నకిరేకల్ సభలో మాట్లాడుతున్న కేసీఆర్
సాక్షి, నకిరేకల్ : నకిరేకల్ నుంచి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా వేముల వీరేశం లక్ష మెజారిటీతో గెలవడం ఖాయమని అపద్ధర్మ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. నకిరేకల్ మినీ స్టేడియంలో ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం గెలుపు కోరుతూ బుధవారం నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. ‘నకిరేకల్ మినీస్టేడియంలో ఉన్న జనా న్ని, హెలిక్యాప్టర్‌లో వస్తూనే చూశాను.. స్టేడియం అం తా జనంతో నిండింది. రోడ్లమీద మరో 10వేల మందికిపైగా నిలబడి ఉన్నారు. ఈ జనసంద్రాన్ని చూస్తేనే వీరే శం గెలుపు ఖాయం’అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తయితే భువనగిరి బస్వాపురం రిజర్వాయర్ నుంచి వచ్చే నీటితో మూసీపై ఆనకట్ట నిర్మిస్తే నకిరేకల్ నియోజకవర్గంలో సుమారు రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని పేర్కొన్నారు. అయిటిపాముల లిఫ్ట్‌కు ప్రత్యేకంగా రూ.111కోట్లతో మంజూరు చేశామన్నారు. మళ్లీ వీరేశాన్ని గెలిపిస్తే మిగిలిన పనులను పూర్తి చేయిస్తానని హామీనిచ్చారు.
ఎమ్మెల్యేగా గెలిపిస్తే వీరేశానికి పెద్దపదవి..
నకిరేకల్ నుంచి ఎమ్మెల్యేగా వేముల వీరేశాన్ని మళ్లీ గెలిపిస్తే ఇప్పుడు ఇంకా పెద్ద పదవి కూడా ఇస్తామని స్పష్టంచేశారు. ఆ కల నెరవేరాలంటే కారు గుర్తుకు ఓటు వేసి లక్ష మెజారిటీతో గెలిపించాని హాజరైన ప్రజలతో శపథం చేయించారు.
భవిష్యత్తు బాగుండాలంటే వీరేశం గెలవాలి
నకిరేకల్ నియోజకవర్గం భవిష్యత్తు బాగుండాలంటే మళ్లీ వేముల వీరేశాన్ని గెలిపించాలని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కోరారు. అభివృద్ధి సంక్షేమ ఫలాలు లబ్ధిపొందుతున్న ప్రజలంతా టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని అన్నారు.
కాంగ్రెస్‌కు నూకలు చెల్లాయి..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లాయని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. కాంగ్రెస్ ఒంటరిగా గెలువలేక కూటమి పేరుతో ఆంధ్రాపార్టీని కలుపుకుందని ఎద్దేవా చేశారు. గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో నకిరేకల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టిన వీరేశాన్ని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.
టీఆర్‌ఎస్‌ను గెలపించాలి..
నకిరేకల్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమానికి ఇప్పటికే రూ.2800కోట్లు మంజూరు చేయించానని.. ఈ అభివృద్ధి పనులు కొనసాగాలంటే మళ్లీ టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి తనను గెలిపించాలని నకిరేకల్ అభ్యర్థి వేముల వీరేశం కోరారు. డిసెంబర్ 7న తమ ఓటు వేసి మహాకూటమి అభ్యర్థి డిపాజిట్ గల్లంతయ్యేలా తీర్పునివ్వాలని కోరారు. వేముల వీరేశం అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎంపీ కేశవరావు, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, పూజర్ల శంభయ్య, ఎమ్మెల్సీ పూల రవీందర్, నియోజకవర్గ పరిశీలకుడు లింగంపల్లి కిషన్‌రావు, ప్రముఖ డాక్టర్లు రాపోలు రఘునందన్, మోహన్‌రెడ్డి, రాష్ట్ర నేతలు కటికం సత్తయ్యగౌడ్, చాడ కిషన్‌రెడ్డి, జెల్ల మార్కెండేయులు, శరణ్యరెడ్డి, నకిరేకల్, చిట్యాల మార్కెట్ చైర్మన్లు మారం భిక్షంరెడ్డి, కాటం వెంకటేశం, వైస్ చైర్మన్ వీర్లపాటి రమేష్, నాయకులు పల్‌రెడ్డి నర్సింహారెడ్డి, గాదగోని కొండయ్య, బొజ్జ సుందర్, కొండ వెంకన్నగౌడ్, సోమా యాదగిరి, యానాల లింగారెడ్డి, కొండ శ్రీను, మందడి వెంకటరామిరెడ్డి, భరత్‌కుమార్, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, గుత్త మంజుల, కొండ లింగస్వామి, పెండెం ధనలక్ష్మి సదానందం, సామ బాలమ్మ, రాజు, సైదారెడ్డి, రమేష్, నరేందర్, పెండెం సంతోష్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment