
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. జట్టు వ్యూహంలో భాగంగా ఓపెనర్‌గా బరిలోకి దిగిన హనుమ విహారి జట్టు స్కోర్40 పరుగుల వద్ద ప్యాట్‌కమిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 66 బంతులు ఆడిన విహారి 8 పరుగులు చేశాడు. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్, పుజారా క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన కర్ణాటక బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్ నిలకడగా ఆడుతున్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. పెర్త్ టెస్టు ఓటమి టీమిండియాలో భారీ మార్పుచేర్పులకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రెగ్యులర్ ఓపెనర్లు మురళీ విజయ్, కేఎల్ రాహుల్ ఇద్దరిపై ఒకేసారి వేటుపడేలా చేసింది. దాంతో వారి స్థానంలో మయాంక్, విహారిలు ఓపెనర్లుగా బరిలోకి దిగారు.
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన టీమిండియా.. పెర్త్ టెస్టులో దారుణంగా చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. దీంతో నాలుగు మ్యాచ్‌లో టెస్టు సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్న ఇరు జట్లు బాక్సింగ్ డే సమరంలో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్నాయి.