ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచకప్‌లో టీమిండియా అరుదైన రికార్డు సాధించింది. సూపర్-12లో భాగంగా గ్రూఫ్-2లో గురువారం టీమిండియా నెదర్లాండ్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా నుంచి ముగ్గురు బ్యాటర్లు అర్థశతకాలతో మెరిశారు. కెప్టెన్ కమ్ ఓపెనర్ రోహిత్ శర్మ(39 బంతుల్లో 53 పరుగులు) విరాట్ కోహ్లి(44 బంతుల్లో 62 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(25 బంతుల్లో 51 నాటౌట్) హాఫ్ సెంచరీలు సాధించారు.
టి20 ప్రపంచకప్‌లో ఒకే మ్యాచ్‌లో టీమిండియా నుంచి ముగ్గురు బ్యాటర్లు అర్థసెంచరీలు సాధించడం ఇది రెండోసారి కాగా.. ఓవరాల్‌గా మూడోసారి. ఇంతకముందు 2007 టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా ఈ ఫీట్ సాధించింది. ఆ తర్వాత 2016 టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా ముగ్గురు బ్యాటర్లు అర్థసెంచరీలు చేశారు. తాజాగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో టీమిండియా నుంచి రోహిత్, కోహ్లి, సూర్యకుమార్‌లు ఈ ఫీట్‌ను సాధించారు.
ఇక నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు చేసింది. కేఎల్ రాహుల్ మినహా టాపార్డర్ అర్థశతకాలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. నెదర్లాండ్స్‌పై భారీ రన్‌రేట్‌తో గెలిచి అగ్రస్థానంలో నిలవాలని టీమిండియా టార్గెట్‌గా పెట్టుకుంది.
చదవండి: 'కోహ్లి కరుణించలేదు'.. ఫామ్‌లోకి వస్తే ఎవరిని వదిలిపెట్టడు
Comments
Please login to add a commentAdd a comment