ధరూర్: భూతగాదాల నేపథ్యంలో దాయాదుల మధ్య జరిగిన ఘర్షణలో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా థరూర్ మండలం ఓబులోనిపల్లె గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య గత కొంత కాలంగా భూ వివాదం నడుస్తోంది. ఈక్రమంలో ఇరు వర్గాలకు చెందిన వారు పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని కర్నూలు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.