వ్యాపారంగా మారిన రాజకీయాలు
వ్యాపారంగా మారిన రాజకీయాలు
Published Sun, Sep 4 2016 9:21 PM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
నకిరేకల్ : దేవాభివృద్ధికి దిక్సూచిగా ఉండాల్సిన రాజకీయాలు నేడు వ్యాపారంగా మారాయని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అమరజీవి కల్లు రామచంద్రారెడ్డి 32వ వర్ధంతి సందర్భంగా సమకాలిన రాజకీయ పరిస్థితులపై ఆదివారం స్థానికంగా జరిగిన సెమినార్‌కు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. బడా పెట్టుబడిదారులు, భూస్వాములు, రాజకీయ రంగంలో ప్రవేశించి రాజకీయాలను వ్యాపారంగా మార్చారన్నారు. పార్లమెంట్, అసెంబ్లీలో శతకోటేశ్వరులు కూర్చుని పేదలకు వ్యతిరేకమైన నిర్ణయాలు చేస్తున్నారన్నారు. అంతకుముందు పట్టణంలో సీసీఎం నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రామచంద్రారెడ్డి స్థూపం వద్ద యాట నర్సింహారెడ్డి పార్టీ జెండాను ఎగురవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేతేపల్లి ఎంపీపీ గుత్త మంజుల, సీపీఎం డివిజన్ కార్యదర్శి ఎండీ.జహంగిర్, జిల్లా కమిటీ సభ్యులు బోళ్ల నర్సింహారెడ్డి, కందాల ప్రమీల, కేఆర్ ట్రస్ట్ అధ్యక్షుడు యానాల కృష్ణారెడ్డి, ప్రతినిధులు బిచినేపల్లి ప్రకాశ్‌రావు, కె.సీతారాములు, రావిరాల మల్లయ్య, నంద్యాల హరేందర్, కల్లు ఉత్తమ్‌రెడ్డి, మర్రి వెంకటయ్య, బొజ్జ చిన్నవెంకులు, అవిశెట్టి శంకరయ్య, వంటెపాక వెంకటేశ్వర్లు, ఆకుల బాస్కర్, ఆదిమల్ల శ్రీనివాస్, సాకుంట్ల నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
Advertisement