ముషీరాబాద్ (హైదరాబాద్): అసెంబ్లీలో త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి కేటాయించే మొత్తాన్ని రూ.20 వేల కోట్లకు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్య సభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, బీసీబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఒక్కో బీసీకి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు.
సోమవారం విద్యానగర్ లోని బీసీ భవన్‌లో 15 బీసీ సంఘాల సమా వేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజ రైన కృష్ణయ్య మాట్లాడుతూ, ఈ డిమాండ్‌లపై ఇప్పటికే మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌ను కలసి వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిగ్రీ కోర్సులు చదివే బీసీ విద్యార్థులకు కూడా పూర్తి ఫీజులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment