న్యూఢిల్లీ: హైదరాబాద్ ప్రాంత పరిధిలో మే నెలలో ఇళ్ల రిజిస్ట్రేషన్లు 7 శాతం తగ్గాయి. మొత్తం 5,877 ఇళ్ల రిజిస్ట్రేషన్లను నమోదైనట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. హైదరాబాద్‌తోపాటు, మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో రిజిస్ట్రేషన్ల వివరాలు ఈ గణాంకాల్లో కలసి ఉన్నాయి.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నమోదైన రిజిస్ట్రేషన్లతో పోలిస్తే మే నెలలో 31 శాతం పెరిగాయి. కాకపోతే క్రితం ఏడాది మే నెలలో రిజిస్ట్రేషన్ల గణాంకాలతో పోలిస్తే 7 శాతం తగ్గాయి. మే నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లు జరిగిన ఇళ్ల విలువ రూ.2,994 కోట్లుగా ఉంది. మొత్తం రిజిస్ట్రేషన్లలో మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో అత్యధికంగా 45 శాతం నమోదయ్యాయి. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా పరిధిలోని రిజిస్ట్రేషన్ల వాటా 39 శాతంగా ఉంది. ఇక హైదరాబాద్ రిజిస్ట్రేషన్ల వాటా 16 శాతంగా ఉంది.
రూ.25–50 లక్షల బడ్జెట్
మే నెలలో హైదరాబాద్ ప్రాంతంలో రిజిస్టర్ అయిన ఇళ్లలో ఎక్కువ శాతం రూ.25–50 లక్షల బడ్జెట్ మధ్య ఉన్నాయి. ఆ తర్వాత రూ.25 లక్షల్లోపు ఇళ్లు 17 శాతంగా ఉన్నాయి. రూ.కోటి రూపాయాలు అంతకుమించి విలువైన ఇళ్ల రిజిస్ట్రేషన్లు 9 శాతంగా ఉన్నాయి. క్రితం ఏడాది మే నెలలో ఈ విభాగం రిజిస్ట్రేషన్లు 6 శాతంతో పోలిస్తే 50 శాతం పెరిగాయి. 1,000–2,000 చదపు అడుగుల ప్రాపర్టీల వాటా 70 శాతంగా ఉంది.
(ఇదీ చదవండి: భారతదేశంలో ఫస్ట్ బిలీనియర్ ఇతడే.. సంపద ఎంతో తెలుసా?)
సగటు లావాదేవీ విలువ క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 3 శాతం పెరిగింది. ‘‘హైదరాబాద్ నివాసిత మార్కెట్ ఆశావహంగా ఉంది. ఇళ్ల కొనుగోదారుల నుంచి బలమైన డిమాండ్ కనిపిస్తోంది. 1,000–2,000 చదరపు అడుగుల ఇళ్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపును నిలిపివేయడం కూడా సెంటిమెంట్‌ను బలపరిచింది’’అని నైట్‌ఫ్రాంక్ ఇండియా సీనియర్ బ్రాంచ్ డైరెక్టర్ శామ్సన్ ఆర్థర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment