
టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్-12 దశలో ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా జింబాబ్వేపై 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, ఒక ఓటమితో 8 పాయింట్లు సాధించిన టీమిండియా గ్రూప్-1 టాపర్‌గా నిలిచి సెమీస్‌కు చేరుకుంది. తొలుత సూర్యకుమార్ సంచలన ఇన్నింగ్స్‌కు తోడు కేఎల్ రాహుల్ మరో అర్థశతకం మెరవడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఆపై భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడమే గాక వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ జింబాబ్వేపై ఒత్తిడి తెచ్చారు. దీంతో జింబాబ్వే 115 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియా 71 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
ఇక మ్యాచ్ విజయం అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. ''మ్యాచ్‌కు ముందే మేము సెమీస్‌కు క్వాలిఫై అయ్యామని తెలుసు. కానీ గ్రూప్ టాపర్‌గా వెళ్లాలనేది మా లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక జింబాబ్వేతో మ్యాచ్‌లో జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. కేఎల్ రాహుల్‌తో పాటు సూర్యకుమార్‌లు తమ ఫామ్‌ను కొనసాగిస్తూ బ్యాటింగ్ చేయడం మాక చాలా అనుకూలం. ఇక సూర్యకుమార్ రోజురోజుకు మరింత బలంగా తయారవుతున్నాడు. అతని కచ్చితమైన షాట్ల ఎంపిక ప్రతీ ఒక్కరిని ముగ్దులను చేస్తోంది.
ఒత్తిడిని తట్టుకొని బ్యాటింగ్ చేయడమనేది సవాల్‌తో కూడుకున్నాది. కానీ సూర్యకుమార్ మాత్రం యథేచ్చగా బ్యాట్‌ను ఝులిపించడం కలిసొచ్చే అంశం. ఇక ఇంగ్లండ్ లాంటి బలమైన జట్టుతో సెమీఫైనల్ ఆడనున్న నేపథ్యంలో సూర్యకుమార్ మరోసారి కీలకంగా మారాడని చెప్పొచ్చు. కొన్ని రోజులుగా చూసుకుంటే ఇంగ్లండ్ మంచి క్రికెట్ ఆడుతూ వస్తున్నారు. వాళ్లను ఎదుర్కోవడం సవాల్ లాంటిదే అయినప్పటికి మంచి ప్రయత్నంతో వారిని ఓడగొట్టేందుకు ప్రయత్నిస్తాం.
ఇప్పటివరకు మా ఆటతీరు బాగానే ఉంది. ఇకపై సెమీస్‌లో మరింత జాగ్రత్తగా ఆడాల్సి ఉంది. సూపర్-12 దశలో చేసిన తప్పులను కరెక్ట్ చేసుకొని సెమీస్ బరిలోకి దిగాలనుకుంటున్నాం. ఇక మ్యాచ్‌లు చూడడానికి వస్తున్న అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు. మేం ఎక్కడ మ్యాచ్‌లు ఆడినా అక్కడ స్టేడియం హౌస్‌ఫుల్ అయినట్లు కనిపిస్తుంది. ఇంతదూరం మాకు మద్దతిస్తూ వచ్చారు. సెమీస్‌లోనూ అదే సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నా. జట్టు తరపున మీ అభిమానానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలలు తెలుపుకుంటున్నా'' అంటూ ముగించాడు.
చదవండి: జింబాబ్వేపై ఘన విజయం.. గ్రూప్-2 టాపర్‌గా సెమీస్‌కు టీమిండియా
Comments
Please login to add a commentAdd a comment