లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన అంపైర్.. ఆగిపోయిన మ్యాచ్! వీడియో వైరల్‌ | AUS Vs PAK: Third Umpire Gets Stuck In MCG Lift, Leading To Delay In Play On Day 3 Video Goes Viral - Sakshi
Sakshi News home page

AUS Vs PAK: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన అంపైర్.. ఆగిపోయిన మ్యాచ్! వీడియో వైరల్‌

Published Thu, Dec 28 2023 10:50 AM | Last Updated on Thu, Dec 28 2023 11:24 AM

Third umpire gets stuck in MCG lift, leading to delay in play on Day 3 - Sakshi

సాధారణంగా క్రికెట్‌లో వర్షం, వెలుతురులేమి, సాంకేతిక కారణాల వల్ల మ్యాచ్‌ ఆగిపోవడం చూస్తూ ఉంటాం. కానీ మెల్‌బోర్న్‌ వేదికగా పాకిస్తాన్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఊహించని ఘటనతో ఆటకు అంతరాయం ఏర్పడింది. ఈ మ్యాచ్‌కు థర్డ్‌ అంపైర్‌గా వ్యహరిస్తున్న థర్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు

దీంతో దాదాపు 5 నిమిషాల పాటు మ్యాచ్‌ ఆగిపోయింది. మూడో రోజు లంచ్‌ బ్రేక్‌ తర్వాత తిరిగి ఆటను ప్రారంభించేందుకు అన్‌ఫీల్డ్‌ అంపైర్లు సిద్దమయ్యారు. ఈ క్రమంలో కెమెరామెన్‌ థర్డ్‌ అంపైర్‌ బాక్స్‌ వైపు కెమెరాను టర్న్‌ చేయగా సీటులో ఇల్లింగ్‌వర్త్ కన్పించలేదు.

దీంతో ఆటను అంపైర్‌లు ప్రారంభించలేదు. వెంటనే ఈ విషయాన్ని ఫోర్త్‌ అంపైర్‌కు ఫీల్డ్‌ అంపైర్‌లు తెలియజేయగా.. అతడు ఏమైందోనని థర్డ్‌ అంపైర్‌ గదికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. ఇంతలోనే లంచ్ పూర్తి చేసిన తర్వాత ఇల్లింగ్‌వర్త్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడని కామెంటేటర్‌లు తెలిపారు.

ఈ విషయం తెలుసుకున్న ఆసీస్‌ ఆటగాళ్లు ఒక్కసారిగా నవ్వుకున్నారు. అయితే 5 నిమిషాల తర్వాత థర్డ్‌ అంపైర్‌ తిరిగి రావడంతో మ్యాచ్‌ ప్రారంభమైంది.  ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.
చదవండి: IND Vs AFG T20I Series: అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌.. టీమిండియా కొత్త కెప్టెన్‌ అతడే!? రోహిత్‌ డౌటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement