భారతీయ మార్కెట్లో చైనీస్ ఉత్పత్తులకు గిరాకీ మామూలుగా ఉండదు, అయితే ఈ సారి హోలీ సందర్భంగా కథ మొత్తం అడ్డం తిరిగింది. ఆత్మనిర్భర్ భారత్ చొరవతో చాలామంది చైనా ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి సుముఖత చూపించడం లేదు.
నివేదికల ప్రకారం, ఢిల్లీలో ఇప్పటికే చాలామంది వ్యాపారులు కేవలం మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా సదర్ బజార్ విక్రేత జావేద్ మాట్లాడుతూ.. ఎక్కువ మంది కొనుగోలుదారులు స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలిపాడు.
తమ పిల్లలకు రంగులను కొనుగోలు చేయడానికి చేయడానికి వచ్చిన కస్టమర్లతో ఒకరు మాట్లాడుతూ.. ప్రస్తుతం భారతీయ ఉత్పత్తుల నాణ్యత బాగుండటంతో చైనా ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. మార్కెట్‌లో అమ్మకానికి ఉన్న చాలా ఉత్పత్తులు మన దేశంలో తయారు చేయబడినవి కావడం సంతోషించదగ్గ విషయం అన్నారు.
కొనుగోలుదారుల నుంచి చైనా ఉత్పత్తుల మీద పెరుగుతున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని భారతీయ ఉత్పత్తులను మాత్రమే విక్రయిస్తున్నామని, లోపాలు ఉన్న వాటిని తిరిగి ఇవ్వకపోవడం కూడా చైనా ఉత్పత్తులు అమ్మకపోవడానికి కారణమని కొంతమంది వ్యాపారాలు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ హోలీ పండుగ వేళ భారతీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరగటం మంచి విషయమనే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment