Atmanirbhar Bharat Abhiyan
-
‘డిజిటల్ అరెస్టు’కు... భయపడకండి
న్యూఢిల్లీ: దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోతుండడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం వేశారు. ఇటీవల పెచ్చరిల్లుతున్న ‘డిజిటల్ అరెస్టు’ ఫ్రాడ్‌ను ఆదివారం ‘మన్‌కీ బాత్’లో ప్రధానంగా ప్రస్తావించారు. ‘‘అన్ని వయసుల వారూ వీటి బారిన పడుతున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోతున్నారు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. సైబర్ నేరగాడికి, బాధితుడికి మధ్య జరిగిన సంభాషణను మోదీ ఉదాహరించారు. ‘‘సైబర్ నేరగాళ్లు తొలుత వ్యక్తిగత సమాచారం సేకరిస్తారు. తర్వాత ఫోన్లు చేసి మీరు నేరాల్లో ఇరుక్కున్నారంటూ భయభ్రాంతులకు గురి చేస్తారు. ఆలోచించుకొనే సమయం కూడా ఇవ్వరు. డబ్బులిస్తారా, అరెస్టవుతారా అంటూ బెదిరిస్తారు. భయపడితే మానసికంగా మరింత ఒత్తిడికి గురి చేసి డబ్బు గుంజుతారు. ‘ఆగడం, ఆలోచించడం, చర్య తీసుకోవడం’ ఈ మోసాలకు విరుగుడు’’ అన్నారు. ‘‘ఇలాంటి గుర్తు తెలియని బెదిరింపు ఫోన్లకు భయపడకుండా ధైర్యంగా ఉండండి. దర్యాప్తు సంస్థలు, పోలీసులు ప్రజలకు ఇలాంటి ఫోన్లు చేయరని, డబ్బులడగరని గుర్తుంచుకోండి. సాయం కోసం జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నెంబర్ ‘1930’కు ఫోన్ చేయండి. సైబర్ నేరగాళ్లతో సంభాషణను రికార్డు చేసి దర్యాప్తు సంస్థలకు అందించండి. సైబర్ మోసాలపై cybercrime. gov. in వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయండి’’ అని సూచించారు. ‘‘డిజిటల్ మోసాలు, ఆన్లైన్ స్కాములపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. అప్రమత్తతే డిజిటల్ భద్రత కల్పిస్తుంది’’ అని ఉద్ఘాటించారు. సైబర్ నేరగాళ్లను సమాజానికి శత్రువులుగా అభివరి్ణంచారు. సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కలి్పంచాలన్నారు. అవి మరపురాని క్షణాలు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు ఈ నెల 31న ఘనంగా నిర్వహించుకుందామని మోదీ అన్నారు. ‘‘గిరిజన యోధుడు బిర్సా ముండా జయంతి వేడుకలు నవంబర్ 15న ప్రారంభమవుతాయి. గతేడాది జార్ఖండ్‌లో బిర్సా ముండా స్వగ్రామం ఉలిహాతును సందర్శించా. అవి మరపురాని క్షణాలు’’ అన్నారు.యానిమేషన్లో అద్భుతాలు ప్రతి రంగంలోనూ ‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తి కనిపిస్తోందని మోదీ హర్షం వెలిబుచ్చారు. ‘‘మన రక్షణ ఉత్పత్తులు 85 దేశాలకు ఎగుమతవుతున్నాయి. యానిమేషన్ రంగంలో మన కళాకారులు గణనీయమైన ప్రగతి సాధించారు. చోటా భీమ్, హనుమాన్, మోటు–పత్లూ, ధోలక్పూర్ కా ధోల్ వంటి యానిమేషన్ సిరీస్‌లు విదేశాల్లోనూ ప్రజాదరణ పొందుతున్నాయి. భారత్‌ను ప్రపంచ యానిమేషన్ పవర్‌హౌస్‌గా మారుద్దాం. ఇండియాలో గేమింగ్ రంగం వేగంగా విస్తరిస్తోంది. మన గేమ్స్‌కు ప్రపంచమంతటా ఆదరణ ఉంది. ప ర్యాటకానికి వర్చువల్ రియాలిటీ (వీటీ) ఊతం ఇస్తోంది. ప్రపంచంలో తదుపరి సూపర్ హిట్ యానిమేషన్ చిత్రం మీ కంప్యూటర్ నుంచే రావొచ్చు. మరో గొప్ప గేమ్‌ను మీరే సృష్టించవచ్చు’’ అని యువతనుద్దేశించి పేర్కొన్నారు. -
Mission Divyastra: శత్రువుకు వణుకే...!
ఖండాంతర లక్ష్యాలను అతి కచి్చతత్వంతో ఛేదించగల రేంజ్, బహుళ సామర్థ్యం. అత్యాధునిక పరిజ్ఞానం. వీటన్నింటి మేలు కలయికగా అగ్ని–5 క్షిపణి రూపుదిద్దుకుంది. ఇందుకోసం డీఆర్డీఓ సైంటిస్టులు ఏళ్ల తరబడి నిరంతర తపస్సే చేశారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కొన్నేళ్లుగా భారత్ సాధిస్తున్న అద్భుత ప్రగతి ఇందుకు తోడైంది. 5,000 కిలోమీటర్ల పై చిలుకు రేంజ్‌తో కూడిన అగ్ని–5 క్షిపణి రాకతో దేశ రక్షణ వ్యవస్థ దురి్నరీక్ష్యంగా మారింది... ఆద్యంతం ఆత్మనిర్భర్... ► చైనా వద్ద ఉన్న డాంగ్‌ఫెంగ్ తదితర క్షిపణుల రేంజ్ 10 వేల నుంచి 15 వేల కి.మీ. దాకా ఉంది! ► వాటిని దృష్టిలో ఉంచుకుని, లక్ష్యఛేదనలో కచ్చితత్వానికి పెద్దపీట వేస్తూ అగ్ని–5ని అభివృద్ధి చేశారు. ► దీని తయారీకి అవసరమైన వైమానిక వ్యవస్థలను పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేశారు. ► అంతేగాక అత్యంత కచి్చతత్వంతో కూడిన సెన్సర్లను కూడా ఈ వ్యవస్థలో అమర్చారు. ► వీటి సాయంతో అణు వార్హెడ్లు లక్ష్యాన్ని అణుమాత్రమైనా తేడా లేకుండా ఛేదించగలవు. గురి తప్పదంతే! అగి్న–5లో వాడిన మలి్టపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికిల్ (ఎంఐఆర్వీ) సాంకేతికత దీన్ని మరింత విధ్వంసకంగా, ప్రమాదకారిగా మారుస్తోంది. ఒకే క్షిపణి ప్రయోగంతో ఒకటికి మించిన లక్ష్యాలను ఛేదించేందుకు వీలు కలి్పంచడం దీని ప్రత్యేకత. ఈ టెక్నాలజీ 1960ల్లో తొలుత తెరపైకి వచి్చంది. 1968లో అమెరికా దీన్ని అభివృద్ధి చేసింది. మైన్యూట్‌మ్యాన్–3 క్షిపణి వ్యవస్థలో దీన్ని వాడింది. 1970ల నుంచి ఎంఐఆర్వీ సాంకేతికత ఖండాంతర క్షిపణుల్లో పూర్తిస్థాయిలో వాడకంలోకి వచి్చంది. ► ఖండాంతర క్షిపణుల తయారీ, పేలోడ్ వ్యవస్థ తదితరాల్లో విప్లవాత్మక మార్పులకు ఎంఐఆర్వీ శ్రీకారం చుట్టింది. ► ఈ పరిజ్ఞానం సాయంతో ఒకే క్షిపణి ద్వారా ఒకటికి మించిన సంఖ్యలో సంప్రదాయ, అణు వార్హెడ్లను ప్రయోగించవచ్చు. ► ఇందుకోసం ఒకే పెద్ద వార్‌హెడ్ బదులుగా పలు చిన్న చిన్న వార్హెడ్లను క్షిపణికి సంధిస్తారు. ► వీటిలో ప్రతి వార్‌హెడ్ స్వతంత్రంగా భిన్న లక్ష్యంపై దాడి చేయగలదు. ► తద్వారా ఒకే క్షిపణి ద్వారా ఒకటికి మించిన లక్ష్యాలను ఛేదించవచ్చు. ► ఒకటికి మించిన వార్హెడ్ల కారణంగా శత్రు దేశాల మిసైల్ డిఫెన్ వ్యవస్థలను ఏమార్చడంతో పాటు వాటి ఖండాంతర క్షిపణి విధ్వంస దాడులను తట్టుకుని లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఛేదించే సంభావ్యత ఎంతగానో పెరుగుతుంది. ► అంతేగాక లక్ష్యఛేదన కచ్చితత్వంతో జరిగేలా చూడటం ఎంఐఆర్వీ ప్రత్యేకత. ► అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా వద్ద మాత్రమే ఈ సాంకేతికత ఉంది. ► పాకిస్తాన్ కూడా ఈ సాంకేతికతను అందిపుచ్చుకునే ప్రయత్నంలో ఉంది. ఇటీవల అబాబీల్ మధ్య శ్రేణి క్షిపణి ప్రయోగంలో దీన్ని ప్రయతి్నంచి చూశారు. -
Mann ki Baat: ఆత్మనిర్భర్ వికసిత్ స్ఫూర్తి.. 2024లోనూ కొనసాగాలి
న్యూఢిల్లీ: ‘‘దేశ ప్రజల్లో వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తి రగిలింది. నూతన సంవత్సరంలోనూ ఇదే స్ఫూర్తిని, వేగాన్ని కొనసాగించాలి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశంలో ప్రతి ప్రాంతం ఆత్మవిశ్వాసంతో నిండిందన్నారు. ఆదివారం 108వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘ఫిట్ ఇండియా’ మన లక్ష్యం కావాలని, ఇందుకోసం భౌతిక, మానసిక ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు వాసుదేవ్, భారత మహిళా క్రికెట్ టీమ్ కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్, చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కార్యక్రమంలో పాల్గొని ఫిట్నెస్ సలహాలిచ్చారు. దేశం ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతోందని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆవిష్కరణలు జరగకపోతే అభివృద్ధి నిలిచిపోతుందని అన్నారు. భారత్ ‘ఇన్నోవేషన్ హబ్’గా మారిందని, అభివృద్ధి పరుగును ఆపబోమనే సత్యాన్ని చాటిందని అన్నారు. నూతన ఆవిష్కరణల్లో 2015లో 81వ స్థానం నుంచి దేశమిప్పుడు 40వ స్థానానికి చేరిందని తెలిపారు. దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... సృజనాత్మకతను పంచుకోండి ‘‘2023లో మన దేశం ఎన్నో ప్రత్యేక ఘనతలు సాధించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం పట్ల ప్రజలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. వారి మనోభావాలను విభిన్న రీతుల్లో తెలియజేస్తున్నారు. గత కొన్ని రోజులుగా శ్రీరాముడిపై, అయోధ్యపై కొత్తకొత్త పాటలు, భజనలు రచించి స్వరపరుస్తున్నారు. చాలామంది కొత్త గేయాలు, పద్యాలు రచిస్తున్నారు. అనుభవజు్ఞలైన కళాకారులతోపాటు యువ కళాకారులు సైతం శ్రీరాముడిపై, అయోధ్యలో రామమందిర నిర్మాణంపై పాటలు, భజనలు రాస్తున్నారు. చక్కగా ఆలపిస్తున్నారు. కొన్నింటిని నా సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. ఈ చరిత్రాత్మక సందర్భంలో కళాకారులు భాగస్వాములవుతుండడం హర్షణీయం. ‘శ్రీరామ్భజన్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో మీ సృజనాత్మకతను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలని కోరుతున్నా. ఈ పాటలు, భజనాలన్నీ కలిపి ఒక భావోద్వేగ ప్రవాహంగా, ప్రార్థనగా మారుతాయి. శ్రీరాముడి బోధించిన నీతి, న్యాయం వంటి సూత్రాలతో ప్రజలు మమేకం అయ్యేందుకు తోడ్పడుతాయి. తెలుగు పాట ‘నాటు నాటు’కు 2023లో ఆస్కార్ అవార్డు లభించడం దేశ ప్రజలకు ఆనందాన్నిచి్చంది. అలాగే ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ అనే తమిళ డాక్యుమెంటరీకి కూడా ఆస్కార్ లభించింది. వీటిద్వారా భారతదేశ సృజనను, పర్యావరణంతో మనకున్న అనుబంధాన్ని ప్రపంచం గుర్తించింది.’’ ఎన్నెన్నో ఘనతలు ‘భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దీనిపై ప్రజలు లేఖలు రాసి ఆనందం పంచుకున్నారు. జీ20 సదస్సు విజయవంతం కావడంపైనా వారు లేఖలు రాశారు. చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతంపై నాకిప్పటికీ సందేశాలు అందుతున్నాయి. దీపావళి సందర్భంగా దేశీయ ఉత్పత్తులు కొని ఉపయోగించడం ద్వారా మన శక్తిని నిరూపించాం. 2023లో మన క్రీడాకారులు సాధించిన విజయాలు దేశం గర్వపడేలా చేశాయి. మన అథ్లెట్లు అద్భుత ప్రతిభ ప్రదర్శించారు. ఆసియా క్రీడల్లో 107, పారా గేమ్స్‌లో 111 పతకాలు సొంతం చేసుకున్నారు. వన్డే క్రికెట్ ప్రపంచకప్‌లో భారత జట్టు అందరి మనసులు దోచేలా ప్రతిభ చూపింది. అండర్–19 టీ20 ప్రపంచకప్‌లో మహిళల జట్టు సాధించిన విజయం ప్రేరణగా నిలుస్తుంది. 2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్‌కు భారత క్రీడాకారులు సన్నద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, మేరీ మాటీ–మేరా దేశ్ వంటి కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా కోట్లాది ప్రజలు భాగస్వాములయ్యారు’’. ఫిట్టర్ లైఫ్ కావాలి: అక్షయ్ కుమార్ సినిమా తారలను గుడ్డిగా అనుకరించవద్దని ప్రజలకు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సూచించారు. సినీ నటులను చూసి ‘ఫిల్టర్స్ లైఫ్’ ఎంచుకోవద్దని, ‘ఫిట్టర్ లైఫ్’ గడపాలని పేర్కొన్నారు. ఫిట్నెస్కి సంబంధించి ‘మన్ కీ బాత్’లో ఆయన పలు సూచనలు చేశారు. వాస్తవానికి నటులు తెరపై కనిపించినట్లుగా బయట ఉండరని అన్నారు. తెరపై వారు బాగా కనిపించడానికి వివిధ రకాల ఫిల్టర్లు, స్పెషల్ ఎఫెక్ట్స్ ఉపయోగిస్తారని వెల్లడించారు. నటులను చూసి యువత ఫిట్‌నెట్ కోసం దగ్గరిదారులు ఎంచుకుంటున్నారని, కండల కోసం స్టెరాయిడ్స్ వంటివి వాడుతున్నారని అక్షయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త సంత్సరంలో ఫిట్నెస్ సాధించడం ఒక లక్ష్యంగా నిర్దేశించుకోవాలని అక్షయ్ పిలుపునిచ్చారు. -
భారత వాయుసేనలోకి తేజస్
సాక్షి, బెంగళూరు: భారత వాయుసేన అమ్ముల పొదిలో మరో కొత్త అస్త్రం చేరింది. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) మొట్ట మొదటి రెండు సీట్లున్న తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను బుధవారం భారత వైమానిక దళానికి అప్పగించింది. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ పాల్గొన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ తయారీ రంగాన్ని రక్షణ రంగంలో విస్తరిస్తున్న హెచ్ఏఎల్ కృషిని ఆయన కొనియాడారు. ప్రపంచ స్థాయి విమానాల డిజైన్, అభివృద్ధి తయారీలో మన దేశానికి అమోఘమైన శక్తిసామర్థ్యాలు ఉన్నాయని గుర్తు చేశారు. భారత వాయుసేనలో శిక్షణ ఇవ్వడానికి తేజస్ అన్ని రకాల సామర్థ్యాలు కలిగి ఉందని, అవసరమైతే యుద్ధ రంగంలో కూడా సేవలు అందిస్తుందని హాల్ వెల్లడించింది. తక్కువ బరువు కలిగి ఉండి అన్ని రకాల వాతావరణాలను తట్టుకోగలిగిన 4.5 జనరేషన్‌కు చెందిన యుద్ధ విమానం తేజస్. రెండు సీట్లు ఉండేలా డిజైన్ చేయడం వల్ల అప్పుడే వాయుసేనలో అడుగు పెట్టిన పైలెట్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. -
శుభోదయం.. నవోదయం
న్యూఢిల్లీ: పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం దేశ అభివృద్ధి ప్రయాణంలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. స్వావలంబన, అభివృద్ధి భారత్‌కు ఇదొక శుభోదయమని చెప్పారు. మన పార్లమెంట్ కొత్త భవనం ఇతర దేశాల ప్రగతికి సైతం స్ఫూర్తిగా నిలుస్తుందని ఉద్ఘాటించారు. ఆదివారం పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవం సందర్భంగా లోక్‌సభ సభామందిరంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘నవ భారత్’ ఆశలు ఆకాంక్షలను, నూతన లక్ష్యాలను కొత్త భవనం ప్రతిబింబిస్తోందని అన్నారు. ఇక్కడ తీసుకొనే ప్రతి నిర్ణయం దేశ మహోన్నత భవిష్యత్తుకు పునాది వేస్తుందని చెప్పారు. పేదలు, దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులు, దివ్యాంగులు, ఇతర అణగారిన వర్గాల సాధికారతకు ఇక్కడే ముందడుగు పడుతుందని వివరించారు. పార్లమెంట్ కొత్త భవనంలోని ప్రతి ఇటుక, ప్రతి గోడ పేదల సంక్షేమానికే అంకితమని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... బానిస మనస్తత్వాన్ని వదిలించుకుంటున్నాం ‘‘75వ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని దేశ ప్రజలు అమృత మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలు పార్లమెంట్ కొత్త భవనాన్ని తమ ప్రజాస్వామ్యానికి కానుకగా ఇచ్చుకున్నారు. దేశ ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నా. మన దేశ వైవిధ్యాన్ని, ఘనమైన సంప్రదాయాన్ని పార్లమెంట్ కొత్త భవన నిర్మాణశైలి చక్కగా ప్రతిబింబిస్తుండడం హర్షణీయం. వందల సంవత్సరాల వలస పాలన వల్ల అణువణువునా పాకిపోయిన బానిస మనస్తత్వాన్ని నవ భారతదేశం వదిలించుకుంటోంది. మహాత్మాగాంధీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం దేశ ప్రజలను మేల్కొల్పింది. నూతన చైతన్యాన్ని నింపింది. స్వాతంత్య్ర కాంక్షను రగిలించింది. స్వాతంత్య్ర పోరాటానికి అంకితమయ్యేలా ప్రజల్లో ఆత్మవిశ్వాసం కలిగించింది. రాబోయే 25 ఏళ్లలో దేశ అభివృద్ధి కోసం ప్రతి పౌరుడు అదే తరహాలో పనిచేయాలి. సహాయ నిరాకరణ ఉద్యమం 1922లో ముగిసింది. మరో 25 ఏళ్లకు.. 1947లో స్వాతంత్య్రం వచ్చింది. 2047లో మనం వందో స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకోబోతున్నాం. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవడానికి మనమంతా కంకణబద్ధులమై పనిచేయాలి. కొత్త భవనం.. ప్రజాస్వామ్య దేవాలయం ఇది కేవలం ఒక నిర్మాణం కాదు, 140 కోట్ల మంది ఆకాంక్షలకు, కలలకు ప్రతిరూపం. మన స్వాతంత్య్ర సమర యోధుల కలలను సాకారం చేయడానికి ఇదొక వేదిక. ఇది మన ప్రజాస్వామ్య దేవాలయం. భారతదేశ దృఢసంకల్పం ప్రపంచానికి ఇస్తున్న సందేశమిది. ప్రతి దేశ చరిత్రలో అమరత్వం పొందిన క్షణాలు కొన్ని ఉంటాయి. కాలం ముఖచిత్రంపై కొన్ని తేదీలు చెరిగిపోని సంతకంగా మారుతాయి. 2023 మే 28 కూడా అలాంటి అరుదైన సందర్భమే. పేదల ప్రజల సాధికారత, అభివృద్ధి, పునర్నిర్మాణం కోసం గత తొమ్మిదేళ్లుగా కృషి చేస్తున్నాం. ఇది నాకు సంతృప్తినిస్తున్న క్షణం. పేదలకు 4 కోట్ల ఇళ్లు నిర్మించి ఇచ్చాం. 11 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాం. గ్రామాలను అనుసంధానించడానికి 4 లక్షల కిలోమీటర్లకుపైగా రహదారులు నిర్మించాం. 50,000కుపైగా అమృత సరోవరాలు(చెరువులు), 30,000కుపైగా కొత్త పంచాయతీ భవనాలు నిర్మించాం. పంచాయతీ భననాల నుంచి పార్లమెంట్ కొత్త భవనం దాకా కేవలం ఒకేఒక్క స్ఫూర్తి మమ్మల్ని ముందుకు నడిపించింది. అదే.. దేశ అభివృద్ధి, ప్రజల అభివృద్ధి. కొత్త దారుల్లో నడిస్తేనే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయి. భారత్ ఇప్పుడు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంది. నూతనోత్సాహం కనిపిస్తోంది. కొత్త ఆలోచన, కొత్త ప్రయాణం. దిశ కొత్తదే, విజన్ కొత్తదే. మన విశ్వాసం, తీర్మానం కూడా కొత్తవే. ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. భారత్ ముందుకు నడిస్తే ప్రపంచం కూడా ముందుకు నడుస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ ఆవిర్భావానికి సాక్షి ఇప్పటి అవసరాలకు పాత భవనం సరిపోవడం లేదు. అందుకే కొత్తది నిర్మించాం. కొత్తగా మరికొంత మంది ఎంపీలు చేరనున్నారు. 2026 తర్వాత పునర్వ్యస్థీకరణతో పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి. సెంగోల్‌కు తగిన గౌరవం దక్కుతుండడం సంతోషకరం. చోళ సామ్రాజ్యంలో సెంగోల్‌ను కర్తవ్య మార్గం, సేవా మార్గం, జాతీయ మార్గానికి గుర్తుగా పరిగణించేవారు. కొత్త భవన నిర్మాణంలో 60,000 మంది కార్మికులు పాల్గొన్నారు. ఇక్కడి డిజిటల్ గ్యాలరీని వారికే అంకితమిస్తున్నాం. ఈ కొత్త భవనం ఆత్మనిర్భర్ భారత్ ఆవిర్భావానికి, వికసిత భారత్ దిశగా మన ప్రయాణానికి ఒక సాక్షిగా నిలుస్తుంది. భారత్ విజయం ప్రపంచ విజయం భారత్‌లాంటి పూర్తి వైవిధ్యం, అధిక జనాభా ఉన్న దేశం పరిష్కరించే సవాళ్లు, సాధించే విజయాలు చాలా దేశాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. రాబోయే రోజుల్లో భారత్ సాధించే ప్రతి విజయం ప్రపంచం సాధించే విజయంగా మారుతుంది. భారత్ కేవలం ఒక ప్రజాస్వామ్య దేశం కాదు, ప్రజాస్వామ్యానికి తల్లి కూడా. మన ప్రజాస్వామ్యమే మనకు స్ఫూర్తి. మన రాజ్యాంగమే మన బలం. ఈ స్ఫూర్తికి, బలానికి ఉత్తమమైన ప్రతీక పార్లమెంట్. పాత కొత్తల కలయికకు పరిపూర్ణ ఉదాహరణ పార్లమెంట్ నూతన భవనం. శతాబ్దాల బానిసత్వం కారణంగా మన ఉజ్వలమైన భవన నిర్మాణ శైలికి, పట్టణ ప్రణాళికకు దూరమయ్యాం. ఇప్పుడు ప్రాచీన వైభవాన్ని పునరుద్ధరించుకుంటున్నాం. పార్లమెంట్ కొత్త భవనాన్ని చూసి ప్రతి ఒక్కరూ గర్వపడుతున్నారు. మన వారసత్వం వైభవం, నైపుణ్యాలు, సంస్కృతితోపాటు రాజ్యాంగ వాణికి సైతం ఈ భవనం ప్రాతినిధ్యం వహిస్తోంది. దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన సామగ్రితో కొత్త భవనం నిర్మించాం. ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్‌కు ఇదొక గుర్తు. ప్రారంభోత్సవం సాగింది ఇలా..! అత్యాధునిక హంగులు, సకల సదుపాయాలతో నిర్మించిన ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెంటు కొత్త భవనాన్ని ఆదివారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అట్టహాసంగా ఒక ఉత్సవంలా సాగిన ఈ వేడుకలో ప్రధాని చారిత్రక ప్రాధాన్యమున్న అధికార మార్పిడికి గుర్తయిన రాజదండం (సెంగోల్)ను లోక్‌సభ ఛాంబర్లో ప్రతిష్టించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో పార్లమెంటు భవనాన్ని జాతికి అంకితమిచ్చారు. ► సంప్రదాయ దుస్తులు ధరించిన ప్రధాని మోదీ ఉదయం 7.30 గంటలకి పార్లమెంటుకు వచ్చారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధానికి ఎదురేగి స్వాగతం పలికారు. ► పార్లమెంటు ఆవరణలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర ప్రధాని మోదీ నివాళులర్పించారు ► అక్కడ నుంచి నేరుగా కొత్త భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన పూజామండపానికి చేరుకున్నారు. అక్కడ ప్రధానికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కర్ణాటక శృంగేరి మఠాధిపతులు వేద మంత్రాలు పఠిస్తూ ఉంటే ప్రధాని మోదీ గణపతి హోమం నిర్వహించారు. దీంతో పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. ► అనంతరం వేద పండితులు ప్రధానికి శాలువా కప్పి ఆశీర్వాదాలు అందజేశారు. ► అక్కడ నుంచి తమిళనాడు నుంచి వచ్చిన 21 మంది పీఠాధిపతులు వద్దకి వెళ్లారు. వారికి నమస్కరించారు. అప్పటికే పూజలు చేసి సిద్ధంగా అక్కడ ఉంచిన చారిత్రక సెంగోల్ ఎదుట ప్రధాని సాష్టాంగ నమస్కారం చేశారు. వారు అందించిన సెంగోల్‌ను చేత పుచ్చుకున్న ప్రధాని మోదీ వీనుల విందుగా నాదస్వరం వాయిస్తూ ఉంటే, వేద పండితులు మంత్రాలు పఠిస్తూ ఉంటే స్పీకర్ ఓం బిర్లా వెంటరాగా ఒక ఊరేగింపుగా వెళ్లి సెంగోల్‌ను లోక్‌సభ ఛాంబర్లోకి తీసుకువెళ్లి స్పీకర్ కుర్చీకి కుడివైపు ప్రతిష్టించారు. ► అనంతరం స్పీకర్ ఆసీనులయ్యే సీటు దగ్గర ప్రధాని జ్యోతి ప్రజ్వలన చేశారు. ► లోక్‌సభ నుంచి తిరిగి ప్రధాని మోదీ పూజాస్థలికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో ఆవిష్కరించి నూతన పార్లమెంటు భవనాన్ని జాతికి అంకితం చేశారు. ► అనంతరం కొత్త భవన నిర్మాణంలో పాలుపంచుకున్న కొంతమంది కార్మికులకు శాలువాలు కప్పి సత్కరించారు. వారి ప్రతిభకి గుర్తింపుగా జ్ఞాపికలను బహూకరించారు. ► అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ► దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రూ.75 స్మారక నాణేన్ని ప్రధాని ఆవిష్కరించారు. త్రిభుజాకారంలో ఉన్న కొత్త భవనం ముద్రించి ఉన్న స్టాంపు, కవర్ని కూడా ఆవిష్కరించారు. ► రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పంపించిన సందేశాలను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ చదివి వినిపించారు. ► కార్యక్రమంలో భాగంగా లోక్‌సభలో నేతల సమక్షంలో జాతీయ గీతం అయిన జనగణమన వినిపించారు. ► ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ఎస్. జైశంకర్, అశ్వినీ వైష్ణవ్, మన్సుఖ్ మాండవీయ, జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. ► నూతన భవనం ప్రారంభోత్సవానికి కనీసం 20 విపక్ష పార్టీలు హాజరు కాలేదు. -
చైనా ఉత్పత్తులకు బ్రేక్! హోలీ వేళ భారతీయులంతా..
భారతీయ మార్కెట్లో చైనీస్ ఉత్పత్తులకు గిరాకీ మామూలుగా ఉండదు, అయితే ఈ సారి హోలీ సందర్భంగా కథ మొత్తం అడ్డం తిరిగింది. ఆత్మనిర్భర్ భారత్ చొరవతో చాలామంది చైనా ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి సుముఖత చూపించడం లేదు. నివేదికల ప్రకారం, ఢిల్లీలో ఇప్పటికే చాలామంది వ్యాపారులు కేవలం మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా సదర్ బజార్ విక్రేత జావేద్ మాట్లాడుతూ.. ఎక్కువ మంది కొనుగోలుదారులు స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలిపాడు. తమ పిల్లలకు రంగులను కొనుగోలు చేయడానికి చేయడానికి వచ్చిన కస్టమర్లతో ఒకరు మాట్లాడుతూ.. ప్రస్తుతం భారతీయ ఉత్పత్తుల నాణ్యత బాగుండటంతో చైనా ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. మార్కెట్లో అమ్మకానికి ఉన్న చాలా ఉత్పత్తులు మన దేశంలో తయారు చేయబడినవి కావడం సంతోషించదగ్గ విషయం అన్నారు. కొనుగోలుదారుల నుంచి చైనా ఉత్పత్తుల మీద పెరుగుతున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని భారతీయ ఉత్పత్తులను మాత్రమే విక్రయిస్తున్నామని, లోపాలు ఉన్న వాటిని తిరిగి ఇవ్వకపోవడం కూడా చైనా ఉత్పత్తులు అమ్మకపోవడానికి కారణమని కొంతమంది వ్యాపారాలు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ హోలీ పండుగ వేళ భారతీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరగటం మంచి విషయమనే చెప్పాలి. -
‘ఆత్మనిర్భర్ భారత్‌కు డిఫెన్స్, ఏరోస్పేస్ కీలక పిల్లర్స్’
గాంధీనగర్: ఆత్మనిర్భర్ భారత్‌కు రక్షణ, ఏరోస్పేస్ రంగాలు ముఖ్యమైన పిల్లర్స్ అని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గుజరాత్లో మూడు రోజుల పర్యటనకు వెళ్లిన మోదీ.. వడోదరలో సీ-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టును రూ.22వేల కోట్ల వ్యయంతో టాటాల భాగస్వామ్యంతో ఎయిర్‌బస్ సంస్థ చేపడుతోంది. విమానయాన రంగంలో ఆత్మనిర్భరత సాధించేందుకు ఇది దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా మోదీ పేర్కొన్నారు. ‘భారత్‌ను ఆత్మనిర్భర్‌గా తీర్చిదిద్దటంలో డిఫెన్స్, ఏరోస్పెస్ రంగాలు ముఖ్యమైన రెండు పిల్లర్స్‌గా మారనున్నాయి. 2025 నాటికి దేశ రక్షణ రంగ తయారీ 25బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడులో ఏర్పాటు చేసిన డిఫెన్స్ కారిడార్లు అందుకు దోహదపడుతాయి. భారత రక్షణ ఏరోస్పేస్ రంగంలో ఇంతపెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి. బీజేపీ అధికారంలోకి వచ్చాక కీలక ఆర్థిక సంస్కరణలు చేపట్టాం. దానివల్లే తయారీ రంగంలో పెద్దమొత్తంలో పెట్టుబడులు వస్తున్నాయి. విమానయాన రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న మూడు దేశాల్లో త్వరలోనే భారత్ చోటు సంపాదిస్తుంది.’అని మోదీ వెల్లడించారు. ఐరోపాకు చెందిన ఎయిర్‌బస్ సంస్థ ఇతర దేశాల్లో సీ-295 విమానాలను తయారు చేయడం ఇదే తొలిసారి. భారత వాయుసేనలో సేవలందిస్తున్న అవ్రో-748 రవాణా విమానాల స్థానంలో, ఎయిర్‌బస్‌కు చెందిన సీ-295 రవాణా విమానాలను ప్రవేశపెట్టాలని గత ఏడాది సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 56 విమానాలు అందించేందుకు ఎయిర్‌బస్‌తో రూ.21,935 కోట్లతో ఒప్పందం కుదిరింది. 2023 సెప్టెంబరు నుంచి 2025 ఆగస్టు మధ్య 16 విమానాలను ఫ్లై-అవే కండీషన్లో ఎయిర్‌బస్ భారత్‌కు అందజేస్తుంది. మిగిలిన 40 విమానాల తయారీ, అసెంబ్లింగ్‌ను టాటా గ్రూప్‌నకు చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ దేశీయంగా చేపడుతుంది. తొలి దేశీయ తయారీ రవాణా విమానం 2026 సెప్టెంబరులో అందుబాటులోకి రావొచ్చని సమాచారం. ఇదీ చదవండి: గుజరాత్లో రూ.22వేల కోట్ల మెగా ప్రాజెక్ట్.. ఎయిర్‌బస్ సీ-295 తయారీ -
బాహుబలి నౌక ఐఎన్ఎస్ విక్రాంత్.. ఏకంగా 14 అంతస్తులు, 2,300 కంపార్ట్మెంట్లు
రక్షణ రంగంలో మన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి ఘనంగా చాటే రోజు రానే వచ్చింది. ఇప్పటిదాకా మన దగ్గరున్న యుద్ధ నౌకలన్నీ బ్రిటన్, రష్యాల నుంచి దిగుమతి చేసుకున్నవే. అలాంటిది అగ్రదేశాలే ఆశ్చర్యపోయేలా అత్యాధునిక విమానవాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ విజయవంతంగా నిర్మించింది. ఈ సామర్థ్యమున్న అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ సరసన సగర్వంగా తలెత్తుకుని నిలిచింది. చైనాతో ఉద్రిక్తత నెలకొన్న వేళ ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతమిస్తూ నిర్మించిన ఈ బాహుబలి యుద్ధనౌకను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జాతికి అంకితం చేశారు. కొచ్చి తీరంలో నావికాదళానికి అప్పగించారు. ఇది 2023లో తూర్పు నౌకాదళ అమ్ములపొదిలో పూర్తిస్థాయిలో చేరే అవకాశముంది. ఐఎన్ఎస్ విక్రాంత్. విజయానికి, శౌర్యానికి గుర్తు. మన దేశ గౌరవానికి ప్రతీక. మన తొలి విమాన వాహక నౌక. బ్రిటన్ నుంచి 1961లో కొనుగోలు చేసిన ఈ నౌక ఎన్నో యుద్ధాల్లో కీలకపాత్ర పోషించింది. మరపురాని విజయాలు అందించింది. 1997లో రిటైరైంది. ఇప్పుడు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి నౌక ఐఏసీ–1కు కూడా అదే పేరు పెట్టారు. నాటి విక్రాంత్ కంటే మెరుగైన సాంకేతికతతో రూపొందించిన ఈ బాహుబలి యుద్ధ నౌక భారత్ చేతిలో బ్రహ్మాస్త్రమే కానుంది. అత్యాధునిక సాంకేతికత విక్రాంత్ నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికతను వాడారు. క్యారియర్ మెషినరీ ఆపరేషన్లు, షిప్ నేవిగేషన్, ఆటోమేటిక్ సర్వైబిలిటీ సిస్టం ఏర్పాటు చేశారు. మేజర్ మాడ్యులర్ ఓటీ, ఎమర్జెన్సీ మాడ్యులర్ ఓటీ, ఎల్ఎం 2500 గ్యాస్ టర్బైన్లు 4, ప్రధాన గేర్‌బాక్స్‌లు, షాఫ్టింగ్, పిచ్ ప్రొపైల్లర్ కంట్రోలర్స్, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ సిస్టమ్, స్టీరింగ్ గేర్, ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్లు, కంప్రెసర్లు, సెంట్రిఫ్యూజన్, 60 క్రిటికల్ పంప్స్, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలు, అగ్నిమాపక వ్యవస్థ తదితరాలున్నాయి. టేకాఫ్ సమయంలో ఎయిర్‌క్రాఫ్ట్‌కు అదనపు లిఫ్ట్ ఇచ్చే ఫ్లైట్ డెక్ స్కీ జంప్‌తో స్టోబార్ కాన్ఫిగరేషన్ ఏర్పాటు చేశారు. దాంతో అతి తక్కువ సమయంలో టేకాఫ్ వీలవుతుంది. ఏ భాగమైనా మొరాయించినా ఆ ప్రభావం మిగతా భాగాలపై పడదు. దాంతో ప్రయాణం నిరాటంకంగా సాగుతుంది. 550 సంస్థలు, 100 ఎంఎస్ఎంఈల భాగస్వామ్యం కేరళలోని కొచ్చి షిప్‌యార్డ్‌లో 2005లో విక్రాంత్ నిర్మాణాన్ని ప్రారంభించారు. నేవీ అంతర్గతసంస్థ అయిన వార్ షిప్ డిజైన్ బ్యూరో (డబ్ల్యూడీబీ) దీన్ని రూపొందించింది. 2009 నుంచి మొదలైన పూర్తిస్థాయి నిర్మాణం 13 ఏళ్లలో పూర్తయింది. బీఈఎల్, భెల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, జిందాల్, ఎస్ఆర్ గ్రూప్, మిథానీ, జీఆర్ఎస్ఈ, కెల్ట్రాన్, కిర్లోస్కర్, ఎల్ అండ్ టీ మొదలైన 550 దిగ్గజ పరిశ్రమలతో పాటు 100కు పైగా ఎంఎస్ఎంఈలు నిర్మాణంలో పాలుపంచుకున్నాయి. పరికరాలు, యంత్రాలన్నీ దాదాపుగా స్వదేశీ తయారీవే. 23 వేల టన్నుల ఉక్కు, 2,500 కి.మీ. ఎలక్ట్రిక్ కేబుల్స్, 150 కి.మీ. పైపులు, 2 వేల వాల్వులు, గ్యాలీ పరికరాలు, ఎయిర్ కండిషనింగ్, రిఫ్రిజిరేషన్ ప్లాంట్లు, స్టీరింగ్ గేర్స్ వంటివన్నీ స్వదేశీయంగా తయారు చేసినవే. కొన్ని భాగాలను మాత్రం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారు. రెండువేల మంది షిప్‌యార్డు అధికారులు, సిబ్బంది, 13 వేలమంది కార్మికులు, ఉద్యోగులు విక్రాంత్ నిర్మాణంలో భాగస్వాములు. నౌక నిర్మాణం జరిగిన 13 ఏళ్ల పాటు రోజూ 2 వేల మందికి ఉపాధి దొరికింది. పరోక్షంగా పలు తయారీ సంస్థల్లో 40 వేల మందికి ఉపాధి లభించింది. 42,8000 టన్నుల సామర్థ్యంతో రెండు టేకాఫ్ రన్వేలు, ఒక ల్యాండింగ్ స్ట్రిప్‌లతో క్షిపణి దాడిని తట్టుకునేలా నిర్మించారు. రూ.20 వేల కోట్లు ఖర్చయియింది. గత ఏడాది ట్రయల్స్ విజయవంతంగా ముగిశాయి. గంటలో వెయ్యిమందికి చపాతీ, ఇడ్లీ రెడీ ఈ నౌకలో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ తరహా వైద్య సదుపాయాలున్నాయి. ఫిజియోథెరపీ క్లినిక్, ఐసీయూ, ల్యాబొరేటరీ, సీటీ స్కానర్, ఎక్స్‌రే మెషీన్లు, డెంటల్ కాంప్లెక్స్, ఐసోలేషన్ వార్డులతో కూడిన అత్యాధునిక మెడికల్ కాంప్లెక్స్ ఉంది. 16 బెడ్లు, రెండు ఆపరేషన్ థియేటర్లున్నాయి. ఐదుగురు మెడికల్ ఆఫీసర్లు, 17 మంది మెడికల్ సెయిలర్స్ ఉంటారు. ఇక దీని కిచెన్ కూడా అత్యాధునికమే. గంటలో ఏకంగా 1,000 మందికి చపాతీలు, ఇడ్లీలు తయారుచేసే ఆధునిక పరికరాలున్నాయి. ఎందుకంత కీలకం? రక్షణపరంగా, రవాణాపరంగా ఎంతో కీలకమైన హిందూ సముద్రంలో పైచేయి సాధించేందుకు ఐఎన్ఎస్ విక్రాంత్ మనకు బ్రహ్మాస్త్రంలా ఉపయోగపడనుంది. ఏ దేశానికైనా యుద్ధ విమానాలను మోసుకుపోగలిగే సామర్థ్యం కలిగిన నౌకలు ఉంటే నావికాశక్తి పటిష్టంగా ఉంటుంది. దీంతో సముద్ర జలాల్లోనూ, గగన తలంపై కూడా పట్టు సాధించగలం. చైనా దగ్గర రెండు విమాన వాహక నౌకలు, 355 యుద్ధ నౌకలు, 48 విధ్వంసక నౌకలు, 43 ఫ్రిజెట్లు, 61 కార్వెట్లున్నాయి. మూడో విమాన వాహక నౌక తయారీ కూడా మొదలైంది. మనకు మాత్రం ఇప్పటిదాకా విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య మాత్రమే ఉంది. 10 విధ్వంసక నౌకలు, 12 ఫ్రిగేట్లు, 20 కార్వెట్లున్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ రాకతో బంగాళాఖాతం, అరేబియా సముద్ర జలాలపై మన పట్టు మరింత బిగుస్తుంది. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనే అత్యాధునిక వ్యవస్థ ఐఎన్ఎస్ విక్రాంత్ సొంతం. నౌక మోసుకుపోగలిగే ఆయుధ సంపత్తి ► 34 యుద్ధ విమానాలు (మిగ్–29కే యుద్ధ విమానాలు, కమోవ్–31 విమానాలు, ఏఎల్‌హెచ్ హెలికాప్టర్లు, ఎంహెచ్–60ఆర్సీ హాక్ మల్టీరోల్ హెలికాప్టర్లు) ► దేశీయంగా రూపొందించిన తేలికపాటి హెలికాప్టర్లు మరో యుద్ధనౌకను నిర్మించగలం విక్రాంత్ తయారీలో ప్రతి రోజూ ఉత్కంఠగానే గడిచింది. కరోనాతో కాస్త ఆలస్యమైనా అద్భుతంగా నిర్మించాం. మరో యుద్ధనౌకను కూడా నిర్మించగల సామర్థ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకున్నాం. విక్రాంత్ తయారీలో 76 శాతం స్వదేశీ పరిజ్ఞానమే. తర్వాతి క్యారియర్ నిర్మాణానికల్లా దీన్ని 85 శాతం వరకు పెంచుకోగలం. – మధునాయర్, కొచ్చి షిప్‌యార్డు సీఎండీ – సాక్షి, విశాఖపట్నం -
ఇదేనా మీ ఆత్మనిర్భర్ భారత్?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీపై ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ‘ఆత్మనిర్భర్ భారత్’ అంశంపై మరోసారి విమర్శలు గుప్పించారు. ‘ఆత్మనిర్భరత, భారత స్వదేశీ స్ఫూర్తిని పెంపొందించేందుకు మహాత్మాగాంధీ చరఖాను ఉపయోగించారు. ఇప్పుడు ప్రధాని మోదీ ఖాదీ, చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధించిన మొదటి ప్రధానిగా సందేహాస్పదమైన గుర్తింపు పొందారు. ఇదేనా మీరు బోధించే ఆత్మనిర్భర్ భారత్? వోకల్ ఫర్ లోకల్?’ అని కేటీఆర్ ట్వీట్ ద్వారా ప్రశ్నించారు. Sri Mahatma Gandhi Ji had used Charkha as a symbol of #AtmaNirbharta & to inculcate #Swadeshi spirit🇮🇳 Now Sri Modi Ji has achieved the dubious distinction as the 1st PM who imposed GST on Handloom & Khadi products Is this the #atmanirbharbharat & #vocal4local that you preach? — KTR (@KTRTRS) August 2, 2022 చదవండి: టీఆర్ఎస్కు షాక్.. బీజేపీలోకి మంత్రి సోదరుడు! -
రూ.28 వేల కోట్ల ఆయుధ కొనుగోళ్లకు పచ్చజెండా
న్యూఢిల్లీ: దేశ ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో సైనిక బలగాల పూర్తిస్థాయి యుద్ధసన్నద్ధతకు అవసరమైన ఆయుధ సామగ్రిని రూ.28వేల కోట్లతో కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. మొత్తం రూ.28,732 కోట్లతో ఆర్మీకి స్వార్మ్ డ్రోన్లు, అత్యాధునిక కార్బైన్ తుపాకులు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను సమకూర్చనున్నారు. ఈ ప్రతిపాదనలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(డీఏసీ) మంగళవారం ఆమోదం తెలిపింది. నాలుగు లక్షల క్లోజ్–క్వార్టర్ కార్బైన్ తుపాకులతో సంప్రదాయ, హైబ్రిడ్ యుద్ధతంత్రంతోపాటు సరిహద్దులోని తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు వీలవుతుందని రక్షణ శాఖ తెలిపింది. ఆత్మనిర్భర్‌లో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలోని చిన్న ఆయుధ ఉత్పత్తి పరిశ్రమకు ఊతం ఇచ్చినట్లవుతుందని పేర్కొంది. నియంత్రణ రేఖ వెంబడి శత్రు స్నైపర్ల నుంచి మన బలగాలకు ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు, సరిహద్దుల్లో ఉగ్రవాదుల ఏరివేత సమయాల్లో ఆర్మీకి అవసరమైన అత్యున్నత ప్రమాణాలతో కూడిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను కూడా కొనుగోలు చేస్తున్నట్లు వివరించింది. ఆధునిక యుద్ధతంత్రంలో సైన్యం సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు అత్యాధునిక డ్రోన్లను కూడా సమకూర్చుకోనున్నట్లు కేంద్రం పేర్కొంది. కోల్‌కతా క్లాస్ యుద్ధ నౌకల కోసం 1,250 కిలోవాట్ సామర్థ్యం కలిగిన మెరైన గ్యాస్ టర్బైన్ జనరేటర్‌ను, ఇంకా 14 ఫాస్ట్ పెట్రోల్ పడవలను కూడా దేశీయంగా సమకూర్చుకుంటామని తెలిపింది. -
ఇండియన్ ఆర్మీలోకి ప్రైవేట్ సంస్థలు! ఇప్పటికే..
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆత్మానిర్బర్ భారత్ పథకం కింద మిలటరీ హార్డ్‌వేర్ విభాగంలోకి ప్రైవేట్ సంస్థల్ని ఆహ్వానించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ డిఫెన్స్ అక్విజేషన్ ప్రొసిజర్స్ (డీఏపీ) మ్యాన్యువల్‌గా సవరించాలని నిర్ణయించింది. ఇండియన్ డిఫెన్స్‌కు (పీఎస్‌యూ) చెందిన ప్రభుత్వ రంగ సంస్థలు మిలటరీకి సంబంధించిన ఆయుధాలు తయారు చేసేవి. ఇప్పుడీ డీఏపీ సవరణలతో ప్రైవేట్ సంస్థలు ఎక్కువ భాగం డిఫెన్స్‌కు చెందిన ఆయుధాల్ని తయారు చేసేందుకు ఊతం ఇచ్చినట్లైందని నివేదికలు చెబుతున్నాయి. ప్రైవేట్ సంస్థల సహకారంతో ఇండియన్ మల్టీ రోల్ హెలికాప్టర్ (ఐఎంఆర్‌హెచ్ )నను అభివృద్ధి, తయారీని కేంద్ర రక్షణ శాఖ ప్రయత్నిస్తుంది. దీంతో ఇండియన్ ఆర్మీ ఇన్వెంటరీలో ఉన్న రష్యా తయారు చేసిన ఎంఐ-17,ఎంఐ-8 హెలికాప్టర్లు భర్తీ కానున్నాయి. కాగా,13టన్నుల బరువైన ఈ మల్టీరోల్ హెలికాఫ్టర్ వైమానిక దాడిలో భారత సాయుధ బలగాల్ని రంగంలోకి దించడంతో పాటు, ఎయిర్ ఎటాక్, యాంటీ సబ్ మెరైన్, యాంటీ షిప్, మిలటరీ ట్రాన్స్ పోర్ట్, వీవీఐపీ వంటి విభాగాల్లో కీలకంగా పనిచేస్తుంది. ఫ్రెంచ్ కంపెనీతో ఎంఓయూ ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఎరో నాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), ప్రైవేట్ సంస్థలు కలిసి వచ్చే ఏడేళ్లలో ఇండియన్ మల్టీ రోల్ హెలికాప్టర్ తయారీని పూర్తి స్థాయిలో ప్రారంభించేలా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. దీంతో పాటు నేవల్ వేరియంట్‌తో సహా ఐఎంఆర్ హెచ్ ఇంజిన్‌ను తయారీ, ఉత్పత్తితో పాటు మద్దతు అందించేలా కొత్త జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు కానుంది. జులై 8న ఈ జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేసేందుకు హెచ్ఏఎల్ తో విమానాల విడిభాగాల తయారీలో పేరు గాంచిన ఫ్రెంచ్ సంస్థ సఫ్రాన్ అవగాహన ఒప్పందంపై సంతకం చేసినట్లు సమాచారం. -
స్టార్టప్‌లకు గుజరాత్ బెస్ట్!
న్యూఢిల్లీ: ఔత్సాహిక వ్యాపారవేత్తలకు అనువుగా స్టార్టప్ వ్యవస్థను అభివృద్ధి చేసే అంశంలో గుజరాత్, కర్ణాటక మరోసారి అత్యుత్తమంగా నిల్చాయి. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) రూపొందించిన ఉత్తమ పెర్ఫార్మర్ జాబితాలో గుజరాత్ వరుసగా మూడోసారి అగ్రస్థానం దక్కించుకుంది. ఈ కేటగిరీలో కర్ణాటకకు కూడా చోటు లభించింది. రాష్ట్రాల స్టార్టప్ ర్యాంకింగ్ 2021 జాబితాను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ సోమవారం విడుదల చేశారు. స్టార్టప్‌లపరంగా ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న భారత్ .. అగ్రస్థానానికి చేరాలన్న లక్ష్య సాధన దిశగా అంతా కృషి చేయాలని ఆయన సూచించారు. జిల్లాల స్థాయిలో కూడా పోటీపడాలని పేర్కొన్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు (యూటీ) తమ తమ స్టార్టప్ వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడంలో తోడ్పాటు అందించేందుకు ఈ ర్యాంకింగ్ విధానాన్ని ఉద్దేశించారు. అయిదు కేటగిరీలు.. సంస్థాగత మద్దతు, నవకల్పనలకు ప్రోత్సాహం, నిధులపరమైన తోడ్పాటు తదితర ఏడు అంశాల్లో సంస్కరణలకు సంబంధించి 26 యాక్షన్ పాయింట్లను పరిగణనలోకి తీసుకుని డీపీఐఐటీ ఈ ర్యాంకులను మదింపు చేసింది. 24 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు (యూటీ) ఈ ప్రక్రియలో పాల్గొన్నాయి. ఉత్తమ (బెస్ట్) పెర్ఫార్మర్లు, టాప్ పెర్ఫార్మర్లు, లీడర్లు, వర్ధమాన లీడర్లు, వర్ధమాన స్టార్టప్ వ్యవస్థలు అంటూ అయిదు కేటగిరీల్లో ఆయా రాష్ట్రాలు, యూటీలను వర్గీకరించారు. దీని ప్రకారం ఉత్తమ వర్ధమాన స్టార్టప్ వ్యవస్థల కేటగిరీలో ఆంధ్రప్రదేశ్, బీహార్, మిజోరం, లడఖ్ ర్యాంకులు దక్కించుకున్నాయి. అలాగే టాప్ పెర్ఫార్మర్లలో తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సా, జమ్మూ కాశ్మీర్లకు ర్యాంకులు దక్కాయి. కోటి కన్నా తక్కువ జనాభా ఉన్న చిన్న రాష్ట్రాల్లో మేఘాలయా బెస్ట్ పెర్ఫార్మర్గా నిల్చింది. -
ఇతర దేశాల కోసం యుద్ధనౌకలు తయారు చేసే స్థాయికి భారత్: రాజ్‌నాథ్
ముంబై: ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండు యుద్ధ నౌకలు సూరత్, ఉదయగిరిలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. మంగళవారం ముంబైలోని మాజగావ్ డాక్స్‌లో అవి జలప్రవేశం చేశాయి. ఈ యుద్ధ నౌకల డిజైన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ (డీఎన్డీ) రూపొందించింది. నౌకలు, జలాంతర్గాముల తయారు చేసే ముంబైకి చెందిన రక్షణ రంగ అనుబంధం సంస్థ మాజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) వాటిని తయారు చేసింది. దేశీయంగా తయారు చేసిన రెండు యుద్ధ నౌకలను ఒకేసారి ప్రారంభించడం ఇదే తొలిసారని సంస్థ వెల్లడించించి. వీటి రాకతో నావికాదళం మరింత బలోపేతమైందని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ అన్నారు. దేశీయ అవసరాలను తీర్చుకోవడమే గాక మున్ముందు ఇతర దేశాల కోసం యుద్ధనౌకలు తయారు చేసే స్థాయికి భారత్ ఎదుగుతుందని ధీమా వెలిబుచ్చారు. ఆత్మనిర్భర్ భారత్‌లో విక్రాంత్ యుద్ధ విమాన తయారీ ఒక మైలు రాయి అయితే,ఇసూరత్, ఉదయగిరిల తయారీతో మన రక్షణ సామర్థ్యం హిందూ మహా సముద్రం నుంచి ఫసిఫిక్, అట్లాంటిక్ దాకా విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: (బారాత్‌లో తప్పతాగి పెళ్లికొడుకు డ్యాన్సులు.. మరొకరిని పెళ్లాడిన వధువు) ఐఎన్ఎస్ సూరత్ ఐఎన్ఎస్ సూరత్ యుద్ధనౌక పీ15బి క్లాస్‌కు చెందినది. క్షిపణుల్ని ధ్వంసం చేసే సామర్థ్యం దీని సొంతం. దీన్ని బ్లాక్ నిర్మాణ పద్ధతుల్లో తయారు చేశారు. అంటే విడిభాగాలను వేర్వేరు ప్రాంతాల్లో తయారు చేసి వాటిని ఎండీఎల్‌లో జోడించారు. దీనికి గుజరాత్ వాణిజ్య రాజధాని సూరత్ పేరు పెట్టారు. నౌకల తయారీలో సూరత్‌కు ఘనచరిత్ర ఉంది. 16వ శతాబ్దంలోనే ఇక్కడ నౌక నిర్మాణం మొదలైంది. ఇక్కడ తయారైన వందేళ్ల నాటి నౌకలు ఇంకా చెక్కు చెదరలేదు. ఐఎన్ఎస్ సూరత్ దీనికి ఆంధ్రప్రదేశ్‌లోని ఉదయగిరి పర్వతశ్రేణి పేరు పెట్టారు. 17ఏ ఫ్రిగేట్స్ ప్రాజెక్టులో ఇది మూడో యుద్ధ నౌక. పీ17 ఫ్రిగేట్స్ (శివాలిక్ క్లాస్) కంటే దీన్ని మరింత ఆధునీకరించారు. మెరుగైన రహస్య ఫీచర్లు, అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్లు, ప్లాట్ఫారం నిర్వహణ వ్యవస్థల్ని పొందుపరిచారు. పీ17ఏ కార్యక్రమం కింద మొత్తం ఏడు నౌకలు నిర్మాణంలో ఉన్నాయి. దీని నిర్మాణంలో తొలిసారిగా కొత్త పద్ధతుల్ని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. -
ఆత్మనిర్భర్‌తో భారత్ స్వయం సమృద్ది: రాజీవ్ కుమార్
