వరుసగా రెండు క్షిపణులను ప్రయోగించిన వాయుసేన
బాలాసోర్: ఉపరితలం నుంచి గాలిలోని లక్ష్యాలను ఛేదించగల మధ్యశ్రేణి ఆకాశ్ క్షిపణులను భారత వాయుసేన శనివారం విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని బాలసోర్‌లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి శనివారం మధ్యాహ్నం 11.55, 12 గంటల సమయంలో వరుసగా రెండు క్షిపణులను ప్రయోగించారు. మానవ రహిత విమానాలకు వేలాడ దీసిన లక్ష్యాలను ఇవి విజయవంతంగా ఛేదించాయి.
యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, గాలిలోంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణులను ధ్వంసం చేయడానికి ఆకాశ్ క్షిపణులను రూపొందించారు. 25 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణులు 60 కిలోల వార్‌హెడ్‌లను మోసుకెళ్లగలవు. ఒకే సమయంలో వివిధ లక్ష్యాలను ఛేదించగలవు.
‘ఆకాశ్’ పరీక్ష సక్సెస్..
Published Sun, Apr 27 2014 4:29 AM | Last Updated on Sat, Sep 2 2017 6:33 AM
Advertisement