సాక్షి, హైదరాబాద్: ఆత్మనిర్భర భారత్ ప్రస్థానంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఇంకో ముందడుగు వేసింది. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు వీలుగా పది మీటర్ల పొడవైన తాత్కాలిక వారధిని అభివృద్ధి చేసింది. వాగులు, వంకల వంటి అడ్డంకులను వేగంగా దాటేందుకు ఆర్మీ ఈ వారధులను ఉపయోగిస్తుంది. లార్సెన్ అండ్ టూబ్రోకు చెందిన తాలేగావ్ కార్యాలయంలో సిద్ధమైన ఈ తాత్కాలిక వారధిని మంగళవారం ఆర్మీకి అందజేశారు. డీఆర్‌డీవో, ప్రైవేట్ కంపెనీలు సంయుక్తంగా పనిచేయడం ద్వారా ఈ వారధిని త్వరగా అభివృద్ధిచేయగలిగినట్లు డీఆర్‌డీవో తెలిపింది. ఇన్నాళ్లూ ఇలాంటి వారధులను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. తొలిసారి పూర్తి స్వదేశీ టెక్నాలజీ, డిజైన్‌లతో దీన్ని రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment