Locals attack
-
బెంగాల్లో ఎన్ఐఏ అధికారులపై దాడి
న్యూఢిల్లీ/బలూర్ఘాట్(పశ్చిమబెంగాల్): 2022 పేలుడు ఘటనలో ఇద్దరు కీలక కుట్రధారులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) శనివారం అదుపులోకి తీసుకుంది. ఈ సందర్భంగా స్థానికులు జరిపిన దాడిలో ఒక అధికారి గాయపడ్డారు. ఎన్ఐఏ ప్రతినిధి ఒకరు ఢిల్లీలో మీడియాకు ఈ విషయం వెల్లడించారు. ‘బెంగాల్‌లోని భూపతినగర్ 2022 డిసెంబర్లో చోటుచేసుకున్న పేలుడు కేసులో కీలక పురోగతి సాధించాం. ముగ్గురి మృతికి కారణమైన అప్పటి ఘటనకు కీలక కుట్రదారులైన బలాయి చరణ మైతీ, మనోబ్రత జనాల కోసం తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో ఐదు ప్రాంతాల్లో సోదాలు జరిపాం. స్థానికుల తీవ్ర ప్రతిఘటన నడుమ వారిద్దరినీ అరెస్ట్ చేశాం. స్థానికుల దాడిలో ఒక అధికారి గాయపడ్డారు. ఎన్ఐఏకి చెందిన ఒక వాహనం ధ్వంసమైంది. ఘటనపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం’అని ఆయన వివరించారు. మైతీ, జనా అనే వారు స్థానికంగా భయోత్పాతం సృష్టించేందుకు నాటుబాంబులు తయారు చేసి, పేల్చారని ఆయన తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర పోలీసులు అప్పట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ, పేలుడు పదార్థాల చట్టాన్ని అందులో చేర్చలేదు. దీనిపై దాఖలైన రిట్ పిటిషన్ మేరకు కలకత్తా హైకోర్టు కేసును ఎన్ఐఏకి అప్పగించింది. సీరియస్‌గానే తీసుకుంటాం: గవర్నర్ ఎన్ఐఏ అధికారులపై దాడి అత్యంత తీవ్రమైన అంశమని బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పేర్కొన్నారు. దీనిని అంతే తీవ్రంగా ఎదుర్కొంటామన్నారు. ‘దర్యాప్తు విభాగాల అధికారులను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు ఎవరికీ మంచిది కాదు. ఇటువంటి గూండాయిజాన్ని అనుమతించబోం. కఠినంగా వ్యవహరిస్తాం’అని మీడియాతో అన్నారు. మరోదారి లేకే గ్రామస్తుల దాడి: సీఎం మమతా బెనర్జీ భూపతిపూర్‌లో ఎన్ఐఐ అధికారులపై స్థానికుల దాడిని సీఎం మమత సమర్థించారు. శనివారం వేకువజామున ఒక్కసారిగా ఇళ్లలోకి దూరి దాడి చేయడంతోనే స్థానిక మహిళలు ఆత్మరక్షణ కోసం ప్రతిదాడికి దిగారని ఆమె అన్నారు. 2022నాటి ఘటనను ఆమె బాణసంచా పేలుడుగా అభివర్ణించారు. -
అంగన్వాడీ టీచర్‌పై అమానుషం.. దుస్తులు చింపి.. సెల్‌ఫోన్ లాగేసుకుని
-
అంగన్వాడీ టీచర్‌పై అమానుషం.. దుస్తులు చింపి.. సెల్‌ఫోన్ లాగేసుకుని
మహబూబాబాద్ రూరల్: అంగన్వాడీ టీచర్‌పై స్థానికులు అమానుషంగా ప్రవర్తించారు. ఆమె రాజీనామా కోరుతూ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మానుకోట మండలంలోని ఇస్లావత్‌తండా గ్రామపరిధిలోని తేజావత్తండాలో చోటుచేసుకుంది. కురవి ఎస్సై బి.రాణాప్రతాప్ వివరాల ప్రకారం.. ఆ గ్రామంలోని అంగన్వాడీ టీచర్ కమల. అంగన్వాడీ కేంద్రం నిర్వహణ విషయంలో కొంతకాలంగా టీచర్‌కు, స్థానికులకు మధ్య వ్యక్తిగత గొడవలు జరుగుతున్నాయి. అవికాస్త పెరిగి సోమవారం రాత్రి ఘర్షణకు దారితీశాయి. స్థానికుల దాడిలో కమల గాయపడింది. పుస్తెలతాడు, సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లారని బాధితురాలు వాపోయింది. దుస్తులు చింపేసి దాడికి పాల్పడ్డారు. స్థానిక సర్పంచ్ రాజీనామా చేయాలని ఒత్తిడి చేశారని.. అందుకు అంగీకరించకపోవడంతో దాడి చేశారని ఆరోపించింది. దాడి అనంతరం కురవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్సై రాణా ప్రతాప్ తెలిపారు. ఉద్యోగానికి రాజీనామాచేయాలంటూ డిమాండ్ చేశారు. -
మృతదేహాన్ని అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన
