న్యూఢిల్లీ: దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ అదిరిపోయే ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అమెజాన్ ఇండియా స్కైలాంజా భాగస్వామ్యంతో 'అమెజాన్ సంభవ్ - బిల్డ్ ఫర్ ఇండియా' పేరుతో హ్యాకథాన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. డెవలపర్లు ఈ అమెజాన్ సంభవ్ కార్యక్రమం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ కోసం భారతదేశంలో ఉన్న సమస్యలకు పరిష్కారాలను సాంకేతికత పరంగా ఎలా కనుగొనాలో అనేది దీని ప్రధాన లక్ష్యం. డెవలపర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఇది మంచి అవకాశముని చెప్పుకోవచ్చు. మొత్తం పది మంది విజేతల కలిపి రూ.15 లక్షల వరకు నగదు ప్రోత్సాహకం అందిస్తారు.
అంతేకాకుండా విజేతలు రీడీమ్ చేసుకోవడానికి అమెజాన్ వెబ్ సిరీస్ క్రెడిట్లను కూడా అందిస్తారు. అలాగే ప్రముఖ పారిశ్రామిక వేత్తల వెబ్‌నార్, మీటింగ్ సెషన్లలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. 21వ శతాబ్దంలో భారతదేశం సామర్థ్యాన్ని తెలియజేయడంలో సాంకేతికత, ఆవిష్కరణలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఎంఎస్‌ఎంఇ, సెల్లింగ్ పార్ట్‌నర్ ఎక్స్‌పీరియన్స్ డైరెక్టర్ ప్రణబ్ భాసిన్ అన్నారు.
బిజినెస్ ఇన్నోవేషన్, సస్టైనబిలిటీ అండ్ హెల్త్ కేర్ అనే రెండు థీమ్స్ ఉంటాయి. వీటిపై డెవలపర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు పని చేయాల్సి ఉంటుంది. అంటే స్మార్ట్ సిటీస్, ఎనర్జీ ఎఫిషియన్సీ, డేటా అనలిటిక్స్, ఆన్‌లైన్ స్టోర్స్ ఏర్పాటు వంటి పలు వాటికి సంబంధించిన ప్రొడక్టులను రూపొందించాల్సి ఉంటుంది. మార్చి 22 వరకే రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ అందుబాటులో ఉంటుంది. "అమెజాన్ సంభవ్ సమ్మిట్" లింక్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment