. రోహిత్‌ కూడా అదే పద్దతిని ఫాలో అయ్యాడు. కాగా సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించి గ్రౌండ్‌లోకి ఎంటర్ అయినందుకు ఆ కుర్రాడికి క్రికెట్‌ ఆస్ట్రేలియా రూ.6 లక్షల 50 వేల భారీ జరిమానా విధించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ ప్రపంచకప్‌లో అభిమానులు మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో గ్రౌండ్‌లోకి రావడం ఇది రెండో సారి. దీంతో ఆటగాళ్ల భద్రతపై క్రికెట్‌ ఆస్ట్రేలియా తీసుకుంటున్న చర్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

చదవండి: ఏమా కొట్టుడు.. 'మిస్టర్‌ 360' పేరు సార్థకం

అన్నీ కుదిరితే ఫైనల్లో టీమిండియా, పాకిస్తాన్‌!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement