
అనంతపురం : తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీలో వర్గపోరు ముదిరింది. జేసీ బ్రదర్స్ దౌర్జన్యాలపై ఓవర్గం టీడీపీ నేతలు బుధవారం రోడ్డెక్కారు. టీడీపీ కార్యకర్త శేఖర్‌కు చెందిన అన్నాట్రాన్స్ పోర్టులో జేసీ వర్గీయులు విధ్వంసానికి పాల్పడ్డారు. ఒక కారు, లారీ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగడాలకు నిరసనగా పోలీసు స్టేషన్ వద్ద టీడీపీ కార్యకర్తలతో కలిసి నేతలు జయచంద్రారెడ్డి, కాకర్ల రంగనాథ్ బైఠాయించారు. వెంటనే జేసీ సోదరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.