న్యూఢిల్లీ: కేంద్రం చేపట్టిన ఆత్మనిర్భర్(స్వావలంబన) కార్యక్రమం వల్ల భారత్‌తో ప్రపంచ ఎకానమీకి సంబంధాలు తెగిపోతాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ఉద్ఘాటించారు. భారత్ స్వయం సంమృద్ధికి దోహదపడే మిషన్ ఇదని ఆయన అన్నారు. ప్రపంచ సరఫరా, విలువల చైన్లకు సంబంధించి అంతర్జాతీయంగా పటిష్ట బంధాన్ని కలిగి ఉండడం వల్ల దేశం తన ప్రజలకు మెరుగైన ఫలితాలను సాధించగలుగుతుందని అన్నారు. ప్రపంచ సరఫరాలు, వ్యాల్యూ చైన్ విషయంలో ఆత్మ నిర్భర్ కార్యక్రమం దేశాన్ని ప్రపంచ ఆర్థిక చిత్రంలో కీలక స్థానంలో ఉంచుతుందని పేర్కొన్నారు. కేంద్రం ప్రారంభించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాల కింద భారత్‌లో భారీ స్థాయిలో కంపెనీలను స్థాపించాలని ఆయన జపాన్ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఆర్థిక సంస్కరణలు, ఎటువంటి అడ్డంకులు లేని అంతర్జాతీయ వాణిజ్యం, వ్యాపార రంగం విషయంలో ప్రాంతీయ అనుసంధానం వంటి విషయాలకు భారత్ కట్టుబడి ఉందని అన్నారు. భారతదేశం-జపాన్లలో కోవిడ్-19ను ఎదుర్కొన్న పద్దతులు, రెండు దేశాల మధ్య ముందుకు సాగుతున్న ఆర్థిక సహకారం... అవకాశాల కోసం అన్వేషణ’ అనే అంశంపై 10వ ఐసీఆర్ఐఈఆర్-పీఆర్ఐ వర్క్‌షాప్ సందర్భంగా జరిగిన ఒక వర్చువల్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రసంగంలో ముఖ్యాంశాలు.. పీఎల్ఐ పథకం కింద జపాన్ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టి, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు దేశాన్ని ఎగుమతి కేంద్రంగా మార్చాలని మేము కోరుకుంటున్నాము. ఇందుకు అనుగుణమైన పరిస్థితులు భారత్‌కు ఉన్నాయని భావిస్తున్నాం. భారతదేశంలోకి జపాన్ పెట్టుబడులను ఆకర్షించడానికి ఏది అవసరమో ఆయా చర్యలన్నింటినీ తీసుకోడానికి భారత్ సిద్ధంగా ఉంది. ఆత్మనిర్భర్, స్వావలంబన భారత్ మిషన్, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం వంటివి కోవిడ్-19 పరిస్థితిని ఎదుర్కొని, ఆర్థిక వ్యవస్థ పురోగతికి తోడ్పాటును అందించే ప్రధాన చర్యలు. ఆత్మనిర్భర్ మిషన్ దేశాన్ని క్లోజ్డ్ ఎకానమీ వైపు నడిపిస్తుందనే భయాన్ని తొలగించడం అవసరం. గ్లోబల్ ఎకానమీ, వాణిజ్యం, సేవలు, ఆర్థిక, సాంకేతిక అంశాలకు సంబంధించి భారతదేశం తన దృఢచిత్తం నుండి వెనక్కి వెళ్లే ప్రశ్నే లేదు. రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడుల సరళీకరణ.. సరళీకృత, గ్లోబల్ ఆర్థిక విధానాల పట్ల భారత్ చిత్తశుద్ధిని ప్రతిబింబిస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థ పురోగతికి జపాన్ సహకారం అందించగలిగే పరిస్థితి ఉంది. ప్రపంచ డిమాండ్‌ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఎగుమతులను వృద్ధి చేయడంలో భారత్‌కు జపాన్ నుంచి తగిన సహాయ సహకారాలు అందుతాయని భావిస్తున్నాం. ప్రపంచ వాణిజ్యం, సంబంధిత సేవల వృద్ధిలో అధిక వాటాను సాధించాలని భారత్ ఆకాంక్షిస్తోంది. ఇది భారత్ వృద్ధి ఊపందుకోవడానికి, ఉపాధి కల్పన భారీగా పెరగడానికి దోహదపడుతుంది. రాబోయే సంవత్సరాల్లో భారత్ దీనిని సాధించడానికి(భారత్‌కు సహాయం చేయడానికి) జపాన్ కంపెనీలు తగిన సహకారం అందిస్తాయని భావిస్తున్నాను. ఇక సాంప్రదాయేతర ఇంధన వనరుల ప్రోత్సాహం, ఎలక్ట్రిక్ వాహనాల దిశగా పురోగతి ప్రస్తుత కీలక అంశాలు. జపాన్ ఇప్పటికే ఈ రంగంలో ముందంజలో ఉంది. హైడ్రోజన్ ఇంధనాన్ని తయారీలో కీలకమైన గ్రీన్ అమ్మోనియాను సరఫరా చేయడానికి భారత్ కంపెనీల సహాయ సహకారాలను తీసుకునే అవకాశాలను జపాన్ పరిశీలించవచ్చు. భారత్ కూడా హైడ్రోజన్ ఫ్యూయెల్ మిషన్‌లో పురోగమించడంపై దృష్టి పెట్టింది. హైడ్రోజన్ ఎకానమీలో జపాన్ గణనీయమైన అభివృద్ధిని సాధించిందని నాకు తెలుసు. టొయోటా తన స్వంత వాహనాన్ని ఆవిష్కరించింది. ఈ విషయంలో భారత్‌కు సహాయసహకారాలు అందించాలని జపాన్ను నేను అభ్యర్థిస్తున్నాను. రాబోయే పదేళ్లలో 10 మెట్రిక్ మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియాను ఎగుమతి చేయాలనే లక్ష్యంతో ఉన్నాము. గ్రీన్ అమ్మోనియా హైడ్రోజన్(పర్యావరణ సానుకూల) ఆర్థిక వ్యవస్థకు ఆధారం. అందువల్ల ఈ ఉత్పత్తిని వేగవంతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. వచ్చే ఐదేళ్లలో భారతదేశంలో 5 ట్రిలియన్ యన్లు(రూ.3,20,000 కోట్లు) లేదా 42 బిలియన్ డాలర్ల పెట్టుబడి లక్ష్యాన్ని జపాన్ ప్రకటించింది. అంతక్రితం భారత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా మధ్య కీలక చర్చలు జరిగాయి. (చదవండి: ఐపీఎల్ అభిమానులకు బుక్ మై షో శుభవార్త..!) -
ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్‌లో ఇక ఇంటర్న్‌షిప్‌లు
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ విద్యనభ్యసించే వారికి నైపుణ్యాలు అలవర్చడంతో పాటు వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) ఆధ్వర్యంలో ఇంటర్న్‌షిప్‌ను అందించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కేవీఐసీతో ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థులు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ విభాగంలోని తమకు నచ్చిన అంశంలో ఇంటర్న్‌షిప్ చేసుకునేలా వెసులుబాటు కల్పిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లోని ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ కార్యాలయాలతో ఆయా ఉన్నత విద్యాసంస్థలు ఇంటర్న్‌షిప్ కోసం సంప్రదించవచ్చని ఏఐసీటీఈ ఆయా సంస్థలకు సూచించింది. ఈ మేరకు కమిషన్ వెబ్సైట్లో సర్క్యులర్ పొందుపరిచింది. కేవీఐసీలో ఏయే అంశాల్లో ఇంటర్న్‌షిప్ చేసేందుకు అవకాశముందో వాటి వివరాలను ఏఐసీటీఈ వెబ్సైట్లో పొందుపర్చనున్నట్లు వివరించింది. ఈ ఇంటర్న్‌షిప్ ఆయా అంశాలకు సంబంధించి వేర్వేరు కాలవ్యవధులను నిర్ణయించనున్నారు. ఇంటర్న్‌షిప్ కాలంలో ప్రతి విద్యార్థికీ నెలకు రూ.5వేలు చొప్పున ఉపకార వేతనాన్ని అందించనున్నారు. ఇదేకాక ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ విభాగం వివిధ పథకాలకు సంబంధించిన పరిశోధనా ప్రాజెక్టులను కూడా ఏర్పాటుచేయబోతోందని ఏఐసీటీఈ పేర్కొంది. ఈ ప్రాజెక్టులకూ స్కాలర్షిప్ను అందించనున్నారు. విద్యార్థులకు ఎంతో మేలు ఇక ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్‌తో భాగస్వామ్యం ద్వారా విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుందని ఏఐసీటీఈ అభిప్రాయపడింది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్‌తో అనుసంధానమై విద్యార్థులను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఈ ఒప్పందం ఉపకరిస్తుందని పేర్కొంది. కేవీఐసీలోని అనేక స్కీముల ద్వారా విద్యార్థులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఆస్కారముంటుందని, ఇది దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని వివరించింది. ఉద్యోగులుగా కాకుండా పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలుగా వారే ఇతరులకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగగలుగుతారని అభిప్రాయపడింది. మార్కెటింగ్, తయారీ అంశాలపై విద్యార్థులు నైపుణ్యాలను అలవర్చుకునేలా ఈ ఇంటర్న్‌షిప్ ఉంటుందని ఏఐసీటీఈ వివరించింది. -
ఏకే–203 రైఫిళ్ల తయారీ అమేథీలో
న్యూఢిల్లీ: అత్యాధునిక ఏకే–203 రకం రైఫిళ్లను భారత్‌లో తయారుచేసేందుకు మార్గం సుగమం అయింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ పరిధిలోని కోర్వాలో రైఫిళ్లను తయారుచేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. రక్షణ ఉత్పత్తుల తయారీ రంగంలో ఆత్మనిర్భర్ సాధించడానికి తాజా నిర్ణయం బాటలుపరుస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రూ.5వేలకోట్ల ప్రాజెక్ట్‌లో భాగంగా ఐదు లక్షలకుపైగా రైఫిళ్లను అక్కడ ఫ్యాక్టరీలో తయారుచేస్తారు. ‘ ఈ కొత్త ప్రాజెక్టు కారణంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అవకాశాలు మెరుగుపడతాయి’ అని సంబంధిత వర్గాలు చెప్పాయి. మూడు దశాబ్దాల క్రితం నుంచి భారత సాయుధ బలగాల కోసం వినియోగిస్తున్న ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో ఈ అధునాతన ఏకే–203 రైఫిళ్లను తెచ్చారు. ఈ తేలికైన 7.62 ్ఠ 39 మిల్లీమీటర్ల కాలిబర్ రైఫిల్ 300 మీటర్ల దూరంలోని లక్ష్యాలనూ చేధించగలదు. ఈ నెల ఆరున రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశముంది. చాలా సంవత్సరాల క్రితమే ఈ ఒప్పందంపై రెండు దేశాలూ ఏకాభిప్రాయానికి వచ్చాయి. అయితే, రైఫిళ్ల సాంకేతికత రష్యా నుంచి భారత్‌కు బదిలీచేసే అంశం కొలిక్కి రాలేదు. ఇంతకాలానికి ఇది సాధ్యమైంది. పుతిన్ పర్యటనలో పలు ఒప్పందాలు.. సోమవారం ఢిల్లీకి రానున్న పుతిన్ సమక్షంలో భారత్ రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంథనం, సాంకేతిక రంగాలకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకోనుంది. సోమవారం సాయంత్రం 5.30గంటలకు కీలక వ్యూహాత్మక అంశాలపై మోదీ, పుతిన్ చర్చించనున్నారు. ఇరు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల 2+2 భేటీల్లో తూర్పు లద్దాఖ్ సరిహద్దు ఉద్రిక్తత, తాలిబాన్ పాలనలో అఫ్గాన్ నుంచి భారత్‌కు పెరగనున్న ఉగ్ర ముప్పు అంశాలూ చర్చించనున్నారు. రెండు ఇంజన్ల కమోవ్–226టీ తేలికపాటి 200 హెలికాప్టర్ల సంయుక్త తయారీ అంశం ఓ కొలిక్కిరానుంది. వచ్చే మూడేళ్లలో ఇరుదేశాల పెట్టుబడుల ఒప్పందాలు 50బిలియన్ డాలర్ల స్థాయికి చేర్చడంపైనా దృష్టిపెట్టనున్నారు. -
ఇది చరిత్రాత్మక నిర్ణయం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: రిటైల్, హోల్ సేల్ వ్యాపారాలనూ ఎంఎస్ఎంఈ పరిధిలోకి తీసుకొస్తున్నట్టు నిన్న కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కీలక నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీ నేడు స్పందించారు. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) జాబితాలో రిటైల్, హోల్ సేల్ వ్యాపారాలను చేర్చి తమ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మోదీ అన్నారు. దీని వల్ల కోట్లాది మంది వర్తకులకు లబ్ధి చేకూరుతుందని మోదీ చెప్పారు. వేగంగా ఆర్థిక సాయం అందడంతో పాటు వారి వ్యాపారాలు వృద్ధి చెందుతాయన్నారు. వ్యాపారుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విటర్లో ఆయన ట్వీట్ చేశారు. ఇక నూతన మార్గదర్శకాలను ఆయన విడుదల చేశారు. కొత్త నిబంధనలతో దాదాపు 2.5 కోట్ల మంది రిటైల్, హోల్ సేల్ వర్తకులు లబ్ధి పొందుతారని చెప్పారు. దీంతో ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రాధాన్య రంగాలకు రుణాల్లో చిరు వర్తకులకు లాభం కలుగుతుంది. అంతేగాకుండా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ లో వారు నమోదు చేసుకోవచ్చు. Our government has taken a landmark step of including retail and wholesale trade as MSME. This will help crores of our traders get easier finance, various other benefits and also help boost their business. We are committed to empowering our traders. https://t.co/FTdmFpaOaU — Narendra Modi (@narendramodi) July 3, 2021 అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది. ఇకపై ఎంఎస్ఎంఈలకు వర్తించే ప్రభుత్వ స్కీములు, ప్రయోజనాలు తమకు కూడా లభించగలవని సీఏఐటీ జాతీయ ప్రెసిడెంట్ బీసీ భార్తియా, సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తాజా నిర్ణయంతో ఆయా వర్గాలకు రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం ప్రాధాన్యతా రంగం కింద రుణాలు పొందేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. చిన్న సంస్థలను పటిష్టం చేసేందుకు, ఆర్థిక వృద్ధికి వాటిని చోదకాలుగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని గడ్కరీ నిన్న ట్వీట్ చేశారు. తాజా మార్గదర్శకాలతో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద 250 కోట్లపైగా టర్నోవర్ ఉన్న హోల్‌సేల్ వ్యాపారులు, చిన్నస్థాయి రిటైలర్లు త్వరగతిన ఫైనాన్స్ పొందే అవకాశం ఉంటుందని వెల్లడించారు. వారు ఉద్యమ్ పోర్టల్‌లో కూడా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. -
ఆర్థిక వ్యవస్థకు బూస్టర్ డోస్..!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ సెకండ్ వేవ్‌తో ప్రతికూల ప్రభావాలు ఎదుర్కొంటున్న దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమివ్వడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా కోవిడ్ ప్రభావిత రంగాలకు రూ. 1.1 లక్షల కోట్ల రుణ హామీ పథకం సహా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఎనిమిది కీలక చర్యలతో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు. వీటితో పాటు ఆర్థిక వృద్ధికి తోడ్పడే మరో ఎనిమిది సహాయక చర్యలు కూడా ఉన్నట్టు ఆమె తెలిపారు. వీటి ప్రకారం.. అత్యవసర రుణ సదుపాయ హామీ పథకం (ఈసీఎల్జీఎస్) పరిమితిని మరో రూ. 1.5 లక్షల కోట్ల మేర పెంచి రూ. 4.5 లక్షల కోట్లకు చేర్చడం ద్వారా చిన్న సంస్థలకు (ఎంఎస్ఎంఈ) ఊరటనిచ్చే ప్రయత్నం చేశారు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా గైడ్లు, టూరిస్ట్ ఏజెన్సీలకు రుణ సదుపాయం లభించేలా చర్యలు ప్రకటించారు. పేదలకు ఉచిత ఆహార ధాన్యాలను అందించే పథకాన్ని నవంబర్ దాకా పొడిగించినందుకు అదనంగా అయ్యే రూ.93,869 కోట్లు, ఎరువుల సబ్సిడీ కింద ఇచ్చే మరో రూ. 14,775 కోట్లతోపాటు కేంద్రం ఇటీవలి కాలంలో ప్రకటించిన ఉద్దీపన చర్యల విలువ సుమారు రూ. 6.29 లక్షల కోట్లకు చేరినట్లవుతుంది. ప్యాకేజీలో చాలా మటుకు భాగం.. కోవిడ్ ప్రభావిత రంగాలకు రుణాలిచ్చే బ్యాంకులు, సూక్ష్మ రుణాల సంస్థలకు ప్రభుత్వ హామీ రూపంలోనే ఉండనుంది. ► 11 వేల మంది టూరిస్ట్ గైడ్లు, ఏజెన్సీలకు తోడ్పాటు.. పర్యాటక రంగాన్ని ఆదుకునేందుకు వీలుగా మూలధన రుణాలు, వ్యక్తిగత రుణాలు ఇచ్చేందుకు కేంద్రం కొత్తగా లోన్ గ్యారంటీ స్కీమ్ ప్రకటించింది. కేంద్ర పర్యాటక శాఖ గుర్తింపు పొందిన 10,700 టూరిస్ట్ గైడ్లు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన గైడ్లకు ఇది వర్తిస్తుంది. అలాగే పర్యాటక శాఖ గుర్తింపు పొందిన 907 మంది పర్యాటక రంగంలోని ఏజెన్సీలకు కూడా ఇది వర్తిస్తుంది. ఏజెన్సీకి గరిష్టంగా రూ. 10 లక్షలు, టూరిస్ట్ గైడ్లకు రూ. 1 లక్ష రుణం అందేలా 100% గ్యారంటీని కేంద్రం సమకూరుస్తుంది. ప్రాసెసింగ్ ఛార్జీలు వంటివేవీ ఈ రుణాలకు వర్తించవు. ► 5 లక్షల మందికి ఉచిత టూరిస్ట్ వీసా అంతర్జాతీయ వీసాల జారీ ప్రక్రియ ప్రారంభమయ్యాక భారత్‌కు వచ్చే తొలి 5 లక్షల మంది విదేశీ పర్యాటకులకు ఉచిత టూరిస్ట్ వీసా ఇవ్వనున్నారు. 31 మార్చి 2022 వరకు లేదా 5 లక్షల టూరిస్ట్ వీసా ల లక్ష్యం పూర్తయ్యే వరకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. దీనితో కేంద్రంపై రూ.100 కోట్ల భారం పడనుంది. ► హెల్త్‌కేర్ ప్రాజెక్టులకు రూ. 50వేల కోట్లు.. కోవిడ్ ప్రభావిత రంగాలకు రుణ వితరణలో భాగంగా ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పనకు రూ. 50 వేల కోట్ల మేర రుణాలకు నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ (ఎన్సీజీటీసీ) గ్యారంటీ ఇస్తుంది. ఇది విస్తరణకు, కొత్త ప్రాజెక్టులకు కూడా వర్తిస్తుంది. విస్తరణ ప్రాజెక్టులకైతే 50 శాతం, కొత్త ప్రాజెక్టులకైతే 75 శాతం గ్యారంటీ వర్తిస్తుంది. 8 మెట్రోపాలిటన్ నగరాలు కాకుండా మిగిలిన నగరాలకు ఇది వర్తిస్తుంది. గరిష్టంగా 7.95 శాతం వడ్డీకి రుణాలు ఇవ్వాలి. అలాగే కోవిడ్ ప్రభావిత టూరిజం, ఇతర రంగాలకు మరో రూ. 60 వేల కోట్ల రుణాలకు గ్యారంటీ ప్రకటించింది. ► ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన పొడిగింపు ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన పథకాన్ని 2022 మార్చి 31 వరకు వర్తించేలా కేంద్రం పొడిగించింది. ఈపీఎఫ్ఓలో నమోదైన సంస్థలు అంతకుముందు ఈపీఎఫ్ చందాదారు కాని రూ. 15 వేల లోపు వేతనంతో కొత్త ఉద్యోగిని తీసుకున్నప్పుడు, అలాగే మహమ్మారి వల్ల 1–3–2020 నుంచి 30–09–2020 మధ్య ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగికి 1 అక్టోబరు 2020 నుంచి 30 జూన్ 2021 మధ్యలో ఉద్యోగం కల్పించినప్పుడు (రూ.15 వేల వేతనం వరకు) ఈ ప్రయోజనం వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా రెండేళ్లపాటు ప్రయోజనం లభిస్తుంది. వెయ్యి మంది వరకు ఉద్యోగులు ఉన్న సంస్థల విషయంలో ఈపీఎఫ్‌లో ఉద్యోగి చందా(వేతనంలో 12%), యాజమాన్య చందా(వేతనంలో 12 శాతం) మొత్తంగా 24% కేంద్రం భరిస్తుంది. వెయ్యికి పైగా ఉద్యోగులు ఉన్న కంపెనీల్లో కేవలం ఉద్యోగి చందా 12% మాత్రమే కేంద్రం భరిస్తుంది. ► ఈసీఎల్‌జీఎస్‌కు అదనంగా 1.5 లక్షల కోట్లు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ఈసీఎల్జీఎస్) పరిధిని ప్రస్తుతం ఉన్న రూ. 3 లక్షల కోట్ల నుంచి అదనంగా రూ. 1.5 లక్షల కోట్లు పెంచుతూ లిక్విడిటీ సంక్షోభం ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈ రంగానికి రూ. 4.5 లక్షల కోట్లు అందేలా ఉపశమన చర్యలు ప్రకటించారు. ► మైక్రో ఫైనాన్స్ సంస్థల ద్వారా 25 లక్షల మందికి రుణాలు మైక్రో ఫైనాన్స్ సంస్థల ద్వారా 25 లక్షల మందికి గరిష్టంగా రూ. 1.25 లక్షల మేర రుణం అందేలా కేంద్రం .. షెడ్యూల్డు బ్యాంకులకు గ్యారంటీ ఇస్తుంది. మార్జిన్ కాస్ట్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్) కంటే 2% ఎక్కువకు బ్యాంకుల నుంచి మైక్రోఫైనాన్స్ సంస్థలకు ఈ రుణాలు లభిస్తాయి. రూ. 7,500 కోట్ల మేర రుణ వితరణ జరిగే వరకు లేదా మార్చి 31, 2022 వరకు ఈ పథకం వర్తిస్తుంది. ► చిన్నారుల ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పన చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన మౌలిక వసతుల కల్పనకు కొత్తగా రూ. 23,220 కోట్ల మేర ఈ ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసేందుకు కొత్త పథకాన్ని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఆరోగ్య సిబ్బంది నియామకం, జిల్లా, సబ్ జిల్లా స్థాయిలో ఐసీయూ పడకలు, ఆక్సిజన్ సరఫరా ఏ ర్పాట్లు, వైద్య పరికరాలు, మందులు, టెలీకన్సల్టేషన్, ఆంబులెన్స్ వసతులపై ఈ నిధులు వెచ్చిస్తారు. ► డీఏపీపై అదనపు సబ్సిడీ... డీఏపీ ఎరువులకు అదనంగా రూ. 14,775 కోట్ల మేర సబ్సిడీని ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు వర్తించేలా ఆర్థిక శాఖ ఆమోదించింది. ఈ సబ్సిడీ పెంపును కేంద్రం ఇదివరకే ప్రకటించింది. నిధులను తాజాగా విడుదల చేసినట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. ► ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పొడిగింపు కోవిడ్ నేపథ్యంలో ప్రకటించిన ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను నవంబరు వరకు పొడిగించారు. ఆహార భద్రత చట్టం పరిధిలో ప్రతి ఒక్కరికి అదనంగా 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తారు. ఈ అంశాన్ని గతంలో ప్రధాన మంత్రి ప్రకటించగా, ఇటీవలే కేబినెట్ ఆమోదించింది. ► ఇతరత్రా 8 సహాయక చర్యలు ♦ రైతు ఆదాయం రెట్టింపు చర్యలు, పౌష్ఠికాహార లోప నివారణ చర్యలు.. ♦ ఈశాన్య ప్రాంత వ్యవసాయ మార్కెటింగ్ సంస్థకు రూ. 77.45 కోట్ల పునరుజ్జీవ ప్యాకేజీ ♦ నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ అకౌంట్ (ఎన్‌ఈఐఏ)కు రూ. 33,000 కోట్ల మేర లబ్ధి. ♦ ఐదేళ్లలో ఎగుమతులకు బీమా కవరేజీని రూ. 88 వేల కోట్ల మేర పెంచే దిశగా ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్‌కు నిధులు. ♦ పంచాయతీలకు నెట్ సౌకర్యం దిశగా భారత్‌నెట్‌కు అదనంగా మరో రూ. 19,041 కోట్లు. ♦ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (పీఎల్ఐ) 2025–26 వరకు పొడిగింపు. ♦ విద్యుత్తు పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వ్యవస్థను ఆధునీకరిస్తారు. దీనికి రూ. 3,03,058 కోట్ల వెచ్చింపు. ఇందులో కేంద్రం వాటా రూ. 97,631 కోట్లు ఉంటుంది. ♦ పీపీపీ ప్రాజెక్టుల ఆమోద ప్రక్రియను సరళీకరిస్తూ ప్రాజెక్టులు వేగవంతం చేసేందుకు కొత్త విధానం. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకునేందుకు, ఉత్పత్తి.. ఎగుమతులతో పాటు ఉపాధి కల్పనకు ఊతమిచ్చేవిగా ఈ చర్యలు ఉన్నాయి. ప్రజారోగ్యానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు మెరుగుపడేందుకు, మెడికల్ ఇన్ఫ్రాలో ప్రైవేట్ పెట్టుబడులు వచ్చేలా తోడ్పడగలవు. రైతుల వ్యయాలు తగ్గేందుకు, వారి ఆదాయాలు పెరిగేందుకు దోహదపడగలవు‘ – నరేంద్ర మోదీ, ప్రధాని ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో ప్రైవేట్ వైద్య రంగం చాలా కీలక పాత్ర పోషించింది. ఆర్థిక మంత్రి ప్రకటించిన చర్యలు హెల్త్‌కేర్ రంగానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడంతో పాటు ఎకానమీ సత్వరం కోలుకోవడానికి కూడా తోడ్పడగలవు‘ – ప్రతాప్ సి. రెడ్డి, చైర్మన్, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వృద్ధికి ఊతం.. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన ఉద్దీపన చర్యలు వృద్ధికి ఊతమిచ్చేలా ఉన్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. లాక్డౌన్లతో కుదేలైన వ్యాపార సంస్థలు ఎదుర్కొంటున్న నిధుల కష్టాలు తీరేందుకు ఇవి తోడ్పడగలవని సీఐఐ అభిప్రాయపడింది. వీటితో ఎగుమతులు మెరుగుపడటానికి ప్రోత్సాహం లభించగలదని ఎఫ్ఐఈవో పేర్కొంది. కోవిడ్‌తో దెబ్బతిన్న అనేక రంగాలకు ఈ ప్యాకేజీ ప్రాణం పోయగలదని అసోచాం తెలిపింది. -
ప్రజలకు టీకాలివ్వడం మాని.. ‘బ్లూటిక్’ కోసం కేంద్రం పోరాటం
న్యూఢిల్లీ: కోవిడ్ టీకాలు పొందడంలో స్వావలంబన (ఆత్మనిర్భర్) సాధించాలం టూ దేశ ప్రజలను వదిలేసి, బ్లూ టిక్ కోసం మోదీ ప్రభు త్వం పోరాటం చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చురకలంటించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితర అగ్ర నేతల అకౌంట్లకు బ్లూ టిక్‌లను ట్విట్టర్ తొలగించడం, ఆ వ్యవహారం వివాదా స్పదం కావడంతో తిరిగి పునరుద్ధరించడంపై రాహుల్ ఈ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనిపై బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర స్పందించారు. ‘ట్విట్టర్‌పై రాజకీయాలు చేయడం రాహుల్‌కు చాలా ముఖ్యమైన విషయం, ఆయన అతిపెద్ద వేదిక కూడా ఇదే’ అని ఎదురుదాడి చేశారు. ఢిల్లీలోని గోవింద్ వల్లభ్ పంత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి తమ సంస్థలో పనిచేసే నర్సులు మలయాళంలో మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించడంపైనా రాహుల్ స్పందించారు. భారతీయ భాషల్లో ఒక్కటైన మలయాళంపై వివక్ష మానుకోవాలన్నారు. -
ఆరేళ్లలో రూ.15 లక్షల కోట్ల ముద్రా యోజన రుణాలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ముద్రా యోజన పథకం కింద గణనీయమైన స్థాయిలో రుణ వితరణ నమోదైంది. ఆరేళ్లలో 28 కోట్ల మందికి పైగా లబ్దిదారులకు రూ.15 లక్షల కోట్ల రుణాలను బ్యాంకులు మంజూరు చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖా ప్రకటించింది. ప్రధానమంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) పథకాన్ని 2015 ఏప్రిల్ 8న ప్రధాని మోదీ ప్రారంభించడం గమనార్హం. ఈ పథకం కింద ఎటువంటి తనఖా లేకుండానే రూ.10 లక్షల వరకు రుణ సాయాన్ని పొందేందుకు అవకాశం ఉంది. శిశు, కిశోర్, తరుణ్ అనే మూడు విభాగాలు కింద.. తయారీ, ట్రేడింగ్, సేవల రంగం, వ్యవసాయం రంగ సంబంధిత పరిశ్రమలకు ఈ పథకం కింద రుణ వితరణ చేయాలన్నది లక్ష్యం. శిశు విభాగం కింద రుణ గ్రహీతలకు 2 శాతం వడ్డీ రాయితీని ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా గతేడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కారణంగా లాక్డౌన్ల వల్ల ఎదురైన సమస్యల నుంచి చిన్న పరిశ్రమలు గట్టెక్కేందుకు ఈ సాయాన్ని ప్రకటించింది. శిశు విభాగం కింద తనఖా లేకుండా ఒక్కో పరిశ్రమకు రూ.50,000 వరకు రుణం మంజూరవుతుంది. 2020 మార్చి నాటికే శిశు విభాగం కింద 9.37 కోట్ల రుణ ఖాతాలున్నాయి. చదవండి: ఉద్యోగుల భద్రత కోసం తగ్గేది లేదు: ఎల్అండ్టీ -
అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.15 లక్షలు మీవే!
