బంగ్లాలో నిరసనలు.. అధ్యక్షుడి రాజీనామాకు డిమాండ్‌ | Tension soars in Bangladesh protests against president resignation | Sakshi
Sakshi News home page

బంగ్లాలో నిరసనలు.. అధ్యక్షుడి రాజీనామాకు డిమాండ్‌

Published Wed, Oct 23 2024 9:12 AM | Last Updated on Wed, Oct 23 2024 10:30 AM

Tension soars in Bangladesh protests against president resignation

ఢాకా:  బంగ్లాదేశ్‌లో మరోసారి నిరసన జ్వాలలు రగులుతున్నాయి. దేశ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ రాజీనామా విద్యార్థి సంఘాలు, నిరసనకారులు డిమాండ్ చేస్తూ అధ్యక్ష భవనం ‘బంగా భబన్‌’ను చుట్టుముట్టారు.  షేక్ హసీనాను ప్రధాన మంత్రిగా తొలగించాలనే డిమాండ్‌లో నిరసనలు చేపట్టిన విద్యార్థి సంఘం మంగళవారం ఢాకాలోని సెంట్రల్ షాహీద్ మినార్ వద్ద ర్యాలీ నిర్వహించింది. అధ్యక్షుడి రాజీనామాతో సహా తమ డిమాండ్లను ప్రకటించారు.

 

ఇక.. ఆందోళనకారులు రాత్రి ‘బంగా భబన్’ మార్చ్‌గా వెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన సైన్యం బారికేడ్లతో నిరసనకారులను ఎదుర్కొవడానికి ప్రయత్నించారు. అధ్యక్ష పదవికి మహ్మద్ షహబుద్దీన్  రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ బంగా భవన్‌ బయట ఆందోళనకారులు పెద్ద ఎత్తున గుమిగూడారు.

అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్.. మాజీ ప్రధానమంత్రి షేక్‌ హసీనా నిరంకుశ ప్రభుత్వానికి మిత్రుడు.ఆయన వెంటనే రాజీనామా చేయాలని ఓ నిరసనకారుడు మీడియాతో మాట్లాడారు. 1972 రాజ్యాంగాన్ని రద్దు చేసి ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబించే కొత్త రాజ్యాంగాన్ని రూపొందించాలని విద్యార్థి సంఘం నేతలు పిలుపునిచ్చారు. అవామీ లీగ్  పార్టీకి సంబంధించిన విద్యార్థి సంస్థ ‘బంగ్లాదేశ్ చత్రా లీగ్‌’ను నిషేధించాలి. అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

షేక్ హసీనా హయాంలో 2014, 2018, 2024లో జరిగిన ఎన్నికలను చట్టవిరుద్ధంగా ప్రకటించాలన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన పార్లమెంటు సభ్యులపై అనర్హత వేటు వేయాలని కోరారు. విద్యార్థులు జూలై-ఆగస్టు చేసిన తిరుగుబాటు స్ఫూర్తికి రిపబ్లిక్ బంగ్లాదేశ్‌గా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

చుప్పు అని కూడా పిలువబడే మహమ్మద్ షహబుద్దీన్ బంగ్లాదేశ్‌కు 16వ అధ్యక్షుడు. అవామీ లీగ్ పార్టీ.. నామినేట్ చేయగా 2023 అధ్యక్ష ఎన్నికలలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement