![Taliban Opens Afghanistan Pakistan Border - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/24/Taliban.jpg.webp?itok=tStrCZp_)
పెషావర్: అఫ్గానిస్తాన్–పాకిస్తాన్ సరిహద్దుల్లోని కీలకమైన తోర్ఖామ్ మార్గాన్ని తాలిబన్ పాలకులు గురువారం తెరిచారు. వైద్యం, ఇతర అత్యవసరాల నిమిత్తం సరిహద్దులు దాటి వచ్చే వారికి పాకిస్తాన్ యంత్రాంగం అవసరమైన తోడ్పాటు ఇవ్వడం లేదంటూ తాలిబన్లు ఆదివారం తోర్ఖామ్ మార్గాన్ని మూసివేశారు. పాకిస్తాన్– మధ్య ఆసియా దేశాలకు ముఖ్యమైన సరఫరా మార్గం ఇదే.
ఇది మూసుకుపోవడంతో పాకిస్తాన్ హుటాహుటిన ఉన్నత స్థాయి బృందాన్ని కాబూల్‌కు పంపించింది. డిమాండ్లను నెరవేర్చేందుకు అంగీకరించడంతో తాలిబన్లు శాంతించారు. అధికారుల సూచనలతో సరిహద్దులు తెరుచుకున్నాయి. దీంతో, అఫ్గాన్ ప్రజల కోసం ఆహార పదార్థాలు, తదితర అత్యవసరాలతో సరిహద్దుల్లో నిలిచిపోయిన వందలాది ట్రక్కులు ఖైబర్ పాస్ గుండా ముందుకుసాగాయి.
చదవండి: అమెరికాలో భీకర మంచు తుపాను
Comments
Please login to add a commentAdd a comment