![Bangladesh Protests Erupt in Dhaka](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/08/11/dhaka-protest.jpg.webp?itok=rvaIKSXf)
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా రాజధాని ఢాకాలో హిందువులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. వీరికి విదేశాల నుంచి కూడా మద్దతు లభిస్తున్నది. మరోవైపు బంగ్లాదేశ్‌లోని పరిస్థితులను భారత్ ఎప్పటికప్పుడు గమనిస్తోంది.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం తాజాగా బంగ్లాదేశ్‌లో హిందూ సమాజంపై జరుగుతున్న మారణహోమానికి వ్యతిరేకంగా హిందూ సంఘాలు ఢాకాలో నిరసన తెలిపాయి. హిందూ దేవాలయాల ధ్వంసంపై పలు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ‘హిందువులకు జీవించే హక్కు ఉంది’ అని రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకుని పలువురు హిందువులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు.
బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో హిందువులు తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ వీధుల్లోకి వచ్చారు. తమ ఆలయాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ వారు చేశారు. ఇదేవిధంగా లండన్, ఫిన్లాండ్‌తో సహా ప్రపంచంలోని పలు ప్రాంతాలలో నిరసనలు కొనసాగాయి. కాగా బంగ్లాదేశ్‌లోని హిందువులకు భద్రత కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి తాత్కాలిక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment