మమత ఇప్పుడు జాతీయ నేత: కమల్‌నాథ్‌ | Mamata Banerjee Is Leader Of Our Country Today: Kamal Nath | Sakshi
Sakshi News home page

మమత ఇప్పుడు జాతీయ నేత: కమల్‌నాథ్‌

Published Thu, May 6 2021 2:21 AM | Last Updated on Thu, May 6 2021 4:35 AM

Mamata Banerjee Is Leader Of Our Country Today: Kamal Nath - Sakshi

ఇండోర్‌: ‘పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఇప్పుడు జాతీయ నేత. మమత ఇప్పుడు మూడోసారి ముఖ్యమంత్రిగా ఎన్నిక య్యారు. ఆమె కేవలం ప్రధానిని మాత్రమే గాక మోదీ మంత్రివర్గాన్ని, కేంద్ర సంస్థలైన సీబీఐ, ఈడీలనూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిం చారు’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ బుధవారం వ్యాఖ్యానించారు.

2024 లోక్‌సభ ఎన్నికలకు మమతను ప్రధాని అభ్యర్థిగా యూపీఏ నిలబెడుతుందా? అన్న ప్రశ్నకు సమాధానంగా.. ఆ విషయం ఇప్పుడే తెలియదని, యూపీఏ సరైన సమయంలోనే తమ అభ్యర్థిని ప్రకటిస్తుందని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లో చెలరేగిన రాజకీయ హింస గురించి తాను మమతతో మాట్లాడి నట్లు తెలిపారు. హింసను ఎంచుకోవడం తప్పని, హింస నుంచి దూరంగా ఉండేలా అందరిని కోరాల్సిందిగా మమతకు సూచించి నట్లు చెప్పారు. మధ్యప్రదేశ్‌ను సందర్శిం చాల్సిందిగా ఆమెను కోరినట్లు తెలిపారు.   చదవండి: (జాతీయ స్థాయి లాక్‌డౌన్‌కు ప్రధాని మోదీపై ఒత్తిడి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement