సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్ హింసాకాండ ఘటనపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. సాధారణంగా ఓడిపోయిన వారు హింసకు పాల్పడతారు. కానీ చరిత్రలో మొదటిసారి విజేతలు ఓడిపోయిన వారిపై దాడిచేస్తున్నారని వింటున్నాను.. పాత కక్షల ప్రభావం అనుకుంటా అంటూ తనదైన శైలిలో ట్విటర్‌లో సెటైర్లు వేశారు. ఈ విధ్వంసానికి టీఎంసీ నాయకత్వం మద్దతు ఇస్తుందంటే నమ్మశక్యంగా లేదు. ఇంత ఘన విజయం సాధించిన తరువాత హింసకు పాల్పడాల్సిన అవసరం ఏముందబ్బా... అయినా ఉన్మాదంతో చెలరేగిపోతూ తోడేళ్లుగా వ్యవహరిస్తున్న వారికి మనం ఎంత చెప్పినా అర్థంకాదు అంటూ ట్వీట్ చేశారు.
కాగా ఫలితాల తరువాత టీఎంసీ కార్యకర్తలు రెచ్చిపోయారని, తీవ్ర హింసకు తెగబడ్డారని బీజేపీ ఆరోపిచింది. ఈ దాడిలో బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని వేలాదిమంది కార్యకర్తల ఇళ్లను ధ్వంసం చేశారని మండిపడింది. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం హుటాహుటిన కోల్‌కతా చేరుకున్నారు. బాధిత కుటుంబాను పరామర్శించారు. టీఎంసీ గూండాలు బీజేపీ కార్యకర్త హరన్ అధికారి ఇంటిని ధ్వంసం చేశారు, అతడిని తీవ్రంగా కొట్టడంతో మరణించారని మండిపడ్డారు. మహిళలు, పిల్లలపై కూడా దాడి చేశారంటూ టీఎంసీపై ఆరోపణలు గుప్పించారు. మరోవైపు బీజేపీ ఆరోపణలను టీఎంసీ ఇప్పటికే తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే.
I find it hard to believe the W B violence is backed by TMC leadership because after such a resounding victory why would they need to do this ? Hooligans indulging in mind less violence are nearest to mad wolves and hence can never be really made to understand
— Ram Gopal Varma (@RGVzoomin) May 4, 2021
Always in history,sore losers indulge in violence ..First time I am hearing winners going after losers ..Have a feeling there could be PURANI DUSHMANI
— Ram Gopal Varma (@RGVzoomin) May 4, 2021
Comments
Please login to add a commentAdd a comment