న్యూఢిల్లీ: దేశీయంగా తయారు చేసిన ఆకాశ్‌మిస్సైల్ వ్యవçస్థను విదేశాలకు ఎగుమతి చేసేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించే ఈ మిస్సైల్స్‌ను కొనేందుకు తయారుగా ఉన్న దేశాల ప్రతిపాదనలు పరిశీలించి వేగంగా అమ్మకాల అనుమతులిచ్చేందుకు వీలుగా ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఆకాశ్‌లో 96 శాతం దేశీయంగా తయారైన పరికరాలే ఉన్నాయి. 25 కిలోమీటర్ల రేంజ్‌లో టార్గెట్‌ను విజయవంతంగా ధ్వంసం చేయగలదు.
ఆత్మ నిర్భర్ భారత్ కింద ఇండియా సొంతంగా మిస్సైళ్లు తయారుచేసి ఎగుమతి చేసే స్థాయికి చేరిందని, తాజాగా ఆకాశ్ మిస్సైల్స్‌ను విదేశాలకు విక్రయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఈ నిర్ణయంతో ఆయుధాల విక్రయాల్లో భారత్ విదేశాలతో పోటీ పడే అవకాశం కలుగుతుందన్నారు. రక్షణ అమ్మకాలు 500 కోట్ల డాలర్లకు చేర్చేందుకు ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. 2024నాటికి 101 రకాల ఆయుధాలను, మిలటరీ ప్లాట్‌ఫామ్స్‌ను దిగుమతి చేసుకోవడం నిలిపివేసి స్వదేశీవి తయారు చేసుకోవాలని భారత్ భావిస్తోంది.
భారత్ మిషన్స్
సాంస్కృతిక, వాణిజ్య సంబంధాల పెంపుదల లక్ష్యంగా వివిధ దేశాల్లో ఇండియన్ మిషన్స్‌ను ఆరంభించాలని కేంద్రం నిర్ణయించింది. ఈస్తోనియా, పరాగ్వే, డొమినికన్ రిపబ్లిక్‌లో భారతీయ మిషన్లను ఆరంభిస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. ఈ మిషన్లతో రాజకీయ, సాంస్కృతిక బం ధాలు బలపడడం, ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు ఊపందుకోవడం జరుగుతుందన్నారు. సబ్‌సాత్ సబ్‌కా వికాస్ ఆధారంగా ఈ మిషన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment