voilence
-
రిజర్వేషన్ కోటా నిరసన హింసాత్మకం.. ఆరుగురి మృతి
ఢాకా: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్‌లో విద్యార్థులు చేపట్టిన నిరసనలు హింసాత్మాకంగా మారాయి. ఈ నిరసనల్లో మంగళవారం ఆరుగురు నిరసనకారులు మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఉన్న అధికార అవామీ లీగ్ పార్టీ విద్యార్థి విభాగం సభ్యులు, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వేలాది మంది విద్యార్థుల మధ్య ఘర్షణలు తీవ్రతరం అయ్యాయి. దీంతో నిరసన మరింత పెరగకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం ముందస్తుగా.. బుధవారం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను నిరవధికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.Dozens injured in Bangladesh clashes as students protest against job quotas for government jobs and a pro-government student body — in pictures https://t.co/CXkzG9mx6b pic.twitter.com/G0ETouUPvs— Al Jazeera English (@AJEnglish) July 16, 2024 బంగ్లాదేశ్‌లో 56 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు వివిధ కోటాల క్రింద రిజర్వ్ చేయబడ్డాయి. అయితే వాటిలో 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వీరుల పిల్లలు, మనవళ్లకు 30 శాతం, 10 శాతం మహిళలకు, 10 శాతం అభివృద్ధి చెందని జిల్లాలకు చెందిన వారికి, 5 శాతం స్థానిక వర్గాలకు,1 శాతం వికలాంగులకు కేటాయించబడ్డాయి. ఈ రిజేర్వేషన్లను సంస్కరించి ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు ఇవ్వాలని కొంతమంది విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కోటా ద్వారా ప్రతిభ ఉన్న విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం విద్యార్థులు చేపట్టిన తీవ్రతరం కావటంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు.Dhaka University now at 12am..#Bangladesh#StepDownHasina pic.twitter.com/PQMX2e8nJQ— Sayed Rouf 🇵🇸 (@SayedRouf4) July 16, 2024 ఈ నిరసనల్లో సుమారు 400వందల మంది గాయపడినట్లు తెలుస్తోంది. అయితే తాము హింసను రెచ్చగొట్టడానికి నిరసన చేయటం లేదని ఓ విద్యార్థి నిరసనకారుడు మీడియాకు తెలిపారు. ‘ మేకు కేవలం మా హక్కులుకోసం పోరాటం చేస్తున్నాం. కానీ అధికార పార్టీ గూండాలు శాంతంగా నిరసన తెలుపుతున్నవిద్యార్థులపై దాడులు చేస్తున్నారు’ అని తెలిపారు. ఇక.. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ హక్కుల కోసం శాంతియుతంగా నిసనలు హింసాత్మకంగా మారాటంపై అంతర్జాతీయ సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆమ్నేస్టీ ఇంటర్నేషనల్ స్పందిస్తూ.. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న నిరసనకారులకు భద్రత కల్పించాలంది. యూఎస్ స్టేట్ డిపార్టుమెంట్ ఈ నిరసన హింసాత్మకంగా మారటాన్ని తీవ్రంగా ఖండించింది.দেশের বুকে আঠারো এসেছে নেমে।❤️#Bangladesh #কোটা_সংস্কার_চাই #কোটাবাতিলচাই #QuotaMovement #QuotaReform pic.twitter.com/Wkalog4iKi— toffee 🇵🇸 (@clowngrizzly) July 16, 2024 -
‘ప్రజలు ప్రేక్షకులుగా ఉండరు’.. మమతాపై స్మృతి ఇరానీ ఫైర్
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర ఇరవై నాలుగు పరగణాల జిల్లా సందేశ్ కాళీ ప్రాంతంలో టీఎంసీ నాయకులకు వ్యతిరేకంగా గిరిజన మహిళలు నిరసన తెలుపుతున్నారు. టీఎంసీ సంబంధించిన ఓ నేత తమ ప్రాంతపు మహిళలను తీవ్రమైన వేధింపులకు గురిచేస్తున్నాడని అక్కడి గిరిజన మహిళుల రోడ్లెక్కి మరీ తమకు న్యాయం చేయాలని నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విమర్శలు గుప్పించారు. మమతా తన పార్టీ కార్యకర్తలతో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడాలని ప్రోత్సహిస్తూ.. హిందూ మారణహోమానికి తెరలేపుతోందని ఆరోపించారు. ‘మమతా బెనర్జీకి కేవలం హిందూ మారణహోహమమే తెలుసు. తన పార్టీ కార్యకర్తలు హిందూ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడాలని అనుమతిస్తున్నారు. సందేశ్ కాళీ ప్రాంతంలో హిందూ మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తి ఎవరూ? ఇప్పటి వరకు షేక్ షాజాహాన్ ఎవరనీ చర్చించుకుంటున్నారు?. షేక్ షాజాహాన్ ఎక్కడ ఉన్నాడో? సీఎం మమతా బెనర్జీ సమాధానం చెప్పాలి’ అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. #WATCH | On Sandeshkhali violence, Union Minister Smriti Irani says, "In Sandeshkhali, some women narrated their ordeals to the media... They said TMC goons visited door to door to identify the most beautiful woman in every house. Who is young. The husbands of identified women… pic.twitter.com/hXARkKp1sj — ANI (@ANI) February 12, 2024 టీఎంసీ ఆఫిసులోనే టీఎంసీ కార్యకర్తలు మహిళలపై రాత్రికి రాత్రి అఘాయిత్యాలకు పాల్పడటానికి అనుమతించటం మాటల్లో చెప్పలేనిదని స్మృతి ఇరానీ ఆరోపించారు. ఇలాంటీ దారుణాలు జరుగుతుంటే పౌరులు ఎట్టిపరిస్థితుల్లో మూగ ప్రేక్షకుల వలె ఉండరని టీఎంసీ ప్రభుత్వంపై మండిపడ్డారు. సీఎం మమతా బెనర్జీ రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే గిరిజన కూలాలు, తెగలను వాడుకుంటోందని దుయ్యబట్టారు. ఇక.. మమతా బెనర్జీ రాష్ట్ర హోం డిపార్టుమెంట్‌ను తన గుప్పెట్లో పెట్టుకోవటంపై దేశంలో న్యాయం కోసం యాత్ర చేసేవారు కూడా స్పందించకపోవటం దారుణమని కాంగ్రెస్‌ను విమర్శించారు. హిందూవులపై దాడిల విషయంలో ప్రభుత్వం ప్రమేయం ఉందని స్మృతి ఇరానీ ఆరోపించారు. మరోవైపు.. సందేశ్ కాళీ ప్రాంతంలో టీఎంసీ నాయకులపై అక్కడి ప్రజల్లో వెల్లువెత్తిన ఆగ్రహానికి కారణాలు తెలుసుకొని, పరిస్థితి చక్కదిద్దటానికి టీఎంసీ సీనియర్ నేత పార్థ భౌమిక్ రేపు(మంగళవారం) ఆ ప్రాంతాన్ని సందర్శించనున్నట్లు సమాచారం. చదవండి: ‘బుల్డోజర్ చర్య ఫ్యాషన్ అయింది’.. హైకోర్టు సీరియస్ -
పుంగునూరులో పోలీసులపై దాడి కేసు: లొంగిపోయిన ఏ-1 నిందితుడు
చిత్తూరు జిల్లా: పుంగునూరులో పోలీసులపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీడీపీ ఇంచార్జ్ చల్లాబాబు సోమవారం పోలీసులకు లొంగిపోయాడు. పుంగునూరులో పోలీసులపై దాడి అనంతరం తప్పించుకుని తిరుగుతున్న చల్లాబాబు నెలరోజుల తర్వాత లొంగిపోయాడు. ఆగస్టు 1వ తేదీనే అల్లర్లకు చంద్రబాబు అండ్‌కో స్కెచ్ వేసింది. పుంగనూరు హైవేపై చంద్రబాబు మీటింగ్ ఉంటే పుంగనూరు పట్టణంలోకి బలవంతంగా దూసుకెళ్లాలని పథకం వేశారు. పోలీసులు అడ్డుకుంటే కర్రలు, రాళ్లు బీర్ బాటిళ్లతో రెచ్చిపోవాలని ప్లాన్ చేశారు. అల్లర్లపై పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబుకు ముందే ఆదేశాలు వచ్చాయి. అంగళ్లు, పుంగనూరులో గొడవల పథకాన్ని వాంగ్మూలంలో చల్లా బాబు అనుచరులు స్పష్టంగా చెప్పారు. ఇప్పటివరకూ ఈ దాడి ఘటనకు సంబంధించి 110 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 63 మంది టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. నేరాల్లో ఘనుడు చల్లా బాబు పుంగనూరులో దాడి కేసులో ప్రధాన సూత్రదారి, పాత్రదారి ఆ నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి చల్లా బాబు అలియాస్ చల్లా రామచంద్రారెడ్డి అని పోలీసులు తేల్చారు. దాడులకు కుట్ర పన్నడం, వ్యూహాన్ని అమలుపరచడంలో ఇతనిదే ప్రధాన పాత్రగా పోలీసులు నిర్ధారించారు. చల్లా బాబు గత చరిత్ర అంతా నేర పూరితమేనని పోలీసు విచారణలో తేలింది. పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయి. ఇతను ఆలయ భూములు, ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. చల్లా బాబుపై ఉన్న పాత కేసుల్లో మచ్చుకు కొన్ని.. 1.1985లో రొంపిచెర్ల పోలింగ్ స్టేషన్‌పై బాంబు దాడి కేసు 2. రొంపిచెర్ల క్రైం నం.368, 2021లో ఐపీసీ సెక్షన్లు, 143, 188, 341,269, 270, 290 రీడ్‌విత్ 149 ఐపీసీ, సెక్షన్ 3 ఈడీయాక్ట్ 3. క్రైం నం.18–2021 ఐపీసీ సెక్షన్లు 353, 506 రీడ్‌విత్ 34 కింద కేసు 4. క్రైం నం.8–2022 ఐపీసీ సెక్షన్లు 188, 341 కింద చౌడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు 5. క్రైం నం.89–2023 ఐపీసీ సెక్షన్లు 143, 341, 506 రీడ్‌విత్149 కింద సోమల పీఎస్‌లో కేసు 6. క్రైం నం.72–2022 ఐపీసీ సెక్షన్లు› 341, 143, 290 రీడ్‌విత్ 149 కింద కేసు 7. క్రైం నం.26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రీడ్‌విత్ 149 కింద కల్లూరు పోలీసు స్టేషన్లో కేసు చదవండి: పుంగనూరు అల్లర్లు.. బయటపడ్డ చంద్రబాబు కుట్ర ‘నారా’జకీయం: తండ్రి పుంగనూరులో.. కొడుకు తుక్కులూరులో.. -
పార్లమెంట్ ను కుదిపేస్తున్న మణిపూర్ ఘటన
-
కంటతడిపెట్టిన దీదీ.. కారణమిదే
కోల్‌కతా: కేంద్రప్రభుత్వ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కన్నీటి పర్యంతమయ్యారు. సెంట్రల్ పోలీస్ ఫోర్స్ సేవల కోసం పరీక్షలు నిర్వహించే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. తాను నిర్వహించే పరీక్షల్లో బీజేపీ అడగమన్న ప్రశ్నలే అడుగుతోందని.. ఈ చర్యలు దాని పునాదిని బలహీనపరుస్తున్నాయని మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. ఆ వివరాలు.. సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్‌లో సివిల్, సాయుధ పోలీసుల ఉద్యోగాల కోసం నిర్వహించే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్షలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల హింసపై ప్రశ్న అడిగారు. ఈ అంశంపై స్పందిస్తూ.. మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. తమ రాష్ట్ర పరువు ప్రతిష్టలకు బీజేపీ తీవ్ర నష్టం కలిగిస్తుందంటూ దీదీ కంటతడిపెట్టారు. బీజేపీ అడగమన్న ప్రశ్నలనే యూపీఎస్సీ అడుగుతున్నదని మండిపడ్డారు. ‘‘బీజేపీ చెప్పిన ప్రశ్నలనే యూపీఎస్సీ అడుగుతుంది. యూపీఎస్సీ నిష్పక్షపాతంగా ఉండేది, కానీ ప్రస్తుతం బీజేపీ తాను అడగాలనుకున్న ప్రశ్నలను యూపీఎస్సీ బోర్డు చేత అడిగిస్తుంది. అలానే యూపీఎస్సీ పేపర్లో రైతుల నిరసనపై ప్రశ్న కూడా రాజకీయ ప్రేరేపితమే' అని మమతా బెనర్జీ విమర్శించారు. యూపీఎస్సీ వంటి సంస్థలను బీజేపీ నాశనం చేస్తోందని ఆమె ఆరోపించారు. బెంగాల్లో కరోనా ఆంక్షలను సడలిస్తున్నట్లు ప్రకటించిన సందర్భంగా మమత ఈ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింస చేలరేగిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యకం చేసింది. మమతా బెనర్జీ కావాలనే తమ పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేసి.. వారిపై దాడి చేయించారని బీజేపీ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను టీఎంసీ ఖండించింది. చిన్న గొడవలను బీజేపీ పెద్దదిగా చేసి చూపుతోందని.. ఫేక్ వీడియోలు, ఫోటోలతో జనాలను మోసం చేస్తుందని మండిపడింది. -
హింసాత్మకంగా మారిన అసోం
-
బెంగాల్లో కేంద్రమంత్రి మురళీధరన్ కారుపై దాడి
-
బెంగాల్లో హింస.. కేంద్ర హోం శాఖ సీరియస్
కోల్కత్త: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చెలరేగిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఇందుకు సంబంధించి నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్ర హోం శాఖ బెంగాల్ గర్నర్‌ను ఆదేశించింది. ఇప్పటికే కేంద్రం నలుగురు సభ్యులతో కమిటీ వేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఫలితాల తర్వాత బెంగాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. బెంగాల్లో కేంద్రమంత్రి మురళీధరన్ కారుపై దాడి జరిగింది. దుండగలు మంత్రి వాహనంపై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో తన వ్యక్తిగత సిబ్బంది గాయపడినట్టు మురళీధరన్ వెల్లడించారు. టీఎంసీ కార్యకర్తలే దాడి చేశారని ఆరోపించడమే కాక.. మురళీధరన్ పర్యటన రద్దు చేసుకుని వెనక్కి వెళ్లిపోయారు. ఇక బెంగాల్లో చెలరేగిన హింసకు ఎన్నికల కమిషనే కారణమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఇక మీదట రాష్ట్రంలో శాంతి భద్రతలు తానే పర్యవేక్షిస్తానన్న మమతా.. డీజీపీ నీరజ్ నయాన్‌పై బదిలీ వేటు వేయడమే కాక.. పాత డీజీపీ వీరేంద్రకు తిరిగి బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. చదవండి: బెంగాల్ హింస ఆగేదెన్నడు? -
గెలిచిన వాళ్లే దాడి చేస్తున్నారా? వర్మ సెటైర్లు
సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్ హింసాకాండ ఘటనపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. సాధారణంగా ఓడిపోయిన వారు హింసకు పాల్పడతారు. కానీ చరిత్రలో మొదటిసారి విజేతలు ఓడిపోయిన వారిపై దాడిచేస్తున్నారని వింటున్నాను.. పాత కక్షల ప్రభావం అనుకుంటా అంటూ తనదైన శైలిలో ట్విటర్లో సెటైర్లు వేశారు. ఈ విధ్వంసానికి టీఎంసీ నాయకత్వం మద్దతు ఇస్తుందంటే నమ్మశక్యంగా లేదు. ఇంత ఘన విజయం సాధించిన తరువాత హింసకు పాల్పడాల్సిన అవసరం ఏముందబ్బా... అయినా ఉన్మాదంతో చెలరేగిపోతూ తోడేళ్లుగా వ్యవహరిస్తున్న వారికి మనం ఎంత చెప్పినా అర్థంకాదు అంటూ ట్వీట్ చేశారు. కాగా ఫలితాల తరువాత టీఎంసీ కార్యకర్తలు రెచ్చిపోయారని, తీవ్ర హింసకు తెగబడ్డారని బీజేపీ ఆరోపిచింది. ఈ దాడిలో బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని వేలాదిమంది కార్యకర్తల ఇళ్లను ధ్వంసం చేశారని మండిపడింది. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం హుటాహుటిన కోల్‌కతా చేరుకున్నారు. బాధిత కుటుంబాను పరామర్శించారు. టీఎంసీ గూండాలు బీజేపీ కార్యకర్త హరన్ అధికారి ఇంటిని ధ్వంసం చేశారు, అతడిని తీవ్రంగా కొట్టడంతో మరణించారని మండిపడ్డారు. మహిళలు, పిల్లలపై కూడా దాడి చేశారంటూ టీఎంసీపై ఆరోపణలు గుప్పించారు. మరోవైపు బీజేపీ ఆరోపణలను టీఎంసీ ఇప్పటికే తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. I find it hard to believe the W B violence is backed by TMC leadership because after such a resounding victory why would they need to do this ? Hooligans indulging in mind less violence are nearest to mad wolves and hence can never be really made to understand — Ram Gopal Varma (@RGVzoomin) May 4, 2021 Always in history,sore losers indulge in violence ..First time I am hearing winners going after losers ..Have a feeling there could be PURANI DUSHMANI — Ram Gopal Varma (@RGVzoomin) May 4, 2021 చదవండి: బెంగాల్లో హింస, సుప్రీంకోర్టుకు బీజేపీ -
బెంగాల్లో హింస, సుప్రీంకోర్టుకు బీజేపీ
కోల్‌కత: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్రంలో చెలరేగిన హింస చర్చకు దారి తీసింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగాల్ ప్రభుత్వం నుంచి నివేదిక కోరారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటనలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన మోదీ గవర్నర్ జగ్దీప్ ధన్కర్కు మంగళవారం ఫోన్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆరా తీశారు. గవర్నర్ ధన్కర్ మంగళవారం ట్విటర్ ద్వారా వివరాలందించారు. ప్రధాని మోదీ తనకు ఫోన్ చేశారని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారని గవర్నర్ తెలిపారు. రాష్ట్రంలో హింస, విధ్వంసం, దోపిడీలు, హత్యలు కొనసాగుతున్నాయని ప్రధానమంత్రికి తాను తెలిపానని పేర్కొన్నారు. శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు సంబంధితులు తక్షణం చర్యలు ప్రారంభించాలన్నారు. ఈ హింసలో కనీసం 12 మంది మరణించారని ఇది గత నెల రోజుల ఎన్నికలలో మరణించిన వారి సంఖ్య కంటే ఎక్కువగా ఉండవచ్చంటూ దీనిపై నివేదికను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరిందని ఆయన తెలిపారు. హుటిహుటిన కోల్‌కతాకు నడ్డా మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం హుటాహుటిన కోల్‌కతా చేరుకున్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నడూ జరగలేదని నడ్డా వ్యాఖ్యానించారు. దేశ విభజన సమయంలోనే ఇంత తీవ్ర హింస జరిగిందనీ, తాజా ఘటనలు తమను దిగ్భ్రాంతికి, ఆందోళనకు గురి చేశాయన్నారు. ఇంతస్థాయిలో అసహనాన్ని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎన్నడూ చూడలేదనిన్నారు. దక్షిణ 24 పరగణాల (ఎఎన్ఐ) ప్రతాప్‌నగర్‌లో బాధిత పార్టీ కార్యకర్తలను నడ్డా పరామర్శించారు. ఖండించిన టీఎంసీ ఈ ఆరోపణలు టీఎంసీ పూర్తిగా తోసిపుచ్చింది. రాష్ట్రంలో వరుసగా మూడోసారి గెలిచిన ముఖ్యమంత్రి తమ నేత మమతా బెనర్జీ అని, బెంగాల్ శాంతి ప్రియమైన ప్రదేశమని పేర్కొంది. అసలు బీజేపీనే తీవ్ర హింసకు పాల్పడిందిన, సీఏపీఎఫ్ ప్రయోగించిందని మమతా బెనర్జీ ఆరోపించారు. అయితే ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కాగా అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆదివారం బెంగాల్లో హింసాకాండ ప్రారంభమైందని బీజేపీ ప్రదాన ఆరోపణ. టీఎంసీ కార్యకర్తలు తమ పార్టీ కార్యకర్తలను హత్య చేశారని, 4వేలకు పైగా ఇళ్లను ధ్వంసం చేశారని మండిపడింది. ఈ హింసాకాండకు బాధ్యత అధికార పార్టీదేనని పేర్కొంది. మమతా సర్కార్ ఫాసిస్టు ప్రభుత్వమని, టీఎంసీని నాజీలంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. మరోవైపు ఈ హింసాకాండపై చర్యలు తీసుకోవాలని సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరుతూ బీజేపీ నేత గౌరవ్ భాటియా సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. PM called and expressed his serious anguish and concern at alarmingly worrisome law & order situation @MamataOfficial I share grave concerns @PMOIndia given that violence vandalism, arson. loot and killings continue unabated. Concerned must act in overdrive to restore order. — Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) May 4, 2021 -
కోవిడ్–19: మహిళలపై తీవ్రమైన వేధింపులు
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19 మహమ్మారి సృష్టించిన విలయ తాండవం మహిళలపై మరో కోణంలో ప్రభావం చూపింది. లాక్డౌన్ కాలంలో మహిళలపై తీవ్రతరమైన హింస ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రపంచంలోని ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు తమ జీవితకాలంలో ఏదో ఒక సందర్భంలో శారీరక లేదా లైంగిక హింసకు గురైనట్టు ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తాజా అధ్యయనం వెల్లడించింది. మహిళలపై హింసకు సంబంధించి అతిపెద్ద అధ్యయనం ఇదేనని తెలిపింది. మూడొంతుల మంది మహిళలు 20 ఏళ్ళు వచ్చేసరికి పరిచయస్తుడైన ఎవరో ఒక వ్యక్తి చేతిలో లైంగిక హింసకు గురవుతున్నట్టు ఈ అధ్యయనం గుర్తించింది. పెరిగిన గృహ హింస కరోనా వ్యాప్తి కారణంగా ప్రభుత్వం చాలా ప్రాంతాల్లో లాక్డౌన్ విధించడంతో, ఆ సమయంలో మహిళలు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఫలితంగా వారిపై హింస మరింత తీవ్రతరమైనట్టు డబ్ల్యూహెచ్ఓ అధ్యయనం గుర్తించింది. మహిళలపై హింస విషయంలో అన్ని దేశాలూ ఒక్కటే అయినా తరతమ స్థాయిల్లో తేడా ఉంటుంది అంతే. స్త్రీలపై హింస అన్నిదేశాల్లోనూ ఉంది. ఇది లక్షలాది మంది మహిళలకు, వారి కుటుంబాలకు తీరని హాని కలిగిస్తోంది. వారి జీవితాల్లో కల్లోలం సృష్టిస్తోంది. కోవిడ్ మహమ్మారి కారణంగా మహిళలపై హింస మరింత పెరిగిందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ గేబ్రియేసస్ చెప్పారు. ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులు సమస్య పరిష్కారం కోసం కలిసికట్టుగా పనిచేయాల్సిన ఆవశ్యకతను ఈ అధ్యయనం నొక్కి చెపుతోందని అన్నారు. 15 ఏళ్ల వయసులోనే.. 2013 తరువాత డబ్ల్యూహెచ్ఓ తొలిసారిగా నిర్వహించిన ఈ అధ్యయనంలో ఇటు జీవిత భాగస్వాముల చేతిలో స్త్రీలు హింసకు గురవుతున్నారని, అంతేకాకుండా పరిచయస్తులు కాని పురుషుల చేతిలోనూ లైంగిక హింసకు గురవుతున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా 73.6 కోట్ల మంది మహిళలు, బాలికలు తమ 15 ఏళ్ల వయస్సులోనే, పైన చెప్పుకున్న కనీసం ఏదైనా ఒక రకమైన హింసకు గురవుతున్నట్టు అధ్యయనంలో వెల్లడయ్యింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు సన్నిహిత భాగస్వామి హింసను, పరిచయస్తులు కాని వారి చేతిలో లైంగిక íß హింసను ఎదుర్కొంటున్నారు’’ అని డబ్ల్యూహెచ్లోని సెక్సువల్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ అండ్ రీసెర్చ్ యూనిట్ డాక్టర్ క్లౌడియా గార్సియా–మొరేనో తెలిపారు. దేశాల మధ్య హింసలో తేడా తక్కువ ఆదాయ దేశాల్లోని మహిళలు, తక్కువ మధ్య ఆదాయ దేశాల్లోని మహిళలపై ఈ హింస ప్రభావం ఒకేలా లేదని ఈ అధ్యయనంలో గుర్తించారు. కొన్ని దేశాల్లో సగం మంది మహిళలపై ఈ ప్రభావం ఉన్నట్టు తెలుస్తోంది. 15 నుంచి 49 ఏళ్ళ మధ్య వయస్సు వారిపై సమీప భాగస్వామి చేతిలో హింస ప్రభావం ఎక్కువగా ఉంది. -
గ్రెటా టూల్‌కిట్: బెంగళూరు యువతి అరెస్ట్
సాక్షి, బెంగళూరు : దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన రిపబ్లిక్ డే హింసాత్మక ఘటనలో పోలీసులు మరో ముందడుగు వేశారు. గణతంత్ర దినోత్సవం నాడు దేశ రాజధానిలో చెలరేగిన హింసకు సంబంధించి బెంగుళూరుకు చెందిన ఓ యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో హింస చెలరేగే విధంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో 21 ఏళ్ల దిశరవి అనే పర్యవరణ ఉద్యమకారినిని ఆదివారం అరెస్ట్ చేశారు. స్వీడన్‌కు చెందిన పర్యవరణ యాక్టివిస్ట్ గ్రెటా థన్‌బర్గ్ కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న దీక్షలకు గ్రేటా మద్దతు తెలపడం, ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ దేశంలో పెను ప్రకంపనలు రేపింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు గ్రేటా షేర్ చేసిన టూల్‌కిట్ ఖలికిస్తాన్ ఉగ్రవాద సంస్థలు తయారు చేసినట్లు ఉందంటూ ఢిల్లీ పోలీసులు సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా రైతు దీక్షలకు మద్దతు తెలుపుతూ.. దేశ అంతరిక వ్యవహారాల్లో తలదూర్చారని ఆరోపిస్తూ పలువురు అంతర్జాతీయ ప్రముఖులపై కేసులు నమోదు చేస్తామని ప్రకటించారు. దీనిలో భాగంగానే గ్రెటా టూల్‌కిట్‌తో సంబంధముందని భావిస్తున్న బెంగళూరు యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పర్యవరణ పరిరక్షణ కోసం దేశ వ్యాప్తంగా ‘ఫ్రైడే ఫర్ ఫ్యూచర్’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 4న ఆమెపై ఢిల్లీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
మహిళలపై ప్రధాని అభ్యంతరకర వ్యాఖ్యలు
జెరూసలేం: సామాన్య వ్యక్తి ఎలా మాట్లాడినా చెల్లుతుంది. కానీ అధికారంలో ఉన్నవారు.. మరీ ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మైనారిటీలు, బాధితుల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే ఇదిగో ఇలా సోషల్ మీడియా వేదికగా వేపుకుతింటారు.. వేటాడేస్తారు నెటిజనులు. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. వివరాలు.. రెండు రోజుల క్రితం ‘ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయోలెన్స్ ఎగెనెస్ట్ వుమెన్’ అనే కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. బెంజమిన్ మహిళలను జంతువులతో పోల్చి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘నీవు కొట్టడానికి మహిళ జంతువు కాదు. మనందరం జంతుహింస తగదని చెప్తాం. వాటి మీద ఆప్యాయత కురిపిస్తాం.. జాలి చూపిస్తాం. మహిళలు పిల్లలు కూడా జంతువులే. అందులోనూ హక్కులున్న జంతువులు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బెంజమిన్. (చదవండి: దుర్గమ్మతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది..!) Netanyahu at event marking International Day for the Elimination of Violence against Women: “A woman isn't an animal you can beat, & nowadays we say don’t hit animals. We have compassion for animals, women are animals, children are animals, with rights.” pic.twitter.com/jwfLH6aYqU — Noga Tarnopolsky (@NTarnopolsky) November 23, 2020 ఇక్కడ బెంజమిన్ నోరు లేని మూగ జీవుల పట్ల ఆప్యాయత, జాలి చూపిస్తాం.. అలాంటిది మానవజాతి మనుగడకు మూలమైన మహిళల్ని ఇంకెంతో గౌరవించాలనే ఉద్దేశంతో మాట్లాడారు. కానీ ఆయన తన భావాలను సరిగా వ్యక్తం చేయకపోవడంతో నెటిజనులు విరుచుకుపడుతున్నారు. మహిళల్ని జంతువులతో పోలుస్తావా అంటూ మండి పడుతున్నారు. గృహ హింస అంటే మీ దృష్టిలో జంతువులను తిట్టడం లాంటిదేనా.. అంటే మహిళలు కూడా మౌనంగా భరించాలని మీ ఉద్దేశమా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. -
ఏం చేశారు.. ఆ ఇద్దరు కార్పొరేటర్లు
బనశంకరి: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన దేవరజీవనహళ్లి, కమ్మగొండనహళ్లి హింసాకాండల కేసులో ఇద్దరు కాంగ్రెస్ కార్పొరేటర్లపై సీసీబీ పోలీసులు దృష్టి సారించారు. డీజే హళ్లి కార్పొరేటర్, మాజీ మేయర్ సంపత్‌రాజ్, పులకేశినగర వార్డు కార్పొరేటర్ అబ్దుల్ రాఖిద్ జాకీర్‌ను సీసీబీ పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు మంగళవారం సీసీబీ డీసీపీ కేసీ.రవికుమార్ తెలిపారు. సీసీబీ జాయింట్ పోలీస్ కమిషనర్ సందీప్‌పాటిల్ నేతృత్వంలో చామరాజపేటే సీసీబీ కార్యాలయంలో వీరి విచారణ సాగింది. (బెంగళూరు అల్లర్లు: ఐదుగురిపై ఎఫ్ఐఆర్ దాఖలు) మరో 30 మంది అరెస్టు : అల్లర్ల కేసులో రోజురోజుకు అరెస్టులు పెరుగుతున్నాయి. సోమవారం రాత్రి మళ్లీ 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి వివిధ విభాగాల పోలీసులు డీజేహళ్లి, కేజీ హళ్లి పోలీస్స్టేషన్ల పరిధిలో గల్లీ గల్లీలో ఉన్న ఇళ్లపై దాడిచేసి 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారి సంఖ్య 380కి పెరిగింది. గొడవ చోటుచేసుకున్న రోజు ఫోటోలు, సీసీ కెమెరా దృశ్యాలు, నిందితులు చెబుతున్న సమాచారం ప్రకారం ప్రతిరోజూ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. పోలీసులు వెళ్లగానే కొందరు దాక్కోగా ఇల్లిల్లూ గాలించి నిర్బంధించారు. గలాటాల తరువాత వివిధ ప్రాంతాలకు పారిపోయినవారిని పట్టుకునేందుకు పోలీసులు కేరళ, తమిళనాడు తదితర ప్రాంతాలకు వెళ్లారు. అనుమానిత ఉగ్రవాది విచారణ ఆల్హింద్ ఉగ్ర సంస్ధ సభ్యుడు, అనుమానిత ఉగ్రవాది సమీయుద్దీన్‌ను ఏటీసీ విభాగం అధికారులు రహస్య ప్రాంతంలోకి తీసుకెళ్లి విచారణ చేస్తున్నారు. కేజీ.హళ్లి, డీజే.హళ్లి అల్లర్లకు సంబంధించి డీజే.హళ్లి నివాసి సమీయుద్దీన్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టగా ఉగ్రసంస్ధ సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇతను డీజే.హళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న అల్లర్లలో భాగస్వాములైనట్లు అనుమానం వ్యక్తమైంది. ఘటన సమయంలో నిప్పుపెట్టడానికి చేతులతో సైగ చేసే దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తం అయ్యాయి. ఇతడి వాట్సాప్ మెసేజ్ చేయడం, వందలాది ఫోన్లు చేసినట్లు విచారణలో వెలుగుచూసింది. ఆ రోజు ఎక్కడ ఉన్నారు గలాటాలు జరిగిన రోజు మీరు ఎక్కడ ఉన్నారు, ఎవరితో మాట్లాడారు మొదలైన సాధారణ ప్రశ్నల నుంచి లోతుగా ఆరా తీస్తున్నారు. అల్లరిమూకలతో కార్పొరేటర్లకు సంబంధాలు ఉన్నాయా అని విచారణ సాగుతోంది. వారి మొబైల్ఫోన్ల కాల్స్‌ను పరిశీలిస్తున్నారు. ప్రమేయం లేదని తేలితే వదిలిపెట్టే అవకాశముంది, లేదంటే అరెస్టు చేయవచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది. సంపత్‌రాజ్ వ్యక్తిగత సహాయకున్ని కూడా ఖాకీలు ప్రశ్నిస్తున్నారు. -
బెంగళూరు అల్లర్లు: ఐదుగురిపై ఎఫ్ఐఆర్
బెంగళూరు: కర్ణాటక రాజధాని డీజే హళ్లి ప్రాంతంలో మంగళవారం రాత్రి చెలరేగిన హింసాత్మక ఘర్షణలకు సంబంధించి బెంగళూరు పోలీసులు ఐదుగురి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ అల్లర్లలో ముగ్గురు మరణించగా.. 200 కార్లు దగ్దమయ్యాయి. డీజే హళ్లి పోలీస్ స్టేషన్‌ను నాశనం చేసి తగులబెట్టారు దుండగులు. ‘పోలీసులను చంపేయండి’ అంటూ ఆయుధాలు కలిగిన నిరసనకారులు నినాదాలు చేశారని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఐదుగురు వ్యక్తులు మంగళవారం రాత్రి 8.45గంటలకు డీజే హళ్లి ప్రాంతంలో దాడులు ప్రారంభించారు. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యే నివాసం బయట దాడులకు పాల్పడ్డారు. ఈ నిరసనలకు ప్రధాన కారణం ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి బంధువు ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దాంతో అల్లర్లు చెలరేగాయి. (రాజుకున్న రాజధాని) పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లోని వివరాలు.. 1. రాత్రి 8:45 గంటలకు, ఐదుగురు వ్యక్తులు అర్ఫాన్, ఎస్డీపీఐకి చెందిన ముజ్జామిల్ పాషా, సయ్యద్ మసూద్, అయాజ్, అల్లాహ్ బక్ష్‌తో పాటు 300 మంది వీధుల్లోకి వచ్చారు. వారి చేతిలో మాచెట్స్, రాడ్లు వంటి ఆయుధాలు కలిగి ఉన్నారు. పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారు. 2. వారు ‘పోలీసులను చంపండి, వారిని విడిచిపెట్టవద్దు’ అని నినాదాలు చేశారు. నిరసనకారులు పోలీసులపై ఇటుకలు కూడా విసిరారు. దాడి సమయంలో పోలీస్ స్టేషన్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్ తలకు గాయమైంది. 3. పోలీసులు పదేపదే విజ్ఞప్తి చేసిన తర్వాత కూడా ఈ గుంపు అక్కడ నుంచి కదల్లేదు, విధ్వంసం కొనసాగింది. వారు కేజే హళ్లి, డీజే హళ్లి పోలీస్ స్టేషన్లలోని వాహనాలకు నిప్పంటించారు. అనంతరం ఈ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. 4. జనసమూహాన్ని అక్కడి నంచి వెళ్లిపోవాల్సిందిగా పోలీసులు హెచ్చరించారు. కాని నిరసనకారులు పోలీసులను ఉద్దేశించి ‘మిమ్మల్ని అంతం చేయకుండా ఇక్కడ నుంచి కదలం’ అని చెప్పారు. వారు బేస్మెంట్ నుంచి పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించి, ‘హత్య చేయాలనే ఉద్దేశ్యంతో’ పోలీసు సిబ్బందిపై దాడి చేశారు. 5. ఎఫ్ఐఆర్లో, మూక దాడిలో చిక్కుకున్న పోలీసుల ప్రాణాలను కాపాడటానికి తాము గాలిలో ఒక రౌండ్ కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాక అర్ఫాన్, ముజ్జామిల్ పాషా (ఎస్డీపీఐ), సయ్యద్ మసూద్, అయాజ్, అల్లాహ్ బక్ష్ కేఎస్ఆర్పీ ప్లాటూన్ల నుంచి తుపాకులను లాక్కోవడానికి ప్రయత్నించారు. దాంతో వారిని చెదరగొట్టడానికి పోలీసులు గాల్లో ఎక్కువ రౌండ్లు కాల్పులు జరిపారు. వారిని అరెస్ట్ చేశాము అని ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. 6. సాయుధ గుంపు పోలీస్ స్టేషన్ మీద రాళ్ళు రువ్వడంతో ఒక పోలీసు కానిస్టేబుల్ గాయపడ్డారు. ఆ తర్వాత మరో 59 మంది గాయాలపాలయ్యారు 7. దుండగులు పోలీస్ స్టేషన్ వెలుపల ఆపి ఉంచిన వాహనాలను తగలబెట్టడం ప్రారంభించగానే, ఒక పోలీసు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. దాంతో నిరసనకారులు పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించి తలుపులు, కిటికీలు పగలగొట్టారు. పోలీసులను అంతం చేస్తామని హెచ్చరించారు. ఈ ముఠా పోలీసుల నుంచి ఆయుధాలను లాక్కోవడానికి కూడా ప్రయత్నించింది. అనంతరం అదనపు దళాలు రావడంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి నిందితులను అరెస్ట్ చేశారు. (అలా చేస్తే చర్యలు తప్పవు: డీజీపీ) కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి బంధువు ఓ వర్గంపై సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌తో మంగళవారం రాత్రి హింస చెలరేగింది. అల్లరిమూకను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఆందోళనకారులు ఎమ్మెల్యే ఇంటిపై దాడికి తెగబడటంతో పాటు పోలీస్ వాహనాలకు నిప్పంటించారు. డీజే హళ్లి పోలీస్ స్టేషన్లోకి చొరబడి కనిపించిన వస్తువులను ధ్వంసం చేశారు. కాగా బెంగళూర్‌లో జరిగిన హింసాకాండకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప అధికారులను ఆదేశించారు. హింసాకాండకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులు, వాహనాలను ధ్వంసం చేసిన వారి నుంచే నష్టాలను రికవరీ చేస్తామని చెప్పారు. -
నేను బతికి ఉండటం అద్భుతం: శ్రీనివాసమూర్తి
బెంగళూరు: ఫేస్బుక్లో షేర్ చేసిన ఓ పోస్టు కర్ణాటకలో కల్లోలానికి దారి తీసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి బంధువు ఒకరు ఓ వర్గాన్ని కించపరిచే విధంగా పోస్టు చేశారు. ఎమ్మెల్యే అండతోనే సదరు వ్యక్తి ఇలా చేస్తున్నాడని భావించి మంగళవారం రాత్రి నిరసనకారులు బెంగళూరులో శ్రీనివాస మూర్తి నివాసంపై దాడి చేశారు. దీనిపై ఎమ్మెల్యే తాజాగా స్పందించారు. తాను బతికుండటం నిజంగా అద్భుతం అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ క్షణం నేను బతికి ఉండటం నిజంగా అద్భుతం. దాడి జరిగినప్పుడు నేను బయట ఉన్నాను. నా శ్రేయోభిలాషులు ఫోన్ చేసి దాడి గురించి ముందుగానే నన్ను హెచ్చరించారు. దాంతో తప్పించుకోగలిగాను. లేదంటే ఇప్పుడు నేను ఇలా బతికి ఉండేవాడిని కాదు’ అన్నారు శ్రీనివాస మూర్తి. (బెంగళూరు అల్లర్లు: ముస్లింల సాహసం) అంతేకాక ‘గుర్తు తెలియని వ్యక్తులు నా ఇంటికి నిప్పంటించారు. పెట్రోల్ బాంబులను విసిరారు. పోలీసులు సకాలంలో రాకపోతే నా ఇంట్లో గ్యాస్ సిలిండర్‌ను పేల్చేసేవారు. ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. ఇది పక్కా ప్రణాళికతో జరిగిన దాడి. పోలీసులు దీనిపై విచారణ చేయాలి. బాధ్యులను కఠినంగా శిక్షించాలి’ అని శ్రీనివాస మూర్తి డిమాండ్ చేశారు. ఓ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న తనకే ఇలా జరిగితే... ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. దాడులు చేసిన వారు తమ నియోజకవర్గానికి చెందిన వారు కాదని, బయటి వ్యక్తులన్నారు. ఈ విషయంపై హోంమంత్రి, పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడానని, తమ పార్టీ వారితో కూడా మాట్లాడినట్టు శ్రీనివాస మూర్తి తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా.. 100మంది గాయపడ్డారు. వీరిలో 60 మంది పోలీసులు ఉన్నారు. -
అమెరికాలో ఆందోళనలు; ఒబామా స్పందన
జార్జి ఫ్లాయిడ్ హత్యకు, సమాజంలో కొనసాగుతున్న అసమ న్యాయం సమస్యకు వ్యతిరేకంగా అమెరికాలో లక్షలాదిమంది ప్రజలు వీధుల్లోకి వచ్చి గళమెత్తుతున్నారు. ఈ సందర్భంగా అమెరికా ఎదుర్కొంటున్న ఈ సమస్యలో నిజమైన మార్పు తీసుకొచ్చేలా ఈ ఉద్వేగాలను ఎలా కొనసాగించాలి అని చాలామంది నన్ను ప్రశ్నిస్తున్నారు. అంతిమంగా ఈ సమస్యకు ఉత్తమ పరిష్కారం లభించేలా వ్యూహాలను తీర్చిదిద్దవలసిన బాధ్యత తదుపరి తరం కార్యకర్తల మీదే ఉంటుంది. అయితే గతంలో ఈ విషయంపై జరిగిన ప్రయత్నాలనుంచి గ్రహించవలసిన కొన్ని ప్రాథమిక పాఠాలు మనకు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. మొదటగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా వెల్లువలా పెల్లుబుకుతున్న ప్రజా నిరసన కార్యక్రమాలు అనేవి.. పోలీసుల పనితీరులో, నేర న్యాయవ్యవస్థలో విస్తృత ప్రాతిపదికన సంస్కరణలు తీసుకురావడంలో అమెరికాలో దశాబ్దాలుగా సాగుతున్న వైఫల్యం పట్ల నిజమైన, సహేతుకమైన నిరాశా నిస్పృహలను ప్రతిబింబిస్తున్నాయి. ఈ నిరసనల్లో పాల్గొంటున్న వారిలో చాలామంది శాంతియుతంగా, సాహసోపేతంగా, బాధ్యతాయుతంగా ఉంటూ స్ఫూర్తి కలిగిస్తున్నారు. కనుక వీరి నిరసనలను ఖండించడానికి బదులుగా మనందరం గౌరవించాలి. మద్ధతుగా నిలవాలి. నిజానికి కామ్డెన్, ఫ్లింట్ వంటి నగరాల్లోని పోలీసులు ఈ వాస్తవాన్ని అర్థం చేసుకున్నందుకు వారిని ప్రశంసించాలి కూడా. మరోవైపున, అనేకరూపాల్లో హింసకు పాల్పడిన అతి చిన్న మైనారిటీ బృందాలు నిజమైన ఆగ్రహంతో లేక కేవల అవకాశవాదంతో అలా చేస్తున్నప్పటికీ అమాయకులను వీరు ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఇప్పటికే తమ పొరుగున ఉన్న వారికి ఈ హింసాత్మక చర్యల ద్వారా కనీస సేవలు కూడా అందకుండా చేసేలా వీరి చర్యలు ఉంటున్నాయి. పైగా దీర్ఘకాలిక లక్ష్య సాధన నుంచి ఇలాంటి చర్యలు పక్కదోవ పట్టిస్తాయి. నిన్ననే కన్నీళ్లు పెట్టుకున్న ఒక నల్లజాతి మహిళ ఇంటర్వ్యూను చూశాను. తన పొరుగునే ఉన్న కిరాణా దుకాణాన్ని ధ్వంసం చేయడం ఆమెను విషాదంలో ముంచెత్తింది. నిజానికి ఆ దుకాణం మళ్లీ యథాస్థితికి వచ్చి సేవలందించాలంటే సంవత్సరాల సమయం పడుతుంది. కాబట్టే హింసను మనం సమర్థించవద్దు, దాన్ని హేతుబద్ధం చేయవద్దు లేక దాంట్లో పాల్గొనకుండా జాగ్రత్తపడదాం. మన నేర న్యాయవ్యవస్థ కానీ, అమెరికన్ సమాజం కానీ అత్యున్నత నైతిక నియమావళితో పనిచేయాలని మనం కోరుకుంటున్నట్లయితే అలాంటి నైతిక నియమావళిని ముందుగా మనం ఆచరించి చూపాల్సి ఉంది. రెండో విషయం, మన నేరన్యాయ వ్యవస్థలో పదేపదే సాగుతున్న జాతివివక్షా ధోరణిని ఇలాంటి నిరసనలు, ప్రత్యక్ష పోరాటం మాత్రమే మార్చగలుగుతాయని.. ఓట్లు వేయడం, ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనడం శుద్ధ దండగమారి వ్యవహారమని కొంతమంది సూచిస్తుండటాన్ని కూడా నేను విన్నాను. ఈ అభిప్రాయాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాను. ప్రజల్లో జాగరూకత పెంచడం, అన్యాయాన్ని అక్కడికక్కడే ఎత్తి చూపడం, అధికారంలో ఉన్నవారికి అసౌకర్యం కలిగించడమే నిరసనల లక్ష్యంగా ఉండాలి. అమెరికా చరిత్ర పొడవునా ఇలాంటి ప్రజా నిరసనలు, సహాయ నిరాకరణకు స్పందించడం వల్లే, దేశంలోని రాజకీయ వ్యవస్థ అణగారిన బృందాల సమస్యల పట్ల ఆసక్తి చూపిందని గుర్తుంచుకోవాలి. కాబట్టే ప్రజల ఆకాంక్షలు, వారి ఉద్వేగాలు నిర్దిష్ట చట్టాలుగా, సంస్థాగత ఆచరణగా పరివర్తన చెందాయి. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో మన డిమాండ్ల పట్ల స్పందించేవారిని మనం ఎన్నుకున్నప్పుడు మాత్రమే ఇది సాకారమవుతుంది. అంతకంటే మించి, మన నేరన్యాయ వ్యవస్థపై, పోలీసుల పనితీరుపై ఎలాంటి ప్రభుత్వం అత్యధిక ప్రభావం వేయగలుగుతుందో మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మనం రాజకీయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు, మనలో చాలామంది అధ్యక్షుడు, ఫెడరల్ ప్రభుత్వం పట్ల మాత్రమే ఆసక్తి పెంచుకుంటూ ఉంటారు. నిజమే. మన సమాజంలో జాతి వివక్ష పాటిస్తున్న అణచివేత స్వభావాన్ని వాస్తవంగానే అర్థం చేసుకుని దానిపై ఏదో ఒక చర్య తీసుకోవాలంటే.. అధ్యక్షుడు, కాంగ్రెస్, అమెరికన్ న్యాయ విభాగం, ఫెడరల్ న్యాయవ్యవస్థ మనకు తప్పకుండా ఉండితీరాలి. అయితే రాష్ట్ర, స్థానిక స్థాయిల్లో ఎన్నికైనవారే చాలావరకు పోలీసు శాఖలో, నేరన్యాయవ్యవస్థలో సంస్కరణల గురించి చాలా ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటారని మాత్రం మర్చిపోవద్దు. చాలావరకు పోలీసువిభాగం అధిపతులను మేయర్లు, కౌంటీ కార్యనిర్వాహకులే ఎక్కువగా నియమిస్తుంటారు, పోలీసు యూనియన్లతో సమష్టి ఒప్పందాలపై చర్చిస్తుంటారు. పోలీసుల దుష్ప్రవర్తనపై విచారించాలా వద్దా, అంతిమంగా వారిపై నేరారోపణ చేయాలా వద్దా వంటి విధులను జిల్లా అటార్నీలు, రాష్ట్రాల అటార్నీలు నిర్వహిస్తుంటారు. వీరంతా ఎన్నికైనవారే. కొన్ని చోట్ల పోలీసుల వ్యవహార శైలిని పర్యవేక్షించే అధికారాన్ని పోలీసు సమీక్షా మండళ్లకు ఉంటుంది. కానీ ఈ స్థానిక పోటీల్లో పాల్గొనే ఓటర్ల సంఖ్య.. ప్రత్యేకించి యువతీయువకుల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. సామాజిక న్యాయానికి సంబంధించిన సమస్యలపై నేరుగా ప్రభావం చూపే ఇలాంటి పదవులను పట్టించుకోకపోవడం తెలివిలేని పని. పైగా.. ఈ కీలకమైన స్థానాల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనే అంశాన్ని కొన్ని వేలమంది ఓటర్లు లేక కొన్ని వందలమంది ఓటర్లు మాత్రమే నిర్ణయిస్తుంటారు. కాబట్టి నిజమైన మార్పు తీసుకురావాలని మనం కోరుకుంటున్నట్లయితే, అలాంటి అవకాశం నిరసనలు లేక రాజకీయాల్లో ఏదో ఒకదానిపై ఆధారపడి ఉండదు. ఈ రెండూ మనకు కావాలి. ప్రజల్లో జాగరూకతను పెంచడానికి మనం జనాల్ని కూడగట్టాలి. పాలనా సంస్కరణలు తీసుకురాగల అభ్యర్థులను మాత్రమే మనం ఎన్నుకునేలా మన ఓటుహక్కును వినియోగించుకునేలా మనం సంఘటితం కావాలి. చివరగా నేర న్యాయవ్యవస్థలో, పోలీసు విభాగంలో సంస్కరణలపై మనం నిర్దిష్టంగా డిమాండ్లు పెట్టాలి, దీన్ని ముందుకు తీసుకురానట్లయితే ఎన్నికైనవారు ఈ కీలకమైన సంస్కరణ పట్ల నామమాత్రంగా మాత్రమే స్పందిస్తూ, ప్రజా నిరసనలు తగ్గుముఖం పట్టాక యధావిధిగా తమ తమ రోజువారీ పనుల్లో మునిగిపోతారు. కాబట్టి సంస్కరణల ఎజెండా విషయం వివిధ సామాజిక బృందాలకు సంబంధించినంతవరకూ వేరువేరుగా ఉంటుంది. మహానగరం విషయంలో ఒక తరహా సంస్కరణలు అవసరం కావచ్చు. గ్రామీణ ప్రజానీకానికి మరో తరహా సంస్కరణలు అవసరం కావచ్చు. కొన్ని ప్రాంతాలకు పూర్తిగా పునరావాసం అవసరం కావచ్చు. ఇతరులకు కొన్ని సంస్కరణలే అవసరం కావచ్చు. అందుకే ప్రతి శాసన అమలు విభాగం కూడా స్పష్టమైన విధానాలు కలిగి ఉండాలి. ఎక్కడైనా దుష్ప్రవర్తనకు సంబంధించిన పరిశీలనకు స్వతంత్ర విభాగం అవసరం కూడా దీనిలో భాగమే. ప్రతి కమ్యూనిటీ అవసరాలకు తగినట్లుగా సంస్కరణలను మార్చాలంటే స్థానిక కార్యకర్తలు, సంస్థలు పరిశోధనలు చేసి ఎలాంటి వ్యూహాలు చేపడితే ఉత్తమంగా ఉంటుంది అనే విషయంపై తోటి పౌరులను చైతన్యవంతం చేయాల్సి ఉంటుంది. దీనికి ప్రారంభ ఘట్టంగా, నేను వైట్‌హౌస్‌లో ఉన్నప్పుడు ఏర్పర్చిన ‘21వ శతాబ్ది విధానాలపై టాస్క్‌ఫోర్స్’ చేసిన కృషిపై ఆధారపడి పౌర, మానవ హక్కులపై లీడర్షిప్ కాన్ఫరెన్స్ అభివృద్ది చేసిన టూల్ కిట్, దానిగురించిన నివేదికను ముందుగా పరిశీ లించాలి. నిర్దిష్ట చర్యలు తీసుకోవడంపై మీకు శ్రద్ధాసక్తులు ఉంటే, ఒబామా ఫౌండేషన్‌లో ఒక నిబద్ధత కలిగిన సైట్‌ను రూపొందిం చాము. సంవత్సరాలుగా స్థానిక, జాతీయ స్థాయిల్లో మంచికోసం పోరాడుతూ వస్తున్న సంస్థలకు, వ్యక్తులకు ఇది ఉపయోగకరమైన వనరుగా ఉంటుంది. గత కొన్ని నెలలుగా అమెరికా కఠిన పరిస్థితులను ఎదుర్కొందని, సమాజంలో స్ఫూర్తి కాస్త తగ్గుముఖం పట్టిందని నేను గుర్తిస్తున్నాను. కరోనా సాంక్రమిక వ్యాధి తీసుకొచ్చిన భయం, విషాదం, అనిశ్చితి, కష్టభూయిష్టమైన పరిస్థితులు వంటివి.. అమెరికా సామాజిక జీవితం ఇప్పటికీ దురభిప్రాయాలు, అసమానత్వంతో నిండివుందని విషాదకరంగా మనందరికీ గుర్తు తెస్తున్నాయి. కానీ గత కొన్ని వారాలుగా ప్రతి జాతిలో, ప్రతి ప్రాంతంలో మన యువతీయువకుల క్రియాశీలతను ఎత్తిపడుతున్న ఘటనలను చూస్తున్నప్పుడు మాత్రం నాకు పరిస్థితి పట్ల ఆశావహంగానే ఉంది. మనం ముందుకు పోవాలంటే మన ధర్మాగ్రహాన్ని శాంతిమార్గంవైపు మళ్లించాలి. నిలకడతో కూడిన సమర్థ కార్యాచరణను చేపట్టాలి. అప్పుడు మాత్రమే మన అత్యున్నత లక్ష్యాలకు అనుగుణంగా మన దేశం సాగించే సుదీర్ఘ ప్రయాణంలో ప్రస్తుత ఘట్టం నిజమైన మూలమలుపు అవుతుంది. బరాక్ ఒబామా, అమెరికా పూర్వ అధ్యక్షుడు -
ట్రంప్ నోరు అదుపులో పెట్టుకో
