భారతదేశంలో రియల్ ఎస్టేట్ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. నగరాల్లో భూములు, భవనాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సంపాదించిన డబ్బులో సగం రెంట్ కట్టుకోవడానికే సరిపోతోందని కొందరు భాదపడుతున్నారు. ఈ తరుణంలో గ్లోబల్ ట్రేడింగ్ కంపెనీ ఐఎంసీ ట్రేడింగ్ అనుబంధ సంస్థ ఐఎంసీ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఓ భారీ డీల్ కుదుర్చుకుంది.
ఐఎంసీ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని ఒక ఆఫీస్ కాంప్లెక్స్ లీజుకు తీసుకుంది. ఇందులో కంపెనీ ఒక్కో చదరపు అడుగుకు రూ. 700 చొప్పున లీజుకు తీసుకుంది. ఈ భవనం మేకర్ మ్యాక్సిటీ 4 నార్త్ అవెన్యూ భవనంలోని 4వ అంతస్తులో ఉంది. లీజు వ్యవధి జూన్ 16న ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన లావేదేవీలు జూన్ 5న పూర్తయ్యాయి.
కంపెనీ రూ.40.81 లక్షల నెలవారీ అద్దెతో 5 నెలల పాటు స్థలాన్ని లీజుకు తీసుకుంది. ముంబైలో అద్దె రేట్లు ప్రాంతాన్ని బట్టి చదరపు అడుగులకు రూ. 100 నుంచి రూ. 500 మధ్య ఉంటాయి. అయితే బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) అనేది ముంబై వ్యాపార కేంద్రాలకు చాలా ముఖ్యమైనది కావడంతో ఇక్కడ ధరలు భారీగా ఉంటాయి. ఇప్పటి వరకు చదరపు అడుగు అద్దె రూ. 700 చెల్లిస్తున్న కంపెనీల జాబితాలో ఐఎంసీ సెక్యూరిటీస్ మొదటి సంస్థ. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఇదే అతిపెద్ద డీల్ అని తెలుస్తోంది.
గతంలో కూడా ఐఎంసీ సెక్యూరిటీస్ సంస్థ 2022 ఏప్రిల్‌లో బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఒక చదరపు అడుగును రూ. 421 చొప్పున లీజుకు తీసుకుంది. అంతకు ముందు 2021 ఏప్రిల్‌లో చదరపు అడుగు రూ. 405 ధరతో లీజుకు తీసుకుంది. ముంబైలో 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో చదరపు అడుగు అద్దె రూ. 130 నుంచి రూ. 136 మధ్య ఉండేది.
Comments
Please login to add a commentAdd a comment