వేంసూరు (ఖమ్మం): ఖమ్మం జిల్లాలోని వేంసూరులో అమానుష సంఘటన జరిగింది. కాలనీలో ఇళ్ల సమీపాన దహన సంస్కారాలు నిర్వహించవద్దంటూ స్థానికులు ఆందోళన చేశారు. అయితే మరీ చితిపై కూర్చుని నిరసన వ్యక్తం చేసిన దౌర్భాగ్య పరిస్థితి. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా వేంసూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో అంత్యక్రియలు జరిపేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కొద్దికాలంగా కాలనీ సమీపాన మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తుండగా ఆ తర్వాత మరోచోట ప్రభుత్వం వైకుంఠధామాన్ని నిర్మించింది. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం అయినా గురువారం ఓ వ్యక్తి మృతి చెందగా ఆ మృతదేహానికి కాలనీ సమీపంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు, బంధువులు తీసుకెళ్లారు. అయితే కాలనీవాసులు అడ్డుకున్నారు. దహన సంస్కారాలతో తాము ఇబ్బంది పడుతున్నామంటూ మృతదేహాన్ని అడ్డుకున్నారు. అంతేకాకుండా అప్పటికే సిద్ధం చేసిన చితిపై కూర్చుని నిరసన తెలిపారు. చివరకు మృతుడి బంధువులు నచ్చచెప్పగా, దహన సంస్కారాలకు ఒప్పుకోవడంతో వివాదం సద్దుమణిగింది. చదవండి: తెలంగాణ శాసన సభాసమరానికి సర్వం సిద్ధం -
పశ్చిమ గోదావరి జిల్లాలో విచ్చల విడిగా ఇసుక దందా
-
36 మంది జలసమాధి
బహరాంపూర్: పశ్చిమ బెంగాల్లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆర్టీసీ బస్సు వంతెన పై నుంచి కాలువలోకి పడిపోవడంతో పది మంది మహిళలు సహా మొత్తం 36 మంది దుర్మరణం చెందారు. బస్సు నదియా జిల్లాలోని షికార్పూర్ నుంచి మాల్దాకు వెళ్తుండగా ముర్షీదాబాద్ జిల్లాలోని దౌల్తాబాద్ పరిధిలో ఆరు గంటలకు ప్రమాదం జరిగింది. సహాయక చర్యలు అందించేందుకు పోలీసులు ఆలస్యంగా వచ్చారంటూ స్థానికులు నిరసన చేపట్టి, ఓ పోలీస్ వాహనానికి నిప్పంటించారు. ఆ మంటలను ఆర్పడానికి వచ్చిన అగ్నిమాపక యంత్రంపైనా వారు దాడి చేశారు. కాలువలోని బస్సును గుర్తించి క్రేన్ల సాయంతో బయటకు తీయడానికి ఎనిమిది గంటలు పట్టిందని అధికారులు చెప్పారు. 32 మృతదేహాలను సిబ్బంది వెలికితీయగా, మరో రెండు నీటిలో కొట్టుకుపోయాయి. ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సీఎం మమతా బెనర్జీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పొగమంచు లేదా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే దుర్ఘటన జరిగి ఉండొచ్చని ఆమె అన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ. 1 లక్ష, స్పల్ప గాయాలైన వారికి రూ. 50 వేల నష్టపరిహారాన్ని ఆమె ప్రకటించారు. -
వ్యభిచార గృహంపై స్థానికుల దాడి
నిర్వాహకులను, విటులను పోలీసులకు అప్పగించిన వైనం మదనపల్లె: నివాసప్రాంతంలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై స్థానికులు దాడి చేశారు. నిర్వాహకులను, విటులను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మదనపల్లెలోని నీరుగట్టువారిపల్లెలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. నీరుగట్టువారిపల్లెలోని తారకా లేఅవుట్లో ఓ మహిళ ఒంటరిగా నివాసముంటోంది. కొంతమంది మహిళలను వ్యభిచారం ఉచ్చులోకి దించి వ్యాపారం సాగి స్తోంది. పలుమార్లు స్థానికులు హెచ్చరించినా పట్టించుకోకపోగా వారిపై బెదిరింపులకు పాల్పడేది. స్థానికంగా నివాసముంటున్న మహిళలు తీవ్ర ఇబ్బందిపడేవారు. ఇకచేసేది లేక కౌన్సిలర్ బండి నాగరాజు ఆధ్వర్యంలో వ్యభిచార గృహంపై దాడి చేశారు. నిర్వాహకురాలితో సహా విటులను, మహిళలను రెండో పట్టణ పోలీసులకు అప్పగించారు. ఈ విషయమై టూ టౌన్ ఎస్ఐ హనుమంతప్పను వివరణ కోరగా, వ్యభిచారవృత్తిలో ఉన్న ముగ్గు రు మహిళలు, నలుగురు విటులను అదుపులోకి తీసుకున్నామని, విచారణ అనంతరం కేసులు నమోదు చేస్తామని చెప్పారు.