
కెప్టెన్‌తో ప్యాట్ కమిన్స్‌తో నితీశ్ రెడ్డి (PC: IPL/SRH)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శుభవార్త. ఆ జట్టు యువ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) ఫిట్‌నెస్ సాధించాడు. జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందాడు.
ఈ క్రమంలో నితీశ్ రెడ్డి ఆదివారం సన్‌రైజర్స్ జట్టుతో చేరనున్నాడు. కాగా గతేడాది ఐపీఎల్‌లో సత్తా చాటి ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’గా నిలిచాడు ఈ విశాఖపట్నం కుర్రాడు. రైజర్స్ తరఫున బరిలోకి దిగిన ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ 13 మ్యాచ్‌లలో కలిపి 303 పరుగులు చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు
ఇందులో రెండు అర్ధ శతకాలు ఉండటం విశేషం. అదే విధంగా.. మూడు వికెట్లు కూడా తీశాడు ఈ ఆంధ్ర ఆల్‌రౌండర్. ఈ నేపథ్యంలో టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన నితీశ్ రెడ్డి గతేడాది అక్టోబరులో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.
బంగ్లాదేశ్‌తో స్వదేశంలో టీ20 సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన ఈ 21 ఏళ్ల ఆటగాడు.. అనూహ్య రీతిలో అదే ఏడాది టెస్టుల్లోనూ రంగప్రవేశం చేశాడు.
కంగారూ గడ్డపై శతకంతో..
ఏకంగా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆడే అవకాశం దక్కించుకున్న నితీశ్ రెడ్డి.. కంగారూ గడ్డపై అదరగొట్టాడు. ముఖ్యంగా సీనియర్లంతా విఫలమైన వేళ మెల్‌బోర్న్‌లో శతకం సాధించి క్రికెట్ ప్రపంచం దృష్టిని తనవైపునకు తిప్పుకున్నాడు. అయితే, ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన నితీశ్.. దురదృష్టవశాత్తూ గాయపడ్డాడు.
18.1 పాయింట్లు
పక్కటెముకల నొప్పి కారణంగా సిరీస్ మొత్తానికి దూరమైన నితీశ్ రెడ్డి.. ఇప్పటి వరకు మైదానంలో దిగలేదు. ఈ క్రమంలో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చికిత్స పొందిన అతడు.. యో-యో టెస్టు పాస్ అయ్యాడు.
బెంగళూరులోని NCAలో నిర్వహించిన పరీక్షలో నితీశ్ 18.1 పాయింట్లు సాధించాడు. ఈ క్రమంలో క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందిన అతడు ఆదివారం సన్‌రైజర్స్ శిబిరంలో చేరనున్నాడు.
కాగా తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటి వరకు 5 టెస్టులు ఆడిన నితీశ్ రెడ్డి.. 298 పరుగులు చేయడంతో పాటు.. ఐదు వికెట్లు తీశాడు. అదే విధంగా నాలుగు టీ20లలో కలిపి 90 రన్స్ చేసిన నితీశ్.. మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లలో కలిపి 303 పరుగులు సాధించడంతో పాటు.. మూడు వికెట్లు తీశాడు.
రన్నరప్
ఇదిలా ఉంటే.. గతేడాది ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఫైనల్ చేరిన సన్‌రైజర్స్ టైటిల్ పోరులో మాత్రం ఓడిపోయింది. కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయం పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
ఇక ఈ ఏడాది మార్చి 23న సొంతమైదానం ఉప్పల్‌లో రైజర్స్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌తో తమ ఐపీఎల్-2025లో ప్రయాణం మొదలుపెట్టనుంది. కాగా కోల్‌కతా- బెంగళూరు మధ్య పోరుతో మార్చి 22 నుంచి తాజా ఎడిషన్ ఆరంభం కానుంది.
చదవండి: ఇంగ్లండ్‌తో టెస్టులు.. టీమిండియా కెప్టెన్‌గా అతడే! బీసీసీఐ గ్రీన్ సిగ్నల్?
Comments
Please login to add a commentAdd a comment