
దుండగలు మంత్రి వాహనంపై రాళ్ల దాడి చేశారు
కోల్‌కత్త: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చెలరేగిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఇందుకు సంబంధించి నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్ర హోం శాఖ బెంగాల్ గర్నర్‌ను ఆదేశించింది. ఇప్పటికే కేంద్రం నలుగురు సభ్యులతో కమిటీ వేసిన సంగతి తెలిసిందే.
అసెంబ్లీ ఫలితాల తర్వాత బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. బెంగాల్‌లో కేంద్రమంత్రి మురళీధరన్ కారుపై దాడి జరిగింది. దుండగలు మంత్రి వాహనంపై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో తన వ్యక్తిగత సిబ్బంది గాయపడినట్టు మురళీధరన్ వెల్లడించారు. టీఎంసీ కార్యకర్తలే దాడి చేశారని ఆరోపించడమే కాక.. మురళీధరన్ పర్యటన రద్దు చేసుకుని వెనక్కి వెళ్లిపోయారు.
ఇక బెంగాల్‌లో చెలరేగిన హింసకు ఎన్నికల కమిషనే కారణమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఇక మీదట రాష్ట్రంలో శాంతి భద్రతలు తానే పర్యవేక్షిస్తానన్న మమతా.. డీజీపీ నీరజ్ నయాన్‌పై బదిలీ వేటు వేయడమే కాక.. పాత డీజీపీ వీరేంద్రకు తిరిగి బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.
చదవండి: బెంగాల్ హింస ఆగేదెన్నడు?