
కాబూల్: అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నప్పటి నుంచి అక్కడి ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గతంలో తాలిబన్ల రాక్షస పాలన మళ్లీ తిరిగిరానుందని భావించి అనేక మంది అఫ్గన్లు దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో దేశం దాటాలన్న సంకల్పంతో చివరికి ఆస్తులను కూడా వదిలేసి పొరుగు దేశాలకు పయనమవుతున్నారు అఫ్గన్ ప్రజలు. అయితే దేశాన్ని వీడేందుకు బయలుదేరుతున్న వాళ్లకు తాలిబన్ల నుంచి చిక్కులు ఎదురవుతున్నాయి.
వీటన్నింటిని దాటుకుంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పాక్ సరిహద్దుకి వేలాది ప్రజలు చేరుకుంటున్నారు. ఆఫ్గన్ వాసుల తాకిడి పెరగడంతో చమన్ సరిహద్దులను పాకిస్తాన్ మూసివేసింది. దీంతో చమన్ సరిహద్దుల్లో వేలది మంది ప్రజలు నిరీక్షిస్తున్నారు. మరోవైపు అన్ని దేశాల సరిహద్దులు సహా వాటికి దారితీసే చెక్ పోస్టుల వద్ద తాలిబన్లు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
చదవండి: Solar Storm: ‘కరోనా’తో పోలిక.. మహా తుపానుతో భారీ డ్యామేజ్!. మనకేం ఫరక్ పడదు
Comments
Please login to add a commentAdd a comment