న్యూఢిల్లీ: దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ అదిరిపోయే ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అమెజాన్ ఇండియా స్కైలాంజా భాగస్వామ్యంతో 'అమెజాన్ సంభవ్ - బిల్డ్ ఫర్ ఇండియా' పేరుతో హ్యాకథాన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. డెవలపర్లు ఈ అమెజాన్ సంభవ్ కార్యక్రమం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ కోసం భారతదేశంలో ఉన్న సమస్యలకు పరిష్కారాలను సాంకేతికత పరంగా ఎలా కనుగొనాలో అనేది దీని ప్రధాన లక్ష్యం. డెవలపర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఇది మంచి అవకాశముని చెప్పుకోవచ్చు. మొత్తం పది మంది విజేతల కలిపి రూ.15 లక్షల వరకు నగదు ప్రోత్సాహకం అందిస్తారు. అంతేకాకుండా విజేతలు రీడీమ్ చేసుకోవడానికి అమెజాన్ వెబ్ సిరీస్ క్రెడిట్లను కూడా అందిస్తారు. అలాగే ప్రముఖ పారిశ్రామిక వేత్తల వెబ్‌నార్, మీటింగ్ సెషన్లలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. 21వ శతాబ్దంలో భారతదేశం సామర్థ్యాన్ని తెలియజేయడంలో సాంకేతికత, ఆవిష్కరణలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఎంఎస్ఎంఇ, సెల్లింగ్ పార్ట్నర్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ ప్రణబ్ భాసిన్ అన్నారు. బిజినెస్ ఇన్నోవేషన్, సస్టైనబిలిటీ అండ్ హెల్త్ కేర్ అనే రెండు థీమ్స్ ఉంటాయి. వీటిపై డెవలపర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు పని చేయాల్సి ఉంటుంది. అంటే స్మార్ట్ సిటీస్, ఎనర్జీ ఎఫిషియన్సీ, డేటా అనలిటిక్స్, ఆన్లైన్ స్టోర్స్ ఏర్పాటు వంటి పలు వాటికి సంబంధించిన ప్రొడక్టులను రూపొందించాల్సి ఉంటుంది. మార్చి 22 వరకే రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ అందుబాటులో ఉంటుంది. "అమెజాన్ సంభవ్ సమ్మిట్" లింక్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. చదవండి: మార్చి 31లోగా ఈ పనులను వెంటనే పూర్తి చేయండి! ఈ స్కీమ్‌లో చేరితే ప్రతి నెల పదివేల పెన్షన్ -
ఆధార్, నారీ శక్తి, సంవాద్.. ఇప్పుడు ఆత్మనిర్భరత
కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని ఒక కుదుపు కుదిపేసింది. దీని ప్రభావంతో చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకులాయి. దీంతో అన్ని దేశాల్లోలాగానే భారత్‌లో ఆర్థిక వ్యవస్థ ను గాడిలో పెట్టేందుకు భారత ప్రభుత్వం కోవిడ్–19 రికవరీ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజిపై ప్రధాని మోడీ ప్రసంగింస్తూ..‘ఆత్మనిర్భరత’ అనే పదాన్ని నొక్కిపలికారు. అప్పటినుంచి ఈ పదం జనం నోళ్లలో తెగ నానుతోంది. ఇది గుర్తించిన ఆక్స్ఫర్డ్ డిక్షనరీ లాంగ్వేజ్ నిపుణుల సలహా ప్యానల్ ఆత్మనిర్భరత పదాన్ని హిందీ వర్డ్ ఆఫ్ ది ఇయర్–2020గా ఎంపిక చేసింది. ఆత్మనిర్భరత అంటే సెల్ఫ్ రిలయన్స్ లేదా స్వావలంబన (స్వయం ప్రతిపత్తి) అని అర్థం. ఏటా బాగా ప్రాచుర్యం పొందిన, కొత్తగా వాడుకలోకి వచ్చిన పదాలను ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా గుర్తిస్తుంది. తాజాగా ఆక్స్ఫర్డ్ హిందీ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్–2020 పదంగా ‘ఆత్మనిర్భరత’ను ప్రకటించింది. ఆత్మనిర్భరత అనేది కేవలం పదం మాత్రమే కాదని, గతేడాది దేశ నైతిక, మానసిక స్థైర్యాన్ని ప్రతిబించిందని ప్యానెల్ వెల్లడించింది. కరోనా మహమ్మారి విజృంభణతో దేశంలోని కోట్ల మంది ప్రజలు కొత్త కొత్త జీవన విధానాలను అలవర్చుకోవాల్సి వచ్చింది. 2020కి ముందు కన్నా ఇప్పుడు వ్యక్తిగత స్వాలంబన పెరిగింది. ఆన్లైన్ క్లాస్‌లు, వర్క్‌ఫ్రం హోం, ఆరోగ్యంపై శ్రద్ధ, సొంతంగా వంట చేసుకుని రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారం తినడం, ఫిజికల్ ఫిట్‌నెస్‌పై దృష్టిమళ్లడం, ఇంట్లో పనులను అందరూ కలిసి చేయడం, ఇంట్లోని ఆత్మీయుల కోసం సమయం కేటాయించడం వంటి అనేక అంశాల్లో సెల్ఫ్ రిలయన్స్ బాగా పెరిగిందని లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ క్రితికా అగర్వాల్ చెప్పారు. రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా బయోటెక్నాలజీ విభాగం ఆత్మ నిర్భర్ భారత్ ప్రచారాన్ని హైలెట్ చేస్తూ..కోవిడ్–19 వ్యాక్సిన్ అభివృద్ధి ప్రక్రియను రాజ్‌పథ్‌లో శకటాల ప్రదర్శనలో ఉంచింది. దీని ద్వారా కూడా ఆత్మనిర్భరతకు మరింత గుర్తింపు వచ్చింది. కాగా హిందీ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా గతంలో ఆధార్ (2017), నారీ శక్తి(2018), సంవిధాన్(2019)లు ఎంపికయ్యాయి. -
ప్రధాని మాటలు ఆచరణలోకి రావాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘బుల్లెట్ ట్రైన్ అహ్మదాబాద్‌కే వెళ్తుంది. హై స్పీడ్ రైలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి దక్షిణాది నగరాలు ఉన్నా ముంబై వద్దే ఆగిపోతుంది. ప్రగతి పథంలో పరిగెత్తే రాష్ట్రాలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాల్సి ఉన్నా అది జరగడం లేదు. ప్రగతిశీల రాష్ట్రాలను ప్రోత్సహించాలని కేంద్ర పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లను కోరుతున్నాం. ప్రధాని మోదీ చెప్పే మాటలపై విశ్వాసం ఉండాలంటే అవి ఆచరణలోకి రావాలి’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. చదవండి: (త్వరలో ఐటీకి కొత్త పాలసీ) తెలంగాణ వాణిజ్య, పరిశ్రమల మండళ్ల సమాఖ్య (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో శనివారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘రెండ్రోజుల క్రితం జరిగిన నీతి ఆయోగ్ భేటీలో రాష్ట్రంలోని పారిశ్రామిక రంగం కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలతో ముందుకు రావడాన్ని ప్రశంసించింది. పరస్పర విమర్శలతో కాలం గడపకుండా కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతాం. అభివృద్ధి, సరికొత్త సంస్కరణలతో తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ నాయకత్వంలో దేశానికే ఆదర్శంగా నిలుపుతాం’అని కేటీఆర్ ప్రకటించారు. పారిశ్రామిక రాయితీలు, ప్రోత్సాహకాల కోసం గతేడాది రాష్ట్ర వార్షిక బడ్జెట్లో రూ.1,500 కోట్లు కేటాయించినా, కోవిడ్–19 కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. 2021–22 బడ్జెట్లో నిధులు కేటాయించి రాయితీలు, ప్రోత్సాహకాలకు సంబంధించిన బకాయిలను చెల్లిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. పరిశ్రమల వివరాలతో బ్లూ బుక్.. ‘రాష్ట్రంలో పారిశ్రామిక సంస్థల వివరాలతో ‘బ్లూ బుక్’తయారు చేస్తున్నాం. తద్వారా భారీ పెట్టుబడులతో వచ్చే బహుళ జాతి కంపెనీలతో స్థానిక పరిశ్రమలు భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్ర పారిశ్రామిక విధానంతో గత ఆరేళ్లలో రూ.2.04 లక్షల కోట్ల పెట్టుబడులతో వచ్చిన 13,826 పరిశ్రమలకు అనుమతులు ఇవ్వగా, 14 లక్షల మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి దక్కుతోంది. స్థానికులకు 80 శాతానికి పైగా ఉద్యోగాలిచ్చే సంస్థలకు అదనపు ప్రోత్సాహకాలిస్తాం. పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను అందించేందుకు తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) సిద్ధంగా ఉంది’అని కేటీఆర్ వెల్లడించారు. కాళేశ్వరం లాంటి బహుళ ప్రయోజన ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కేవలం మూడున్నరేళ్ల రికార్డు సమయంలో పూర్తి చేసిందని పేర్కొన్నారు. ధాన్యం దిగుబడి పెరిగి ఈశాన్య భారతంతో పాటు తైవాన్, మధ్య ప్రాచ్య దేశాలకు సోనా బియ్యం ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎఫ్‌టీసీసీఐ ఆధ్వర్యంలో 18 కేటగిరీల్లో ఎంపిక చేసిన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు కేటీఆర్ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షులు రమాకాంత్ ఇనానీ, ఉపాధ్యక్షులు కె.భాస్కర్‌రెడ్డి, అనిల్ అగర్వాల్, అవార్డుల కమిటీ చైర్మన్ రవీంద్ర మోదీ పాల్గొన్నారు. ఆత్మ నిర్భర్‌తో ఒరిగిందేమీ లేదు.. ‘కోవిడ్–19 కారణంగా దెబ్బతిన్న రంగాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్బర్ భారత్‌లో భాగంగా ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీతో 20 మందికి కూడా ప్రయోజనం కలగలేదు. వచ్చే ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టే బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మంచి ప్యాకేజీ ప్రకటించడం ద్వారా ఆర్థిక పునరుజ్జీవనానికి కేంద్రం బాటలు వేస్తుందని ఆశిస్తున్నాం. గత 12 త్రైమాసికాల్లో దెబ్బతిన్న దేశ ఆర్థిక పరిస్థితి తిరిగి పుంజుకోవాలని కోరుకుంటున్నాం’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘హై స్పీడ్ ట్రైన్, ఇండస్ట్రియల్ కారిడార్లు, డిఫెన్స్ ప్రొడక్షన్ క్లస్టర్లు వంటి అంశాలపై కేంద్రానికి లేఖలు రాస్తున్నాం. వచ్చే కేంద్ర బడ్జెట్లో హైదరాబాద్–నాగ్‌పూర్, హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్– బెంగళూరు పారిశ్రామిక కారిడార్లకు నిధులు కేటాయించాలి. పెద్ద ఎత్తున పారిశ్రామికవృద్ధికి బాటలు వేసే ఫార్మాసిటీ, జీనోమ్ వ్యాలీ, టెక్స్టైల్ పార్కులు, ఐటీఐఆర్ వంటి వాటిని కేంద్రం ప్రోత్సహించకపోతే పరిగెత్తలేం’అని కేటీఆర్ స్పష్టం చేశారు. -
ఆంధ్రప్రదేశ్‌కు రూ.344 కోట్ల రివార్డు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్దేశించిన నాలుగు పౌర సంస్కరణల్లో మూడింటిని ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు పూర్తి చేశాయి. వన్ నేషన్–వన్ రేషన్ కార్డ్ సంస్కరణతో పాటు సులభతర వాణిజ్యం సంస్కరణలు, పట్టణ స్థానిక సంస్థల సంస్కరణలను ఈ రెండు రాష్ట్రాలు పూర్తి చేశాయి. దీంతో మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సాయం పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు అదనంగా రూ.344 కోట్లు లభించగా, మధ్యప్రదేశ్‌కు మూలధన ప్రాజెక్టుల కోసం రూ.660 కోట్లు అందుకునే అర్హత లభించింది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా ఈ పథకాన్ని 2020 అక్టోబర్ 12న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సంస్కరణలను పూర్తి చేసి ఈ రాష్ట్రాలకు జారీ చేసిన రూ.14,694 కోట్ల మూలధన వ్యయానికి ఈ మొత్తం రూ.1,004 కోట్లు అదనపు ఆర్థిక సాయం లభించనుంది. 27 రాష్ట్రాల్లో రూ.9,880 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం.. కోవిడ్–19 సంక్షోభం కారణంగా తలెత్తిన పన్ను ఆదాయంలో కొరత కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలకు మూలధన వ్యయాన్ని పెంచేందుకు ‘స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ కేపిటల్ ఎక్స్పెండిచర్’ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఇందులో ఇప్పటివరకు 27 రాష్ట్రాల్లో రూ.9,880 కోట్ల మూలధన వ్యయ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. మొదటి విడతగా ఇప్పటికే రూ.4,940 కోట్లు రాష్ట్రాలకు విడుదలయ్యాయి. ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా, నీటిపారుదల, విద్యుత్, రవాణా, విద్య, పట్టణాభివృద్ధి వంటి వివిధ రంగాల్లో మూలధన వ్యయ ప్రాజెక్టులను కేంద్రం ఆమోదించింది. -
ఆర్మీ స్వదేశీ వారధి
సాక్షి, హైదరాబాద్: ఆత్మనిర్భర భారత్ ప్రస్థానంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఇంకో ముందడుగు వేసింది. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు వీలుగా పది మీటర్ల పొడవైన తాత్కాలిక వారధిని అభివృద్ధి చేసింది. వాగులు, వంకల వంటి అడ్డంకులను వేగంగా దాటేందుకు ఆర్మీ ఈ వారధులను ఉపయోగిస్తుంది. లార్సెన్ అండ్ టూబ్రోకు చెందిన తాలేగావ్ కార్యాలయంలో సిద్ధమైన ఈ తాత్కాలిక వారధిని మంగళవారం ఆర్మీకి అందజేశారు. డీఆర్డీవో, ప్రైవేట్ కంపెనీలు సంయుక్తంగా పనిచేయడం ద్వారా ఈ వారధిని త్వరగా అభివృద్ధిచేయగలిగినట్లు డీఆర్డీవో తెలిపింది. ఇన్నాళ్లూ ఇలాంటి వారధులను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. తొలిసారి పూర్తి స్వదేశీ టెక్నాలజీ, డిజైన్లతో దీన్ని రూపొందించారు. -
అమ్మకానికి ‘ఆకాశ్ క్షిపణి’
న్యూఢిల్లీ: దేశీయంగా తయారు చేసిన ఆకాశ్‌మిస్సైల్ వ్యవçస్థను విదేశాలకు ఎగుమతి చేసేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించే ఈ మిస్సైల్స్‌ను కొనేందుకు తయారుగా ఉన్న దేశాల ప్రతిపాదనలు పరిశీలించి వేగంగా అమ్మకాల అనుమతులిచ్చేందుకు వీలుగా ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఆకాశ్‌లో 96 శాతం దేశీయంగా తయారైన పరికరాలే ఉన్నాయి. 25 కిలోమీటర్ల రేంజ్లో టార్గెట్‌ను విజయవంతంగా ధ్వంసం చేయగలదు. ఆత్మ నిర్భర్ భారత్ కింద ఇండియా సొంతంగా మిస్సైళ్లు తయారుచేసి ఎగుమతి చేసే స్థాయికి చేరిందని, తాజాగా ఆకాశ్ మిస్సైల్స్‌ను విదేశాలకు విక్రయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఈ నిర్ణయంతో ఆయుధాల విక్రయాల్లో భారత్ విదేశాలతో పోటీ పడే అవకాశం కలుగుతుందన్నారు. రక్షణ అమ్మకాలు 500 కోట్ల డాలర్లకు చేర్చేందుకు ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. 2024నాటికి 101 రకాల ఆయుధాలను, మిలటరీ ప్లాట్‌ఫామ్స్‌ను దిగుమతి చేసుకోవడం నిలిపివేసి స్వదేశీవి తయారు చేసుకోవాలని భారత్ భావిస్తోంది. భారత్ మిషన్స్ సాంస్కృతిక, వాణిజ్య సంబంధాల పెంపుదల లక్ష్యంగా వివిధ దేశాల్లో ఇండియన్ మిషన్స్‌ను ఆరంభించాలని కేంద్రం నిర్ణయించింది. ఈస్తోనియా, పరాగ్వే, డొమినికన్ రిపబ్లిక్లో భారతీయ మిషన్లను ఆరంభిస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. ఈ మిషన్లతో రాజకీయ, సాంస్కృతిక బం ధాలు బలపడడం, ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు ఊపందుకోవడం జరుగుతుందన్నారు. సబ్‌సాత్ సబ్కా వికాస్ ఆధారంగా ఈ మిషన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. -
రివైండ్ 2020: ఢామ్.. జూమ్
2020... వస్తూవస్తూనే ‘కరోనా’ సునామీతో ప్రపంచానికి ‘మాస్క్‘ పడింది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రజల జీవితాలతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా చెల్లాచెదురైంది. వివిధ దేశాల ఎకానమీలు మైనస్లలోకి జారిపోయి చరిత్రలో ఎన్నడూచూడని పతనాన్ని చవిచూశాయి. భారత్ జీడీపీ ఏకంగా 23.9 శాతం (క్యూ1లో) క్షీణించింది. కరోనా కల్లోలంతో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పాతాళానికి పడిపోయినప్పటికీ.. మళ్లీ అంతేవేగంగా కోలుకొని, ఆకాశమే హద్దుగా దూసుకుపోయాయి. సెన్సెక్స్ మార్చిలో 25,638 పాయింట్ల కనిష్టానికి కుప్పకూలి... కొద్ది నెలల్లోనే కొత్త రికార్డులను బద్దలు కొట్టింది. మరోపక్క, ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో బంగారం భగ్గుమంది. భారత్‌లో తులం ధర రూ.55 వేల పైకి ఎగబాకింది. ముడి చమురు ధర చరిత్రలో తొలిసారిగా మైనస్‌లోకి జారిపోయింది. ఇక కరోనాతో దేశీయంగా పర్యాటకం, విమానయానం తదితర రంగాలు తీవ్రంగా దెబ్బతిని, భారీగా ఉద్యోగాల కోతకు దారితీసింది. అసలే మొండిబాకీలతో నెట్టుకొస్తున్న బ్యాంకింగ్ రంగం పరిస్థితి పెనంమీంచి పొయ్యిలో పడినట్లయింది. పీఎంసీ, లక్ష్మీ విలాస్ బ్యాంకులు కుప్పకూలాయి. లాక్డౌన్ల కారణంగా వాహన రంగంలో ఎన్నడూలేని విధంగా సున్నా అమ్మకాలు నమోదయ్యాయి. మోదీ సర్కారు ‘ఆత్మనిర్భర్’ రూపంలో దాదాపు రూ. 29 లక్షల కోట్లకు పైగా ప్యాకేజీని ప్రకటించి ఎకానమీకి దన్నుగా నిలిచింది. ఆర్బీఐ కూడా వడ్డీరేట్లను అట్టడుగుకు దించేసింది. ఇంత కల్లోలంలోనూ ముకేశ్ అంబానీ నిధుల స్వారీ చేశారు. ఫేస్బుక్, గూగుల్, ఇంటెల్ ఇలా ఒకటేమిటి ప్రపంచాన్ని శాసిస్తున్న అనేక దిగ్గజ కంపెనీలన్నీ రిలయన్స్ జియో, రిటైల్‌లలో కోట్లాది డాలర్లు కుమ్మరించేందుకు క్యూ కట్టడం విశేషం. కరోనా పుణ్యమా అని సామాన్యుల నుంచి కార్పొరేట్ల దాకా అంతా డిజిటల్ బాట పట్టారు. వర్చువల్, ఆన్లైన్ అనేవి జీవితంలో భాగమైపోయాయి. ఇలా ఒక రోలర్ కోస్టర్ రైడ్‌లా సాగిన ఈ ‘కరోనా’నామ సంవత్సరంలో వ్యాపార రంగంలో చోటు చేసుకున్న పరిణామాలపై ‘సాక్షి బిజినెస్’ రివైండ్ ఇది... మార్కెట్ ఉద్దీపనల అండ! ఈ ఏడాది భారత స్టాక్ మార్కెట్ ప్రయాణం కరోనా విసిరిన సవాళ్లను అధిగమించి కొత్త శిఖరాల అధిరోహణ లక్ష్యంగా సాగింది. ఏడాది ప్రారంభంలో ఆర్థిక మందగమనం, కోవిడ్ భయాలతో సెన్సెక్స్, నిఫ్టీలు మార్చి 24న రెండేళ్ల కనిష్టానికి పతనమయ్యాయి. ద్వితీయార్థంలో ఉద్దీపనల అండ, ఆర్థిక వ్యవస్థ రికవరీ, కోవిడ్–19 వ్యాక్సిన్ ఆశలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సహకారం అందడంతో రికార్డుల ర్యాలీ చేస్తున్నాయి. మరోవైపు కోవిడ్–19 వైరస్.... స్ట్రెయిన్ వైరస్‌గా రూపాంతరం చెంది ప్రపంచదేశాలను భయపెడుతుండటం ఈక్విటీ మార్కెట్లకు ఆందోళనను కలిగిస్తోంది. ఈ ఏడాది మొత్తం మీద సెన్సెక్స్ 6492 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 1814 పాయింట్లను ఆర్జించింది. లాక్డౌన్ విధింపు ప్రకటనతో మార్చి 23న సెన్సెక్స్, నిఫ్టీలు తమ జీవితకాలంలోనే అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. ట్రేడింగ్ ప్రారంభంలో ఇరు సూచీలు 10 శాతం పతనమవడంతో సర్క్యూట్ నిబంధల ప్రకారం ట్రేడింగ్‌ను 45 నిమిషాలు నిలిపేశారు. తర్వాత ట్రేడింగ్ ప్రారంభమైనా అమ్మకాలు ఆగకపోవడంతో సెన్సెక్స్ 3,935 పాయింట్లు, నిఫ్టీ 1,135 పాయింట్ల నష్టంతో ముగిశాయి. ఇక ఏప్రిల్ 7న సూచీలు ఒక్కరోజులో రికార్డు లాభాల్ని ఆర్జించాయి. ఈ ఒక్కరోజే సెన్సెక్స్ 2,476 పాయింట్లు, నిఫ్టీ 1,135 పాయింట్లను ఆర్జించాయి. సూచీ ఏడాది కనిష్టస్థాయి ఏడాది గరిష్టస్థాయి సెన్సెక్స్ 25,638 (మార్చి 24న) 47,807(డిసెంబర్ 30) నిఫ్టీ 7511 (మార్చి 24న) 13,997(డిసెంబర్ 30) ఎకానమీ మాంద్యం కోరలు... భారత ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్ గట్టి దెబ్బ కొట్టడంతో దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యం కోరల్లోకి వెళ్లింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఏకంగా మైనస్ 23.9 శాతానికి పడిపోయింది. అయితే లాక్డౌన్ ఆంక్షలు సడలింపుసహా ఎకానమీ కోలుకునేందుకు కేంద్రం, ఆర్బీఐలు తీసుకున్న ఉద్దీపన చర్యలతో రెండో త్రైమాసికానికి వ్యవస్థ కాస్త రికవరీని సాధించింది. క్షీణత మైనస్ 7.5 శాతానికి పరిమితమైంది. కేంద్రం అండ ఆత్మ నిర్భర్ అభియాన్ కరోనా కుదేలైన ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమలకు భరోసానిస్తూ కేంద్రం ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకం ద్వారా అభయమిచ్చింది. కోవిడ్ సంక్షోభం నాటి నుంచి ఈ ఏడాదిలో కేంద్రం, ఆర్బీఐలు సంయుక్తంగా మొత్తం రూ.29.87 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపనలను ప్రకటించాయి. జీడీపీలో 10 శాతం ఉంటుందని అంచనా. ల్యాండ్, లేబర్æ, లిక్విడిటీ, లా వీటిపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు కేంద్రం చెప్పుకొచ్చింది. ముఖ్యంగా సూక్ష్మ, స్థూల, మధ్య తరగతి పరిశ్రమకు ఎలాంటి షరతులు లేకుండా రుణాలు మంజూరు చేయడంలాంటి ఎన్నో బృహత్కర కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి. బ్యాంకింగ్ కుదుపులు యస్ బ్యాంక్, లక్ష్మీవిలాస్ బ్యాంకు, పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్(పీఎంసీ) ఉదంతాలతో ఈ ఏడాది భారత బ్యాంకింగ్ రంగం భారీగా కుదుపులకు లోనైంది. లక్ష్మీవిలాస్ బ్యాంకు ఆర్థిక పరిస్థితి బాగుండకపోవడంతో సింగపూర్‌కు చెందిన డీబీఎస్ బ్యాంకులో విలీనమైంది. హెచ్‌డీఐఎల్‌కు రుణాలను జారీ చేయడంలో అక్రమాలకు తెరతీయడంతో మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్ ఆర్బీఐ చేతుల్లోకి వెళ్లిపోయింది. అలాగే నిరర్థక ఆస్తులు పెరిగిపోయి నష్టాల ఊబిలో కూరుకుపోయిన యస్ బ్యాంక్‌ను రక్షించేందుకు ఆర్బీఐ ఆ బ్యాంక్‌లోని 49 శాతం షేర్లను ‘ఎస్బీఐ’ చేత కొనుగోలు చేయించింది. ఇక బ్యాంకింగ్‌లో మొండి బకాయిల తీవ్రత కొనసాగుతోంది. ఆర్బీఐ పాలసీ భరోసా కరోనాతో కష్టాలపాలైన ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ఈ ఏడాదిలో ఆర్బీఐ ద్రవ్యపాలసీ కమిటీ వడ్డీరేట్లను గణనీయంగా తగ్గించింది. రెపోరేటును 115 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.15 శాతం నుంచి 4 శాతానికి పరిమితం చేసింది. అలాగే రివర్స్ రెపోరేటు 155 పాయింట్లను తగ్గించి 4.9 శాతం నుంచి 3.35 శాతానికి తీసుకొచ్చింది. ప్రతి ద్రవ్యపాలసీ సమీక్షలో సులభతరమైన విధానానికి కట్టుబడి ఉంటామని, ద్రవ్యోల్బణం దిగివస్తే, వడ్డీరేట్లపై మరింత కోత విధించేందుకు వెనకాడబోమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యలు ఆర్థిక వ్యవస్థ రికవరీకి దన్నుగా నిలుస్తున్నాయి. విమానయానం కుదేలు కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా కేంద్రం విధించిన లాక్‌డౌన్‌తో దేశీయ విమానయాన రంగం పూర్తిగా డీలాపడింది. వైరస్ వ్యాప్తి నియంత్రణకు కేంద్రం మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమానాలను నిలిపివేసింది. మార్చి 25 నుంచి దేశీయ విమానాలపై ఆంక్షలను విధించింది. సర్వీసులన్నీ ఒక్కసారి స్తంభించిపోవడంతో విమానయాన కంపెనీలకు పైసా ఆదాయం లేకుండా పోయింది. పైపెచ్చు ఆకస్మిక నిర్ణయంతో విమానయాన సంస్థలు ప్రయాణికులు బుక్ చేసుకున్న ముందస్తు టికెట్ల సొమ్మును తిరిగి చెల్లించాల్సి వచ్చింది. దీంతో దేశీయ విమాన కంపెనీలు దివాలా దిశగా ప్రయాణించాయి. అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా దేశీయ విమాన సర్వీసుల పునరుద్ధరణకు మే 25న అనుమతులు లభించాయి. అలాగే జూలై నుంచి ఆయా దేశాలతో పరస్పర ఒప్పందంతో కొన్ని దేశాలకు విమానాలు నడుస్తున్నాయి. అయితే విమానయాన కంపెనీలకు అధిక ఆదాయాలను ఇచ్చే అంతర్జాతీయ సర్వీసులపైన ఆంక్షల పర్వం కొనసాగుతోంది. కోవిడ్–19 వ్యాక్సిన్ రాకతో అన్ని సర్వీసులు పునరుద్ధరణ జరిగి విమానయాన రంగం తిరిగి గాడిలో పడుతుందని విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆటోమొబైల్ కరోనా బ్రేకులు ఈ 2020 ఏడాదిలో ఆటో మొబైల్ పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. చరిత్రలోనే తొలిసారి ఒక నెల ఆటో అమ్మకాలు సున్నాగా నమోదయ్యాయి. దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో ఉత్పత్తి పూర్తిగా స్తంభించడం, విక్రయాలకు బ్రేక్‌పడటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే ఉద్దీపన ప్యాకేజీలో ఆటో పరిశ్రమకు పెద్దపీట వేయడం, భారత్‌లో ఉత్పాదక సామర్థ్యాలను, ఎగుమతులను పెంచే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకంలో ఎక్కువగా దెబ్బతిన్న ఆటోమొబైల్ పరిశ్రమకు గరిష్టంగా రూ.57,042 కోట్ల ప్రోత్సాహకాలు లభించనుండటంతో చివరి రెండు క్వార్టర్ల నుంచి ఆటోపరిశ్రమ వీ–ఆకారపు రికవరీని సాధిస్తోంది. రికవరీ స్పీడ్‌పై ఈ రంగం ఆధారపడి ఉంది. ఫోన్లు స్మార్ట్...స్మార్ట్ స్మార్ట్ఫోన్ల కంపెనీలకు ఈ 2020 ఏడాది కలిసొచ్చింది. ఏడాది ప్రథమార్ధంలో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు ఆశించినస్థాయిలో నమోదుకాలేదు. అయితే చివరి రెండు క్వార్టర్ల నుంచి విక్రయాలు ఊపందుకున్నాయి. ఈ ఏడాదిలో మొత్తం స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 15 కోట్లను దాటినట్లు గణాంకాలు చెబుతున్నాయి. సరిహద్దు వివాదాలు, కరోనా వైరస్ సృష్టికి కారణమైందనే వాదనల నేపథ్యంలో చైనా ఫోన్లపై బ్యాన్ నినాదంతో దేశంలో మొదటిసారి చైనా ఫోన్ల అమ్మకాలు రెండోస్థానానికి దిగివచ్చాయి. దీంతో దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ కంపెనీ అమ్మకాల్లో ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. రిలయన్స్ అప్పు లేదు కరోనాతో ఎకానమీ కకావికలమైన తరుణంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం ఈ ఏడాదిలో వరుస పెట్టుబడులతో కలకలలాడింది. గూగుల్, ఫేస్బుక్, సిల్వర్‌లేక్ వంటి దిగ్గజ కంపెనీలకు జియో ప్లాట్ఫామ్లో 33 శాతం వాటాను విక్రయించి రూ.1.52 లక్షల కోట్లను చేకూర్చుకుంది. అలాగే రైట్స్ ఇష్యూ చేపట్టి అదనంగా రూ.53 వేల కోట్లను సమీకరించింది. తన మరో అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్‌నూ 10 శాతం వాటాను విక్రయించి రూ.47 వేల కోట్లను సమకూర్చుకుంది. వాటా విక్రయాలు, ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులతో ఆర్ఐఎల్ రుణ రహిత కంపెనీగా అవతరించింది. కంపెనీలోకి వెల్లువలా పెట్టుబడులు రావడంతో కంపెనీ షేరు సైతం ఈ 2020లో 35 శాతం ర్యాలీ చేసింది. ఈ ఏడాదిలో సెప్టెంబర్ 16న రూ.2,369 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. రూపాయి ఒడిదుడుకులు భారత ఈక్విటీల్లోకి విదేశీ పెట్టుబడులు రికార్డు స్థాయిలో వెల్లువెత్తినా ఈ ఏడాది డాలర్ మారకంలో రూపాయి బలపడలేకపోయింది. స్టాక్ మార్కెట్ పతనం వేళలో ఆర్బీఐ స్పాట్ మార్కెట్ నుంచి అధిక మొత్తంలో డాలర్లను కొనుగోలు చేయడంతో రూపాయి విలువ బలహీనపడిందని అంచనా. అలాగే కరోనాతో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించడం కూడా రూపాయిపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఈ ఏడాది డాలర్ మారకంలో రూపాయి విలువ గరిష్ట స్థాయి 70.73 గానూ, కనిష్ట స్థాయి 76.92 గానూ నమోదైంది. వెరసి ఈ ఏడాదిలో రూపాయి విలువ 6 రూపాయల రేంజ్లో కదలాడింది. క్రూడాయిల్ మైనస్‌లోకి ఈ ఏడాది క్రూడాయిల్ ధరలు ఏకంగా మైనస్‌ల్లోకి వెళ్లిన సంఘటన జరిగింది. ఏడాది ఆరంభంలో అంతర్జాతీయ ఆర్థిక మాంద్యంతో క్రూడాయిల్‌కు డిమాండ్ అంతంతగానే ఉంది. మరోవైపు చమురు ధరలపై ఆధిపత్యం కోసం సౌదీ– రష్యా దేశాలు ఒప్పంద పరిమితికి మించి క్రూడాయిల్ ఉత్పత్తి చేయడంతో నిల్వలు భారీగా పెరిగాయి. ఈ తరుణంలో కరోనా ప్రేరేపిత లాక్డౌన్ విధింపు క్రూడాయిల్ ధరలపై విరుచుకుపడింది. ఫలితంగా ఏప్రిల్ 21న నైమెక్స్ లైట్ స్వీట్ క్రూడ్ మే నెల ఫ్యూచర్ కాంట్రాక్ట్ బ్యారెల్ ధర తొలిసారి మైనస్‌లోకి వెళ్లిపోయింది. ఒక దశలో మైనస్ 40.32 డాలర్లకు చేరుకుంది. చివరికి 208 డాలర్లు నష్టపోయి మైనస్ 37.63 డాలర్ల వద్ద ముగిసింది. బంగారం @ రూ. 56,190 కరోనా వైరస్‌తో స్టాక్ మార్కెట్లు కుదేలవడం ఈ ఏడాది పసిడి ర్యాలీకి కలిసొచ్చింది. కోవిడ్–19 సంక్షోభ వేళ ఇన్వెస్టర్లు రక్షణాత్మక సాధనమైన బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపారు. అలాగే ఆర్థికంగా చిన్నాభిన్నమైన వ్యవస్థను సరిదిద్దేందుకు పలు దేశాల కేంద్ర బ్యాంకులు సులభతర వడ్డీరేట్ల విధానానికి తెరతీయడం కూడా బంగారం ర్యాలీకి కలిసొచ్చింది. ప్రపంచమార్కెట్లో ఆగస్ట్ 7న ఔన్స్ పసిడి ధర అత్యధికంగా 2,089 డాలర్ల స్థాయిని అందుకుంది. ఇదే ఆగస్ట్ 8న దేశీయ ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.56,190 చేరుకుంది. మొత్తంగా పసిడి ధరలు ఏడాదిలో 20 శాతం పెరిగాయి. అయితే కోవిడ్ వ్యాక్సిన్ రాక, ఆర్థిక వ్యవస్థ పురోగతి నేపథ్యంలో బంగారం ధరలు ఏడాది ముగింపు సమయానికి కొంత దిగివచ్చాయి. వచ్చే ఏడాదిలో పసిడి నుంచి పెద్ద ర్యాలీ ఆశించకపోవడం మంచిదని బులియన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఠాగూర్ కోరుకున్నది ‘ఆత్మనిర్భర్ భారత్’నే