వాషింగ్టన్ : నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ పోలీసుల చేతిలో మృతిచెందడాన్ని నిరసిస్తూ అగ్రరాజ్యం అమెరికాలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. మినియాపొలిస్‌లో ప్రారంభమైన నిరసన జ్వాలలు అమెరికాలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు అంటుకున్నాయి. ఆందోళనకారులను కించపరుస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నిరసనలకు ఆజ్యం పోసినట్లు అయ్యింది. లూటింగ్ మొదలైతే.. షూటింగ్ తప్పదని హెచ్చరిస్తూ ట్రంప్ గత వారం సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రకంపనలు రేపుతోంది. దీనిపై టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగర పోలీస్ చీఫ్ ఆర్ట్ అసేవెడో డొనాల్ట్ ట్రంప్‌కు గట్టిగానే బదులిచ్చారు. ట్రంప్ నోరు మూసుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. (నిరసనలపై మండిపడ్డ ట్రంప్) ఇలాంటి వ్యాఖ్యల వల్ల నిరసనకారుల ఆగ్రహం ఇంకా పెరుగుతుందని, ఇలా వ్యాఖ్యలు చేయడం వారిని రెచ్చగొట్టడమే అవుతుందన్నారు. నిరసనకారులను రెచ్చగొట్టకుండా ట్రంప్ నోరు మూసుకోవడం సరైనదని సూచించారు. ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడటానికి బదులుగా సమస్య పరిష్కారానికి చొరవ చూపితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇదిలావుండగా జార్జ్ మృతిపై ఆందోళన ఉధృతమవుతున్న తరుణంలో.. అతని మెడపై బలమైన ఒత్తిడి వలనే చనిపోయాడని వైద్యులు పోస్ట్‌మార్టం నివేదికను బహిర్గతం చేశారు. దీంతో ఆందోళనకారుల ఆగ్రహం మరింత పెరిగింది. ఏకంగా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ను తాకింది. ఈ క్రమంలో ట్రంప్ బంకర్లో తల దాచుకున్నట్లు వార్తలు వెలుపడ్డాయి. (జార్జ్ హత్య : సత్య నాదెళ్ల స్పందన) -
జేఎన్‌యూ దాడి : పోలీసుల కీలక ప్రెస్‌మీట్
సాక్షి, న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయంప్రాంగణంలో జనవరి 5, ఆదివారం చోటుచేసుకున్న ఘటనపై ఢిల్లీ పోలీసులు కీలక ప్రకటన చేయనున్నారు. నేడు( శుక్రవారం)నాలుగు గంటలకు పోలీసులు మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ముసుగులేసుకుని మరీ క్యాంపస్‌లో ప్రవేశించి, ఆందోళన చేస్తున్న విద్యార్థులపై విరుచుకుపడిన దుండగుల వివరాలను వెల్లడిస్తామన్నారు. ఈ దాడి వెనుక ఉన్న కుట్రను బహిర్గతం చేయనున్నామని అలాగే వాట్సాప్ మిస్టరీని కూడా ఛేదించామని అధికారులు చెబుతున్నారు. జేఎన్‌యు క్యాంపస్‌లో అక్కడ ఉన్న వారి మొబైల్ ఫోన్ల డేటాను విశ్లేషిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హింస జరిగిన దాదాపు ఐదు రోజులకు సంఘటనను దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. మరోవైపు రెండు వాట్సాప్ గ్రూపులకు కనీసం 70 మంది నిర్వాహకులను గుర్తించినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని సీనియర్ పోలీసు అధికారిని ఉటంకిస్తూ పిటిఐ నివేదిక పేర్కొంది. కాగా ముసుగులేసుకున్న సుమారు 50 మంది జేఎన్‌యు క్యాంపస్‌లోకి కర్రలు, ఇనుప రాడ్లతో హాస్టల్ గదుల్లోకి ప్రవేశించి విద్యార్థులు, ఉపాధ్యాయులపై దాడి చేశారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ దాడిలో విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషే ఘోషేతోపాటు, మరో 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన ఇప్పటివరకు మొత్తం 14 ఫిర్యాదులను పోలీసులు నమోదు చేశారు. వీటన్నింటినీ క్రైమ్ బ్రాంచ్ పరిశీలిస్తోంది. అయితే ఈ ప్రకటనపై కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జనవరి 5 దాడిలో గాయపడిన విద్యార్థి నాయకురాలు ఐషే ఘోషే పై కేసు నమోదు చేసిన తీరుగానే, పోలీసుల ప్రకటన వుండే అవకాశం ఉందా అని సందేహిస్తున్నారు. -
ప్రమాదంలో ఉన్నారా.. కాల్ చేయండి!
సాక్షి, హైదరాబాద్: మహిళలు, బాలికలపై రోజు రోజుకూ పెరుగుతున్న హింసాత్మక ఘటనలు సభ్య సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. దేశంలో ప్రతీరోజు ఏదో ఒకమూల చోటు చేసుకుంటున్న అమానుష ఘటనలు, హత్యాచారాలు భయ బ్రాంతులకు గురి చేస్తున్నాయి. మానవత్వానికి మాయని మచ్చగా మిగిలిపోతున్నాయి. తాజగా హైదరాబాద్‌లో ప్రియాంకరెడ్డి, వరంగల్‌లో మరో యువతి హత్యాచార ఘటనలు కలకలం రేపాయి. అయితే అనుకోని ప్రమాదంలోగానీ, చిక్కుల్లోగానీ ఇరుక్కుంటే.. అధైర్యపడకండి! ధైర్యంగా ఆలోచించండి.. అప్రమత్తంగా వుంటూ వేగంగా కదలండి. వీటిన్నికంటే ముందుగా పరిస్థితులను చురుకుగా అర్థం చేసుకోవడం ప్రధానం. దీంతోపాటు ప్రమాదంలో ఉన్న బాధితుల ఆసరా, రక్షణ కోసం కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వివిధ హెల్ప్ లైన్ నెంబర్లను తమ సమాచారాన్ని అందించడం చాలా ముఖ్యం. ఈ నెంబర్లను మీ మొబైల్ ఫోన్లలో సేవ్ చేసుకోండి. ప్రమాదంలో ఉన్న మహిళలూ, అమ్మాయిలు ఈ హెల్ప్లైన్లను గుర్తుంచుకోండి! విద్యార్థినులపై వేధింపులు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలపై ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ రాష్ట్రంలో 181 నెంబర్ అందుబాటులో ఉంది. అలాగే షీ టీం ల్యాండ్ లైన్ నెంబరు 040 - 2785 2355 గానీ, వాట్సాప్ నెంబరు 94906 16555 కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అలాగే దేశ వ్యాప్తంగా ఉన్న టోల్ ఫ్రీ నెంబర్లు 112,100,1090, 1091 లలో ఏదో ఒక దానికి ఫోన్ చేసి తాము ప్రమాదంలో ఉన్న సమాచారాన్ని అందించి, రక్షణ పొందండి. మరోవైపు తెలంగాణాలో చోటుచేసుకున్న వరుస ఘటనలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ట్విటర్లో ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ప్రియాంక రెడ్డి సజీవదహనం కలచివేస్తోందనీ, మీడియా హౌస్‌లు బాధితుల కోసం హెల్ప్లైన్ల అవగాహన కల్పించడం చాలా అవసరమని ఆమె పేర్కొన్నారు. (ప్రియాంకారెడ్డి చివరి ఫోన్‌కాల్) హైదరాబాదులో ప్రియాంక రెడ్డి సజీవదహనం కలచివేస్తుంది. ప్రమాదంలో ఉన్నప్పుడు అమ్మాయిలు టోల్ ఫ్రీ నెంబర్లు 112,100,1090, 181, 1091 లలో ఏదో ఒకదానికి ఫోన్ చేయండి. మీడియా మిత్రులు మరొకసారి హెల్ప్ లైన్లను ఫోకస్ చేయండి. — Vasireddy Padma (@padma_vasireddy) November 28, 2019 -
బెంగాల్ హింస ఎందుకు కొనసాగుతోంది?
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తలెత్తిన హింసాకాండ ఇప్పటికీ ఎందుకు కొనసాగుతోంది. ఏ ఎన్నికల సందర్భంగానైనా ఆ రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు చెలరేగడం, ఎన్నికల అనంతరం ఆగిపోవడం సాధారణ విషయం. ఈసారి ఎందుకు అలా జరగలేదు ? పైగా ఎన్నికల సందర్భంగా తలెత్తిన హింసలోకన్నా అనంతరం కొనసాగిన హింసాకాండలోనే ఎక్కువ మంది మరణించారు. అక్కడ రాజకీయాలే హింసాత్మకం అయితే ఎందుకు సామాన్య పౌరులు వాటికి దూరం కావడం లేదు ? పైగా ఎంత హింసాకాండ జరిగిన ఎన్నికల సందర్భంగా పోలింగ్ ఎక్కువగా ఉంటోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో 81.85 శాతం పోలింగ్ జరిగింది. ఎందుకు? స్థానిక ప్రజాస్వామ్య బలంగా ఉండడం పశ్చిమ బెంగాల్లో వామపక్షాల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదికే, అంటే 1978లో మూడంచెల పంచాయతీ వ్యవస్థను తీసుకొచ్చింది. గ్రామ స్థాయిలో, సమితి స్థాయిలో, జిల్లా స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం. ఇక్కడే ఇతర రాష్ట్రాలకు ఈ రాష్ట్రాలకు తేడా ఉంది. ఇతర పార్టీలతో, పార్టీ చిహ్నాలతో ప్రమేయం లేకుండా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. బెంగాల్లో పార్టీ గుర్తులపైనే ఎన్నికలు జరుగుతాయి. ఈ కారణంగా పార్టీల బలాబలాలు సమాన స్థాయిలో ఉన్నప్పుడు దిగువ స్థాయి నుంచే అల్లర్లు పుట్టుకొస్తాయి. తణమూల్‌కు సమాన స్థాయిలో బీజేపీ ఎదుగుతూ వచ్చిన విషయం తెల్సిందే. అభివద్ధి కార్యక్రమాలతో విభేదాలు తణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇళ్లనిర్మాణం, బాల్య వివాహాల నివారణకు పెళ్లీడు వచ్చాక పెళ్లి చేస్తే పెళ్లి కూతురుకి పాతిక వేల రూపాయలను పారితోషికంగా ఇవ్వడం లాంటి పథకాలను అమలు చేస్తోంది. తణమూల్ కాంగ్రెస్‌కు చెందిన కార్యకర్తలు అన్నదమ్ముల పేరు మీద ఒకటికన్నా ఎక్కువ ఇంట్లను పొందడం, ఇప్పటికీ పంచాయతీ స్థాయిలో బలంగా ఉన్న కమ్యూనిస్టులకు ఒక్క ఇల్లు కూడా దక్కక పోవడం, పెళ్లి కూతురికి పాతికవేల పారితోషకం మంజూరుకు తణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఐదువేల రూపాయలు లంచం తీసుకోవడం విపక్ష కార్యకర్తల్తో కక్షలను రేపాయి. 2018లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వివిధ పార్టీలను పోటీ చేయకుండా అడ్డుకోవడం ద్వారా దాదాపు 40 శాతం సీట్లను ఏకగ్రీవంగా గెలుచుకొంది. అప్పటి నుంచి సీపీఎం, బీజేపీ పార్టీ కార్యకర్తల్లో రగులుతున్న కోపం లోక్‌సభ ఎన్నికల్లో హింసాకాండకు దారితీసింది. అనూహ్యంగా సీపీఎం, సీపీఐ కార్యకర్తలు బీజేపీతో చేతులు కలపడంతో ఇరు పక్షాల మధ్య దాడులు ఎక్కువయ్యాయి. ఇలా కక్షలు, కార్పణ్యాలు పంచాయతీ స్థాయికి పాకడంతో అల్లర్లు సద్దుమణగడం లేదు. -
ఇంత పైశాచికమా..మౌనం వీడండి ప్లీజ్!
