
ప్రతీకాత్మక చిత్రం
పారిస్: యూరోపియన్ యూనియన్ జూలై 1వ తేదీనుంచి 15 దేశాల సరిహద్దులను మళ్లీ తెరుస్తున్నట్లు ప్రకటించింది. అయితే కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న అమెరికాను ఈ జాబితా నుంచి మినహాయించారు. చైనాను ఈ జాబితాలో చేర్చి, రెండు వారాలకు ఒకసారి సమీక్షిస్తామని తెలిపారు. అలాగే చైనా కూడా యూరోపియన్ దేశాలకు సహకరించాలనే షరతుతో యూరోపియన్ యూనియన్ ఈ నిర్ణయం తీసుకుంది. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఉరుగ్వే దేశాలకు షరతులు లేకుండా సరిహద్దులను తెరిచారు. 27 సభ్య దేశాలున్న యూరోపియన్ యూనియన్ ఓటింగ్ విధానం ద్వారా అల్జీరియా, జార్జియా, జపాన్, మాంటేనెగ్రో, మొరాకో, రువాండా, సెర్బియా, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, ట్యునీషియా దేశాల సరిహద్దులను తెరిచింది. ఈ నిర్ణయాన్ని అమలు చేసే బాధ్యత సభ్య దేశాలపై ఉంటుందని యూరోపియన్ యూనియన్ ప్రకటించింది. (ముప్పున్న వారికే ముందుగా టీకా!)
Comments
Please login to add a commentAdd a comment