ఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర ఇరవై నాలుగు పరగణాల జిల్లా సందేశ్ కాళీ ప్రాంతంలో టీఎంసీ నాయకులకు వ్యతిరేకంగా గిరిజన మహిళలు నిరసన తెలుపుతున్నారు. టీఎంసీ సంబంధించిన ఓ నేత తమ ప్రాంతపు మహిళలను తీవ్రమైన వేధింపులకు గురిచేస్తున్నాడని అక్కడి గిరిజన మహిళుల రోడ్లెక్కి మరీ తమకు న్యాయం చేయాలని నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విమర్శలు గుప్పించారు. మమతా తన పార్టీ కార్యకర్తలతో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడాలని ప్రోత్సహిస్తూ.. హిందూ మారణహోమానికి తెరలేపుతోందని ఆరోపించారు.
‘మమతా బెనర్జీకి కేవలం హిందూ మారణహోహమమే తెలుసు. తన పార్టీ కార్యకర్తలు హిందూ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడాలని అనుమతిస్తున్నారు. సందేశ్ కాళీ ప్రాంతంలో హిందూ మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తి ఎవరూ? ఇప్పటి వరకు షేక్ షాజాహాన్ ఎవరనీ చర్చించుకుంటున్నారు?. షేక్ షాజాహాన్ ఎక్కడ ఉన్నాడో? సీఎం మమతా బెనర్జీ సమాధానం చెప్పాలి’ అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు.
#WATCH | On Sandeshkhali violence, Union Minister Smriti Irani says, "In Sandeshkhali, some women narrated their ordeals to the media... They said TMC goons visited door to door to identify the most beautiful woman in every house. Who is young. The husbands of identified women… pic.twitter.com/hXARkKp1sj
— ANI (@ANI) February 12, 2024
టీఎంసీ ఆఫిసులోనే టీఎంసీ కార్యకర్తలు మహిళలపై రాత్రికి రాత్రి అఘాయిత్యాలకు పాల్పడటానికి అనుమతించటం మాటల్లో చెప్పలేనిదని స్మృతి ఇరానీ ఆరోపించారు. ఇలాంటీ దారుణాలు జరుగుతుంటే పౌరులు ఎట్టిపరిస్థితుల్లో మూగ ప్రేక్షకుల వలె ఉండరని టీఎంసీ ప్రభుత్వంపై మండిపడ్డారు. సీఎం మమతా బెనర్జీ రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే గిరిజన కూలాలు, తెగలను వాడుకుంటోందని దుయ్యబట్టారు. ఇక.. మమతా బెనర్జీ రాష్ట్ర హోం డిపార్టుమెంట్‌ను తన గుప్పెట్లో పెట్టుకోవటంపై దేశంలో న్యాయం కోసం యాత్ర చేసేవారు కూడా స్పందించకపోవటం దారుణమని కాంగ్రెస్‌ను విమర్శించారు. హిందూవులపై దాడిల విషయంలో ప్రభుత్వం ప్రమేయం ఉందని స్మృతి ఇరానీ ఆరోపించారు.
మరోవైపు.. సందేశ్ కాళీ ప్రాంతంలో టీఎంసీ నాయకులపై అక్కడి ప్రజల్లో వెల్లువెత్తిన ఆగ్రహానికి కారణాలు తెలుసుకొని, పరిస్థితి చక్కదిద్దటానికి టీఎంసీ సీనియర్ నేత పార్థ భౌమిక్ రేపు(మంగళవారం) ఆ ప్రాంతాన్ని సందర్శించనున్నట్లు సమాచారం.
చదవండి: ‘బుల్డోజర్ చర్య ఫ్యాషన్ అయింది’.. హైకోర్టు సీరియస్
Comments
Please login to add a commentAdd a comment