భర్తలు, తండ్రులు, ఇతర సన్నిహిత కుటుంబ సభ్యుల చేతుల్లోనే మహిళలు, బాలికలు తీవ్రమైన దాడులకు, హింసకు గురవుతున్నారనీ ఐక్య రాజ్య సమితి ఏనాడో తేల్చి చెప్పింది. దేశంలో మహిళలకు ఏపాటి రక్షణ ఉందో తెలియచెప్పడానికి, మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు అన్న కవి ఆవేదనకు నిలువెత్తు సాక్ష్యం ఈ ఘటన. నూరేళ్లు కాపాడతానని ప్రమాణం చేసిన భార్య సైకోగా మారాడు. భార్య నిస్పహాయతను, మౌనాన్నిఆసరాగా చేసుకుని దారుణంగా హింసిస్తూ నిత్య నరకం చూపించాడు. అక్కడితో ఆ దుర్మార్గుడి అఘాయిత్యాలు అగలేదు. మరింత కౄరంగా వ్యవహించి తనలోని శాడిస్టు నైజాన్ని బయటపెట్టాడు. మధ్యప్రదేశ్‌లో భూపాల్లోచోటు చేసుకున్న ఈ కిరాతకుడి దుర్మార్గం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ధర్ జిల్లాకు చెందిన మహిళ(36) కు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారు. భర్త బ్యాండ్ మేళంలో పనిచేస్తుంటాడు. రెండేళ్ల క్రితం పిల్లల విషయంలో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో భర్త దారుణంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా తన పైశాచికాన్ని కొనసాగించాడు. ఆమె ప్రైవేటు భాగాల్లో బైక్ హ్యాండిల్ దూర్చి నరకం చూపించాడు. అనంతరం అక్కడినుంచి పత్తా లేకుండాపోయాడు. అయితే ఈ బాధ ఎవరితో చెప్పాలో అర్థం కాక, బాధితురాలు మౌనాన్ని ఆశ్రయించింది. ఒక పక్క అవమానం, మరోవైపు పిల్లల భవిష్యత్తు ఆమెను భయపెట్టింది. అయితే ఆమె గర్భసంచికి, పెద్ద పేగులు, మూత్ర నాళమునకు ఇన్ఫెక్షన్ సోకింది. కాలం గడుస్తున్న కొద్దీ నొప్పి తీవ్రం కావడంతో చివరికి వైద్యులను, ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించక తప్పలేదు. బాధిత మహిళ గర్భసంచిలోకి బైక్ హ్యాండిల్ భాగం చొచ్చుకుపోయిందని గుర్తించిన వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. అయితే దానికి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుందన్నారు. దీంతో తన వైద్యానికి అంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకు రావాలో అర్థంకాక చివరికి పోలీసులకు మొరపెట్టుకుంది. బాధితురాలి కథనం పోలీసులను సైతం కదిలించింది. వెంటనే స్పందించి బాధితురాల్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. దీంతో డాక్టర్లు దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి ఆపరేషన్ చేశారు. సుమారు ఆరు అంగుళాల పొడవున్న ప్లాస్టిక్ భాగాన్ని వెలికి తీశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు శాడిస్ట్ భర్తను కూడా అరెస్ట్ చేశారు. అయితే ఇలాంటి అరాచకాలు, హింసపై ఇకనైనా మౌనం వీడాలని మహిళా సంఘాలు బాధిత మహిళలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. లేదంటే సహనాన్ని బలహీనతగా పరిగణించి శాడిస్ట్ భర్తలు మరింత రెచ్చిపోతారని హెచ్చరిస్తున్నారు. -
వారికి ఇల్లే అతి ప్రమాదకరం : షాకింగ్ రిపోర్టు
మహిళలు,ఆడపిల్లలపై పెరుగుతున్న హింస, అత్యాచారాలు, హత్యల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. రోజురోజుకు ఈ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. తాజాగా ఐక్యరాజ్యసమితి అధ్యయనం దిగ్భ్రాంతికరమైన అంశాన్ని వెలుగులోకి తెచ్చింది. ఈ నేలపై అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం మహిళలకు ఇల్లేనట. అవును..షాకింగ్‌గా ఉన్నా.. మీరు విన్నది నిజమే సొంత ఇల్లే ఆమె పాలిట యమపాశమవుతోంది. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... కుటుంబ సభ్యులు, సన్నిహిత జీవిత భాగస్వాములే చేతుల్లో అత్యధిక మహిళలకు హత్యకు గురవుతున్నారని యూఎన్ సర్వే తేల్చింది . మహిళలపై లైంగిదాడులు, గృహహింస, హత్యాచారాలు నిత్యకృత్యంగా మారిపోయాయి.ఆడవారిగా పుట్టిన పాపానికి ప్రపంచవ్యాప్తంగా మహిళలు, ఆడపిల్లలు దారుణ హత్యలకు గురవుతున్నారని ‘మహిళలపై హింస- అంతర్జాతీయ వ్యతిరేక దినోత్సవం' సందర్భంగా నిర్వహించిన యూఎన్ఓడీసీ సర్వే తేల్చింది. 2018 నివేదిక ప్రకారం 2017లో హత్యకు గురైన మహిళల్లో మూడోవంతు భర్తల చేతుల్లో పథకం ప్రకారం హతమవుతున్నారు. రోజుకు 137 మందిని సొంత కుటుంబ సభ్యులే హత్యగావిస్తున్నారు. 2017లో ప్రపంచవ్యాప్తంగా 87వేలమంది హత్యకు గురయ్యారు. వీరిలో 58శాతం అంటే దాదాపు 50వేలమంది కుటుంబ సభ్యులు, సన్నిహిత భాగస్వాములు చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. 30 వేలమంది ఒక పథకం ప్రకారం చంపబడుతున్నారు. ప్రపంచవ్యాప్తగా ప్రతి లక్షమంది జనాభాలో 1.3 శాతం మంది పుట్టకముందే గర్భంలోనే హత్యకు గురవుతున్నారు. భాగస్వాములు లేదా కుటుంబ సభ్యుల ద్వారా హత్యకు గురవుతున్న మహిళలు : ఆసియా - 20,000 ఆఫ్రికా - 19,000 అమెరికా - 8,000 యూరోప్ - 3,000 ఓసియానా - 300 ఎందుకు జరుగుతుంది? వివిధ కారణాల వలన అన్ని సమాజాల్లో లింగ-సంబంధిత హత్యలు జరుగుతున్నాయని సమితి నివేదించింది. ముఖ్యంగా భ్రూణ హత్యలు, జీవిత భాగస్వామి హింస, గృహ హింస, పరువు హత్యలు, వరకట్న సంబంధిత హత్యలున్నాయని నివేదిక పేర్కొంది. వీటితోపాటు వ్యవస్థీకృత నేరాలు, మాదకద్రవ్య ముఠాలు, భారీ వలసలు, డ్రగ్స్, ట్రాఫికింగ్ ఉదంతాల్లో హింసాత్మక హత్యలు చోటు చేసుకుంటున్నాయని సర్వే తెలిపింది. అలాగే చేతబడి, మంత్రగత్తెల ఆరోపణలతో కూడా హత్యలు జరుగుతున్నాయని నివేదించింది. సాయుధ ఘర్షణ సందర్భాల్లో మహిళలపై లైంగిక హింసను ప్రదాన ఆయుధంగా ప్రయోగించబడుతోందని పేర్కొంది. అనేక సందర్భాల్లో మహిళలపై హింస హత్యలకు దారితీస్తోందని, అయితే మహిళలకు, బాలికలకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసకు పాల్పడుతున్న నేరస్తులు నేరాలు నిరూపితం కావడంలలేదని, దీంతో వారు శిక్షలనుంచి తప్పించుకుంటున్నారని తెలిపింది. మహిళలపై హింస నిర్మూలించేందుకు చట్టాలు, పథకాలు ఉన్నప్పటికీ సన్నిహిత భాగస్వామి / కుటుంబ సంబంధిత హత్యలు ఆగడం లేదనీ, ఇటీవల సంవత్సరాల్లో భ్రూణ హత్యల నిరోధంలో ఎలాంటి పురోగతి లేదని స్పష్టం చేసింది. మానవహత్యల్లో మెజారిటీ బాధితులుగా పురుషులు కూడా ఉంటున్నప్పటికీ లింగ అసమానత, వివక్ష, మూఢాచారాల ఫలితంగా మహిళలు మరింత ప్రభావితమవుతున్నారని యూఎన్ఓడీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యూరీ ఫిడోటోవ్ సెడ్ పేర్కొన్నారు. మహిళలపై హింస నిరోధంపై అంతర్జాతీయ దినోత్సవం సందర్బంగా నవంబరు 25 ఆదివారం ఈ అధ్యయనాన్ని విడుదల చేసింది. మహిళలు, బాలికలపై లింగ సంబంధిత హత్యలు, దాడులను సమర్థవంతంగా అడ్డుకునేందుకు, దర్యాప్తు, విచారణకు, శిక్షలు తదితర అనేక ఆచరణాత్మక చర్యలను ఇందులో సిఫార్సు చేసింది. అలాగే న్యాయనిర్ణేతలు, పాలకులు, ప్రభుత్వ సంస్థలతోపాటు ఐక్యరాజ్యసమితి సంస్థలు, సిబ్బంది, పౌర సమాజాల మధ్య అవగాహన కోసం అధ్యయనాన్ని వెల్లడించినట్టు తెలిపింది. మహిళలపై హింస నిరోధానికి పోలీసులకు న్యాయవ్యవస్థలు, ఆరోగ్యం,సామాజిక సేవలకు మధ్య సమన్వయం చాలా అవసరమని ఈ నివేదిక నొక్కి చెప్పింది. ప్రాథమిక విద్య, అవగాహనతో పాటు ఈ సమస్యల పరిష్కాల్లో ఎక్కువ పురుషులు పాల్గొనడం చాలా ముఖ్యమని యూఎన్ నివేదిక స్పష్టం చేసింది. -
రక్తమోడుతున్న కనికరించలేదు: వీడియో వైరల్
తూత్తుకూడి : దక్షిణ తమిళనాడులోని తూత్తుకుడి పట్టణంలో వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్ కాపర్(రాగి) యూనిట్ విస్తరణ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా బుధవారం అన్నానగర్ ప్రాంతంలో బంద్ నిర్వహిస్తున్న ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో 22 ఏళ్ల కలియప్పన్ అనే వ్యక్తి బుల్లెట్ తగిలి మరణించాడు. అయితే అతని మరణానికి ప్రధాన కారణం పోలీసుల నిర్లక్ష్య వైఖరే. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతని చూట్టూ పోలీసులు మూగారు. అతని పరిస్థితేంటో కూడా తెలుసుకోకుండా ఓ పోలీసు లాఠీతో బెదిరిస్తూ...‘నటించింది చాలు ఇక వెళ్లు’ అని కసురుకున్నాడు . బుల్లెట్ తగిలి తీవ్ర రక్తస్రావమైన అతడిని సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. గాయాలతో రక్తమోడుతున్న వ్యక్తి పట్ల కనీసం కనికరం కూడా చూపకుండా కర్కశంగా ప్రవర్తించిన పోలీసుల వైఖరిని అందరూ తప్పుపడుతున్నారు. తూత్తుకుడిలోని స్టెరిలైట్ రాగి కర్మాగారాన్ని మూసివేయాలని ఆందోళన చేస్తున్న ప్రజలపై పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో 22 ఏళ్ల కలియప్పన్ అనే వ్యక్తికి బుల్లెట్ తగిలింది. దాంతో బాధ భరించలేక అతను అక్కడే కుప్పకూలిపోయాడు. అది చూసిన ఓ పోలీసు అధికారి కనీసం ఆస్పత్రికి కూడా తరలించకుండా ‘నటించింది చాలు ఇక వెళ్లు’ అని అనడం అక్కడే ఉన్న ఓ రిపోర్టర్ వీడియో తీశాడు. దాంతో ఈ వీడియో కాస్తా సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దారుణ ఘటనలో ఇప్పటివరకు కలియప్పన్‌తో కలిపి 13 మంది మరణించారు. ముందస్తు హెచ్చరికలు లేకుండా ప్రజలపై కాల్పులు జరిపినందుకు గానూ తూత్తుకుడి జిల్లా కలెక్టర్, పోలీసు అధికారిని బుధవారం బదిలీ చేశారు. కానీ పోలీసులు మాత్రం ఆందోళనకారులు తమపై రాళ్లు రువ్వడం వల్లే తాము కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపారు. ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కాల్పులు జరుపుతున్న సమయంలో ఓ పోలీసు అధికారి బస్సు పైకి ఎక్కి ‘కనీసం ఒక్కరైనా చావాలి’ అని అంటున్న వీడియో వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. -
ప్రమాదకర ధోరణి
సమస్య వచ్చిపడినప్పుడు నాన్చుడు ధోరణి అవలంబిస్తే ఫలితం ఎలా ఉంటుందో ఉత్తరభారతంలో సోమవారం జరిగిన ఉదంతాలు రుజువు చేశాయి. ‘భారత్ బంద్’ పలు రాష్ట్రాలను రణక్షేత్రాలుగా మార్చింది. 9మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, వందలమంది గాయపడ్డారు. భారీయెత్తున విధ్వంసం చోటుచేసుకుంది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు, పోలీసులు విఫలమైనప్పుడు నిరసనలు కట్టుదాటడం రివాజే. కానీ ఈసారి జరిగింది అది కాదు. దళితులు, వారిని వ్యతిరేకించేవారి మధ్య ఘర్షణలు జరిగాయి. తాము ఒకటి రెండుచోట్ల గాల్లోకి మాత్రమే కాల్పులు జరిపామని పోలీసులు చెబుతుంటే, చనిపోయినవారంతా తూటా గాయాల వల్లే కన్నుమూశారు. చానళ్లు చూపిన దృశ్యాల్లో ప్రైవేటు వ్యక్తి ఒకరు ఆందోళనకారుల్ని గురిచూసి కాల్చినట్టు స్పష్టంగా కనబడుతోంది. ఇది ఆందోళన కలిగించే అంశం. రాజస్తాన్‌లోని కరౌలీ జిల్లా హిందువాన్ నగరంలో తొలినాటి బంద్‌ను నిరసిస్తూ ఆధిపత్య కులాలకు చెంది నవారు మంగళవారం బీజేపీ, కాంగ్రెస్‌లకు చెందిన ఇద్దరు దళిత ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పుపెట్టారు. ఎస్సీ, ఎస్టీ(అత్యాచారాల నిరోధక) చట్టం వేధింపులకు ఆయుధంగా మారుతున్నదని, అది దుర్వినియోగమవుతున్నదని గత నెల 20న సుప్రీంకోర్టు వ్యాఖ్యానించి, ఆ కేసుల్లోని నిందితుల అరెస్టుకు కొన్ని మార్గదర్శకాలు జారీచేసిన నాటి నుంచీ దళిత వర్గాల్లో అసంతృప్తి, ఆగ్రహావేశాలు కనబడుతూనే ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని దాదాపు అన్ని పార్టీలూ డిమాండు చేశాయి. బీజేపీలోని దళిత ఎంపీలు సైతం దీనితో శ్రుతి కలిపారు. కేంద్రం సైతం సోమవారం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. కానీ పదిహేను రోజులపాటు కేంద్రం వైఖరేమిటో ప్రభుత్వంలోని వారెవరూ చెప్పలేకపోయారు. దళితుల్లో గూడుకట్టుకున్న అసంతృప్తిని అంచనా వేయడంలో వైఫల్యం చెందడంవల్ల దురదృష్టకర పరిణామాలు ఏర్పడ్డాయి. ఏ ప్రధాన రాజకీయ పార్టీ ‘భారత్ బంద్’కు పిలుపునివ్వలేదన్న సంగతిని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఉత్తరప్రదేశ్ డీజీపీయే ఈ మాట చెబుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన రెండురోజులకు జాతీయ దళిత సంస్థల సమాఖ్య(ఎన్ఏసీడీఓఆర్) తొలిసారి ఈ బంద్ పిలుపునిస్తే అఖిల భారత దళిత హక్కుల సమాఖ్య(ఏఐడీఆర్ఎఫ్), ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంఘాలు, మరికొన్ని ఇతర సంస్థలు దానితో గొంతు కలిపాయి. ఆ తర్వాతే బీఎస్పీ తదితర పార్టీలు మద్దతు ప్రకటించాయి. బంద్ పిలుపులు దేశంలో కొత్తగాదు. తమ ఆగ్రహాన్నీ, అసంతృప్తినీ వ్యక్తం చేయడానికి, పాలకుల మెడలు వంచడానికి, సమస్యపై పాలకులు దృష్టి సారించేలా చేయడానికి దాన్నొక ఆయుధంగా వాడుకోవడం స్వాతంత్య్రానికి పూర్వం నుంచి ఉన్నదే. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు ఈ మార్గాన్ని అవలంబిస్తూనే ఉంటాయి. కానీ బంద్‌కు మద్దతుగా దళిత శ్రేణులు ఒకపక్క ఊరేగింపులు తీస్తుం డగా...ఆ బంద్‌ను నిరసిస్తూ మరికొన్ని గుంపులు రంగంలోకి దిగాయి. రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి చోట్ల ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకున్నాయి. ఇరుపక్షాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఒకటి రెండు చోట్ల గాల్లోకి కాల్పులు జరిపామని పోలీసులు చెబుతున్నారు. మరైతే మృతుల్లో అత్యధికులు బుల్లెట్ గాయాలతో ఎలా మరణించారు? ఉద్యమానికి చెడ్డపేరు తీసుకొచ్చేందుకు కొన్ని అసాంఘిక శక్తులు ఈ పని చేశాయా లేక దళిత శ్రేణులతో తలపడేందుకు వీధుల్లోకొచ్చినవారు ఈ కాల్పులకు తెగబడ్డారా అన్నది తేలాలి. మరణించిన 9మందిలో ఏడుగురు దళితులే కావడం వల్ల ఇది ప్రత్యర్థివర్గాల పనికావొచ్చునన్న సందేహాలు సహజంగానే తలెత్తుతాయి. సమస్య ఎదురైనప్పుడు సకాలంలో స్పందించడం ప్రభుత్వాల కనీస ధర్మం. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు విషయంలో కేంద్రం సాచివేత ధోరణి అవ లంబించినట్టే, సోమవారంనాటి బంద్ తీవ్రతను అంచనా వేయడంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్ ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ప్రధాన పార్టీలు ఇచ్చిన బంద్ పిలుపు కాదు గనుక దీని ప్రభావం పెద్దగా ఉండదని అంచనా వేసి ఉంటే అక్కడి ప్రభుత్వాలు తమ తమ ఇంటెలిజెన్స్ సంస్థలను ప్రక్షాళన చేసు కోవడం ఉత్తమం. ఈ బంద్‌ను ప్రతిఘటించాలని ఆధిపత్య కులాలవారు నిర్ణయిం చిన సంగతిని కూడా ఈ సంస్థలు పసిగట్టలేకపోయాయి. ఫేస్బుక్, వాట్సాప్, ట్వీటర్ వంటి సామాజిక మాధ్యమాల ప్రభావం అమితంగా ఉన్న ఈ కాలంలో ఎలాంటి సమాచారమైనా, సందేశమైనా క్షణాల్లో లక్షలమందికి సులభంగా చేరు తుందని గూఢచార విభాగాలు గుర్తించలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. హింసకు దిగినవారెవరు... వారి ఉద్దేశాలేమిటన్న సంగతలా ఉంచితే ప్రధాన రాజకీయ పక్షాల ప్రమేయం లేకుండానే వేలాదిమంది దళితులు వీధుల్లోకి రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. తమ రక్షణకుద్దేశించిన చట్టం తగినంత ఆసరా ఇవ్వలేకపోతున్నదని, సుప్రీంకోర్టు తీర్పు పర్యవసానంగా అది మరింత నీరు గారుతుందని వారు ఆందోళన చెంది ఉండొచ్చు. వాదప్రతివాదాల సమయంలో ప్రభుత్వం తరఫున సమర్ధవంతమైన వాదన వినిపించి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. గత అయిదేళ్లలో దళితులపై దాడులు బాగా పెరిగాయని నిరుడు విడుదలైన జాతీయ క్రైం రికార్డుల బ్యూరో లెక్కగట్టింది. 2009–15 మధ్య ఈ చట్టం కింద తప్పుడు కేసుల పెట్టడం గణనీయంగా తగ్గిందని వెల్లడించింది. వీటిని విస్మరించి శిక్షల శాతం తక్కువగా ఉన్నదన్న కారణంతో చట్టం దుర్వినియోగమవుతున్నదన్న నిర్ణయానికి రావడం సబబు కాదని ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పి ఉంటే బాగుండేది. ఇప్పుడు స్టే ఇవ్వడానికి నిరాకరించినా, తీర్పును సమీక్షించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది గనుక ఈసారైనా అవసరమైన గణాంకాలతో సమర్ధవంతమైన వాదనలు వినిపించి దళితుల ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడటం ముఖ్యం. ఈ దిశగా కేంద్రం అడుగులేయాలి.