
కోల్‌కతా: బంగ్లాదేశ్ నుంచి వచ్చే శరణార్థులుకు తమ రాష్ట్రం ఆశ్రయం కల్పిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఆదివారం అధికార టీఎంసీ నిర్వహించిన అమరవీరుల దినోత్సవ ర్యాలీలో సీఎం మమత పాల్గొని మాట్లాడారు.
‘‘ బంగ్లాదేశ్ పొరుగున ఉన్న దేశం.. కావున ఆ దేశం గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేను. బంగ్లాదేశ్ గురించి భారత ప్రభుత్వం మాట్లాడాలి. అయితే నిస్సహాయులైన ప్రజలు (బంగ్లాదేశ్‌కు చెందినవారు) బెంగాల్ తలుపు తడితే మాత్రం.. తాము కచ్చింతంగా ఆ ప్రజలకు ఆశ్రయం కల్పిస్తాం.
ఐక్యరాజ్య సమితిలోనే దీనిపై నిర్మానం చేయబడి ఉంది. శరణార్థులును పొరుగుదేశం వాళ్లు గౌరవించాలని అందులో ఉంది. బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో ఇబ్బంది పడుతున్న బెంగాల్ ప్రజల బంధువులకు తాము పూర్తి సహకారం అందిస్తాం’ అని సీఎం మమత తెలిపారు.
Mamata Banerjee at her Best. Biggest Mass Leader West Bengal has ever seen. #ShahidDibas pic.twitter.com/QMk0H9XeNg
— The Enigmous (@_TheEnigmous) July 21, 2024
ఈ ర్యాలీలో పాల్గొన్న సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ లోక్‌సభ ఎన్నికల ప్రదర్శనపై సీఎం మమత ప్రశంసలు కురిపించారు.
‘‘ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో ఉండలేదు. ఇది స్థిరమైన ప్రభుత్వం కాదు.. త్వరలోనే కూలిపోయింది. మీరు (అఖిలేష్) ఇచ్చిన లోక్‌ససభ ఎన్నికల ప్రదర్శనకు యూపీలో బీజేపీ ప్రభుత్వం రాజీనామా చేయాలి. కానీ, సిగ్గులేని బీజేపీ ప్రభుత్వం.. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ఇంకా అధికారంలోనే కొనసాగుతోంది’’ అని బీజేపీపై విమర్శలు గుప్పించారామె.
అనంరతం ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మాట్లాడారు. ‘‘ప్రశ్చిమ బెంగాల్ ప్రజల వలే యూపీ ప్రజలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఢిల్లీలో అధికారంలో కూర్చున్నవారి అధికారం కొన్నిరోజుల మాత్రమే ఉంటుంది. కేంద్రంలోని ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది’’ అని అన్నారు.
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ అనుకూల విద్యార్థి సంఘాలకు చెందిన విద్యార్థులు, రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న ఆందోళనకారుల మధ్య జరిగిన హింసలో ఇప్పటివరకు 151 మంది ప్రాణాలు కోల్పోయారు. బంగ్లాదేశ్‌లో సంక్షోభం నెలకొన్న ఈ సమయంలో బెంగాల్ సీఎం మమత చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment