బెంజమిన్ నెతన్యాహు
జెరూసలేం: సామాన్య వ్యక్తి ఎలా మాట్లాడినా చెల్లుతుంది. కానీ అధికారంలో ఉన్నవారు.. మరీ ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మైనారిటీలు, బాధితుల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే ఇదిగో ఇలా సోషల్ మీడియా వేదికగా వేపుకుతింటారు.. వేటాడేస్తారు నెటిజనులు. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. వివరాలు.. రెండు రోజుల క్రితం ‘ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయోలెన్స్ ఎగెనెస్ట్ వుమెన్’ అనే కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. బెంజమిన్ మహిళలను జంతువులతో పోల్చి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘నీవు కొట్టడానికి మహిళ జంతువు కాదు. మనందరం జంతుహింస తగదని చెప్తాం. వాటి మీద ఆప్యాయత కురిపిస్తాం.. జాలి చూపిస్తాం. మహిళలు పిల్లలు కూడా జంతువులే. అందులోనూ హక్కులున్న జంతువులు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బెంజమిన్. (చదవండి: దుర్గమ్మతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది..!)
Netanyahu at event marking International Day for the Elimination of Violence against Women: “A woman isn't an animal you can beat, & nowadays we say don’t hit animals. We have compassion for animals, women are animals, children are animals, with rights.” pic.twitter.com/jwfLH6aYqU
— Noga Tarnopolsky (@NTarnopolsky) November 23, 2020
ఇక్కడ బెంజమిన్ నోరు లేని మూగ జీవుల పట్ల ఆప్యాయత, జాలి చూపిస్తాం.. అలాంటిది మానవజాతి మనుగడకు మూలమైన మహిళల్ని ఇంకెంతో గౌరవించాలనే ఉద్దేశంతో మాట్లాడారు. కానీ ఆయన తన భావాలను సరిగా వ్యక్తం చేయకపోవడంతో నెటిజనులు విరుచుకుపడుతున్నారు. మహిళల్ని జంతువులతో పోలుస్తావా అంటూ మండి పడుతున్నారు. గృహ హింస అంటే మీ దృష్టిలో జంతువులను తిట్టడం లాంటిదేనా.. అంటే మహిళలు కూడా మౌనంగా భరించాలని మీ ఉద్దేశమా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment