రిజర్వేషన్‌ కోటా నిరసన హింసాత్మకం.. ఆరుగురి మృతి | bangladesh reservation quota protest violence several student deceased | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్‌ కోటా నిరసన హింసాత్మకం.. ఆరుగురి మృతి

Published Wed, Jul 17 2024 2:58 PM | Last Updated on Wed, Jul 17 2024 5:23 PM

bangladesh reservation quota protest violence several student deceased

ఢాకా: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ కోటాను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్‌లో విద్యార్థులు చేపట్టిన నిరసనలు హింసాత్మాకంగా మారాయి. ఈ నిరసనల్లో మంగళవారం ఆరుగురు నిరసనకారులు మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఉన్న అధికార అవామీ లీగ్ పార్టీ విద్యార్థి విభాగం సభ్యులు, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వేలాది మంది విద్యార్థుల మధ్య ఘర్షణలు తీవ్రతరం అయ్యాయి. దీంతో నిరసన మరింత పెరగకుండా బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ముందస్తుగా.. బుధవారం నుంచి  ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను నిరవధికంగా మూసివేస్తున్నట్లు  ప్రకటించింది.

 

బంగ్లాదేశ్‌లో 56 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు వివిధ కోటాల క్రింద రిజర్వ్ చేయబడ్డాయి. అయితే  వాటిలో 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వీరుల పిల్లలు, మనవళ్లకు 30 శాతం, 10 శాతం మహిళలకు, 10 శాతం అభివృద్ధి చెందని జిల్లాలకు చెందిన వారికి, 5 శాతం స్థానిక వర్గాలకు,1 శాతం వికలాంగులకు కేటాయించబడ్డాయి. 

ఈ రిజేర్వేషన్లను సంస్కరించి ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు ఇవ్వాలని కొంతమంది విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ కోటా ద్వారా ప్రతిభ ఉన్న విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం విద్యార్థులు చేపట్టిన తీవ్రతరం కావటంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు.

 

ఈ నిరసనల్లో సుమారు 400వందల మంది గాయపడినట్లు తెలుస్తోంది. అయితే తాము హింసను రెచ్చగొట్టడానికి నిరసన చేయటం లేదని ఓ  విద్యార్థి నిరసనకారుడు మీడియాకు తెలిపారు. ‘ మేకు కేవలం మా హక్కులుకోసం పోరాటం చేస్తున్నాం. కానీ అధికార పార్టీ గూండాలు శాంతంగా నిరసన తెలుపుతున్నవిద్యార్థులపై దాడులు చేస్తున్నారు’ అని తెలిపారు. 

ఇక.. బంగ్లాదేశ్‌లో  రిజర్వేషన్‌ హక్కుల కోసం శాంతియుతంగా నిసనలు హింసాత్మకంగా మారాటంపై అంతర్జాతీయ సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆమ్నేస్టీ ఇంటర్నేషనల్ స్పందిస్తూ.. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న నిరసనకారులకు భద్రత కల్పించాలంది.  యూఎస్‌ స్టేట్‌ డిపార్టుమెంట్‌ ఈ నిరసన హింసాత్మకంగా మారటాన్ని తీవ్రంగా ఖండించింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement