కోమటిరెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నా.. రాజీనామాకు సై! | trs mla vemula veeresham counter to komatireddy rajagopal reddy | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 11 2017 12:39 PM | Last Updated on Mon, Dec 11 2017 12:52 PM

trs mla vemula veeresham counter to komatireddy rajagopal reddy - Sakshi

సాక్షి, నల్లగొండ: కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్టు టీఆర్‌ఎస్‌ నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల  వీరేశం ప్రకటించారు. 'కోమటిరెడ్డి సోదరులు ఇద్దరూ రాజీనామా చేయాలి. నేను కూడా రాజీనామా చేస్తాను. నకిరేకల్‌లో నేను ఓడిపోతే.. రాజకీయ సన్యాసం తీసుకుంటాను. మీరు ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారా?' అని ప్రశ్నించారు.

ఈసారి నకిరేకల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ గెలవకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. నకిరేకల్‌కు కోమటిరెడ్డి బ్రదర్స్‌ వస్తున్నారంటేనే ఎమ్మెల్యే వేముల వీరేశానికి గుబులు పుడుతుందని విమర్శించారు. కేసీఆర్‌ కుటుంబం దిగివచ్చినా ఇక్కడ కాంగ్రెస్‌ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్‌ మూడవ కన్ను తెరిస్తే తెలంగాణలో టీఆర్‌ఎస్‌ కనుమరుగు కావడం ఖాయమన్నారు. ఏ జిల్లాకు వెళ్లినా తమకు టీపీసీసీ పగ్గాలు ఇవ్వాలని ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement