Akash missiles
-
అమ్మకానికి ‘ఆకాశ్ క్షిపణి’
న్యూఢిల్లీ: దేశీయంగా తయారు చేసిన ఆకాశ్‌మిస్సైల్ వ్యవçస్థను విదేశాలకు ఎగుమతి చేసేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించే ఈ మిస్సైల్స్‌ను కొనేందుకు తయారుగా ఉన్న దేశాల ప్రతిపాదనలు పరిశీలించి వేగంగా అమ్మకాల అనుమతులిచ్చేందుకు వీలుగా ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఆకాశ్‌లో 96 శాతం దేశీయంగా తయారైన పరికరాలే ఉన్నాయి. 25 కిలోమీటర్ల రేంజ్లో టార్గెట్‌ను విజయవంతంగా ధ్వంసం చేయగలదు. ఆత్మ నిర్భర్ భారత్ కింద ఇండియా సొంతంగా మిస్సైళ్లు తయారుచేసి ఎగుమతి చేసే స్థాయికి చేరిందని, తాజాగా ఆకాశ్ మిస్సైల్స్‌ను విదేశాలకు విక్రయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఈ నిర్ణయంతో ఆయుధాల విక్రయాల్లో భారత్ విదేశాలతో పోటీ పడే అవకాశం కలుగుతుందన్నారు. రక్షణ అమ్మకాలు 500 కోట్ల డాలర్లకు చేర్చేందుకు ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. 2024నాటికి 101 రకాల ఆయుధాలను, మిలటరీ ప్లాట్‌ఫామ్స్‌ను దిగుమతి చేసుకోవడం నిలిపివేసి స్వదేశీవి తయారు చేసుకోవాలని భారత్ భావిస్తోంది. భారత్ మిషన్స్ సాంస్కృతిక, వాణిజ్య సంబంధాల పెంపుదల లక్ష్యంగా వివిధ దేశాల్లో ఇండియన్ మిషన్స్‌ను ఆరంభించాలని కేంద్రం నిర్ణయించింది. ఈస్తోనియా, పరాగ్వే, డొమినికన్ రిపబ్లిక్లో భారతీయ మిషన్లను ఆరంభిస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. ఈ మిషన్లతో రాజకీయ, సాంస్కృతిక బం ధాలు బలపడడం, ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు ఊపందుకోవడం జరుగుతుందన్నారు. సబ్‌సాత్ సబ్కా వికాస్ ఆధారంగా ఈ మిషన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. -
చైనాను 'ఆకాశ్'తో అడ్డుకుందామంటే..
న్యూఢిల్లీ: చైనా నుంచి ఎప్పుడైనా రక్షణ పరంగా ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో ఈశాన్య రాష్ట్రాల్లో దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ్ క్షిపణులను మోహరించాలని భారత ప్రభుత్వం గతంలోనే భావించింది. అవును. తాజా కాగ్ రిపోర్టు ఈ విషయాన్నే వెల్లడించింది. ఇందుకోసం 2010లో కేబినేట్ ఆమోదాన్ని కూడా తెలిపింది. అయితే, ఇప్పటివరకూ ఈ దిశగా ముందడుగు పడకపోవడానికి కారణాలు తెలుసుకుంటే షాక్‌కు గురి కావాల్సిందే. ఆకాశ్ క్షిపణుల తయారీ నెలకొన్న లోపాల గురించి కాగ్ శుక్రవారం పార్లమెంటులో రిపోర్టు ప్రవేశపెట్టింది. ఇదే సమయంలో ఆన్లైన్లో కూడా ఈ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచింది. ఆకాశ్ క్షిపణులను డీఆర్డీవో డిజైన్ చేసింది. ప్రభుత్వ సంస్ధలైన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) తదితరులు వీటిని ఉత్పత్తి చేశాయి. స్వదేశీ సాంకేతికతతో ఉత్పత్తైన ఆకాశ్ క్షిపణుల్లో మూడిండ ఒక వంతు ప్రయోగ దశలో విఫలమయ్యాయి. దీంతో అత్యవసర సమయాల్లో 'ఆకాశ్' ఆదుకుంటుందా? అనే ప్రశ్న తలెత్తినట్లు కాగ్ పేర్కొంది. 2013 జూన్ నుంచి 2015 డిసెంబర్ మధ్య ఈశాన్య రాష్ట్రాల్లోని ఆరు ప్రదేశాల్లో చైనా వైపుగా ఆకాశ్ క్షిపణుల స్క్వాడ్రన్లను ఏర్పాటు చేయాల్సివుందని చెప్పింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.3,619 కోట్లు కేటాయించిందని వెల్లడించింది. అయితే, ఇప్పటివరకూ ఒక్క స్క్వాడ్రన్‌ను కూడా ఏర్పాటు చేయలేదని పేర్కొంది. బేస్‌ల నిర్మాణంలో జాప్యమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చింది. భారత్-చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నడుమ ఆకాశ్ క్షిపణుల బేస్‌లు ఈశాన్య రాష్ట్రాల్లో ఉంటే చైనా కొంచెం వెనక్కు తగ్గేదని సీనియర్ మిలటరీ అధికారులు చెబుతున్నారు. -
‘ఆకాశ్’ పరీక్ష సక్సెస్..
వరుసగా రెండు క్షిపణులను ప్రయోగించిన వాయుసేన బాలాసోర్: ఉపరితలం నుంచి గాలిలోని లక్ష్యాలను ఛేదించగల మధ్యశ్రేణి ఆకాశ్ క్షిపణులను భారత వాయుసేన శనివారం విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని బాలసోర్‌లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి శనివారం మధ్యాహ్నం 11.55, 12 గంటల సమయంలో వరుసగా రెండు క్షిపణులను ప్రయోగించారు. మానవ రహిత విమానాలకు వేలాడ దీసిన లక్ష్యాలను ఇవి విజయవంతంగా ఛేదించాయి. యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, గాలిలోంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణులను ధ్వంసం చేయడానికి ఆకాశ్ క్షిపణులను రూపొందించారు. 25 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణులు 60 కిలోల వార్హెడ్లను మోసుకెళ్లగలవు. ఒకే సమయంలో వివిధ లక్ష్యాలను ఛేదించగలవు.