venkannagaud
-
బీసీలకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలి
మిర్యాలగూడ : దేశ జనాభాలో 54 శాతం ఉన్న బీసీలకు పార్లమెంట్లో ప్రత్యేకంగా బీసీ బడ్జెట్ ప్రవేశపెట్టాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గండిచెర్వు వెంకన్నగౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో నిర్వహించిన బీసీ విద్యార్థి సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీరని అన్యాయం చేస్తున్నాయని అన్నారు. బీసీ బిల్లును రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొన్నారు. బీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి కమిషన్‌కు జాతీయ హోదా కల్పించాలన్నారు. రూ.10వేల కోట్లతో సబ్‌ప్లాన్ ఏర్పాటు చేసి, కుల వృత్తులకు రూ.రెండు వేల కోట్లతో బడ్జెట్ కేటాయించాలన్నారు. సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు గాదగోని మహేష్‌గౌడ్, నాయకులు నాగరాజుగౌడ్, లక్ష్మణ్‌యాదవ్, కృష్ణబాబు, నాగరాజు, గురవయ్య, సురేష్, రమేష్, అనిల్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల అస్వస్థతపై విచారణ చేపట్టాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు వెంకన్నగౌడ్ డిమాండ్ హుజూర్నగర్ : చండూరు, చివ్వెంల మండలాల్లోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటించి 161 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలపై సమగ్ర విచారణ చేపట్టాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అయిల వెంకన్నగౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. సన్నబియ్యంతో భోజనం అందజేయాలని ఆదేశాలున్నా కొన్ని పాఠశాలల్లో నాసిరకం బియ్యాన్నే వాడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు బిల్లుల చెల్లింపుల్లోనూ అధికారులు కక్కుర్తి పడుతున్నారని ఆరోపించారు. వారి నుంచి ప్రతినెలా మామూళ్లు తీసుకోవడం వల్ల వారు నాణ్యమైన భోజనం అందించే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. వెంటనే విద్యాశాఖ ఉన్నతాధికారులు చొరవ చూపి చండూరు, చివ్వెంల మండలాల్లోని ఘటనలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేగాక జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. సమావేశ ంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వేముల శేఖర్‌రెడ్డి, యూత్ విభాగం రాష్ట్ర కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి కోడి మల్లయ్య యాదవ్, జిల్లా కోశాధికారి పిల్లి మరియదాసు, పట్టణ, మండల అధ్యక్షులు గుర్రం వెంకటరెడ్డి, జడ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.