ర్నూలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు లేక వెలవెలబోతున్న దృశ్యం
రియల్..ఢమాల్!
Published Wed, Nov 9 2016 9:49 PM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM
- వెలవెలబోయిన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు
- జిల్లా వ్యాప్తంగా నామమాత్రంగా రిజిస్ట్రేషన్లు
కర్నూలు (టౌన్): రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూముల క్రయ విక్రయదారులతో నిత్యం కళకళలాడే జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం బుధవారం వెలవెలబోయింది. కేంద్ర ప్రభుత్వం రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేయడంతో పాటు జిల్లా వ్యాప్తంగా బ్యాంకులు, ఏటీయం సెంటర్లు మూసివేయడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ప్రభావం కనిపించింది. రిజిస్ట్రేషన్‌తో పాటు తగినంత చిల్లర లేక నకలు, ఈసి వంటి పనులు కూడ సక్రమంగా జరగలేదు. జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ సేవలు స్తంభించాయి.
నిన్న 650..నేడు 180
జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారిక లెక్కల ప్రకారం మంగళవారం 650 రిజిస్ట్రేషన్లు జరిగాయి. బుధవారం ఈ సంఖ్య 180 మాత్రమే. ప్రతిరోజు సరాసరి కర్నూలు, కల్లూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 30 చొప్పున రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. బుధవారం ఈ సంఖ్య ఐదుకే పరిమితమైంది.
రిజిస్ట్రేషన్లపై ప్రభావం ఉంది : మహబూబ్ బాషా, కర్నూలు జాయింట్ సబ్ రిజిస్ట్రార్
రూ.500. రూ.1000 నోట్లు రద్దు చేయడంతో రిజిస్ట్రేషన్లపై ప్రభావం బాగా కనిపించింది. నిన్నటి రోజున చలనాలు కట్టిన వారివి మాత్రమే పనులు జరిగాయి. నామమాత్రంగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. బంద్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు.
మరో రెండు రోజులు ఇలాగే ఉండొచ్చు : యు.వి.వి. రత్నసాగర్, జిల్లా రిజిస్ట్రార్
బుధవారం బ్యాంకులు, ఏటీఎంలు పనిచేయలేదు. దీంతో చిన్నపాటి పనులకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలో ప్రతిరోజు 600కు పైగా రిజిస్ట్రేషన్లు (వివిధ రకాల) జరుగుతుంటాయి. బుధవారం 30 శాతం రిజిస్ట్రేషన్లు జరుగలేదు. దీని ప్రభావం మరో రెండు రోజులు ఉండవచ్చు.
Advertisement