శాంతినికేతన్: భారత్‌తోపాటు ప్రపంచం సాధికారత సాధిం చాలని గురుదేవుడు రవీం ద్రనాథ్ ఠాగూర్ ఆకాంక్షిం చారనీ, అదే లక్ష్యంగా తమ ప్రభుత్వం‘ఆత్మనిర్భర్ భారత్’ను ప్రకటించిందని ప్రధాని మోదీ తెలిపారు. విశ్వకవి రవీంద్రుడు స్థాపించిన విశ్వభారతి విశ్వవిద్యాలయం వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటైన ఉత్సవాలనుద్దేశించి ప్రధాని గురువారం ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ఈ వర్సిటీ, అనంతరం కాలంలో విశ్వమానవ సౌభ్రాతృత్వం కోసం విశేషంగా కృషి చేసిందని ప్రధాని కొనియాడారు. కాగా, ఈ ఉత్సవాలకు తనను ఆహ్వానించలేదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఈ పరిణామం కేంద్రం, టీఎంసీ ప్రభుత్వం మధ్య మరోసారి వివాదం రేపింది. ఆ పేరులోనే ఉంది గురుదేవుడు కలలుగన్న విశ్వ–భారతి రూపమే ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్. భారత్ అభివృద్ధి, తద్వారా ప్రపంచ పురోగతియే ప్రభుత్వ లక్ష్యం. దీనిద్వారా భారత్ సాధికారత, అభివృద్ధి.. అంతిమంగా ప్రపంచ అభివృద్ధి సాధ్యం’అని అన్నారు. ‘జాతీయవాద భావనతోపాటు సర్వమానవ సౌభ్రాతృత్వం సాధించేందుకు ఠాగూర్ ఈ సంస్థను స్ధాపించారు. భారత్‌ను ప్రపంచానికి గల సంబంధం ‘విశ్వ భారతి’పేరులోనే ఉంది. భారత్‌లో ఉత్తమమైన వాటి నుంచి ప్రపంచం ప్రయోజనం పొందాలి అనేదే రవీంద్రుని కల’ అని తెలిపారు. ఇలా ఉండగా, జమ్మూకశ్మీర్ వాసులకు ఆరోగ్య బీమా వర్తింప జేసే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని శనివారం ప్రధాని ప్రారంభించనున్నారు. -
ఆవిష్కారం.. ఆత్మ నిర్భర్ భారతం
సాక్షి, న్యూఢిల్లీ : నూతన పార్లమెంటు భవనం దేశ ప్రజాస్వామ్య చరిత్రలో కీలక మైలురాయని ప్రధాని నరేంద్రమోదీ అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన పార్లమెంటు భవనం సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు గురువారం ప్రధాని శంకుస్థాపన చేశారు. నూతన భవనం ఆత్మ నిర్భర్ భారత్ దార్శనికతలో అంతర్భాగమని, స్వాతంత్య్ర అనంతర కాలంలో మొదటిసారిగా ఓ ప్రజా పార్లమెంటు నిర్మించేందుకు చరిత్రాత్మక అవకాశం వచ్చిందని అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ(2022) సమయానికి పూర్తయ్యే ఈ భవనం దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుందన్నారు. ప్రతి పార్లమెంటు సభ్యుడు ప్రజలకు, రాజ్యాంగానికి జవాబుదారీగా ఉండాలని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘2014లో పార్లమెంటు సభ్యుడిగా పార్లమెంటు భవనంలో మొదటిసారి అడుగుపెట్టిన క్షణం ఇంకా గుర్తుంది. ఆ సమయంలో ప్రజాస్వామ్యానికి ఆలయం అయిన ఈ భవనానికి శిరసు వంచి ప్రణామం చేశా. పాత పార్లమెంటు భవనం స్వాతంత్య్రం అనంతర కాలంలో దేశానికి ఒక దిశను అందిస్తే కొత్త భవనం ఆత్మ నిర్భర్ భారత్ ఆవిష్కారానికి సాక్షిగా మారనుంది. 21వ శతాబ్దపు ఆకాంక్షలను నెరవేరుస్తుంది.’’ అన్నారు. ప్రజాస్వామ్యమే బలం భారత ప్రజాస్వామ్య మూలాలు 13వ శతాబ్దికి చెందిన మాగ్నాకార్టాలో ఉన్నాయని మోదీ గుర్తు చేశారు. ‘‘భారతదేశంలో ప్రజాస్వామ్యం అంటే జీవన విలువలు, జీవన మార్గం దేశ ప్రజల ఆత్మ. భారత్‌లో ప్రజాస్వామ్యం విఫలమవుతుందని మొదట్లో చాలామంది భావించారు, కానీ అది తప్పని ప్రస్తుత తరం గర్వంగా చెప్పుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో ఒక జీవన క్షమానుగత వ్యవస్థ ఉన్నాయి.’’ అన్నారు. కొత్త బిల్డింగ్ భవిష్యత్ రాజ్యాంగ అవసరాలు తీరుస్తుందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అభిప్రాయపడ్డారు. పలువురు కేంద్రమంత్రులు, విదేశీ రాయబారులు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, ఏఐడీఎంకే, బీజేడీ, టీఆర్ఎస్ తదితర పార్టీల ప్రతినిధులు, రతన్‌టాటా వంటి వ్యాపారవేత్తలు కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా తమ సందేశాలు పంపారు. భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆచార్య శివకుమార్ శర్మ, కేఎస్ లక్ష్మీనారాయణ సోమయాజి తదితరులు పూజలు నిర్వహించారు. శృంగేరి పీఠం నుం చి శంఖం, నవరత్న పీఠాలను శృంగేరి శారద పీఠం జగద్గురు భారతీ తీర్థ ఆశీర్వదించి పంపారు. ఈ కార్యక్రమంలో సర్వమత ప్రార్థనలు చేశారు. కాంగ్రెస్ విమర్శలు: ప్రజాస్వామ్యాన్ని ఛిన్నాభిన్నం చేసిన అనంతరం నిర్మించే కొత్త భవనం దేన్ని ప్రతిబింబిస్తుందని కాంగ్రెస్ విమర్శించింది. హక్కుల కోసం రైతులు పోరాటం చేస్తున్న తరుణంలో ప్రధాని భవనాలకు శంకుస్థాపనలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రతినిధి సూర్జేవాలా దుయ్యబట్టారు. పార్లమెంట్ బిల్డింగంటే ఇసుక, ఇటుకలు కాదని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించేదని చెప్పారు. విశేషాలు.. ► నూతన భవన నిర్మాణ కాంట్రాక్టును టాటా ప్రాజెక్ట్స్ గెలుచుకుంది. ► 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీన్ని నిర్మించనున్నారు. ► ప్రాజెక్టు అంచనా దాదాపు రూ.971 కోట్లు. 2022కి పూర్తి చేయాలని భావిస్తున్నారు. ► నిర్మాణం పూర్తయితే లోక్‌సభ సీటింగ్ సామ ర్థ్యం 888 మంది సభ్యులకు పెరుగుతుంది. ► సంయుక్త సమావేశాలప్పుడు 1224 మందివరకు సామర్ధ్యం పెంచుకునే వీలుంది. ► రాజ్యసభ సీటింగ్ సామర్ధ్యం 384 సీట్లు. ► ప్రాజెక్టులో భాగంగా నిర్మించే శ్రమ్శక్తి భవన్లో ఒక్కో ఎంపీకి 40 చదరపు మీటర్ల ఆఫీసు ఇస్తారు. ఈ భవనం నిర్మాణం 2024లో పూర్తవుతుంది. ► ప్రస్తుత పార్లమెంట్ భవన నిర్మాణం 1921లో ప్రారంభమై 1927 జనవరి 18న ముగిసింది. ► ప్రస్తుత నిర్మాణంపై సుప్రీంకోర్టులో పలు దావాలున్నాయి. అందుకే కోర్టు కేవలం పేపర్ వర్క్ పూర్తి చేసేందుకు మాత్రమే అనుమతినిచ్చింది. తీర్పు వచ్చేవరకు కొత్త కట్టడాలు నిర్మించడం, కూల్చడం, చెట్లు నరకడం చేయవద్దని ఆదేశించింది. -
ఉద్యోగకల్పనకు రూ. 23,000 కోట్లు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కల్లోలం నేపథ్యంలో వ్యాపార సంస్థలను ఉద్యోగ కల్పనకు ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన (ఏబీఆర్‌వై) పథకం పట్టాలెక్కనుంది. ఈ స్కీమ్ కోసం మొత్తం రూ.22,810 కోట్ల నిధుల కేటాయింపునకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ‘ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ 3.0 కింద కోవిడ్ రికవరీ దశలో కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రోత్సాహం అలాగే సంస్థాగత రంగంలో ఉపాధిని పెంపునకు తోడ్పాటు కోసం ఉద్దేశించిన ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన’కు ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది’ అని ప్రభుత్వ అధికారిక ప్రకటన పేర్కొంది. ఈ స్కీమ్‌లో భాగంగా ప్రస్తుత 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1,584 కోట్ల వ్యయ కేటాయింపునకు, అదేవిధంగా మొత్తం స్కీమ్ కాల వ్యవధికి (2020–23) గాను రూ.22,810 కోట్ల వ్యయానికి కేబినెట్ ఓకే చెప్పినట్లు వెల్లడించింది. ఏబీఆర్‌వై స్కీమ్‌లో భాగంగా 2020 అక్టోబర్ 1 తర్వాత, 2021 జూన్ వరకు కొత్తగా ఉద్యోగాలను కల్పించిన సంస్థలకు రెండేళ్ల పాటు సబ్సిడీ ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుందని కేబినెట్ సమావేశం అనంతరం కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ వివరించారు. పథకం సంగతిదీ... 1,000 మంది వరకూ ఉద్యోగులు ఉండే సంస్థలు కొత్తగా చేపట్టే నియామకాలకు సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) చెల్లింపులను ప్రభుత్వమే భరిస్తుంది. అంటే ఆయా కొత్త ఉద్యోగుల మూల వేతనంపై 12% ఉద్యోగుల తరఫు చెల్లింపు, 12% వ్యాపార సంస్థ తరఫు చెల్లింపు, అంటే మొత్తం 24 శాతాన్ని ఈ స్కీమ్ కింద కేంద్రం సబ్సిడీ కింద అందజేస్తుంది. అయితే, 1,000 మంది కంటే అధికంగా ఉద్యోగులు కలిన సంస్థల విషయంలో మాత్రం రెండేళ్ల పాటు కేవలం ఉద్యోగుల తరఫున 12 శాతం ఈపీఎఫ్ చెల్లింపు మొత్తాన్ని మాత్రమే ప్రభుత్వం భరిస్తుంది. ఉదాహరణకు, 2020 అక్టోబర్ 1 తేదీకి ముందు ఈపీఎఫ్ఓలో నమోదైన ఏ సంస్థలో కూడా పనిచేయని, యూనివర్సల్ పర్మనెంట్ నంబర్ (యూఏఎన్) లేని ఒక ఉద్యోగి (నెల వేతనం రూ.15,000 లోపు ఉండాలి) ఈ స్కీమ్‌కు అర్హుడు. కోవిడ్ సమయంలో, 2020 మార్చి 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ఉద్యోగాన్ని కోల్పోయిన ఉద్యోగి (నెల వేతనం రూ.15,000 లోపు ఉండాలి), సెప్టెంబర్ 30, 2020 వరకూ ఈపీఎఫ్ఓ కవరేజీ ఉన్న ఏ సంస్థలోనూ చేరకుండా ఉన్నా కూడా ఈ స్కీమ్ ప్రయోజనానికి అర్హత లభిస్తుంది. ఆధార్‌తో అనుసంధానమైన సభ్యుల ఖాతాలోకి ఎలక్ట్రానిక్ విధానంలో భవిష్య నిధి వాటా మొత్తాన్ని ఈపీఎఫ్ఓ జమ చేస్తుంది. కేబినెట్ ఇతర నిర్ణయాలు.. ► కోచి, లక్షద్వీప్ ద్వీపాల మధ్య సబ్‌మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్(ఓఎఫ్సీ) కనెక్టివిటీని కల్పించే ప్రాజెక్టుకు ఆమోదం. దీనికి రూ.1,072 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ► భారత్, సురినామ్ మధ్య ఆరోగ్యం, వైద్య రంగాల్లో సహకారం కోసం ఉద్దేశించిన అవగాహన ఒప్పందానికి ఓకే. ► భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ, లగ్జెంబర్గ్ క్యాపిటల్ మార్కెట్స్ నియంత్రణ సంస్థ సీఎస్‌ఎస్‌ఎఫ్ మధ్య ఒప్పందం. -
10న పార్లమెంటు కొత్త భవనానికి భూమి పూజ
న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటు భవనానికి ఈ నెల 10న ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ జరగనుంది. రూ.971 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ కొత్త భవనం నిర్మాణం 2022 నాటికి పూర్తి అయ్యే అవకాశాలున్నాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శనివారం తెలిపారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తున్న ప్రజాస్వామ్య దేవాలయం వందేళ్లు పూర్తి చేసుకుందని, ఆత్మనిర్భర్‌లో భాగంగా మనమే కొత్త భవనాన్ని నిర్మించుకోవడం దేశానికి గర్వకారణమని బిర్లా అన్నారు. కోవిడ్ నిబంధనల మ«ధ్య డిసెంబర్ 10 మధ్యాహ్నం ఒంటిగంటకి భూమి పూజ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించామని కొందరు స్వయంగా హాజరైతే, మరికొందరు ఆన్లైన్ ద్వారా తిలకిస్తారని బిర్లా చెప్పారు. 2022లో జరిగే దేశ 75వ స్వాతంత్య్ర దిన వేడుకల నాటికి కొత్త భవనంలోనే పార్లమెంటు సమావేశాలు జరుగుతాయని బిర్లా ఆశాభావం వ్యక్తం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించే ఈ భవనాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేస్తూ పేపర్‌లెస్ కార్యాలయాలను నిర్మించనున్నారు. భవిష్యత్‌లో పార్లమెంటు నియోజకవర్గాలను పెంచే ఉద్దేశం ఉన్న కేంద్రం అందుకు అనుగుణంగా లోక్‌సభ కార్యక్రమాలు నిర్వహించే హాలుని 888 మంది సభ్యులు కూర్చోవడానికి వీలుగా, రాజ్యసభ సమావేశ మందిరాన్ని 384 సీట్ల సామర్థ్యంతో నిర్మించనున్నారు. లోక్‌సభలో 1,224 మంది (ఉభయ సభలు సమావేశమైనప్పుడు) కూర్చునేందుకు వీలుగా సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశముంటుంది. ఈ భవన నిర్మాణంలో 2 వేల మంది ప్రత్యక్షంగా 9 వేల మంది పరోక్షంగా పాల్గొననున్నారు. 64.500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించే ఈ భవనం బయట నుంచి చూడడానికి ప్రస్తుతమున్న పార్లమెంటు మాదిరిగానే ఉంటుందని బిర్లా వివరించారు. -
ఎకానమీకి మరింత జోష్..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సంక్షోభంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంపై కేంద్రం మరింతగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఆత్మనిర్భర్ భారత్ 3.0 కింద మరిన్ని చర్యలు ప్రకటించారు. నిర్దిష్ట గృహ విక్రయ లావాదేవీలపై పన్నుపరమైన ప్రయోజనాలు, మరికొన్ని రంగాలకు అత్యవసర రుణ హామీ పథకం వర్తింపు, కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రోత్సాహకాలు, ఎరువుల సబ్సిడీకి అదనంగా కేటాయింపులు మొదలైనవి వీటిలో ఉన్నాయి. లాక్డౌన్ అమలు చేసినప్పట్నుంచీ ఇప్పటిదాకా ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల మొత్తం పరిమాణం దాదాపు రూ. 30 లక్షల కోట్లుగా ఉంటుందని (స్థూల దేశీయోత్పత్తిలో 15 శాతం) నిర్మలా సీతారామన్ తెలిపారు. పటిష్టంగా రికవరీ... దీర్ఘకాలం లాక్డౌన్ అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన రికవరీ నమోదు చేస్తోందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఉత్పత్తి గణాంకాల మెరుగుదలతో పాటు, అక్టోబర్‌లో ఇంధన వినియోగ వృద్ధి 12 శాతం పెరిగిందని.. వస్తు, సేవల పన్నుల వసూళ్లు 10 శాతం వృద్ధి చెంది రూ. 1.05 లక్షల కోట్లకు చేరాయని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన.. కొత్తగా ఉద్యోగులను తీసుకునే సంస్థలకు ప్రావిడెంట్ ఫండ్పరమైన సబ్సిడీని ఇవ్వడం ద్వారా ఉద్యోగాల కల్పనకు ఊతమిచ్చేందుకు కేంద్రం ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన ఆవిష్కరించింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో నమోదై, కొత్తగా ఉద్యోగులను తీసుకునే సంస్థలకు ఇది వర్తిస్తుంది. దీని ప్రకారం రెండేళ్ల పాటు పీఎఫ్ చందాలో ఉద్యోగి వాటా (జీతంలో 12 శాతం), సంస్థ వాటా (జీతంలో 12 శాతం) కలిపి మొత్తం 24 శాతాన్ని ప్రభుత్వం భరిస్తుంది. ఈపీఎఫ్‌వోలో నమోదైన సంస్థలో, రూ. 15,000 లోపు నెలవారీ జీతంపై చేరే కొత్త ఉద్యోగులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. అలాగే రూ. 15,000 కన్నా తక్కువ వేతనమున్న ఈపీఎఫ్ సభ్యులు, కరోనా వైరస్ పరిణామాలతో మార్చి 1వ తేదీ తర్వాత ఉద్యోగం కోల్పోయి, అక్టోబర్ 1న లేదా ఆ తర్వాత తిరిగి ఉద్యోగంలోకి చేరినా.. వారికి కూడా ఈ పథ కం వర్తిస్తుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 2021 జూన్ 30 దాకా ఈ స్కీమ్ అమల్లో ఉంటుంది. ఈ స్కీమును ఉపయోగించుకోదల్చుకున్న పక్షంలో.. 50 మంది దాకా ఉద్యోగులు ఉన్న సంస ్థలు కొత్తగా కనీసం ఇద్దరు ఉద్యోగులకు, 50 మంది కి పైగా సిబ్బంది ఉన్న సంస్థలు కనీసం అయిదు మందికి ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుంది. ఈసీఎల్జీఎస్ మార్చి దాకా పొడిగింపు... వచ్చే ఏడాది మార్చి 31 దాకా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్‌ను కేంద్రం పొడిగించింది. చిన్న, లఘు సంస్థలకు ఈ పథకం కింద తనఖా లేని రుణాలు లభిస్తాయి. కామత్ కమిటీ గుర్తించిన 26 రంగాలతో పాటు హెల్త్‌కేర్ రంగానికి కూడా ఈ స్కీమ్ వర్తింపచేయనున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ కంపెనీలకు రుణాలపై ఏడాది మారటోరియంతో పాటు చెల్లింపునకు నాలుగేళ్ల వ్యవధి లభిస్తుందని వివరించారు. రియల్టీకి తోడ్పాటు... గృహ కొనుగోలుదారులు, డెవలపర్లకు ఆదాయ పన్నుపరమైన ఊరటనిచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రూ. 2 కోట్ల దాకా విలువ చేసే కొత్త గృహాలను స్టాంప్ డ్యూటీ సర్కిల్ రేటు కన్నా 20 శాతం తక్కువకు విక్రయించేందుకు అనుమతించేలా ఆదాయ పన్ను చట్టాన్ని సవరించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యత్యాసం 10 శాతం దాకా మాత్రమే ఉంది. అమ్ముడుపోకుండా పేరుకుపోయిన గృహాల విక్రయానికి ఊతమివ్వడంతో పాటు కొనుగోలుదారులు, డెవలపర్లకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని నిర్మలా సీతారామన్ వివరించారు. ప్రస్తుతం ఐటీ చట్టంలోని సెక్ష¯Œ 43సీఏ ప్రకారం.. సర్కిల్ రేటు కన్నా ఒప్పంద విలువ 10 శాతానికి మించి తగ్గిన పక్షంలో పన్నుపరమైన జరిమానాలు ఉంటున్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. దీనివల్ల నిల్వలు పేరుకుపోతున్నా.. బిల్డర్లు రేట్లు తగ్గించే పరిస్థితి లేదని వివరించాయి. ఈ నిబంధన సడలించడమనేది.. రేట్లు తగ్గించేందుకు, విక్రయాలు పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నాయి. రూ. 65వేల కోట్ల ఎరువుల సబ్సిడీ .. ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా ఎరువుల సబ్సిడీ కోసం రూ. 65,000 కోట్లు కేటాయిస్తున్నట్లు సీతారామన్ వెల్లడించారు. పంట సీజ¯Œ లో రైతులకు సరైన సమయంలో, తగినంత స్థాయిలో ఎరువులు అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇది రైతాంగానికి గణనీయంగా తోడ్పడగలదని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ పేర్కొన్నారు. ఎరువుల వినియోగం 2016–17లో 499 లక్షల టన్నులుగా ఉండగా 2020–21లో 673 లక్షల టన్నులకు పెరుగుతుందని అంచనా. మరిన్ని చర్యలు.. ► పట్టణ ప్రాంతాల్లో అందుబాటు ధరల్లో ఇళ్ల పథకానికి అదనంగా రూ. 18,000 కోట్లు. ► కాంట్రాక్టర్లకు నిధుల లభ్యత మరికాస్త మెరుగ్గా ఉండే విధంగా ప్రాజెక్టులకు కట్టాల్సిన ముందస్తు డిపాజిట్ పరిమాణం తగ్గింపు. 2021 డిసెంబర్ 31 దాకా వర్తింపు. ► కోవిడ్–19 టీకాపై పరిశోధనలకు బయోటెక్నాలజీ విభాగానికి రూ. 900 కోట్ల గ్రాంటు. ► గ్రామీణ ఉపాధికి రూ.10,000 కోట్లు. ► మరింతగా రుణ వితరణకు తోడ్పడేలా ఎగ్జిమ్ బ్యాంక్‌కు రూ. 3,000 కోట్లు. ► డిఫెన్స్, ఇన్ఫ్రా కోసం బడ్జెట్ కేటాయింపులకు మించి రూ. 10,200 కోట్లు. -
‘తయారీ’ బూస్ట్ 2 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: తయారీ రంగంలో భారత్ స్వావలంబన సాధించాలన్న ప్రధాని మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం మరో పథకానికి తెరతీసింది. దేశంలో టెలికం, ఆటోమొబైల్, ఫార్మాసూటికల్స్ వంటి మరో 10 కీలక తయారీ పరిశ్రమలకు మరింత చేయూతనిచ్చేందుకు ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని అమలు చేయనుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ స్కీమ్ అమలుకు ఆమోదముద్ర వేశారు. దీని ప్రకారం ఐదేళ్ల వ్యవధిలో మొత్తం రూ. 2 లక్షల కోట్ల మేర రాయితీలు ఆయా రంగాలకు చెందిన పరిశ్రమలకు లభించనున్నాయి. కాగా, సామాజిక మౌలికసదుపాయాల కల్పన రంగాలకు కూడా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) స్కీమ్‌ను విస్తరించేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. ప్రస్తుతం ఆర్థిక మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులకు మాత్రమే ఈ స్కీమ్ అమలవుతోంది. దేశీ తయారీకి దన్ను... ఆర్థిక వ్యవస్థ వృద్ధిని పుంజుకునేలా చేయడం, అలాగే దిగుమతులను తగ్గించి తద్వారా ఉపాధి అవకాశాలను సృష్టించాలనేది ప్రభుత్వ సంకల్పం. ఈ దిశగా దేశీ తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి ఈ స్కీమ్ తోడ్పాటును అందించనుంది. ఈ కొత్త పథకం కింద రూ.1,45,980 కోట్ల ఆర్థిక ప్రయోజనాన్ని ప్రభుత్వం కేటాయించనుంది. కాగా, ఇప్పటికే రూ.51,311 కోట్ల వ్యయానికి కేంద్రం ఆమోదం తెలిపిందని అధికారిక ప్రకటన వెల్లడించింది. ‘భారతీయ తయారీ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా మరింత పోటీపడేలా చేయడమే లక్ష్యంగా ఈ ఐదేళ్ల పీఎల్ఐ స్కీమ్‌ను రూపొందించాం. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది’ అని సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. సంబంధిత మంత్రిత్వ శాఖలు/విభాగాలు ఈ స్కీమ్‌ను అమలు చేస్తాయి. విడివిడిగా ఆయా రంగాలకు సంబంధించిన తుది ప్రతిపాదనలను వ్యయ ఆర్థిక కమిటీ (ఈఎఫ్‌సీ) మదింపు చేసిన తర్వాత, కేబినెట్ ఆమోదిస్తుంది. షిప్పింగ్ శాఖ పేరు మార్పు... కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ పేరును పోర్టులు, షిప్పింగ్, వాటర్‌వేస్ మంత్రిత్వ శాఖగా కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఈ ప్రతిపాదనను ప్రధాన మంత్రి మోదీ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఈ దిశగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ‘స్వావలంబన భారత్’ సాకారం: నిర్మలా సీతారామన్ పీఎల్ఐ స్కీమ్‌కు ఆమోదం గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, తయారీ రంగానికి ఇది అద్భుతమైన ప్రోత్సాహకాలను అందిస్తుందని చెప్పారు. తద్వారా ‘ఆత్మనిర్భర్ భారత్’ (స్వావలంబన భారత్) లక్ష్యం సాకారం దిశగా దేశాన్ని నడిపించడంలో తోడ్పడుతుందని పేర్కొన్నారు. ‘రెండు స్కీమ్‌లకు సంబంధించి కేబినెట్ చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థకు ఇది కచ్చితంగా సరైన దన్నును అందిస్తుంది. ఎందుకంటే మేము స్వావలంబన కోసం ప్రయత్నిస్తున్నాం. ప్రపంచ విలువ ఆధారిత సరఫరా వ్యవస్థలో భారత్‌ను భాగంగా చేసేందుకు ఇవి దోహదం చేస్తాయి’ అని సీతారామన్ వివరించారు. దీనిద్వారా ఉద్యోగాలను సృష్టించడంతో పాటు ప్రపంచ సరఫరా వ్యవస్థకు భారత్‌ను అనుసంధానం చేస్తుందని చెప్పారు. భారత్‌ను ప్రపంచ తయారీ గమ్యస్థానంగా మార్చేందుకు ఈ ప్రోత్సాహకాలు తోడ్పడతాయని పేర్కొన్నారు. సమయానుకూల నిర్ణయం: కార్పొరేట్ ఇండియా పీఎల్ఐ స్కీమ్‌ను మరో 10 కీలక రంగాలకు వర్తింపజేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలపడం పట్ల భారత పారిశ్రామిక దిగ్గజాలు, నిపుణులు ప్రశంసలు కురిపింటటచారు. ఎవరేమన్నారంటే... కొత్త పీఎల్ఐ పాలసీ సమయానుకూలమైనది అలాగే తయారీ రంగంలో సమూల మార్పులను తీసుకొస్తుంది. తద్వారా ప్రపంచ తయారీ రంగ కేంద్రంగా భారత్ ఎదిగేందుకు దోహదం చేస్తుంది. – ఉదయ్ కోటక్, సీఐఐ ప్రెసిడెంట్ తయారీ రంగంలో భారత్ స్వావలంబన సాధించేందుకు ఉద్దేశించిన ఈ ఫ్లాగ్షిప్ పథకానికి సుమారు రూ.2 లక్షల కోట్లను వెచ్చించనున్నారు. ఆర్థిక కార్యకలాపాలపై ఇది భారీ ప్రభావాన్నే చూపుతుంది. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, తదితర విభిన్న రంగాల వ్యాప్తంగా గణనీయంగా ఉద్యోగ కల్పనకు దోహదం చేస్తుంది. – దీపక్ సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్ పీఎల్ఐ స్కీమ్ పరిధిలోకి మరిన్ని రంగాలను తీసుకురావడం వల్ల తయారీ రంగానికి భారీ బూస్ట్ లభించనుంది. ఈ చర్యలు వ్యూహాత్మకం అలాగే సాంకేతికతతో ముడిపడినవి, దీనివల్ల దేశంలో ఉద్యోగాల కల్పన కూడా జోరందుకుంటుంది. దేశీ మార్కెట్ కోణంలోనే కాకుండా ఆయా రంగాలకు చెందిన ఉత్పత్తులకు భారత్‌ను ఎగుమతి కేంద్రంగా మార్చేందుకు భారీ అవకాశాన్ని భారత ఆర్థిక వ్యవస్థ అందిస్తుంది. – సంగీతా రెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్ -
చిన్న పరిశ్రమలకు మరో నెల ‘రుణ’ హామీ
న్యూఢిల్లీ: లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) సంబంధించి అత్యవసర రుణ హామీ పథకాన్ని (ఎమర్జె్జన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్–ఈసీఎల్జీఎస్) కేంద్రం సోమవారం మరో నెలపాటు పొడిగించింది. ఈ పథకం నవంబర్ 30వ తేదీ వరకూ అమలవుతుంది. నిజానికి అక్టోబర్‌తో ఈ పథకం గడువు ముగిసింది. దేశం మొత్తం కరోనా కోరల్లో చిక్కుకున్న పరిస్థితుల్లో– మేనెల్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూ. 20లక్షల కోట్ల విలువైన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజ్ (స్వావలంభన భారత్) ప్రకటించారు. ఇందులో భాగంగా చిన్న ఎంఎస్ఎంఈలకు ఆర్థిక వెసులుబాటు కల్పించడం లక్ష్యంగా రూ.3 లక్షల కోట్ల ఈసీఎల్‌జీఎస్‌ను ఆవిష్కరించారు. అక్టోబర్ చివరి వరకూ లేదా రూ.3 లక్షల కోట్ల రుణ మంజూరు అయ్యే వరకూ పథకం అమల్లో ఉండాలన్నది పథకం లక్ష్యం. అయితే నిర్దేశించుకున్న మేరకు రూ.3 లక్షల కోట్ల రుణ మంజూరీలు జరక్కపోవడంతో లాంఛనంగా మరో నెలపాటు పథకం గడువును ఆర్థిక మంత్రిత్వశాఖ పొడిగించింది. వచ్చేది పండుగ సీజన్ కాబట్టి, వ్యవస్థలో డిమాండ్ పుంజుకుంటుందని, అలాంటి పరిస్థితుల్లో ఈ పథకం చిన్న పారిశ్రమలకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్థికశాఖ తెలిపింది. -
ఏపీ ఆత్మనిర్భర్ లక్ష్యం రూ.20,860 కోట్లు
సాక్షి, అమరావతి : దిగుమతులపై కాకుండా స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఆత్మ నిర్భర్ భారత్’ పథకాన్ని గరిష్ట స్థాయిలో వినియోగించుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. తొలి దశలో కనీసం రూ.20,000 కోట్ల పై చిలుకు కేంద్ర నిధులతో భారీ ప్రాజెక్టులను చేపట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. కోవిడ్-19 తర్వాత భారతదేశం దిగుమతులపై ఆధారపడకుండా సొంత అవసరాలతో పాటు ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ.. ఆత్మనిర్భర్ కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ఆరు రంగాల్లో సుమారు రూ.20,860 కోట్ల కేంద్ర నిధులతో ప్రాజెక్టులను చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ.6,000 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కావడంతో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన (పీఎంకేఎస్‌వై) కింద రూ.6,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మెగా ఫుడ్ పార్కులు, శీతల గిడ్డంగులు, ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లు వంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టనుంది. ఈఎంసీ-2 కోసం 3,760 కోట్లు మొబైల్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు 90 శాతం చైనా నుంచే దిగుమతి అవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం దేశీయ తయారీపై దృష్టి సారించింది. ఇందుకోసం వచ్చే మూడేళ్ల కోసం ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్-2 (ఈఎంసీ-2) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.3,760 కోట్ల వరకు కేంద్ర నిధులను వినియోగించుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే వైఎస్సార్ కడప జిల్లా కొప్పర్తిలో వైఎస్సార్ ఈఎంసీని ఏర్పాటు చేస్తోంది. దీనికి అదనంగా చిత్తూరు జిల్లా పాదిరేడు అరణ్యం వద్ద మరో ఈఎంసీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనికి అదనంగా ఐటీ రంగంలో పార్కుల అభివృద్ధికి కేంద్రం నుంచి రూ.100 కోట్ల నిధులు రాబట్టడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రూ.1,000 కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్ దేశీయ ఫార్మా అవసరాలకు తగ్గట్టుగా కనీసం మూడు బల్క్ డ్రగ్ పార్కులను ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ఇందుకు ఒక్కో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు రూ.1,000 కోట్లు కేటాయించింది. దీన్ని సాధించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంజాబ్, ఒరిస్సా వంటి రాష్ట్రాలతో గట్టిగా పోటీపడుతోంది. రూ.5,000 కోట్లతో మౌలిక వసతులు సరుకు రవాణాపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం ప్రత్యేక రైల్వే కారిడార్లు, పోర్టులను జాతీయ రహదారులతో అనుసంధానం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న నాలుగు పోర్టులను కలిపే విధంగా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఏపీ మారిటైమ్ బోర్డు పంపిన ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. దీనికి కింద కనీసం రూ.5,000 కోట్లకు తక్కువ కాకుండా రాష్ట్రంలో ప్రాజెక్టులు చేపట్టే అవకాశముందని అంచనా. రూ.5,000 కోట్లతో పారిశ్రామిక ఇన్ఫ్రా దేశంలో పారిశ్రామిక రంగ మౌలిక వసతులను పెంచడానికి కేంద్రం ప్రత్యేకంగా పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (నిక్‌డిట్)ను ఏర్పాటు చేసి నిధులను విడుదల చేస్తోంది. రాష్ట్రం మీదుగా వెళుతున్న మూడు పారిశ్రామిక కారిడారల్లో తొలి దశ కింద వివిధ క్లస్టర్లను రూ.5,000 కోట్లతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. -
మరో విడత ఉద్దీపన ప్యాకేజీ!
న్యూఢిల్లీ: డిమాండ్‌ను పెంచేందుకుగాను ఆర్థిక ఉద్దీపనలతో కూడిన మరో ప్యాకేజీని ప్రభుత్వం సరైన సమయంలో ప్రకటిస్తుందని ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ తెలిపారు. పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 15వ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి సన్యాల్ ప్రసంగించారు. తదుపరి ఉద్దీపనలను ప్రకటించేందుకు వీలుగా అటు ద్రవ్యపరంగా, ఇటు పరపతి పరంగానూ వెసులుబాటు ఉన్నట్టు చెప్పారు. కరోనా కారణంగా మార్చిలో లాక్డౌన్ ప్రకటించిన అనంతరం.. రూ.1.70 లక్షల కోట్ల విలువ చేసే పలు ఉద్దీపనలతో కేంద్రం ప్యాకేజీని ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత భారత్‌ను తయారీ కేంద్రంగా మలిచే లక్ష్యంతో ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీని సైతం ప్రకటించింది. ‘‘సరైన సమయంలో తదుపరి ఉద్దీపనల అవసరాన్ని మేము (ప్రభుత్వం) గుర్తించాము’’ అని సన్యాల్ వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ క్షీణతపై వస్తున్న ఆందోళనలకు స్పందించారు. ఇతర దేశాల మాదిరి ముందుగానే భారీ డిమాండ్ కల్పనకు బదులు.. ఒత్తిడిలోని వర్గాలు, వ్యాపార వర్గాల వారికి రక్షణ కవచం ఏర్పాటుపై భారత్ దృష్టి పెట్టిందన్నారు. మరో ప్యాకేజీకి వెసులుబాటు: కామత్ సంజీవ్ సన్యాల్ మాదిరి అభిప్రాయాలనే ప్రముఖ ఆర్థికవేత్త, న్యూ డెవలప్మెంట్ బ్యాంకు మాజీ ప్రెసిడెంట్ కేవీ కామత్ సైతం వ్యక్తం చేశారు. మరో ప్యాకేజీకి వీలుగా ద్రవ్య, పరపతి పరమైన వెసులుబాటు ఉందని అభిప్రాయపడ్డారు. భారత్ వచ్చే 25 ఏళ్ల పాటు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. -
అన్నదాతలే వెన్నెముక
న్యూఢిల్లీ: 2014లో తమ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టంతో పండ్లు, కూరగాయల సాగుదారులు లాభపడగా, ఇప్పుడు ధాన్యం రైతులకు తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు తగినంత స్వేచ్ఛ లభించిందని ప్రధాన మోదీ అన్నారు. ఈ క్లిష్ట సమయంలో కూడా రైతుల వల్లే వ్యవసాయ రంగం బలోపేతమైందని, స్వయం సమృద్ధ భారత్‌కు అన్నదాతలు కీలకంగా ఉన్నారని కొనియాడారు. ఆదివారం మాసాంతపు ‘మన్‌కీ బాత్’లో ప్రధాని మోదీ దేశ ప్రజల నుద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ సంస్కరణ బిల్లులపై ఒక వర్గం రైతులు ఆందోళనలు కొనసాగిస్తుండగా ప్రధాని వారిపై ప్రశంసలు కురిపించడం గమనార్హం. అదే సమయంలో ఆయన గత కాంగ్రెస్ ప్రభుత్వాల విధానాలపై మండిపడ్డారు. మహాత్మాగాంధీ ఆర్థిక సిద్ధాంతాలను కాంగ్రెస్ పాటించి ఉంటే ఇప్పుడు ‘ఆత్మనిర్భర్ భారత్’ యోజన అవసరం ఉండేదే కాదన్నారు. దేశం ఎప్పుడో స్వయం సమృద్ధం సాధించి ఉండేదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రైతు సంఘా లతో ముచ్చటించారు. 2014లో చేసిన వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ)చట్టంతో లాభం పొందిన హరియాణా, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల రైతుల అనుభవాలను వివరించారు. ఉత్పత్తులను విక్రయించే సమయంలో వీరికి దళారుల బెడద తప్పిందని, మెరుగైన ధర లభించిం దని పేర్కొన్నారు. ఇప్పుడు వరి, గోధుమ, చెరకు రైతులకు కూడా ఇదే స్వేచ్ఛ లభించనుందని, వారు మంచి ధర పొందనున్నారని అన్నారు. కథలు చెప్పడం మన సంస్కృతిలో భాగమంటూ ఆయన.. సైన్స్‌కు సంబంధిం చిన కథలు ప్రస్తుతం ప్రాచుర్యం పొందుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని ‘బెంగళూరు స్టోరీ టెల్లింగ్ సొసైటీ’ సభ్యులతో ముచ్చటించారు. వారితో తెనాలి రామకృష్ణుడి కథ ఒకటి చెప్పించారు. ప్రజలంతా కూడా పిల్లలకు కథలు చెప్పేందుకు కొంత సమయం కేటాయించాలని కోరారు. మాలి దేశానికి చెందిన సేదు దెంబేలే గురించి ప్రధాని తెలిపారు. ఆయనకు భారత్‌పై ఉన్న అభిమానాన్ని వివరించారు. ప్రధాని ఇంకా ఏమన్నారంటే.. ► కథలు ప్రజల సృజనాత్మకతను ప్రకటిస్తాయి. నేను నా జీవితంలో చాలా కాలం దేశమంతటా సంచరించాను. ప్రతి రోజు ఒక కొత్త ఊరు, కొత్త ప్రజలు. నా పర్యటనల్లో నేను పిల్లలతో మాట్లాడేవాడిని. వారిని కథలు చెప్పమని అడిగేవాడిని. కానీ వారు జోక్స్ చెబుతామని, మాకు జోక్స్ చెప్పండని అడగేవారు. నేను ఆశర్యపోయేవాడిని. వారికి కథలతో పరిచయం ఉండటం లేదు. గతంలో ఇంట్లో పెద్దలు పిల్లలకు కథలు చెప్పేవారు. ఆ కథల్లో శాస్త్రం, సంప్రదాయం, సంస్కృతి, చరిత్ర ఉండేవి. కథల చరిత్ర మానవ నాగరికత అంత పురాతనమైంది. కథలు చెప్పే సంప్రదాయం అంతరించిపోకుండా ఇప్పటికీ కొందరు కృషి చేస్తున్నారు. ఐఐఎం(ఏ)లో ఎంబీఏ చేసిన అమర్వ్యాస్ వంటి కొందరు వెబ్‌సైట్స్‌ను ఏర్పాటు చేసి ఆధునిక సాంకేతికత సాయంతో ఆసక్తి ఉన్నవారికి పలు కథారీతులను పరిచయం చేస్తున్నారు. బెంగుళూరులో శ్రీధర్ అనే వ్యక్తి గాంధీజీ కథలను ప్రచారం చేస్తున్నారు. ► ఇంట్లో అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య వం టి పెద్దలుంటే వారి వద్ద కథలను విని, రికార్డ్ చేసుకోండి. భవిష్యత్తులో ఉపయోగ పడ్తాయి. ► ఆధునిక వ్యవసాయ పద్దతులను ఉపయోగించడం వల్ల వ్యయం తగ్గుతుంది. దిగుబడి, నాణ్యత పెరుగుతుంది. రైతులు మార్కెట్ అవసరాలకనుగుణంగా పంటలు వేయాలి. ► సెప్టెంబర్ 28 షహీద్ భగత్ సింగ్ జయంతి. బ్రిటిష్ వారిని గడగడలాడించిన సాహస దేశభక్తుడు భగత్ సింగ్. లాలా లాజ్‌పత్ రాయ్ పట్ల ఆయనకున్న అంకితభావం, చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు వంటి విప్లవకారులతో అనుబంధం చాలా గొప్పది. ఆయనకు నా వినమ్ర నివాళులు. భగత్‌సింగ్‌లా కావడం ఎలా? హైదరాబాద్ వ్యక్తికి మోదీ సమాధానం నమో యాప్‌లో ఒక ప్రశ్న చూశాను. ఈ తరం యువత భగత్‌సింగ్‌లా కావడం ఎలా? అని హైదరాబాద్‌కు చెందిన అజయ్ ఎస్జీ అడిగారు. మనం భగత్‌సింగ్ కాగలమో, లేదో తెలియదు కానీ, ఆయనకు దేశంపైన ఉన్న ప్రేమను, దేశ సేవ కోసం ఆయన పడే తపనను మనం పెంపొందించుకోవచ్చు. అదే మనం ఆయనకు ఇచ్చే ఘన నివాళి. దాదాపు నాలుగేళ్ల క్రితం ఇదే సమయంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో మన సైనికుల శక్తి సామర్థ్యాలను చూశాం. అప్పుడు ఆ వీర సైనికుల మనస్సులో ఒకటే ఉంది.. దేశ రక్షణ ఒకటే వారి లక్ష్యం. తమ ప్రాణాలకు వారు ఎలాంటి విలువనివ్వలేదు. పని ముగించుకుని, వారు విజయవంతంగా తిరిగిరావడం మనం చూశాం. దేశ మాత గౌరవాన్ని వారు మరింత పెంచారు. -
ఆత్మనిర్భర్ భారత్‌కు ఐఎంఎఫ్ కితాబు
వాషింగ్టన్: ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ (స్వావలంబన భారత్) కార్యక్రమాన్ని చాలా ముఖ్యమైనదిగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పేర్కొంది. ‘‘స్వావలంబన భారత్ (తన అవసరాలకు తనపైనే ఆధారపడడం) కార్యక్రమం కింద ఇచ్చిన ఆర్థిక ప్యాకేజీ భారత ఆర్థిక వ్యవస్థకు సాయపడింది. మరింత అగాథంలోకి పడిపోకుండా కాపాడింది. కనుక ఈ కార్య్రమాన్ని చాలా ముఖ్యమైనదిగా చూస్తున్నాము. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భారత్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. అందుకు ఆర్థిక వ్యవస్థ సామర్థ్య, పోటీతత్వాన్ని ఇనుమడింపజేసే విధానాలను అనుసరించడం కీలకమవుతుంది. ప్రపంచం కోసం తయారీ అన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు గాను.. అంతర్జాతీయ విలువ ఆధారిత సరఫరా వ్యవస్థలో భారత్ మరింతంగా చొచ్చుకునిపోయే విధానాలపై దృష్టి పెట్టాలి’’ అంటూ ఐఎంఎఫ్ డైరెక్టర్ గెర్రీరైస్ వాషింగ్టన్లో జరిగిన మీడియా సమావేశంలో భాగంగా చెప్పారు. ఆరోగ్యసంరక్షణ రంగంలో స్థిరమైన వృద్ధి లక్ష్యాలను సాధించేందుకు భారత్ జీడీపీలో ప్రస్తుతం ఈ రంగానికి కేటాయిస్తున్న 3.7 శాతాన్ని క్రమంగా పెంచాల్సి ఉందన్నారు. మధ్య కాలానికి మరింత సమ్మిళిత, స్థిరమైన వృద్ధిని సాధించేందుకు సమగ్రమైన, నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. -
1,500 ఎకరాల్లో భారీ ఫర్నిచర్ పార్కు
సాక్షి, అమరావతి: దేశీయ అవసరాలకు తోడు ఎగుమతులే లక్ష్యంగా రాష్ట్రంలో భారీ ఫర్నిచర్ పార్కు ఏర్పాటు కానుంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో, శ్రీ సిటీకి సమీపంలో 1,500 ఎకరాల్లో ఫర్నిచర్ పార్కును నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా సుమారు 20 రకాల వస్తువులకు సంబంధించి దిగుమతులను తగ్గించుకుని ఎగుమతి చేసే విధంగా స్వయం సమృద్ధి సాధించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో భాగంగా ఏపీలో ఫర్నిచర్ పార్కు ఏర్పాటు కానుంది. అంతర్జాతీయంగా ఏటా రూ. 20 లక్షల కోట్ల విలువైన ఫర్నిచర్ విక్రయాలు జరుగుతుండగా ఇందులో కనీసం రూ.3–4 లక్షల కోట్ల విలువైన మార్కెట్‌ను భారత్ దక్కించుకుంటే 25 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర వాణిజ్య శాఖ అంచనా వేసింది. ఇందులో భాగంగా డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపైఐఐటీ) దేశవ్యాప్తంగా ఫర్నిచర్ తయారీకి సంబంధించి పార్కుల ఏర్పాటుకు మార్గదర్శకాలను జారీ చేయడంతోపాటు అనువైన ప్రాంతాలను పరిశీలిస్తోంది. ఫర్నిచర్ తయారీకి అవసరమైన దుంగలు, ఇతర కలపపై దిగుమతి సుంకం ఎత్తివేయడంతో పాటు మరిన్ని అనుబంధ యూనిట్లకు రాయితీలు ఇచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. పోర్టులకు దగ్గర్లో ఫర్నిచర్ తయారీ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చెన్నై, కృష్ణపట్నం రేవులకు చేరువలో ఉన్నందున నెల్లూరు జిల్లాలో భారీ యూనిట్ ప్రతిపాదనకు డీపీఐఐటీ నుంచి సూత్రప్రాయంగా ఆమోదం లభించిందని పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. డీపీఐఐటీ అధికారులు ఇప్పటికే స్థలాన్ని కూడా పరిశీలించారు. (‘మేక్ ఇన్ ఇండియా’.. అదే మన బ్రాండ్) ప్రధాన భాగస్వామిగా గోద్రేజ్! రాష్ట్రంలో ఏర్పాటయ్యే ఫర్నిచర్ పార్కులో ప్రధాన భాగస్వామిగా ఉండేందుకు ప్రముఖ దేశీయ ఫర్నిచర్ తయారీ సంస్థ గోద్రేజ్ ఆసక్తి వ్యక్తం చేసింది. మరో రెండు సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని, ప్రస్తుతం ఇవి చర్చల దశలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆత్మనిర్భర్ భారత్‌లో గుర్తించిన 20 రంగాలు ఇవే.. ఏసీలు, చర్మ పాదరక్షల తయారీ, ఆటో విడిభాగాలు, ఫర్నిచర్, సముద్ర ఉత్పత్తులు, స్టీల్, అల్యూమినియం, ఆగ్రో క్లస్టర్, ఆహార పదార్థాలు, వ్యవసాయ కెమికల్స్, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, వైద్య చికిత్స ఉత్పత్తులు, టెలివిజన్, కెమెరాలు, బొమ్మలు, ఇథనాల్, ఎలక్ట్రానిక్ వెహికిల్ కాంపోనెంట్, స్పోర్ట్స్, జిమ్ పరికరాలు. -
66 లక్షల వినియోగదారులతో ‘పేటీఎం మనీ’
బెంగుళూరు: దేశంలోని కస్టమర్లకు పేటీఎం యాప్ ద్వారా మెరుగైన సేవలను అందిస్తు వినియోగదారుల ప్రజాదరణ చూరగొంది. అయితే తాజాగా పైటీఎం మనీ విభాగం(వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్) అత్యాధునిక సేవలతో 66లక్షల మంది వినియోగదారుల సంఖ్యను చేరుకున్నట్లు సంస్థ పేర్కొంది. కాగా ఈ విజయంపై పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ స్పందిస్తు మొదటిసారి వినియోగిస్తున్న వారే 70 శాతం ఇన్స్టాల్ చేసుకున్నారని అన్నారు. అయితే 60 శాతం మంది వినియోగదారులు చిన్న పట్టణాలు, నగరాల నుంచే తమ యాప్‌ను ఉపయోగిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర పేన్సన్ పథకానికి, స్టాక్స్‌కు పీటీఎం మెరుగైన సేవలందిస్తుంది. మరోవైపు లక్షలాది ప్రజల సంపదను పెంచడానికి పేటీఎమ్ మనీ కీలక చర్యలు తీసుకుంటున్నట్లు పేటీఎం మనీ సీఈఓ వరుణ్ వశ్రీధర్ తెలిపారు. ప్రజల ఆదాయాలను పెంచే ఆత్మనిర్బహర్ భారత్ విజయం సాధించడంలో పేటీఎం కీలక పాత్ర పోషిస్తుందని సంస్థ అధికారులు తెలిపారు. ఇటీవలె స్టాక్ బ్రోకరేజ్ రంగంలోని పేటీఎం ప్రవేశించిన విషయం తెలిసిందే. దీనికి కావాల్సిన అనుమతులను సెబీ(సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) ద్వారా పొందింది. (చదవండి: పబ్జీ ఉచ్చు: తాతా ఖాతాకు చిల్లు) -
కేంద్రమే అప్పు తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత కోవిడ్ సంక్షోభ పరిస్థితుల్లో పరస్పరం సహకరించుకుని సమాఖ్యవాదాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోరారు. ఏ రాష్ట్రంలో ఏ మూల అభివృద్ధి జరిగినా అది జాతీయాభి వృద్ధికి దోహదం చేస్తుందని, ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలకు మరింత చేయూత అందించాల న్నారు. జీఎస్టీ పరిహారం చెల్లింపులకు సంబం ధించి కేంద్రం చేసిన ప్రతిపాదనలను వెనక్కు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి ముఖ్యమంత్రి సోమవారం మూడు పేజీల లేఖ రాశారు. కేంద్రమే రుణం తీసుకుని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం పూర్తి స్థాయిలో చెల్లించాలన్నారు. ప్రధానికి సీఎం రాసిన లేఖలో ఏముందంటే.. ‘కేంద్రం చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారం ప్రతిపాదనలపై తీవ్ర ఆందోళనతో ఈ లేఖ రాస్తున్నా. జీఎస్టీలో చేరడం ద్వారా స్వల్పకాలికంగా నష్టం ఉంటుందని తెలిసినా జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేరాం. దీర్ఘకాలంలో ప్రయోజనం ఉంటుందని, పెట్టుబడులు వస్తాయని పూర్తి స్థాయిలో మద్దతు తెలిపాం. యూపీఏ అధికారంలో ఉండగా కేంద్ర అమ్మకపు పన్ను ఎత్తివేత ద్వారా కలిగే రెవెన్యూ నష్టాన్ని పూర్తిగా పరిహారం కింద చెల్లిస్తామని రాష్ట్రాలకు హామీ ఇచ్చారు. కానీ అలా చెల్లించకపోవడంతో తెలంగాణ రూ. 3,800 కోట్లు నష్టపోయింది. ఈ చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలు చేసిన ఒత్తిడితో జీఎస్టీ అమలు ద్వారా వచ్చే రెవెన్యూ లోటును పరిహారం రూపంలో రెండు నెలలకోసారి చెల్లించేలా చట్టంలో చేర్చారు. కానీ, కేంద్రం ఈ పరిహారం చెల్లింపులో ఆలస్యం చేస్తోంది. ఏప్రిల్–2020 నుంచి చెల్లించడం లేదు. ఖర్చులు పెరిగాయి... ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాల రెవెన్యూ వసూళ్లు తగ్గిపోగా, ఖర్చులు పెరిగాయి. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో తెలంగాణ 83 శాతం ఆదాయాన్ని కోల్పోయింది. కోవిడ్ సంబంధిత ఖర్చు ఎక్కువ కావడంతో బహిరంగ మార్కెట్లో అప్పులు తెచ్చి నడిపించడం పెద్ద సవాల్‌గా మారింది. వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లాల్సి వచ్చింది. భారత ప్రభుత్వ నియంత్రణలో ఉన్న విశాల ఆర్థిక విధానం వల్ల రాష్ట్రాలు అప్పులు తెచ్చుకునేందుకు కూడా కేంద్రంపై ఆధారపడాల్సిన పరిస్థితి. రాజ్యాంగం పేర్కొన్న సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రానికి 3.5 శాతం రుణ పరిమితి ఉంటే రాష్ట్రాలకు 3 శాతమే కల్పించారు. చట్టంలోని అంశాలను కేంద్రం ఉల్లంఘిస్తోంది. జీఎస్టీలో చేరడం ద్వారా రాష్ట్రాలు మరింత ఆర్థిక సౌలభ్యాన్ని ఆశించాయి. కానీ, జీఎస్టీలో చేరడం ద్వారా ఇతర పన్నుల రూపంలో ఆదాయం సమకూర్చుకునే అవకాశాలు కోల్పోయాయి. కేంద్రానికి మాత్రం ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను, కస్టమ్స్ డ్యూటీల రూపంలో మరిన్ని పన్నులు రాబట్టుకునే వెసులుబాటు వచ్చింది. ఆర్బీఐ డివిడెండ్ల ద్వారా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పన్నేతర ఆదాయం కూడా పెంచుకోవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం విరివిగా నిధులు ఇవ్వాల్సి ఉంది. కానీ కేంద్రం తాను నిధులు ఇవ్వకుండా రావాల్సిన వాటిని కూడా తిరస్కరిస్తోంది. చట్టపరమైన హక్కులనూ కాలరాస్తోంది. ఆత్మనిర్భర్‌తో ముడిపెట్టడం సరికాదు... జీఎస్టీ పరిహారం చెల్లింపులకు, ఆత్మనిర్భర్ ప్యాకేజీకి ముడిపెట్టడం కూడా ఆ ప్యాకేజీ ద్వారా రాష్ట్రాలకు కలిగే పూర్తి ప్రయోజనాలను అడ్డుకోవడమే. కేంద్రం సెస్, సర్ చార్జీల ద్వారా పెద్ద ఎత్తున ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. లీటర్ పెట్రోల్‌పై రూ.13 సెస్ విధించడం ద్వారా ఏటా రూ.2 లక్షల కోట్లు కేంద్రానికి రానున్నాయి. జీఎస్టీ సెస్ మిగిలినప్పుడు ఆ మొత్తాన్ని తదుపరి సంవత్సరాల్లో కూడా వినియోగించుకునే వీలుండే (నాన్ ల్యాప్సబుల్) పరిహార నిధిలో జమ చేయకుండా కేంద్రం కన్సాలిడేటెడ్ ఫండ్‌లో జమ చేసుకుంది. 2017–18, 2018–19 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ ఖర్చులకు ఉపయోగించుకుంది. ఇప్పుడు ఆ సెస్ లోటు వచ్చిందని రాష్ట్రాలను అప్పు తెచ్చుకోమంటున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభిప్రాయం అడిగిన విధంగా జీఎస్టీ పరిహారం చెల్లింపు లోటును రాష్ట్రాలు అప్పులు తీసుకోవడం ద్వారా పూడ్చుకునే ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలి. ఇందుకు ప్రత్యామ్నాయంగా తక్కువ పడిన పరిహారం మొత్తాన్ని కేంద్రమే అప్పు తీసుకోవాలి. ఈ అప్పుకు సంబంధించిన అసలు, వడ్డీని జీఎస్టీ కింద 2022 తర్వాత వసూలయ్యే సెస్ నుంచి జీఎస్టీ కౌన్సిల్లో నిర్ణయం తీసుకోవడం ద్వారా చెల్లించాలి. చివరిగా, సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేయడం ద్వారా విపత్కర పరిస్థితుల్లో కష్టాలను అధిగమించడంతో పాటు బలమైన దేశంగా నిలబడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మీ దృష్టికి తెస్తున్నా. బలమైన రాష్ట్రాలు బలమైన దేశాన్ని నిర్మిస్తాయి. ఈ కారణంతోనే జీఎస్టీ కౌన్సిల్లో ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాల ఏకాభిప్రాయంతోనే నిర్ణయాలు జరిగాయి. ఈ సంప్రదాయం ఇక ముందు కూడా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా. నా విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించి ప్రత్యామ్నాయంపై మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా.’ -
స్వావలంబనతో ప్రతిష్ట పెరుగుతుంది!
న్యూఢిల్లీ: కేంద్రం ప్రకటించిన ‘ఆత్మనిర్భర్ భారత్’ విధానం దేశ శక్తి సామర్థ్యాలను పెంచేందుకు తోడ్పడుతుందని, రక్షణ రంగంలో మనం స్వావలంబన సాధిస్తే, ప్రపంచంలో భారత్ స్థాయి పెరుగుతుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచశాంతి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత సుస్థిరంగా ఉండేందుకు ఇది సాయపడుతుందని పేర్కొన్నారు. రక్షణరంగ పరిశ్రమల సదస్సునుద్దేశించి గురువారం ప్రధాని ప్రసంగించారు. రక్షణ సామర్థ్యాల్లో స్వావలంబన సాధించడం ద్వారా హిందూ మహాసముద్ర ప్రాంతం రక్షణ కల్పనలో భారత్ పాత్ర పెరుగుతుందన్నారు. వ్యూహాత్మక సంబంధాలను బట్టి పలు మిత్ర దేశాలకు రక్షణ సరఫరాదారుగా కూడా మారుతుందని తెలిపారు. ‘ప్రపంచదేశాల్లో భారత్ అతిపెద్ద రక్షణ వస్తువుల దిగుమతిదారుగా ఉంది. దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు గతంలో ఎలాంటి చర్యలు చేపట్టలేదు. రక్షణ పరికరాల దిగుమతులపై విధించిన నిషేధంతో దిగుమతులకు అడ్డుకట్ట పడటంతోపాటు దేశీయ పరిశ్రమ బలోపేతం అవుతుంది. నిషేధం జాబితాలో మరిన్ని వస్తువులను కూడా త్వరలో చేరుస్తాం’అని తెలిపారు. నూతన విధానంతో దేశీయ ఉత్పత్తి పెరగడంతోపాటు ప్రైవేట్ రంగం సాయంతో సాంకేతికత అభివృద్ధి చెందుతుందన్నారు. ఆటోమేటిక్ విధానంలో రక్షణ రంగంలోకి 75 శాతం ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు ఉభయతారకంగా పనిచేస్తుందని వివరించారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో రక్షణ రంగ పరిశ్రమల కారిడార్ ఏర్పాటు దిశగా చర్యలు సాగుతున్నాయని వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో ఇందుకుగాను ప్రభుత్వం రూ.20 వేల కోట్లు వ్యయం చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ జనరల్ బిపిన్ రావత్ మాట్లాడుతూ.. దేశీయ సాంకేతికత, సామగ్రిని ఉపయోగించుకుని యుద్ధంలో పోరాడి, విజయం సాధించడానికి మించిన సంతృప్తి మన జవాన్లకు మరేదీ లేదన్నారు. తరువాతి తరం సైనిక సంపత్తి అభివృద్ధిలో దేశీయ పరిశ్రమతో కలిసి ముందుకు సాగుతామన్నారు. -
ఆత్మనిర్భర భారత్ దిశగా రక్షణశాఖ కీలక ముందడుగు
-
గిన్నిస్‌లోకి ‘టైగర్ సర్వే’
న్యూఢిల్లీ: భారత్‌లో పులుల సంఖ్యను లెక్కించేందుకు 2018–19లో నిర్వహించిన సర్వే.. గిన్నిస్ ప్రపంచరికార్డు సృష్టించింది. ప్రపంచంలో అతిపెద్ద కెమెరా ట్రాపింగ్ వైల్డ్‌లైఫ్ సర్వేగా ఇది రికార్డుకెక్కింది. దేశంలో 2,967 పులులు ఉన్నట్లు సర్వే తేల్చింది. ప్రపంచంలోని మొత్తం పులుల్లో 75 శాతం పులులు భారత్‌లో ఉన్నాయి. సర్వే గిన్నిస్ రికార్డు పొందడంపై పర్యావరణ శాఖ మంత్రి జవదేకర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది అరుదైన ఘనత అని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌కు ఒక గొప్ప ఉదాహరణ అని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పులుల గణన సర్వేలో భాగంగా 1,21,337 చదరపు కిలోమీటర్ల (46,848 చదరపు మైళ్లు) విస్తీర్ణంలో 26,838 ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇవి 34,858,623 ఫొటోలను చిత్రీకరించాయి. ఇందులో 76,651 ఫొటోలు పులులకు సంబంధించినవి. పులి పిల్లలు మినహా దేశంలో మొత్తం 2,461 పులులు ఉన్నట్లు ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఈ ఫొటోలను విశ్లేషించి గుర్తించారు. పిల్లలతో కలిపితే 2,967 పులులు ఉన్నట్లు తేల్చారు. -
దేశీ యాప్‌లపై దృష్టి
న్యూఢిల్లీ: ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ చాలెంజ్‌లో పాల్గొనాలని ప్రధాని మోదీ స్టార్టప్‌లు, ఐటీ సంస్థలకు పిలుపునిచ్చారు. భారత్ తయారీ యాప్‌లు ప్రపంచ స్థాయిలో రాణించగలవని నిరూపించాలని ఆయన కోరారు. ఇప్పటికే దేశంలో వినియోగిస్తున్న భారతీయ యాప్‌లలో ఉత్తమమైన వాటిని గుర్తించి, ప్రోత్సహించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇటీవలే ప్రభుత్వం 59 చైనీస్ యాప్‌లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన శనివారం ‘ఆత్మనిర్భర్ భారత్ ఇన్నోవేషన్ చాలెంజ్’ను ప్రారంభించడం గమనార్హం. ఈ చాలెంజ్ ఆత్మనిర్భర్ యాప్ ఎకోసిస్టమ్‌ను రూపొందించేందుకు దోహదపడుతుందన్నారు. ‘ఎవరికి తెలుసు?, మీరు రూపొందించిన ఈ యాప్‌లను నేను కూడా ఉపయోగించవచ్చునేమో’అని ఆయన లింక్డ్ ఇన్‌లో వ్యాఖ్యానించారు. ప్రపంచస్థాయి ‘మేడ్ ఇన్ ఇండియా యాప్స్’ తయారు చేయాలని ఐటీ, స్టార్టప్ రంగాల వారిలో అపారమైన ఉత్సాహం ఉందని తెలిపారు. వీరి ఆలోచనలు, ఉత్పాదనలకు సరైన వేదిక కల్పించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ, అటల్ ఇన్నోవేషన్ మిషన్ కలిసి ‘ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ చాలెంజ్’ ప్రారంభించాయన్నారు. ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించిన వారు గానీ, అలాంటి ఉత్పత్తులను సృష్టించే దృష్టి, నైపుణ్యం ఉన్న వారికి ఇది సాయపడుతుందని చెప్పారు. టెక్ రంగానికి చెందిన వారంతా ఇందులో పాల్గొనాలని ఆయన కోరారు. కోవిడ్ సృష్టించిన అనేక సమస్యలకు సాంకేతికత ద్వారా పరిష్కారాలు లభిస్తున్నాయని తెలిపారు. దీంతోపాటు ప్రధాని మోదీ.. వ్యవసాయ పరిశోధనలు, విస్తరణ, విద్య రంగాలపై అధికారులతో సమీక్ష జరిపారు. బీజేపీ శ్రేణులకు ప్రశంస లాక్డౌన్ సమయంలో దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు చేపట్టిన సేవా కార్యక్రమాలను ప్రధాని మోదీ అతిపెద్ద సేవా యజ్ఞంగా పేర్కొన్నారు. శనివారం ఆయన ఏడు రాష్ట్రాల బీజేపీ శాఖల నేతలతో ఆన్లైన్ ద్వారా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన లాక్డౌన్ సమయంలో చేపట్టిన సేవా కార్యక్రమాలను కొనియాడారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం ఈ కార్యక్రమంలో మాట్లాడారు. బుద్ధుని బోధనలు..నేటి సవాళ్లకు పరిష్కారాలు బుద్ధ భగవానుని బోధనలు నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు శాశ్వత పరిష్కారం చూపుతాయని ప్రధాని మోదీ అన్నారు. ఆషాఢ పూర్ణిమ నాడు పాటించే ధమ్మ చక్ర దినం సందర్భంగా ప్రధాని వర్చువల్ ప్రసంగం చేశారు. ఆశ, ప్రయోజన పూర్వక జీవితమే మానవ దుఃఖాలను దూరం చేసే మార్గమని బుద్ధ భగవానుడు సారనాథ్‌లో తన మొదటి సందేశంలోనే చెప్పారన్నారు. తోటి వారిలో జీవితం పట్ల ఆశను ప్రేరేపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. లద్దాఖ్‌లో శుక్రవారం పర్యటన సందర్భంగా సింధు నది ఒడ్డున చేసిన సింధుపూజ ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. -
భారత్‌కు ‘స్వావలంబన’తోనే మోక్షం!
సాక్షి, న్యూఢిల్లీ : చైనాకు భారత్ ఎగుమతి చేస్తున్న ఉత్పత్తులకు ఐదింతల ఉత్పత్తులను చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది. కరోనా మహమ్మారి భారత్‌ను కుదిపేస్తున్న సమయంలో ఇది మరింత ప్రస్ఫుటమైంది. వైరస్ల నుంచి రక్షించుకునేందుకు వాడే గ్లౌజ్‌లు, మాస్క్‌లు, కవర్ సూట్లు మొదలుకొని కరోనా పరీక్షల కిట్ల కోసం చైనాపైనే భారత్ ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది. చైనాకు భారత్ ఎగుమతి చేసే ఉత్పత్తులకన్నా చైనా నుంచి భారత్ దిగుమతులు చేసుకుంటున్న ఉత్పత్తుల విలువ 50 బిలియన్ డాలర్లు ఎక్కువంటే ఆశ్చర్యం వేస్తుంది. భారత టెక్నాలజీ రంగంపై కూడా చైనా ఆధిపత్యమే కనిపిస్తోంది. 2015 నుంచి నేటి వరకు భారతీయ టెక్నాలజీ రంగంపై చైనా ఏడు బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టింది. భారత ప్రభుత్వాన్ని కూడా ప్రభావితం చేయాలంటే చైనాకు టెక్నాలజీ రంగంపైనున్న ఆధిపత్యం సరిపోతుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొనే కరోనా ప్రభావిత ఆర్థిక వ్యవస్థను రక్షించుకోవాలంటే భారత్‌కు స్వావలంబన ఒక్కటే మార్గమని ప్రధాని నరేంద్ర మోదీ భావించారని, అందులో భాగంగా 200 కోట్ల రూపాయలకు మించని ప్రతి సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలను భారతీయులకే అప్పగిస్తామని ఆయన చెప్పడం ప్రశంసనీయమని ఆర్థిక నిపుణలు చెబుతున్నారు. అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజ్ నుంచి చైనా కంపెనీలన్నింటిని తొలగిస్తూ అమెరికా సెనేట్ బిల్లు తీసుకరావడం ఇరు దిగ్గజ దేశాల మధ్య సరికొత్త వ్యాపార యుద్ధానికి తెరలేచిందని, ఈ సమయంలో మోదీ తీసుకున్న నిర్ణయం ఎంతో సముచితమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మోదీ నిర్ణయాన్ని జాతీయ మీడియా తప్పు పట్టడాన్ని వారు విమర్శిస్తున్నారు. స్వావలంబన నిర్ణయాలు ఎంత మేరకు అమలవుతాయన్న విషయాన్ని ప్రస్తుతానికి పక్కన పెడితే నిర్ణయంలో తప్పు వెతకరాదని వారు హితవు చెబుతున్నారు. (కార్మికుల రైలు బండికి ‘టైం టేబుల్’ లేదట!) -
వలసల దుస్థితికి పరిష్కారమెలా?
కరోనా వైరస్ పుట్టుక, పర్యవసానంగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్లో భాగంగా తీసుకుం టున్న చర్యలు గ్రామీణ వ్యవసాయ రంగ దుస్థితిని మరింతగా పెంచివేశాయి. పట్టణాల నుంచి తమ తమ సొంత గ్రామాలకు తరలివచ్చిన లక్షలాదిమంది వలస కార్మికులు వ్యవసాయరంగంలోని దుస్థితికి సరికొత్త బాధితులు కాబోతున్నారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిం పువల్ల ఏర్పడిన దుర్భర పరిస్థితి ఫలితంగా.. దారిద్య్ర నిర్మూలన కోసం గత కొన్ని దశాబ్దాలుగా సాగుతూ వచ్చిన కృషి మళ్లీ వెనక్కు పోయేటట్టుంది. దీంతో గ్రామీణ కుటుంబాలు మళ్లీ దారిద్య్రంలో కూరుకుపోనున్నాయి. ఇప్పటికే పతనం అంచుపై నిలబడి ఉన్న కుటుంబాలు లాక్డౌన్ కారణంగా తీవ్రమైన ఆహార కొరత బారిన పడుతున్నాయి. ఇప్పుడు దేశం ముందున్న సవాలు ఏమిటంటే, గ్రామీణ కుటుంబాలు దారిద్య్రంలో కూరుకుపోకుండా చేయడం, గ్రామీణ ఆర్థిక ముఖచిత్రాన్ని పునరుద్ధరించి, పునర్నిర్మాణం చేయడమే. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల భారీ మొత్తం కానీ, తదనుగుణంగా ఆర్థిక మంత్రి ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలు కానీ ప్రస్తుత సంక్షోభంలో తలెత్తుతున్న భయాందోళనలను కనీసంగా కూడా పారదోలడం లేదు. ఈ పథకాలు, ప్యాకేజీలను అనుకున్న విధంగా అమలు చేయగలిగితే గ్రామీణ మౌలిక వసతి కల్పనను ప్రోత్సహించడం, గ్రామీణ పరిశ్రమలకు వేగంగా రుణాలు మంజూరు చేయడం, వ్యవసాయ మార్కెట్లను అనుసంధానించడం వంటి చర్యలు దీర్ఘకాలంలో మేలు చేయవచ్చు. గ్రామీణ జీవితాలను పునరుద్ధరించి, వారికి మెరుగైన జీవితాన్ని అందించడానికి నాలుగు సూత్రాల ఎజెండా ఉంది. వీటిలో మొదటిది... జాతీయ ఉపాధి పథకమేనని ఏకగ్రీవంగా చెప్పవచ్చు. ప్రస్తుతం దేశంలో గ్రామీణ ఉపాధి కల్పన పథకంలో భాగంగా దాదాపు 7.65 కోట్లమంది క్రియాశీలక ఉపాధి కార్డుదారులు ఉంటున్నారు. వీరందరికీ ఉపాధి హామీ పథకంలో భాగంగా 100 రోజుల పనిని కల్పించినట్లయితే బడ్జెట్లో కల్పించిన రూ. 40,000 కోట్లు ఏమూలకూ సరిపోవు. వలస కార్మికుల రాక కారణంగా ఈ సంవత్సరం ఉపాధి హామీ పథకంలో అధిక సంఖ్యలో కార్మికులు నమోదయ్యే పరిస్థితిని తోసిపుచ్చలేం. గత కొన్నేళ్లుగా ఒక్కో కుటుం బానికి సగటు పనిదినాలు 45 నుంచి 50 రోజుల వరకే లభిస్తున్నాయి. గ్రామీణ కుటుంబాలు తాము కోరుకుంటున్న పనిదినాలు ఇవే అని చెప్పడానికి లేదు. ఉపాధికి డిమాండ్ తగ్గించిన కారణంగానే ఇన్ని తక్కువ పనిదినాలు వారికి అందుబాటులో ఉంటున్నాయి. గ్రామాల్లో తగినంత పనిని కల్పించడంలో విఫలమైన కారణంగానే ప్రభుత్వం సీజనల్ వలసను ప్రతి సంవత్సరం ప్రోత్సహిస్తోంది. అందుచేత, గ్రామీణ ఉపాధి పథకం అమలులో మొదట్లో జరిగిన అన్యాయాలను తొలగించడానికి రెండు మార్గాలున్నాయి. సాధారణంగా శ్రామిక కుటుంబాలు వేసవి కాలంలోనే ఎక్కువ పనిదినాలను పొందుతుంటాయి కానీ ఈ సంవత్సరం లాక్డౌన్ కారణంగా ఆ అవకాశాన్ని పూర్తిగా పోగొట్టుకున్నాయి. కాబట్టి పనిచేసినా చేయకున్నా వీరికి కనీసం 20 పనిరోజులకైనా పరిహారం అందించాల్సి ఉంటుంది. అవసరమైన కుటుంబాలకు నగదు బదిలీ చేయడానికి ఇది ఒక సమర్థవంతమైన మార్గం. రెండు... ఈ సంవత్సరం ప్రతి కుటుంబానికి పనిదినాలను వంద నుంచి 200కి పెంచాలన్న డిమాండ్ పెరుగుతోంది. కరువు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల కాలంలో ఉపాధి పనిదినాలను 150 రోజులకు పెంచడం రివాజు. మరొక మార్గం ఏదంటే, ప్రతి కుటుంబానికి పనిదినాల సంఖ్య సగటున వందరోజులను మించని పరిస్థితిలో తాము కోరుకున్నన్ని రోజులు కుటుంబాలకు పని కల్పించడమే. ప్రభుత్వ సగటు అయిన 100 రోజుల పరిమితిని మించిపోయినా సరే ఈ సంవత్సరం గ్రామీణ కుటుంబాలు కోరుకున్న పనిదినాలను కల్పించడం అవసరం. లాక్డౌన్ కలిగించిన దుర్భర పరిస్థితుల్లో ప్రభుత్వం పాటించవలసిన కనీస విధానమిది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా జాతీయ ఆహార భద్రతను అమలుచేయడం. లాక్ డౌన్ నేపథ్యంలో అదనపు కోటా, ముందస్తు కోటా, అదనంగా కిలో పప్పు ఇవ్వడం వంటివి ప్రకటించారు (అయితే ఆరువారాల తర్వాత కూడా ఈ అదనపు కోటా ఇంకా ప్రజలకు అందలేదు). వన్ నేషన్ ఒక రేషన్ కార్డు విధానం ద్వారా ఇది మరింత సమర్థంగా అమలు చేస్తామని చెబుతున్నారు. అయితే దరఖాస్తు చేసుకుని సంవత్సరాలు గడుస్తున్నా రేషన్ కార్డు అందని వారికి తక్షణం కార్డులు అందించే ఏర్పాటు చేయాలి. 2011లో ఎస్ఈసీసీ సర్వే ప్రకారం ప్రభుత్వ సౌకర్యాలు పొందుతున్న కుటుంబాల సంఖ్య 11.2 శాతం మాత్రమే ఉన్నట్లు తెలిసింది. అంటే 90 శాతం కుటుంబాలకు రేషన్ కార్డును అందించాల్సిన అవసరం ఉందని నాటి సర్వే తెలిపింది. మూడోది... కిసాన్ సన్మాన్ యోజన. ఈ పథకం కింద ఏటా ఇచ్చే 6 వేల రూపాయలకు ప్రస్తుత సంక్షోభకాలంలో మరొక 2 వేలను కలిపి ఇస్తున్నారు. అయితే సన్నకారు రైతు కుటుంబాల వ్యవసాయ ఖర్చులతో పోలిస్తే ఇది ఒక మూలకు కూడా సరిపోదు. అందుకనే ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి కనీసం 10 వేల రూపాయలను పెంచడం సహేతుకంగా ఉంటుంది. నాలుగోది... పంటల బీమా. ఇది ఇప్పుడు స్వచ్చందంగా తీసుకునే బీమా కిందికి మార్చారు. దీంతో చాలామంది రైతులు పంటల బీమా పాలసీని తీసుకోరు. ఈ బీమా పాలసీని పూర్తిగా రైతులకు లబ్ధి కలిగించేలా మార్పు చేయాలి. ఇప్పుడైతే సన్నకారు రైతులు బ్యాంకులకు వెళ్లి, కస్టమర్ సర్వీసు కేంద్రాలను, బ్యాంకింగ్ కరస్పాండెంట్లను సంప్రదించి ప్రీమియం చెల్లించి తమ దరఖాస్తును అప్ లోడ్ చేయవలసి రావడం చాలా కష్టమైన వ్యవహారంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానాన్ని రైతులకు ఉపయోగించేలా సులభతరం చేయడంపై ఆలోచించాలి. పోస్ట్మ్యాన్నే పంటల బీమా ఏజెంటుగా మారిస్తే రైతు వద్దకే నేరుగా వెళ్లి సంబంధిత పని చేసిపెట్టడానికి వీలవుతుంది. వలస కూలీలు విభిన్న రకాలుగా ఉన్నారు. కొందరు కొన్ని వారాలపాటు తమ గ్రామాలు విడిచిపెట్టి, మళ్లీ తిరిగి వస్తుంటారు. ప్రతి ఆరునెలలకు ఒకసారి ఇలా చేస్తుంటారు. కొందరయితే ఆరు లేదా ఎనిమిది నెలల వరకు వలస వెళ్లి తర్వాత తిరిగి వస్తుంటారు. మరికొందరు సంవత్సరాల పాటు గ్రామాలు వదిలేసి పట్టణ కేంద్రాల్లోనే జీవిస్తుంటారు. చాలామంది వలస కూలీలు ఖరీఫ్ సీజన్లో వెనక్కు వచ్చి తమ చిన్న కమతాల్లో సాగు చేస్తుంటారు. 2016–17 ఎకనమిక్ సర్వే ప్రకారం ప్రతి అయిదు కుటుంబాల్లో కనీసం ఒక కుటుంబంలో ఒక్కరయినా వలస పోతుంటారని తెలిసింది. ఇప్పుడు లాక్డౌన్ పరిస్థితులలో వలస కార్మికులు చాలావరకు తమ ఇళ్లకు వెళ్లిపోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరి ఆరాటాన్ని అర్థం చేసుకోవచ్చు. తాము ఇన్నేళ్లుగా జీవిస్తూ వచ్చిన నగరాలు, పట్టణాలు తమను ఎలా గాలికి వదిలేశాయో అర్థమైనందువల్లే మళ్లీ నగరాలకు రావాలంటేనే వీరు భయపడిపోతున్నారు. ప్రస్తుత సంక్షోభం నుంచి కుదుట పడ్డాక నగరాలకు తిరిగివస్తే ఉండటానికి కాస్త గూడు ఎక్కడ దొరుకుతుందనేది వీరిని కలవరపరుస్తోంది. దీంతో చాలామంది కార్మికులు మళ్లీ నగర కేంద్రాలకు తిరిగి రాకపోవచ్చు కూడా. ఇలాంటివారు తమ పరిసర గ్రామాలలోనే పనికోసం ప్రయత్నించవచ్చు. నగరాల్లో ఉన్నప్పుడు వీరు నైపుణ్యాలను పెంచుకుని ఉండవచ్చు కానీ ఆ నిర్దిష్టమైన నైపుణ్యాలు గ్రామీణ ప్రాంతాల్లో అసలు పనికిరాకపోవచ్చు. ఇలాంటి సందర్భంలో రహదారులు, చిన్నచిన్న దుకాణాలు నిర్మించడం, విద్యుత్ నెట్వర్క్ పనులు, సోలార్ లేదా ఇతర పునర్వినియోగ విద్యుత్ ప్లాంట్లను నిర్మించడం, ఇంటర్నెట్ నెట్వర్క్స్, తదితర మౌలిక వ్యవస్థాపన పనుల్లో వీరి నైపుణ్యాలను ఉపయోగించేలా తగు చర్యలు తీసుకోవాలి. వలస కార్మికుల గాథలో ఒక కోణాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. వీరిలో చాలామంది పని వెదుక్కోవడం కోసమే నగరాలకు వెళుతుంటారు. అప్రెంటీస్‌గా పనిచేస్తూ నైపుణ్యాలను నేర్చుకుం టారు. వసతికోసం తంటాలుపడుతూ, గుడిసెలను ఏర్పర్చుకుం టారు. ఈ గుడిసెలను క్రమబద్ధీకరించేంతవరకు అధికారుల వేధింపులకు గురవుతూనే ఉంటారు. తగిన ఇళ్లు, నీరు, టాయ్‌లెట్ సౌకర్యాలు, విద్యుత్, రేషన్ కార్డులు వంటివి లేకుండానే వీరు నగరాల్లో నివసిస్తుంటారు. ప్రభుత్వం ప్రాథమిక సేవలు కల్పించకపోవడంతో వీరి ఆదాయాల్లో 40 నుంచి 50 శాతం వరకు కనీస వసతులపైనే పెట్టాల్సి వస్తోంది. ప్రభుత్వం తగు సౌకర్యాలు కల్పిస్తే ఇలా ఖర్చుపెట్టే ఆదాయాలను పొదుపు చేసుకుని సంక్షోభ సమయాల్లో వాడుకోవడం సాధ్యపడుతుంది. కరోనా సంక్షోభ నేపథ్యంలో గ్రామీణ ఆర్థిక ముఖచిత్రాన్ని పునర్నిర్మించాలంటే ఒక కొత్త దృక్పథం అవసరం. చిన్న చిన్న లక్ష్యాల గురించి ఆలోచించాలి. గ్రామీణ ప్రాంతాల్లో వాటర్ షెడ్ పథకాలను మళ్లీ అమలు చేయాలి. తృణధాన్యాలు, నూనె గింజలు, కాయధాన్యాలు, వంటి సాంప్రదాయిక పంటల ఉత్పత్తిని పెంచే పథకాలు చేపట్టాలి. వరి, గోధుమ కాకుండా ఇతర పంటలను ప్రోత్సహించాలి. పశుపోషణను పెద్ద ఎత్తున చేపట్టాలి. తమ భూములు, తమ శ్రమకు తగిన ఆదాయాలను పెంచే సాంప్రదాయిక పంటలవైపు గ్రామీణులను మళ్లించాల్సి ఉంటుంది. రోజురోజుకూ కనీవినీ ఎరుగని సంక్షోభం మన జీవితాలను ఆవరిస్తోంది. ఇంతవరకు భారతదేశం సాధించిన మానవాభివృద్ధికి సంబంధించిన మైలురాళ్లన్నింటినీ ఈ సంక్షోభం వెనక్కు మళ్లించేలా ఉంటోంది. దేశ గ్రామీణ ముఖచిత్రంపై దారిద్య్ర భూతం మరోసారి కోరలు చాస్తోంది. ఈ విపత్తును ఎలా పరిష్కరిస్తారనేది దేశ భవిష్యత్తునే నిర్దేశించనుంది. (ద వైర్ సౌజన్యంతో...) వ్యాసకర్త : అశ్విని కులకర్ణి , ఫౌండర్ ట్రస్టీ, ప్రగతి అభియాన్ -
ఆర్థిక సౌష్టవమే ‘ఆత్మ నిర్భర్’ లక్ష్యం
భారత్ ఆత్మ నిర్భర్ యోజన ప్రభుత్వ అంగాలకు, ప్రజలకు స్వావలంబన సాధిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కోట్ల మందికి జీవనోపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి ఈ ప్యాకేజీ తిరిగి ఊపిరులూదుతుంది. ఉద్యోగులకు మేలు చేకూరుస్తుంది. శ్రామికులు, రైతులతోపాటు దేశం కోసం కష్టపడే ప్రతిఒక్కరికీ ఉపయుక్తంగా మారుతుంది. ప్యాకేజీ పనులు వేగంగా నాణ్యతతో, పారదర్శకతతో జరిగితే ప్రధాని ఆకాంక్షించిన లక్ష్యాలు నెరవేరుతాయి. అందుకు అందరూ సంకల్పం చేయాలి. ప్రభుత్వానికి సహకరించాలి. అప్పుడే భవిష్యత్తులో కరోనాలాంటి సంక్షోభాలు వచ్చినా ప్రజా సంకల్పంతో మరింత ధైర్యంగా ఎదుర్కొనగలం. మేకిన్ ఇండియాకి ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ దేశ ఆర్థిక వ్యవస్థకు నూతన జవసత్వాలు నింపేలా ఉంది. కోవిడ్ సంక్షోభంతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం పోసేలా కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పేరుతో రూ. 20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. కరోనాను జయించడంతోపాటు అన్ని రంగాల్లో స్వావలంబన సాధించడం ఇప్పుడు కేంద్రం ముందున్న ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యసాధనకు కొంత సమయం పడుతుంది. ప్రధాని ముందుచూపుతో ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో ఈ రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ రూపొందించారు. దేశంలోని అన్ని వర్గాలను ఆదుకునేందుకు ఈ ప్యాకేజీ దోహదపడుతుంది. ఒకపక్క కరోనా సంక్షోభాన్ని దేశం ఎదుర్కొంటున్న తీరును 50కి పైగా అంతర్జాతీయ ప్రముఖ పత్రికలు ప్రశంసించాయి. కరోనాపై పోరులో దేశం యావత్తూ ప్రధాని నరేంద్రమోదీ వెంట నడుస్తోందంటూ న్యూయార్క్ టైమ్స్ వంటి అంతర్జాతీయ పత్రికలు ప్రశంసిస్తున్నాయి. మేకిన్ ఇండియాకి ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ దేశ ఆర్థిక వ్యవస్థకు నూతన జవసత్వాలు నింపేలా ఉంది. కీలకమైన రంగాలకు జవసత్వాలు ఆర్ధిక వ్యవస్థలోని కీలకమైన రంగాలు ఆర్థికవ్యవస్థ, మౌలికసదుపాయాలు, సాంకేతిక విజ్ఞానం, ప్రజలు, ఉత్పత్తుల డిమాండ్ లాక్‌డౌన్‌తో ఇబ్బందుల్లో పడ్డాయి. ఈ రంగాలు బలోపేతంగా ఉన్నట్లయితే ఎలాంటి విపత్కర పరిస్థితిని అయినా పోరాటంలో కీలకంగా వ్యవహరిస్తాయి. ఈ రంగాలకు జవజీవాలు అందించేందుకే ప్రధాని మోదీ రూ.20 లక్షల కోట్ల ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ ప్యాకేజీ రూపొం దించారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ఈ ఐదు రంగాలను బలోపేతం చేస్తుందని ప్రధాని విశ్వసిస్తున్నారు. 1. ఆర్థికవ్యవస్థను అత్యంత వేగంతో వృద్ధి చెందించడం. 2. మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యత. 3. మన వ్యవస్థకు అవసరమయ్యే సాంకేతిక విజ్ఞానం అందిపుచ్చుకు నేందుకు అవసరమైన చర్యలు, 4. స్వయం సమృద్ధి సాధించిన మన జనాభా. 5. మన ఉత్పత్తులకు , శ్రమకు డిమాండ్ సాధించడం. గరీబ్ కల్యాణ్ యోజనతో ప్రారంభం ఆత్మ నిర్భర్ భారత్ యోజనలో మొదటిదే ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన’. పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని.. లాక్డౌన్ ప్రకటించిన 36 గంటల్లోనే రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీతో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి, పూటగడవక ఆందోళన చెందే కార్మికుల సంక్షేమం, ఆహార, ఆర్థిక భద్రత కోసం ఈ ప్యాకేజీని కేటాయించింది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా 80 కోట్ల మంది పేదలకు రేషన్ కార్డుల ద్వారా గతంలో ఇచ్చే రేషన్‌కు అదనంగా బియ్యం లేదా గోధుమలు, పప్పులు ఉచి తంగా పంపిణీ చేశారు. ఉపాధి హామీ పథకం వేతనాన్ని గతంలో ఇచ్చే రూ. 182కు అదనంగా మరో రూ. 20 పెంచారు. దీనివల్ల 5 కోట్ల కుటుంబాలకు అదనపు లబ్ధి చేకూరింది. 60 ఏళ్లు పైబడిన వయో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఎక్స్‌గ్రేషియా కింద వచ్చే 3 నెలల్లో రెండు విడతల్లో రూ. వెయ్యి జమ చేశారు. పీఎం కిసాన్ యోజన కింద తొలి వాయిదా రూ. 2 వేలను ఏప్రిల్ మొదటి వారంలోనే జమ చేశారు. దీనివల్ల 8.69 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలిగింది. జన్‌ధన్ ఖాతాలున్న 20 కోట్ల మంది మహిళలకు మూడు నెలలపాటు నెలకు రూ. 500 చొప్పున జమ చేస్తున్నారు. ప్రధాన మంత్రి ‘ఉజ్వల యోజన’ కింద లబ్ధి పొందిన 8.3 కోట్ల కుటుంబాలకు 3 నెలలపాటు ఉచితంగా గ్యాస్ సిలిండర్ల సరఫరా చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 63 లక్షల స్వయం సహాయక సంఘాలకు పూచీ కత్తు లేకుండా ఇస్తున్న రుణ పరిమితి రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచారు. 100 మంది వరకు పనిచేస్తున్న సంస్థల్లో 90% మంది ఉద్యోగులు నెలకు రూ. 15 వేల లోపు వేతనాలు పొందుతున్నట్లయితే వారికి సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్‌ను మూడు నెలలపాటు కేంద్రమే చెల్లిస్తుంది. దీనివల్ల 80 లక్షల మంది ఉద్యోగులు, 4 లక్షల సంస్థలకు ప్రయోజనం కలుగుతుంది. భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి’ కింద జమ అయిన రూ.31 వేల కోట్లను, 3.5 కోట్ల మంది రిజిస్టర్డ్ నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమానికి ఉపయోగించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు వెసలుబాటు కల్పించారు. వీటి ద్వారా వలస కార్మికులకు భోజన, వసతి, మంచినీటి సదుపాయం కల్పించారు. ప్రాణాలను పణంగా పెట్టి, కరోనా వైరస్ రోగులకు వైద్యసేవలు అందిస్తున్న ఆశ వర్కర్లు, వైద్య సాంకేతిక, పారి శుద్ధ్య, పారా మెడికల్ సిబ్బంది, నర్సులు, వైద్యులకు రూ. 50 లక్షల వ్యక్తిగత వైద్య బీమా కల్పించారు. దీనివల్ల 20 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. అయిదు ప్యాకేజీలు ఆత్మ నిర్భర భారత్ అభియాన్‌లో అయిదు ప్యాకేజీలను కేంద్రం ప్రకటించింది. ఈ అయిదు ప్యాకేజీలు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేవి. రూ. 6 లక్షల కోట్లతో మొదటి ప్యాకేజీని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) అభివృద్ధిని లక్ష్యంగా నిర్ణయించుకుని ప్రకటించారు. ఎంఎస్ఎంఈలతో సహా అర్హులైన చిన్న వ్యాపారాలకు ఎలాంటి తాకట్టు అవసరం లేకుండా రూ.3 లక్షల కోట్ల రుణాలు అందించనున్నారు. తద్వారా 45 లక్షల చిన్న వ్యాపారాలకు ప్రయోజనం లభించనుంది. వచ్చే మూడు నెలల పాటు ఉద్యోగి కనీస వేతనంలో పీఎఫ్ చందా మినహాయింపు వాటాను 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించారు. ఈ నిర్ణయంతో ఉద్యోగులకు, కంపెనీల యాజమాన్యాలకు రూ. 6,750 కోట్ల అదనపు నగదు అందుబాటులోకి వస్తుంది. దీంతో 4.3 కోట్ల మంది ఉద్యోగులతో పాటు 6.5 లక్షల కంపెనీలకు లబ్ధి చేకూరనుంది. కేటగిరీ పరిధి దాటితే ప్రస్తుతం లభిస్తున్న ప్రోత్సాహకాలు కోల్పోతామన్న భయంతో తమ వ్యాపారాన్ని విస్తరించకుండా ఉంటున్న ఎంఎస్ఎంఈలకు వీటి ప్రోత్సాహకాలతో ముడిపడి ఉన్న పెట్టుబడి నిబంధనలను సడలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆత్మ నిర్భర్ భారత్ పథకం రెండో విడతలో భాగంగా వలస కూలీలు, రైతులు, చిన్న వ్యాపారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రూ.3.16 లక్షల కోట్ల ప్యాకేజీని అమలు చేస్తున్నారు. మొత్తం 9 అంశాలను ఈ ప్యాకేజీలో పొందుపరిచారు. వలస కార్మికుల కోసం 3, ముద్రా–శిశు రుణాల కోసం 1, వీధి వ్యాపారుల కోసం 1, గృహ నిర్మాణం కోసం 1, ఉపాధి కల్పన కోసం 1, చిన్న, సన్నకారు రైతుల కోసం 2 ప్రయోజనాలు కల్పిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా కష్టాలు అనుభవిస్తున్న వలస కూలీలకు రూ. 11 వేల కోట్లతో భోజన వసతి సౌకర్యం కల్పించారు. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 8 కోట్ల మంది వలస కార్మికులకు వచ్చే రెండు నెలలపాటు ప్రతి మనిషికి 5 కేజీల బియ్యం/గోధుమలు, రేషన్‌కార్డుకు ఒక కేజీ చొప్పున పప్పు దినుసులు పూర్తి ఉచితంగా అందిస్తారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ. 3,500 కోట్లు ఖర్చుపెట్టనుంది. ముద్ర– శిశు రుణాలకు 2 శాతం వడ్డీ రాయితీ కల్పించారు. చిన్న, సన్నకారు రైతులకు నాబార్డు ద్వారా రూ. 30 వేల కోట్ల అత్యవసర మూలధన నిధి సమకూరుస్తారు. ఈ మొత్తం ద్వారా సన్న, చిన్నకారు రైతులకు గ్రామీణ బ్యాంకులు, సహకార సంఘాల నుంచి రుణాలు అందజేస్తారు. ప్రస్తుత రబీలో 3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. 2.5 కోట్లమంది రైతులు, మత్స్యకారులు, పశుపాలకులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందించి వడ్డీ రాయితీతో రూ. 2 లక్షల కోట్ల రుణాలను సమకూరుస్తారు. గరిష్ఠంగా రూ. 3 లక్షల రుణం వరకు ఈ రాయితీ వర్తిస్తుంది. కార్మికులందరికీ కనీస వేతనం, వీధి వ్యాపారులకు రూ. 5 వేల కోట్ల రుణాలు, వలస కూలీలకు ఊళ్లలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పిస్తారు. ఆత్మ నిర్భర్ భారత్ యోజన మూడో ప్యాకేజీ వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను బలోపేతం చేసేది. ఈ రంగాలకు రూ. 1.63,343 కోట్లను కేటాయించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాలు, వ్యవసాయ పరిశ్రమలు, స్టార్టప్‌ల ద్వారా గిడ్డంగులు, పంటల శుద్ధి వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించడానికి రూ.లక్ష కోట్లతో ‘వ్యవసాయ మౌలిక వసతుల కల్పన నిధి’ని ప్రభుత్వం ఏర్పాటుచేయనుంది. మత్స్యఉత్పత్తుల పెంపు, మార్కెటింగ్‌లకు ప్రోత్సాహకం కల్పించేలా రూ. 20 వేల కోట్లతో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనను ప్రారంభిస్తారు. దీనివల్ల 55 లక్షల మందికి ఉపాధి లభించడమే కాకుండా ఎగుమతులు రెట్టింపై రూ.లక్ష కోట్లకు చేరుతాయి. రూ. 15 వేల కోట్లతో పాడి పరి శ్రమ మౌలిక అభివృద్ధి ఏర్పాటు చేయనున్నారు. ఇంధన వనరుల్లో ఆర్థిక వృద్ధి, ఉద్యోగాల కల్పనకు ఊతమిచ్చేలా పలు సంస్కరణలు చేస్తూ నాలుగో విడత ఉద్దీపన చర్యలు ప్రకటిం చారు. బొగ్గు, ఖనిజాలు, రక్షణ, అంతరిక్ష రంగం, ఎయిర్ పోర్టులు, విద్యుత్ పంపిణీ, సోలార్ విద్యుత్, అణుశక్తి రంగాలకిది వర్తిస్తుంది. బొగ్గు తవ్వకాల్లో ప్రభుత్వ గుత్తాధిపత్యానికి స్వస్తి పలుకుతూ, కార్పొరేట్ సంస్థలు కూడా ప్రవేశించేలా ఖనిజ రంగాన్నీ సరళీకృతం చేస్తున్నారు. 500 మైనింగ్ బ్లాకులను బహిరంగ వేలం వేస్తున్నారు. రక్షణ రంగంలోనూ స్వయం సమద్ధి సాధించడానికి ఏడీఐలను 40 నుంచి 74 శాతానికి పెంచారు. అలాగే, మరో ఆరు ఎయిర్‌పోర్టులను ప్రైవేటుకు అప్పగిస్తారు. అంతరిక్ష రంగంలో ముఖ్యంగా జియో స్పేషియల్ ప్రయోగాలకు, స్టార్టప్‌లకు అవకాశం కల్పిస్తారు. ఉల్లి, టమాటా వంటి త్వరగా చెడిపోయే ఉత్పత్తుల నిల్వ సామర్థ్యం పెంచే రేడియేషన్ సాంకేతికత పరిజ్ఞాన అభివృద్ధికి రూ. 500 కోట్లు కేటాయించారు. కార్పొరేటైజ్ అంటే ప్రైవేటీకరణ కాదని సామర్థ్యం, నైపుణ్యాల పెంపు అని సూత్రీకరిస్తూ, ఆర్థిక శాఖ సరికొత్త నిర్వచనం చెప్పింది. ఈ ఆర్థిక ప్యాకేజీలో ఐదో అంశాన్ని స్వయం సమృద్ధి చెందడమే లక్ష్యంగా రూపొందించారు. ప్రభుత్వరంగ సంస్థలు, వనరులు, రాష్ట్ర ప్రభుత్వాల వనరులపై దృష్టి పెట్టారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం అదనంగా రూ. 40 వేల కోట్లు కేటాయించారు. దీనివల్ల 300 కోట్ల పనిదినాలు కల్పించవచ్చు. క్షేత్రస్థాయి వైద్య వ్యవస్థ బలోపేతానికి పెట్టుబడులు కేటాయించారు. జాతీయ స్థాయిలో ఆన్లైన్ విద్యా వ్యవస్థ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. చూపు, వినికిడి సమస్యలు ఉన్న వారి కోసం ప్రత్యేక ఈ–బోధన సామాగ్రి అందుబాటులోకి తెస్తున్నారు. దేశవ్యాప్తంగా మే 30 నుంచి 100 విశ్వవిద్యాలయాలకు ఆన్లైన్ కోర్సులకు అనుమతి ఇచ్చారు. లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా నష్టపోయిన సంస్థలకు దివాళ స్మృతి నుంచి ఏడాది పాటు మినహాయింపు లభించింది. రాష్ట్రాలకు రెవెన్యూ లోటు రూ. 12,390 కోట్లు భర్తీ చేశారు. ప్రకృతి వైపరీత్యాల కింద ఇచ్చే నిధులను కరోనా నిమిత్తం ఆరు నెలలు ముందుగానే ఏప్రిల్ మొదటివారంలో రూ.11,092 కోట్లు రాష్ట్రాలకు అడ్వాన్స్‌లుగా చెల్లించారు. రాష్ట్రాల ఆర్థిక సౌలభ్యానికి వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పరిమితిని 60 శాతానికి పెంచారు. రాష్ట్రాల ఓవర్‌డ్రాఫ్ట్ వరుస రోజుల పరిమితిని 14 నుంచి 21 రోజులకు పెంచారు. త్రైమాసికంలో ఓవర్‌డ్రాఫ్ట్ రోజుల పరిమితిని 32 నుంచి 50 రోజులకు గడువు పెంచారు. ఇప్పటికే ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ప్రతి రూపాయి నూటికి నూరు శాతం పేదల జేబుల్లోకి చేరింది. ప్రభుత్వ కార్యాలయాలు, రవాణా బంద్ అయినప్పటికీ.. జన్‌ధన్, ఆధార్‌వంటి సంస్కరణలు అందుకు దోహదపడ్డాయి. భారత్ ఆత్మనిర్భర్ యోజన ప్రభుత్వ అంగాలు, ప్రజలకు స్వావలంబన సాధిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కోట్ల మందికి జీవనోపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి ఈ ప్యాకేజీ తిరిగి ఊపిరులూదుతుంది. ఉద్యోగులకు మేలు చేకూరుస్తుంది. శ్రామికులు, రైతులతోపాటు దేశం కోసం కష్టపడే ప్రతి ఒక్కరికీ ఉపయుక్తంగా మారుతుంది. ప్యాకేజీ పనులు వేగంగా నాణ్యత, పారదర్శకతతో జరిగితే ప్రధాని ఆకాంక్షించిన లక్ష్యాలు నెరవేరుతాయి. అందుకు అందరూ సంకల్పం చేయాలి. ప్రభుత్వానికి సహకరించాలి. అప్పుడే భవిష్యత్తులో కరోనాలాంటి సంక్షోభాలు వచ్చినా ప్రజా సంకల్పంతో మరింత ధైర్యంగా ఎదుర్కొనగలం. వ్యాసకర్త : కేంద్ర హోంశాఖ సహాయమంత్రి gkishanreddy@yahoo.com -
ప్రధానికి కాంగ్రెస్ ఎంపీ అభినందనలు
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ కట్టడిని సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా చర్యలు చేపట్టడమే కాకుండా అయా దేశాలకు వైద్య సహకారం అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభినందించారు. 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' ప్యాకేజీలో భాగంగా చేనేత వృత్తులకు , చేతి వృత్తిదారులకు నిధులు కేటాయించాలని కోరుతూ ప్రధానికి కోమటిరెడ్డి లేఖ రాశారు. ఈ సందర్భంగా కరోనా సంక్షోభంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అతి పెద్ద ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘కరోనా మహమ్మారి విస్తరించకుండా విధించిన లాక్ డౌన్ కారణంగా తెలంగాణతో పాటు దేశంలో ఉన్న చేనేత, చేతి వృత్తిదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 2019 గణంకాల ప్రకారం 31 లక్షల కుటుంబాలు, 45 లక్షల మంది ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ రంగానికి నిధులు కేటాయించి ఆదుకోవాలి. సంప్రదాయంగా ఇదే వృత్తిని నమ్ముకున్న చేనేత వృత్తిదారులలో ఆధిక శాతం పేదవారు ఉన్నారు. ఇందులో 67 శాతం మంది రూ.5,000 లోపు , 26.2 శాతం రూ.10,000 లోపు, 6.8 శాతం మాత్రమే రూ.10,000 పైన ఆదాయం పొందుతున్నారు. మన దగ్గర తయారైన ఉత్పత్తులను మన దేశంలోనే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసేవారు. లాక్ డౌన్ కారణంగా ముడి సరుకుల రవాణా లేక, పని లేక చేనేత , చేతి వృత్తిదారులకు ఉపాధి కరువైంది. ఇదే వృత్తిని నమ్ముకున్న వారంతా ఆకలితో అలమటిస్తున్నారు. వీరికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని కోరుతున్నాను. ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తే ముడి సరుకుల కొనుగోలు ద్వారా అయా వృత్తులు తిరిగి గాడిలో పడుతాయి. నెలకు రూ. 3,000ల చొప్పున మూడు నెలల పాటు ఆర్థిక సాయం, పౌర సరఫరాల శాఖ నుంచి రేషన్ అందించాలి. దేశంలోని 23 కోట్ల బీపీఎల్ కుటుంబాలకు దోతిలు, చీరలు అందజేయాలని, వీటిని తయారు చేసే బాధ్యతను చేనేత, చేతివృత్తిదారులకు అప్పగించాలి’ అంటూ ప్రధాని మోదీకి రాసిన లేఖలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. చదవండి: భారత్‌పై నేపాల్ ప్రధాని షాకింగ్ కామెంట్లు! బస్సుల గోల.. కాంగ్రెస్‌పై అదితి ఫైర్ -
ఆత్మనిర్భర్ ఆర్థిక ప్యాకేజీపై నీలం సాహ్ని సమీక్ష
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్ధిక ఉద్దీపన ప్యాకేజీతో ఏఏ శాఖలకు ఎంత మేరకు నిధులు సమకూరుతాయే అంచనా వేసి తద్వారా వివిధ పథకాలన్నీ ప్రజలందరికీ లబ్ది చేకూరేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించారు. కోవిడ్-19 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకం ప్యాకేజీ అమలుపై సీఎస్ క్యాంపు కార్యాలయంలో ఆమె ప్రాథమిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం సాహ్ని మాట్లాడుతూ: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తున్న నవరత్నాల కార్యక్రమానికి ప్రాధాన్యతను ఇస్తూనే.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకం కింద ప్రకటించిన ప్యాకేజీని పటిష్టంగా అమలు చేయడం ద్వారా ప్రతి ఒక్కపేదవారికి లబ్ది చేకూరేలా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఆ దిశగా సంబంధిత శాఖలు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసి అమలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. (‘ఉద్దీపన ప్యాకేజ్‌తో ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం’) ఈ విషయమై వచ్చే సమావేశంలో సవివరంగా చర్చిద్దామని ఆలోగా శాఖల వారీ పూర్తి సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని సిఎస్ అధికారులను ఆదేశించారు. అంతకుముందే ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకం కింద ప్రకటించిన ప్యాకేజీతో రాష్ట్రంలోని వివిధ శాఖలకు కలిగే ప్రయోజనాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఆలాగే వ్యవసాయం, పాడి పరిశ్రమాభివృధ్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, కార్మిక ఉపాధి కల్పన శాఖ ముఖ్యకార్యదర్శి బీ ఉదయలక్ష్మి, ఇంధన, మున్సిపల్ పరిపాలన శాఖల కార్యదర్శులు ఎన్. శ్రీకాంత్, జే శ్యామలరావు, పరిశ్రమల శాఖ సంచాలకులు సుబ్రహ్మణ్యం వారి వారి శాఖలకు సంబంధించి ఎంతమేరకు ఆర్ధిక ప్యాకేజి లబ్ధి కలుగుతుందనే వివరాలను తెలియజేశారు. కాగా ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.సత్యనారాయణ, ఎస్ఎల్బిసి కన్వీనర్ నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు. (ప్రధాని ప్రసంగం.. అర్థం ఏంటో!) -
‘ఆత్మ నిర్భర్’ ఫన్నీ మీమ్స్ వైరల్
లాక్డౌన్ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించిన తర్వాత ఓ పదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఆత్మ నిర్భర్’ అంటే అర్థం ఏంటో చెబుతూ నెటిజన్లు ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఆత్మ నిర్భర్’ అంటే ‘స్వయంగా వంట చేసుకోవడం’ ‘మన పని మనం చేసుకోవడం’ అంటూ కొంత మంది కామెంట్స్ చేయగా.. మరికొందరూ ‘కొడుకును ఓ తల్లి నువ్వు పెళ్లి ఎప్పడూ చేసుకుంటావ్ అని అడిగిన ప్రశ్నకు.. కొడుకు అమ్మ నేను అత్మనిర్భర్’ అని బదులు ఇచ్చినట్లుగా నెటిజన్లు ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు. మరోక ట్విటర్ యూజర్ ‘నేను నా పబ్జీ పేరు ఆత్మనిర్భర్‌గా మారుస్తాను.. ఇప్పుడు చూడండి నా బృందం నాకు మద్దతు ఇవ్వదు’ అంటూ సరదాగా కొత్తకొత్తగా అర్థాలు వెతుకుతున్నారు. (ప్రధాని ప్రసంగం.. అర్థం ఏంటో!) Meet Pandiyan, he has trained himself to pee in the pot. And has been working hard to be atmanirbhar much before Modiji came along & made it trend. Pandiyan's atmanirbharta is of as much consequence as today's speech. pic.twitter.com/RpdDNXChsV — Manisha (@ManiFaa) May 12, 2020 ఇక ‘మా పెంపుడు పిల్లి పాండియన్‌ను చూడండి. అది టాయిలేట్ వస్తే బాత్రూంకు వెళ్లడానికి శిక్షణ తీసుకుంది. అంటే ప్రధాని మోదీ ‘ఆత్మనిర్భర్’గా ఉండాలని చెప్పక మునిపే పాండియన్ ‘ఆత్మనిర్భర్’గా ఉండటానికి చాలా కష్టపడుతున్నాడు’ అంటూ నెటిజన్లు తమదైన శైలిలో అర్థాలు వెతుకుతున్నారు. కాగా దేశ వ్యాపంగా అమలవుతున్న లాక్డౌన్ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పేరిట రూ.20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. ఆత్మ విశ్వాసం, ఆత్మ బలంతో ప్రజలు ఉండటమే కాకుండా ‘ఆత్మ నిర్భర్ భారత్’ అనేది దేశ ప్రజల నినాదం కావాలని ఆయన పిలుపునిచ్చారు. Mom : son when will you marry ?? Son : mom , I am #Atmanirbhar !! pic.twitter.com/G3Xvc7cWEy — Last Man Standing RELUCTANT_ECONOMIST (@Mnomics_) May 12, 2020 -
ప్రధాని ప్రసంగం.. అర్థం ఏంటో!
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించిన తర్వాత ఒక పదానికి అర్థం తెలుసుకోవడానికి గూగుల్‌లో మనోళ్లు తెగ వెతికారు. 'ఆత్మనిర్భర్' అంటే ఏమిటి? అంటూ గూగుల్‌లో శోధించారు. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పేరిట రూ.20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. ఆత్మబలం, ఆత్మ విశ్వాసం నిండుగా ఉన్న ‘ఆత్మ నిర్భర్ భారత్’ దేశ ప్రజల నినాదం కావాలని ప్రధాని పిలుపునిచ్చారు. (రూ.20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీ) ఆయన ప్రసంగం ముగిసిన వెంటనే ‘ఆత్మ నిర్భర్’కు అర్థం కోసం గూగుల్‌లో చాలా మంది వెతికారు. కర్ణాటక, తెలంగాణ వాసులు ఎక్కువగా శోధించినట్టు గూగుల్ ట్రెండ్స్ బట్టి వెల్లడైంది. మహారాష్ట్ర, గుజరాతీయులు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. గూగుల్ మాత్రమే కాదు, చాలా మంది తక్షణ సమాధానాల కోసం మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌ను కూడా ఆశ్రయించారు. ‘ఆత్మ నిర్భర్ అంటే ఏమిటి? సమాధానం చెప్పండి ప్లీజ్’ అంటూ అడిగారు. ఆత్మ నిర్భర్ అంటే స్వావలంభన అని అర్థం. స్వావలంబన దిశగా దేశం అడుగులు వేయడానికి ఆర్థిక ప్యాకేజీ ఊతమిస్తుందని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. మన దేశంలో తయారయ్యే ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా స్వావలంబన సాధించాలని ఆయన కోరారు. (ఆ రైళ్లను ఎక్కువ చోట్ల ఆపండి.. )